లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆరు పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (3) తొలి వికెట్‌గా వెనుదిరిగి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. మరో వికెట్ పడకుండా కేహుల్ రాహుల్ (36), పుజారా (34) భారత్‌ను ఆదుకునే ప్రయత్నంచేశారు. దూకుడుగా అడుతున్న రాహుల్ (36) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 70 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లికి జతకలిసిన పుజారా ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కుదురుకున్న దశలోనే పుజారా 36 పరుగుల వద్ద అండర్సన్ పుజారాను ఔట్ చేసి దెబ్బతీశాడు. ఆ తరువాత వచ్చిన రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది.
ప్రసుత్తం భారత్ నాలుగు కీలక వికెట్ల కోల్పోయి 104 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజ్‌లో కోహ్లి (24) విహారి (0) ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగుల వద్ద ఆలౌటైన విషయం తెలిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ 89 పరుగులతో రాణించగా.. బ్రాడ్ 38 పరుగులు చేసి కీలక సమయంలో ఆదుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఇషాంత్ శర్మ, బూమ్రా చెరో మూడు వికెట్లతో రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment