ఆస్ట్రేలియా-భారత్‌ తొలి వన్డే.. రోహిత్‌ మూడో డబుల్‌ సెంచరీ ఇక్కడే! బ్యాటర్లకు పండగే | PCA Stadium Mohali Pitch Report, Weather Forecast: Batters Heaven Expected In Ind Vs Aus 1st ODI In Mohali - Sakshi
Sakshi News home page

PCA Stadium Pitch Report: ఆస్ట్రేలియా-భారత్‌ తొలి వన్డే.. రోహిత్‌ మూడో డబుల్‌ సెంచరీ ఇక్కడే! బ్యాటర్లకు పండగే

Published Fri, Sep 22 2023 8:21 AM | Last Updated on Fri, Sep 22 2023 9:27 AM

Batters heaven expected in IND vs AUS 1st ODI in Mohali - Sakshi

file photo

ఆసియాకప్‌-2023 విజయం తర్వాత టీమిండియా మరో కీలక​ పోరుకు సిద్దమైంది. స్వదేశంలో వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మొహాలీ వేదికగా శుక్రవారం జరగనుంది. ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు భారత జట్టు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్య, కుల్దీప్‌ యాదవ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.

ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. మొహాలీలో ఆస్ట్రేలియాపై భారత్‌ ఒక్క వన్డే మ్యాచ్‌లో​ కూడా గెలవలేదు. ఇప్పుడు ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. అన్నింటిలోను ఓటమి పాలైంది. ఈ క్రమంలో నేడు జరగబోయే తొలి వన్డేల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాహుల్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక తొలి వన్డే జరగబోయే మొహాలీలోని పీసీఏ ఐఎస్‌ బింద్రా స్టేడియం పిచ్‌ రిపోర్ట్‌ను ఓ సారి పరిశీలిద్దాం.

పిచ్‌ రిపోర్టు..
మొహాలీలోని పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామం. వికెట్‌ను కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగా తాయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేదికపై ఆడిన చివరి ఐదు మ్యాచ్‌లలో .. నాలుగు సార్లు మొదట బౌలింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. కేవలం ఒక్కసారి మాత్రమే తొలుత బ్యాటింగ్‌ చేసిన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే ఛాన్స్‌ ఉంది.

ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్‌ సాధించిన రికార్డు భారత్‌ పేరిటే ఉంది. 2017 శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా ఏకంగా 392 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లోనే టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(208) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఇక ఇక్కడ నాలుగేళ్లుగా వన్డే జరగలేదు. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రం జరిగాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ బ్యాటర్లే పైచేయి సాధించారు. ఇక ఈ మ్యాచ్‌కు ఎటువంటి వర్షసూచన లేదు.
చదవం‍డి: IND vs AUS: వన్డేల్లో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement