AL Pacino
-
Oscars 2024: ‘ఉత్తమ చిత్రం’ వివాదంపై స్పందించిన నటుడు
ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో నంబర్ వన్ అవార్డుగా ‘ఉత్తమ చిత్రం ’ విభాగాన్ని భావిస్తారు. అందుకే ఈ విభాగాపు అవార్డును వేడుకలో చివరిగా ప్రకటిస్తారు. అలాగే వేడుకలో చివరి మూమెంట్స్ కాబట్టి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. కానీ అలాంటి డ్రామా గడిచిన ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో కనిపించలేదు. ‘ఉత్తమ చిత్రం’ అవార్డును ప్రకటించిన ప్రముఖ నటుడు అల్ పచినో చాలా సాదాసీదాగా వెల్లడించేశారు. పోటీలో ఉన్న పది చిత్రాల పేర్లు చెప్పకుండా.. అవార్డు సాధించిన చిత్రాన్ని ప్రకటించేశారు. కవర్ని మెల్లిగా తెరుస్తూ.. ‘నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనిపిస్తోందని సింపుల్‌గా ప్రకటించారు. ఇలా చేయడం పట్ల హాలీవుడ్‌లోని కొందరు నటీనటులు, ఇతర ప్రముఖులు విముఖత వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయంపై మంగళవారం అల్ పచినో స్పందించారు. ‘‘ఆస్కార్ వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా పాల్గొనడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇక వేడుకలో ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలవడానికి పోటీ పడ్డ పది చిత్రాల పేర్లను నేను చదవకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయని తెలిసింది. కానీ ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. అది ఆస్కార్ ప్రొడ్యూసర్ల నిర్ణయం. వేడుక ఆద్యంతం ఈ పది సినిమాల యూనిట్ వాళ్లు హైలైట్ అవుతూనే ఉన్నందువల్ల వారు ఇలా నిర్ణయించి ఉండొచ్చు. ఆస్కార్‌కు నామినేట్ కావడం అనేది ఎవరి జీవితంలోనైనా ఓ మంచి మైల్స్టోన్. ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తిగా నాకు ఈ విషయం తెలుసు. వారి పేర్లు ప్రస్తావించకపోవడం అనేది బాధకు గురి చేసే విషయమే. ఈ ఘటన పట్ల బాధపడిన వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చెబుతూ ఓ స్టేట్మెంట్ను విడుదల చేశారు అల్ పచినో. ఇక ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఆపెన్‌హైమర్’, ‘అమెరికన్ ఫిక్షన్’, ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’, ‘బార్బీ’, ‘ది హోల్డోవర్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ‘మేస్ట్రో’, ‘΄ాస్ట్ లీవ్స్’, ‘పూర్ థింగ్స్’, ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాలు ΄ోటీ పడగా, ‘ఆపెన్‌హైమర్’ అవార్డు దక్కించుకుంది. -
83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే దాదాపు 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు. అది కూడా తనకంటే వయసులో చిన్నదైన 29 ఏళ్ల నూర్ అల్పాల్లాతో ఓ బిడ్డకు స్వాగతం పలికారు. జూన్‌లో నూర్ అల్ఫాల్లా బిడ్డకు జన్మనివ్వగా.. రోమన్ పాసినో అని నామకరణం చేశారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. అల్ పాసినో అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో తన గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫాల్లాతో కనిపించారు. ఈ జంట కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!) ప్రెగ్నెన్సీ సమయంలో అనుమానాలు? అయితే గతంలో నూర్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ప్రకటించగా.. నటుడు అల్ పాసినో అభ్యంతరం వ్యక్తం చేశారు. నూర్ ప్రెగ్నెన్సీ వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందిగా కోరాడని తెలిసింది. అంతేకాకుండా తనకు 83 ఏళ్ల వయసులో పిల్లలను కనడం ఇష్టం లేదని తెలిపాడు. అయితే నూర్ గర్భం ధరించిన విషయాన్ని చాలా రోజుల పాటు అల్ పాసినోకు తెలియకుండా దాచింది. మే 31న గర్భం ధరించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి చేసుకోకుండానే ముగ్గురితో సహజీవనం? అల్ పాసినోకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అతనికి మొదట తన యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్ అనే మహిళతో సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఆ తర్వాత మరో నటి బెవర్లీ డి ఏంజెలోతో డేటింగ్ చేశారు. వీరికీ కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత అల్, బెవర్లీ 2004లో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు. ఆ తర్వాత అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా ఏప్రిల్ 2022లో లాస్ ఏంజిల్స్‌లో కలిసి డిన్నర్ చేస్తుండగా.. మొదటిసారి ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. కొవిడ్ లాక్ డౌన్లో వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. అల్ పాసినో తన తండ్రి కంటే పెద్ద వయసులో ఉన్నా.. అల్ఫాల్లా అతని వయస్సు అంతరాన్ని పెద్దగా పట్టించుకోదు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) + Al and his girlfriend, Noor Alfallah, after dinner in Santa Monica. pic.twitter.com/6kCrePMDuf — Pacino's World 👑 (@worldpacino) August 2, 2023 -
ప్రేయసితో సహజీవనం.. ఆమె ప్రెగ్నెన్సీపై డౌట్ పడ్డ నటుడు!
ప్రముఖ హాలీవుడ్ స్టార్, గాడ్ ఫాదర్ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే! అయితే ఈ వయసులో తను తండ్రిగా ప్రమోషన్ పొందడాన్ని నమ్మలేకపోయాడట. తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా? అని ఆలోచనలో పడ్డాడట! ఈ క్రమంలో తన ప్రియురాలు నూర్ అల్ఫల్లా గర్భం దాల్చడంపై అనుమానం వ్యక్తం చేశాడట. తన కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్ఏ డెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టాడట! దీంతో నూర్ కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా.. ఈ రిపోర్టులో అల్ పాసినోయే తండ్రి అని వెల్లడైనట్లు తెలుస్తోంది. అంటే ఈ హాలీవుడ్ స్టార్ 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారు. కానీ అతడి ప్రియురాలు నూర్ అల్ఫల్లా మాత్రం మొదటిసారి తల్లి కాబోతోంది. కాగా అల్ పాసినో గతంలో మీటల్ దోహన్, జాన్ టరంట్, బెవెర్లీ డీఆంగెలోతో రిలేషన్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో జాన్ టరంట్కు జూలీ మేరీ అనే కుమార్తె, బెవెర్లీ డీఆంగెలె కవలలకు జన్మనిచ్చింది. అయితే వీరిద్దరికీ బ్రేకప్ చెప్పిన తర్వాత అల్ పాసినో కోవిడ్ సమయంలో నూర్ అల్ఫల్లాతో లవ్‌లో పడ్డాడు. అప్పటినుంచి వీరు సహజీవనం చేస్తున్నారు. అల్ఫల్లా కూడా గతంలో రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేయగా 2018లో బ్రేకప్ చెప్పింది. చదవండి: హీరోయిన్‌తో లవ్.. ముద్దు ఫోటో షేర్ చేసిన నటుడు -
83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న హీరో
హాలీవుడ్ సీనియర్ హీరో, ‘గాడ్‌ఫాదర్’ ఫేమ్ అల్ పాసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. 29 ఏళ్ల యువతి, నిర్మాత నూర్ అల్పల్లాతో ఈ సీనియర్ హీరో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం అల్పల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు. (చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) కోవిడ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి రిలేషన్షిప్లో కొనసాగుతున్నారు. మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ తర్వాత పాసినో.. అల్పల్లాతో డేటింగ్ ప్రారంభించాడు. అల్పల్లా కూడా అంతకు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేసింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పాసినోతో సహజీవనం కొనసాగించింది. అల్పల్లాకు ఇది మొదటి సంతానం కాగా, పాసినోకు నాలుగో సంతానం. అంతకు ముందు నటన శిక్షకురాలు జాన్ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు.