
హాలీవుడ్ సీనియర్ హీరో, ‘గాడ్‌ఫాదర్’ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. 29 ఏళ్ల యువతి, నిర్మాత నూర్ అల్పల్లాతో ఈ సీనియర్ హీరో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం అల్పల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు.
(చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!)
కోవిడ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ తర్వాత పాసినో.. అల్పల్లాతో డేటింగ్ ప్రారంభించాడు. అల్పల్లా కూడా అంతకు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేసింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పాసినోతో సహజీవనం కొనసాగించింది. అల్పల్లాకు ఇది మొదటి సంతానం కాగా, పాసినోకు నాలుగో సంతానం. అంతకు ముందు నటన శిక్షకురాలు జాన్ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment