all out
-
136 ఏళ్ల చరిత్రలో తొలిసారి: టీమిండియా అత్యంత చెత్త రికార్డు (ఫొటోలు)
-
ఆలౌట్ తాగిన చిన్నారి.. అరుదైన చికిత్సతో కాపాడిన కిమ్స్ కడల్స్ డాక్టర్లు
హైదరాబాద్, మే 25, 2024: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన 18 నెలల పాప ప్రమాదవశాత్తు ఆలౌట్ సీసా మొత్తం తాగేసింది. ఆమె ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నా ఆమె పరిస్థితి బాగుపడకపోగా, ఊపిరితిత్తులు పాడయ్యాయి. ఆమెకు సరిగా ఊపిరి అందలేదు. దాంతో రాయ్‌పూర్ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిని సంప్రదించాయి.ఇక్కడి నుంచి ఇద్దరు ఇంటెన్సివిస్టులు, ఒక పెర్ఫ్యూజనిస్టు, ఒక కార్డియాక్ సర్జన్, ఐసీయూ నర్సు కలిసి రాయ్‌పూర్‌కు విమానంలో వెళ్లారు. అక్కడ పరీక్షించిన తర్వాత పాపకు ఆలౌట్‌లోని హైడ్రోకార్బన్ల వల్ల కెమికల్ న్యూమోనైటిస్ అనే సమస్య తీవ్రంగా వచ్చిందని తెలిసింది. పాప శరీరానికి తగినంత ఆక్సిజన్ అందించడానికి వెంటిలేటర్ సరిపోకపోవడంతో, ఆమె కుడివైపు గుండె కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. దాంతో పాపకు ఎక్మో పెట్టి, ఆమె పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.ఎక్మోను రెండు విధాలుగా అమరుస్తారు. సాధారణంగా, కుడి తొడ వెయిన్ను తొలగించి, డీ-ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకుంటారు, ఆపై ఎక్మో ద్వారా ఆక్సిజనేషన్ తర్వాత కుడి ఇంటర్నల్ జుగులర్ వెయిన్ ద్వారా ఊపిరితిత్తులను బైపాస్ చేస్తారు. గుండె కూడా దెబ్బతింటే, అంతర్గత జుగులర్ వెయిన్ నుంచి డీ-ఆక్సిజనేటెడ్ రక్తం తీసుకుని, దాన్ని ఎక్మో ద్వారా ఆక్సిజనేట్ చేస్తారు. మొత్తం శరీరానికి సరఫరా చేయడానికి అయోటా ఆర్క్ ద్వారా తిరిగి ప్రవేశపెడతారు. సాధారణంగా, ఫెమోరల్ వెయిన్ నుంచి రక్తం తీసుకుని, దాన్ని శుద్ధిచేసి ఫెమోరల్ ఆర్టెరీకి తిరిగి పంపుతారు. ఇది కొంత సులభం. అయితే, ఈ సందర్భంలో, పాప బరువు కేవలం 10 కిలోలు మాత్రమే ఉన్నందున, ఎక్మోను మెడ వద్ద అమర్చారు. ఇది ఊపిరితిత్తులు, గుండె రెండింటినీ బైపాస్ చేస్తుంది. ఈ విధానం చాలా అరుదు.ఈ ప్రొసీజర్ తర్వాత పాపను తొలుత రోడ్డు మార్గంలో రాయ్‌పూర్‌కు విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను 9 రోజుల పాటు వీఏ-ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడింది. అప్పుడు మరో ఐదారు రోజులు వెంటిలేటర్ మీద ఉంచారు. అనంతరం హైఫ్లో, లోఫ్లో ఆక్సిజన్ పెట్టారు. ఈ మధ్యలో ఇన్ఫెక్షన్ రావడంతో యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేశారు. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. అన్ని రకాలుగా బాగుండటంతో గురువారం ఆమెను డిశ్చార్జి చేశారు.వీఏ లేదా వీవీ ఎక్మోపై పిల్లలను పెట్టి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం అత్యంత అరుదు. అందులోనూ ముఖ్యంగా మెడ వద్ద కాన్యులా పెట్టి తరలించడం భారతదేశంలోనే అత్యంత అరుదైనది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన ఇలాంటి అతి కొద్ది కేసుల్లో ఇదొకటి. గుండె శస్త్రచికిత్సలు చేసిన తర్వాత పిల్లలకు ఎక్మో పెట్టడం కొంత సులభం. కానీ ఈ కేసులో మాత్రం పాపకు ఊపిరితిత్తులు, గుండె కూడా కొంత దెబ్బతిన్నాయి. పాప వయసు బాగా తక్కువ. దాంతో మెడ వద్ద కాన్యులేషన్ ద్వారా ఎక్మో పెట్టడం, ఎలాంటి సమస్యలు లేకుండా రాయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా తరలించడం చాలా సంక్లిష్టమైనది, సవాళ్లతో కూడుకున్నది. ఇది మొత్తం వైద్య బృందానికి ఉన్న అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వాలకు నిదర్శనం.ఈ సందర్భంగా కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ 'పరాగ్ శంకర్రావు డెకాటే' మాట్లాడుతూ.. బాలికకు ఇచ్చిన చికిత్స వల్ల ఆమె గుండె, ఊపిరితిత్తులకు తగినంత మద్దతు లభించింది. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, అత్యున్నత నైపుణ్యం కలిగిన వైద్యబృందం వల్ల మాత్రమే ఆమెను ఎక్మో పెట్టి రాయ్‌పూర్ నుంచి విమానంలో హైదరాబాద్‌కు విజయవంతంగా తీసుకురాగలిగాం.అనుభవజ్ఞులైన కార్డియాక్, వాస్క్యులర్ సర్జన్లు ఉండటంతో రక్తనాళాల్లోకి కాన్యులేషన్ సరిగ్గా జరిగింది. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో ఇలా మెడ ద్వారా కాన్యులేషన్ పెట్టి వీఏ-ఎక్మో పెట్టిన కేసులు ఆరు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో ఈ-పీసీఆర్ కూడా చేయగలరు. అంటే రోగిని ఎక్మో మీద పెట్టి, అదే సమయంలో కార్డియో రెస్పిరేటరీ మసాజ్ ఇవ్వగలరు. గడిచిన మూడేళ్లలో మొత్తం 15 సార్లు ఎక్మో పెట్టాము. ఇది భారతదేశంలోనే ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి అత్యంత ఎక్కువ సార్లు. మెరుగైన ఫలితాల కోసం రక్తనాళాలను కూడా పునరుద్ధరించగలం. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో చాలా అందుబాటు ధరల్లోనే ఎక్మో సేవలు అందుతాయి. లిటిల్ వన్ అనే ఫౌండేషన్ ద్వారా పేద రోగులకు ఆర్థిక సాయం కూడా అందిస్తాం. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అన్ని రకాల రోగులకు అత్యున్నత స్థాయి చికిత్సలు అందుతాయనడానికి ఈ కేసు ఒక నిదర్శనం” అని ఆయన చెప్పారు.రాయ్‌పూర్ నుంచి పాపను తీసుకొచ్చిన బృందంలో పీఐసీయూ అధినేత డాక్టర్ పరాగ్ డెకాటే, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ అవినాష్ రెడ్డి, కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ జనార్ధన్, పెర్ఫ్యూజనిస్టు దయాకర్, మేల్ నర్సు దీపుమోనే, సర్జికల్ సిస్టర్ నాగశిరీష ఉన్నారు. ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత పాపకు కిమ్స్ కడల్స్ పీఐసీయూ బృందం, నర్సులు, ఇతర సిబ్బంది సాయంతో సమగ్ర చికిత్సలు అందినట్లు డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. ఈ వైద్య నిపుణులందరి సమిష్టి కృషి వల్ల, ఐకాట్ సంస్థ అందించిన ఎయిర్ అంబులెన్స్ సేవల వల్ల, తల్లిదండ్రులు సహకారం వల్ల పాప పూర్తిగా కోలుకోగలిగింది. -
బంగ్లాదేశ్ 188 ఆలౌట్
సిల్హెట్: ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజే శ్రీలంక పట్టు బిగించింది. శనివారం రెండో రోజు 32/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 51.3 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. తైజుల్ ఇస్లామ్ (47; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విశ్వ ఫెర్నాండో 4, కసున్ రజిత, లహిరు కుమార చెరో 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో లంకకు 92 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆట నిలిచే సమయానికి 36 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే (52; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (23 బ్యాటింగ్, 3 ఫోర్లు), విశ్వ ఫెర్నాండో (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్ నహిద్ రాణాకు 2 వికెట్లు దక్కాయి. -
IND vs BAN 2nd Test: భారత బౌలర్లదే పైచేయి
ఒకవైపు ఉమేశ్, ఉనాద్కట్ పదునైన పేస్... మరోవైపు అనుభవజ్ఞుడైన అశ్విన్ స్పిన్ తంత్రం... వెరసి రెండో టెస్టులో తొలి రోజే బంగ్లాదేశ్ కుప్పకూలింది. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేని ఆతిథ్య జట్టు కనీస స్కోరు కూడా సాధించలేక చతికిలపడింది. మోమినుల్ హక్ పోరాటం మినహా జట్టు బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ విశేషమేమీ లేకపోయింది. గత టెస్టుతో పోలిస్తే అశ్విన్ మెరుగైన ప్రదర్శన ఇవ్వగా, ఉపఖండం పిచ్‌లపై ఉమేశ్ మళ్లీ సత్తా చాటాడు. పుష్కరకాలం తర్వాత టెస్టు ఆడిన ఉనాద్కట్ కూడా రెండు వికెట్లతో సంతృప్తిగా ముగించాడు. ఆపై టీమిండియా వికెట్ కోల్పోకపోయినా... ఆడిన 9 ఓవర్లలోనే ఎన్నో సార్లు బంతి అనూహ్యంగా స్పందించడంతో ఓపెనర్లు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని చూస్తే రెండో రోజు ఆట భారత బ్యాటింగ్‌కు సవాల్ విసిరేలా ఉంది. మిర్పూర్: భారత్‌తో గురువారం మొదలైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 73.5 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటైంది. మోమినుల్ హక్ (157 బంతుల్లో 84; 12 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. షకీబ్ విఫలం... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులకు పైగా నమోదైన భాగస్వామ్యాలు నాలుగు కాగా, అత్యధికం 48 మాత్రమే! ఇదీ ఆ జట్టు బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. ఒక్కో జోడీ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగానే భారత బౌలర్లు వికెట్ తీసి బంగ్లాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే జట్టు ఇన్నింగ్స్ ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా వెళ్లలేదు. ఓపెనర్లు నజ్ముల్ హొస్సేన్ (24), జాకీర్ హసన్ (15) ఆరంభంలో కొంత జాగ్రత్త ప్రదర్శించినా... అదీ ఎక్కువ సేపు సాగలేదు. ‘0’ వద్ద జాకీర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసినా దాని వల్ల భారత్‌కు పెద్దగా నష్టం జరగలేదు. జాకీర్‌ను అవుట్ చేసి ఉనాద్కట్ టెస్టుల్లో తొలి వికెట్ సాధించాడు. అదే స్కోరు వద్ద నజ్ముల్ కూడా అవుట్ కాగా... లంచ్ సమయానికి బంగ్లా స్కోరు 82/2కు చేరింది. అయితే విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడిన షకీబ్ (16) నిష్క్రమించాడు. మరోవైపు మోమిన్ మాత్రం పట్టుదలగా నిలబడి కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. అతనికి కొద్ది సేపు ముష్ఫికర్ రహీమ్ (26) సహకరించాడు.అశ్విన్ ఓవర్లో ముష్ఫికర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడం సహా ఒక దశలో పది బంతుల వ్యవధిలో వీరిద్దరు ఆరు ఫోర్లు బాదడం విశేషం. ఈ జోడీని జైదేవ్ ఉనాద్కట్ విడదీయగా... సిరాజ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన లిటన్ దాస్ (25) దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి 78 బంతుల్లో మోమినుల్ అర్ధసెంచరీ పూర్తయింది. టీ బ్రేక్ తర్వాత ఒకదశలో బంగ్లా 213/5తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే భారత బౌలర్లు చెలరేగడంతో మరో 14 పరుగులకే ఆ జట్టు తర్వాతి ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఎనిమిది ఓవర్ల ఆటలో భారత్ వికెట్ తీయడంలో బంగ్లాదేశ్ బౌలర్లు సఫలం కాలేకపోయారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: నజ్ముల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 24; జాకీర్ (సి) రాహుల్ (బి) ఉనాద్కట్ 15; మోమినుల్ (సి) పంత్ (బి) అశ్విన్ 84; షకీబ్ (సి) పుజారా (బి) ఉమేశ్ 16; ముష్ఫికర్ (సి) పంత్ (బి) ఉనాద్కట్ 26; లిటన్ దాస్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 25; మెహదీ హసన్ (సి) పంత్ (బి) ఉమేశ్ 15; నూరుల్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 6; తస్కీన్ (సి) సిరాజ్ (బి) ఉమేశ్ 1; తైజుల్ (నాటౌట్) 4; ఖాలెద్ (సి) ఉనాద్కట్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (73.5 ఓవర్లలో ఆలౌట్) 227. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–82, 4–130, 5–172, 6–213, 7–219, 8–223, 9–227, 10–227. బౌలింగ్: సిరాజ్ 9–1–39–0, ఉమేశ్ యాదవ్ 15–4–25–4, జైదేవ్ ఉనాద్కట్ 16–2–50–2, అశ్విన్ 21.5–3– 71–4, అక్షర్ 12–3–32–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బ్యాటింగ్) 3; గిల్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 19. బౌలింగ్: తస్కీన్ 4–2–8–0, షకీబ్ 4–2–11–0. -
24 ఏళ్ల క్రితం సొంతగడ్డపై.. 18 ఏళ్ల క్రితం విదేశీ గడ్డపై
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం మరోసారి కనిపించింది. రెండోరోజు ఆట వర్షంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. 272/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 278 పరుగులకు చేరగానే కేఎల్ రాహుల్(123 పరుగులు) రూపంలో వికెట్ కోల్పోయింది. అంతే అక్కడి నుంచి టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. కేవలం 49 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లు చేజార్చుకోవడం విశేషం. చదవండి: IND Vs SA: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. అనవసరంగా గెలుక్కున్నాడు ఈ నేపథ్యంలో టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే సీన్‌ను రిపీట్ చేసింది. 2003-04 ఆసీస్ పర్యటనలో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 311/3తో పటిష్టంగా కనిపించింది. అయితే మిగతా ఏడు వికెట్లను 55 పరుగుల వ్యవధిలో చేజార్చుకొని 366 పరుగులకు ఆలౌటైంది. ఇక అంతకముందు మరో ఆరేళ్లు వెనక్కి వెళితే.. అంటే 1997-98లో వెస్టిండీస్ టీమిండియా పర్యటనకు వచ్చింది. ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 471 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. అయితే ఎవరు ఊహించని విధంగా 41 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు చేజార్చుకొని 512 పరుగులకు ఆలౌటైంది. చదవండి: IND VS SA 1st Test: లడ్డూలాంటి క్యాచ్ వదిలేశారు.. ఫలితం అనుభవించండి -
WI Vs Pak: పాకిస్తాన్ 217 ఆలౌట్
కింగ్స్టన్: వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఫవాద్ ఆలమ్ (56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... అష్రఫ్ (44; 8 ఫోర్లు), బాబర్ ఆజమ్ (30; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో సీల్స్, హోల్డర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 38 ఓవర్లలో 5 వికెట్లకు 100 పరుగులు చేసింది. చదవండి: Ind Vs Eng: రెండో రోజు బౌలర్లదే... -
నాలుగో టెస్టు: ‘స్టోక్స్ నన్ను తిట్టాడు’
112 పరుగులతో పోలిస్తే 205 పరుగులు మెరుగైన స్కోరే కదా! ఇంగ్లండ్ జట్టు కూడా ఇదే తరహాలో సంతృప్తి చెందినట్లుంది. తీవ్ర విమర్శలు వచ్చిన గత పిచ్‌తో పోలిస్తే ఈసారి ఎలాంటి అనూహ్య టర్న్ కానీ బౌన్స్ కానీ లేవు. స్పిన్నర్లు కూడా మరీ ప్రమాదకరంగా ఏమీ కనిపించలేదు. అయినా సరే ఇంగ్లండ్‌కు పరుగులు చేయడం సాధ్యం కాలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు వచ్చి మంచి అవకాశాన్ని ఆ జట్టు వృథా చేసుకుంది. బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపించిన పిచ్‌పై రోజు మొత్తం కూడా నిలబడలేకపోయింది. ఐదు ఇన్నింగ్స్‌ల తర్వాత మొదటిసారి 200 పరుగులు దాటినా... భారత్‌కు సవాల్ విసిరేందుకు ఏమాత్రం సరిపోని స్కోరిది. అక్షర్ పటేల్, అశ్విన్ కలిసి ఏడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టగా, సిరాజ్ రెండు కీలక వికెట్లు తీశాడు. రెండో రోజు నిలబడి టీమిండియా భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్ చేతిలోకి వచ్చేసినట్లే. అహ్మదాబాద్: భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ వైఫల్యం వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. లారెన్స్ (46 ; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అక్షర్ పటేల్‌కు 4, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ తొలి ఓవర్లోనే గిల్ (0) వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్ (8 బ్యాటింగ్), పుజారా (15 బ్యాటింగ్) నిలబడటంతో ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 24 పరుగులకు చేరింది. రూట్ విఫలం... గత రెండు టెస్టుల్లాగే ఈసారి కూడా ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఆరో ఓవర్ నుంచే స్పిన్నర్‌ను బౌలింగ్‌కు దించి భారత్ ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిం చింది. దానిని నిలబెట్టుకుంటూ ఈ ఓవర్ వేసిన అక్షర్ రెండో బంతికే సిబ్లీ (2)ని బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లోనూ క్రాలీ (9)ని అవుట్ చేసిన అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ జో రూట్ (5)ను చక్కటి ఇన్‌స్వింగర్‌తో సిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అక్షర్, అశ్విన్ రూట్ కనీసం రివ్యూ కోరే ప్రయత్నం కూడా చేయలేదు. స్కోరు 30/3కి చేరిన ఈ దశలో స్టోక్స్, బెయిర్‌స్టో (28; 6 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా సిరాజ్ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన స్టోక్స్ ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. స్టోక్స్ క్రీజ్‌లో ఉండటంతో వెంటనే అశ్విన్‌తో బౌలింగ్ చేయించిన ఎత్తుగడ ఈసారి పని చేయలేదు. అతని తొలి ఓవర్లోనే స్టోక్స్ సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అశ్విన్ ఓవర్లోనే అతని ఎల్బీ కోసం భారత్ చేసిన అప్పీల్ రివ్యూలో కూడా తిరస్కరణకు గురైంది. టపటపా... లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే సిరాజ్ కీలక వికెట్‌తో ఇంగ్లండ్‌ను మరింత ఇబ్బందుల్లో పడేశాడు. 146.4 కిలోమీటర్ల వేగంతో సిరాజ్ వేసిన బంతి నేరుగా బెయిర్‌స్టో ప్యాడ్లను తాకడంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. బెయిర్‌స్టో రివ్యూ కోరినా లాభం లేకపోయింది. మరో ఎండ్‌లో స్టోక్స్ పట్టుదలగా తన బ్యాటింగ్ కొనసాగించాడు. సుందర్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అతను, అక్షర్ ఓవర్లో రివర్స్ స్వీప్‌తో 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సుందర్ వేసిన ఒక చక్కటి బంతికి స్టోక్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. చివరి సెషన్ లో లారెన్స్, పోప్ (87 బంతుల్లో 29; 2 ఫోర్లు) కలిసి కొద్దిసేపు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే అశ్విన్ నాలుగు పరుగుల వ్యవధిలో పోప్, ఫోక్స్ (1)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. అప్పటి వరకు ఓపిగ్గా ఆడిన లారెన్స్ కూడా అక్షర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ కాగా, మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సేపు పట్టలేదు. ‘స్టోక్స్ నన్ను తిట్టాడు’ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మధ్యలో స్టోక్స్, కోహ్లి మధ్య కాస్త వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. సిరాజ్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన సమయంలో సిరాజ్‌ను స్టోక్స్ ఏదో అన్నాడు. అయితే దీనికి జవాబివ్వకుండా సిరాజ్ నేరుగా విషయాన్ని తన కెప్టెన్‌కు చెప్పాడు. దాంతో సహచరుడికి అండగా కోహ్లి వెళ్లి స్టోక్స్‌తో గట్టిగా వాదించడం కనిపించింది. అంపైర్ వీరేందర్ శర్మ మధ్యలో జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఆట ముగిశాక మాట్లాడిన సిరాజ్... స్టోక్స్ తనను తిట్టడం వల్లే ఇదంతా జరిగిందని వెల్లడించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) సిరాజ్ (బి) అక్షర్ 9; సిబ్లీ (బి) అక్షర్ 2; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) సిరాజ్ 28; రూట్ (ఎల్బీ) (బి) సిరాజ్ 5; స్టోక్స్ (ఎల్బీ) (బి) సుందర్ 55; పోప్ (సి) గిల్ (బి) అశ్విన్ 29; లారెన్స్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 46; ఫోక్స్ (సి) రహానే (బి) అశ్విన్ 1; బెస్ (ఎల్బీ) (బి) అక్షర్ 3; లీచ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 7; అండర్సన్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (75.5 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–10, 2–15, 3–30, 4–78, 5–121, 6–166, 7–170, 8–188, 9–189, 10–205. బౌలింగ్: ఇషాంత్ శర్మ 9–2–23–0; సిరాజ్ 14–2–45–2; అక్షర్ పటేల్ 26–7–68–4; అశ్విన్ 19.5–4–47–3; సుందర్ 7–1–14–1. భారత్ తొలి ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) అండర్సన్ 0; రోహిత్ (బ్యాటింగ్) 8; పుజారా (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (12 ఓవర్లలో వికెట్ నష్టానికి) 24. వికెట్ల పతనం:1–0. బౌలింగ్: అండర్సన్ 5–5–0–1, స్టోక్స్ 2–1–4–0, లీచ్ 4–0–16–0, బెస్ 1–0–4–0. -
ముంబై: ‘ఆపరేషన్ ఆలౌట్’.. దడ మొదలైంది!
సాక్షి, ముంబై: ముంబై పోలీసులు ఆపరేషన్ ఆలౌట్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 39 మంది నేరస్తులను ముంబై పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. మరో 74 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక నగరంలోని అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 951 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముంబై పోలీసులు గత కొద్ది రోజులుగా చేపడుతున్న ‘ఆపరేషన్ ఆలౌట్’ పథకం సత్పలితాలనిస్తోంది. ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో స్థానికంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న నేరస్తులతో పాటు పరారీలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులు, లైసెన్స్ లేని ఆయుధాలతో తిరుగుతున్న నేరస్తులు కూడా ఇందులో పట్టుబడుతున్నారు. దీంతో కరుడుగట్టి నేరస్తులతోపాటు ఇళ్లల్లో దాక్కున్న సాధారణ నేరస్తుల్లో దడ మొదలైంది. ముంబై సీపీ నేతృత్వంలో.. శివ్ (శివాజీ) జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటచేసుకోకుండా ముంబై పోలీసులు ఆపరేషన్ ఆలౌట్ చేపట్టారు. ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్, విశ్వాస్ నాంగరే–పాటిల్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ల మార్గదర్శనంలో కూంబింగ్ ఆపరేషన్ జరిగింది. తమ తమ పోలీసుస్టేషన్ల హద్దులో పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు 259 చోట్ల కూంబింగ్ నిర్వహించారు. అందులో పరారీలో ఉన్న 39 మంది నేరస్తులను పట్టుకోగా లైసెన్స్ లేకుండా అక్రమంగా ఆయుధాలతో తిరుగుతున్న 37 మందిపై, నగర బహిష్కరణకు గురైన మరో 37 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నివాసముంటున్న వారిపై కూడా ఈ ఆపరేషన్‌లో చర్యలు తీసుకున్నారు. అందులో హోటళ్లు, ముసాఫిర్ ఖానా, లాడ్జింగులు, గెస్ట్ హౌస్‌లు తదితర అద్దె నివాస గృహాలలో 951 చోట్ల తనిఖీలు నిర్వహించారు. అలాగే మొత్తం ముంబైలో 149 చోట్ల నాకా బందీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 39 మందిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ ఆలౌట్‌లో భాగంగా రోడ్లపై, జంక్షన్ల వద్ద, సిగ్నల్స్ వద్ద అడుక్కుంటున్న 50 మంది బిక్షగాళ్లపై చర్యలు తీసుకున్నారు. బిక్షగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దడమూ ఈ ఆపరేషన్ లక్ష్యమే. సిగ్నల్స్ వద్ద, ప్రార్థన స్థలాలవద్ద అడుక్కుంటున్న బిక్షగాళ్లందరిని పట్టుకోవాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా ముంబై పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఇందులో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన లేదా నగరాన్ని తిలకించేందుకు వచ్చి తప్పిపోయి తిరుగుతున్న లేదా ప్రేమలో మోసపోయి ఇంటికి వెళ్లలేక ఇక్కడే తిరుగుతున్న పిల్లలన్ని పట్టుకుని వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఇందులో అనేక మంది పిల్లలు రైల్వే స్టేషన్ల బయట, ప్లాట్‌ఫారాలపై, బస్టాండ్లలో, ఫుట్‌పాత్‌లపై లభించారు. వీరి చిరునామా సేకరించి ఇళ్లకు పంపించడంతో అనేక పేద కుటుంబాలు ఉపరి పీల్చుకున్నాయి. అంతేగాకుండా ఈ పథకం చేపట్టినందుకు ముంబై పోలీసులు వివిధ రంగాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. చదవండి: మరోసారి ఈ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు ఉత్తరాఖండ్: మూడేళ్ల కొడుకును వదిలి -
బంగ్లా వల్ల కాలేదు..!
దక్షిణాఫ్రికా ఇటీవలి భారత్‌తో సిరీస్‌లో మూడు టాస్‌లు ఓడిపోయిన తర్వాత ‘ఒక్క టాస్ అయినా గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే’ ఫలితం భిన్నంగా ఉండేదేమో అంటూ డు ప్లెసిస్ ఆవేదనగా ఒక వ్యాఖ్య చేశాడు. కానీ విదేశీ జట్లు భారత గడ్డపై టాస్ మాత్రమే గెలిస్తే సరిపోదని, ప్రత్యర్థిని ఎదుర్కోగల సత్తా కూడా కొంత ఉండాలని మళ్లీ మళ్లీ రుజువైంది. కీలకమైన టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగినా... దానిని ఉపయోగించుకోవడంలో బంగ్లాదేశ్ విఫలమైంది. ముగ్గురు పేసర్లు ఒక వైపు, అశ్విన్ మరో వైపు చెలరేగుతుండగా ఏమీ చేయలేక చేతులెత్తేసి 150 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రోహిత్ త్వరగానే అవుటైనా... పుజారా, మయాంక్ కలిసి తమదైన శైలిలో టీమిండియా భారీ స్కోరుకు బాట వేశారు. షమీ అద్భుత బౌలింగే తొలి రోజు ఆటలో హైలైట్‌గా నిలిచిన అంశం. ఇండోర్: భారత్‌తో టి20 సిరీస్‌లో ఎంతో కొంత పోరాటం కనబర్చిన బంగ్లాదేశ్ టెస్టుల్లోకి వచ్చేసరికి ‘తమ స్థాయి’ని ప్రదర్శించింది. తొలి టెస్టు మొదటి రోజు గురువారం పేలవమైన ఆటతో ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (105 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మోమినుల్ హక్ (80 బంతుల్లో 37; 6 ఫోర్లు) కొంత పోరాడి నాలుగో వికెట్‌కు 68 పరుగులు జత చేయడం మినహా మిగతా జట్టంతా విఫలమైంది. షమీ 3 వికెట్లు పడగొట్టగా...ఇషాంత్, ఉమేశ్, అశ్విన్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ (6) వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (61 బంతుల్లో 43 బ్యాటింగ్; 7 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (81 బంతుల్లో 37 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ మరో 64 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. ముగ్గురూ తలా ఒక వికెట్... ఊహించినట్లుగానే పిచ్ ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు అనుకూలించింది. ఇలాంటి స్థితిలో భారత త్రయాన్ని ఎదుర్కోవడం బంగ్లా బ్యాట్స్‌మెన్ వల్ల కాలేదు. ఓపెనర్ కైస్ (6)ను అవుట్ చేసి ప్రత్యర్థి పతనానికి ఉమేశ్ శ్రీకారం చుట్టగా, అదే స్కోరు వద్ద మరో ఓపెనర్ షాద్మన్ (6)ను ఇషాంత్ పెవిలియన్ పంపించాడు. ఒకసారి డీఆర్ఎస్తో బతికిపోయినా, ఆ తర్వాత మిథున్ (13) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. షమీ వేసిన బంతికి వికెట్లు ముందు దొరికిపోయిన అతను రివ్యూ కోరలేదు. కీలక భాగస్వామ్యం... స్కోరు 31/3నుంచి బంగ్లాను ఆదుకునేందుకు కెప్టెన్ మోమినుల్, సీనియర్ ముష్ఫికర్ కలిసి ప్రయత్నించారు. మంచి సమన్వయంతో ఆడిన వీరిద్దరు కొన్ని చూడచక్కటి షాట్లు కూడా కొట్టారు. ఈ క్రమంలో మధ్యలో కొంత అదృష్టం కూడా బంగ్లా జోడీకి కలిసొచ్చింది. లంచ్ విరామం తర్వాత అశ్విన్ వేసిన ఓవర్లో వరుస బంతుల్లో ముష్ఫికర్ 6, 4 కొట్టడంతో భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇద్దరు సీనియర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే బంగ్లా మెరుగైన స్కోరు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. టీమ్ హ్యాట్రిక్... కీలక సమయంలో నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసి అశ్విన్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. అశ్విన్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి వదిలేసిన మోమినుల్ క్లీన్‌బౌల్డయ్యాడు. భారత గడ్డపై అశ్విన్‌కు ఇది 250వ వికెట్ కావడం విశేషం. కొద్ది సేపటికే అశ్విన్ బౌలింగ్‌లోనే స్వీప్‌కు ప్రయత్నించి మహ్ముదుల్లా (10) కూడా బౌల్డయ్యాడు. ఆ తర్వాత బంగ్లా పతనం వేగంగా సాగింది. 10 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 5 వికెట్లు కోల్పోయింది. వరుస బంతుల్లో ముష్ఫికర్, మెహదీ హసన్ (0)లను షమీ అవుట్ చేశాక అంపైర్లు టీ విరామం ప్రకటించారు. ముష్ఫికర్‌ను షమీ అద్భుత బంతితో బౌల్డ్ చేసిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. విరామంనుంచి తిరిగొచ్చాక తొలి బంతికే లిటన్ దాస్ (21)ను ఇషాంత్ అవుట్ చేయడంతో భారత్ ‘టీమ్ హ్యాట్రిక్’ పూర్తి చేసుకుంది. జడేజా చక్కటి ఫీల్డింగ్‌కు తైజుల్ (1) రనౌట్ కాగా, ఇబాదత్ (2)ను బౌల్డ్ చేసి ఉమేశ్ ప్రత్యర్థి జట్టు ఆట ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై బంగ్లాకు ఇది రెండో అత్యల్ప స్కోరు. రోహిత్ విఫలం... గత సిరీస్ హీరో రోహిత్ శర్మ బంగ్లాతో టెస్టులో అదే జోరును కొనసాగించలేకపోయాడు. జాయెద్ బంతిని డ్రైవ్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో రోహిత్ అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత మయాంక్, పుజారా ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బంగ్లా బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ వీరిద్దరు వేగంగా పరుగులు జోడించారు. ఒక దశలో పుజారా ఎనిమిది బంతుల వ్యవధిలో 5 ఫోర్లు బాదడం విశేషం! 32 పరుగుల వద్ద మయాంక్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో కైస్ వదిలేయడం భారత్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత మరో వికెట్ తీయడంలో బంగ్లా విఫలమైంది. 250 స్వదేశంలో అశ్విన్ వికెట్ల సంఖ్య. తన 42వ టెస్టులో అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కుంబ్లే (350), హర్భజన్ (265) మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు. నాలుగు క్యాచ్‌లు నేలపాలు! బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేసినా మొదటి రోజు భారత ఫీల్డింగ్‌లో భారీ వైఫల్యం కనిపించింది. ఏకంగా నాలుగు క్యాచ్‌లు అదీ స్లిప్‌లోనే చేజారాయి. వీటిలో మూడు క్యాచ్‌లు రహానే వదిలేయగా, ఒక క్యాచ్‌ను కోహ్లి వదిలేశాడు. అశ్విన్ బౌలింగ్‌లోనే ఇది మూడు సార్లు జరగ్గా, ఉమేశ్ బౌలింగ్‌లో ఒక అవకాశం చేజారింది. ముష్ఫికర్ మూడు సార్లు (3, 14, 34 పరుగుల వద్ద) బతికిపోగా, మరోసారి మహ్ముదుల్లాకు (7 పరుగుల వద్ద) లైఫ్ లభించింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాద్మన్ (సి) సాహా (బి) ఇషాంత్ 6; కైస్ (సి) రహానే (బి) ఉమేశ్ 6; మోమినుల్ (బి) అశ్విన్ 37; మిథున్ (ఎల్బీ) (బి) షమీ 13; ముష్ఫికర్ (బి) షమీ 43; మహ్ముదుల్లా (బి) అశ్విన్ 10; లిటన్ దాస్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 21; మెహదీ హసన్ (ఎల్బీ) (బి) షమీ 0; తైజుల్ (రనౌట్) 1; జాయెద్ (నాటౌట్) 7; ఇబాదత్ (బి) ఉమేశ్ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (58.3 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–12; 2–12; 3–31; 4–99; 5–115; 6–140; 7–140; 8–140; 9–148; 10–150. బౌలింగ్: ఇషాంత్ 12–6–20–2; ఉమేశ్ 14.3–3–47–2; షమీ 13–5–27–3; అశ్విన్ 16–1–43–2; జడేజా 3–0–10–0. భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 37; రోహిత్ (సి) లిటన్ దాస్ (బి) జాయెద్ 6; పుజారా (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (26 ఓవర్లలో వికెట్ నష్టానికి) 86. వికెట్ల పతనం: 1–14. బౌలింగ్: ఇబాదత్ 11–2–32–0; అబూ జాయెద్ 8–0–21–1; తైజుల్ 7–0–33–0. తొలి సెషన్ ఓవర్లు: 26, పరుగులు: 63, వికెట్లు: 3 (బంగ్లాదేశ్) రెండో సెషన్ ఓవర్లు: 28, పరుగులు: 77, వికెట్లు: 4 (బంగ్లాదేశ్) మూడో సెషన్ ఓవర్లు: 4.1, పరుగులు: 10, వికెట్లు: 3 (బంగ్లాదేశ్) ఓవర్లు: 26, పరుగులు: 86, వికెట్లు: 1 (భారత్) -
కోహ్లి, రహానే చేతుల్లో...
మొత్తానికి ఆధిక్యమైతే దక్కింది! కానీ అది కొంతే! వెస్టిండీస్ మరీ ఏమీ వెనుకబడి లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించి తొలి టెస్టులో టీమిండియాను పైమెట్టులో నిలిపే బాధ్యత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలపై పడింది. వీరికితోడు విహారి, పంత్ కొన్ని పరుగులు జోడిస్తే మిగిలిన పనిని బౌలర్లు చూసుకునే వీలుంటుంది. నార్త్ సౌండ్ (అంటిగ్వా): సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (5/43) ప్రతాపం చూపాడు. కీలక సమయంలో వికెట్లు తీసి తొలి టెస్టులో వెస్టిండీస్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ (74 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) ఆ జట్టు టాప్ స్కోరర్. కెప్టెన్ హోల్డర్ (65 బంతుల్లో 39; 5 ఫోర్లు), హెట్‌మైర్ (47 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. షమీ (2/48), జడేజా (2/64)లకు రెండేసి వికెట్లు దక్కాయి. 75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ టీ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (16), కేఎల్ రాహుల్ (85 బంతుల్లో 38; 4 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (25) ఔటయ్యారు. కోహ్లి (14 బ్యాటింగ్), రహానే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కోహ్లి సేన 173 పరుగుల ఆధిక్యంలో ఉంది. హోల్డర్, కమిన్స్ విసిగించారు... భారత లోయరార్డర్లో జడేజా–ఇషాంత్ తరహాలోనే విండీస్ లోయరార్డర్లో హోల్డర్, మిగుయెల్ కమిన్స్ (45 బంతుల్లో 0) బౌలర్లను విసిగించారు. ఓవర్‌నైట్ స్కోరు 189/8 శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్లు ఆలౌట్ కావడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ, హోల్డర్, కమిన్స్ పట్టుదల చూపారు. 17 ఓవర్లకు పైగా క్రీజులో నిలిచి జట్టు స్కోరును 200 దాటించారు. 9వ వికెట్‌కు 41 పరుగులు జత చేశారు. హోల్డర్‌ను ఔట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కమిన్స్‌ను జడేజా బౌల్డ్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. శుక్రవారం టీ సెషన్ అనంతరం భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి తడబడింది. ప్రతి బ్యాట్స్‌మెన్ అన్నోఇన్నో పరుగులు చేయడంతో ఓ దశలో 130/4తో కాస్త మెరుగ్గానే కనిపించింది. అయితే, ఇషాంత్ విజృంభించి... కీలకమైన చేజ్, హోప్ (24), హెట్మైర్ను ఔట్ చేశాడు. ఇదే ఊపులో రోచ్ (0) పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
చివరి టెస్ట్: జడేజా ఒంటరి పోరాటం
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులుకు ఆలౌట్ అయ్యింది. ఆల్‌రౌండర్ జడేజా 86 పరుగులతో చివరి వరకూ పోరాడి నాటౌట్‌గా నిలిచాడు. 176 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే తెలుగు కుర్రాడు హనుమ విహారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోర్ 237 వద్ద హనుమ విహారి (56)ని మెయిన్ అలీ ఔట్ చేశాడు. దీంతో భారత్ మరో ఇరవై పరుగుల లోపు ఆలౌట్ అవుతుందని భావించారు. కానీ జడేజా ఒంటరి పోరాటంతో భారత్ 292 పరుగులు చేయగలిగింది. ఇషాంత్ శర్మ (4) కొద్ది సేపు క్రీజ్‌లో జడేజాకు అండగా నిలిచాడు. ఆ తరువాత వచ్చిన షమి వెంటనే ఔటైనా.. చివరి వికెట్‌గా వచ్చిన బూమ్రా సహాయంతో జడేజా పోరాడాడు. చివరి వికెట్‌గా బూమ్రా రనౌట్ కావడంతో భారత్ ఇన్సింగ్స్ ముగిసింది. చివరి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం నమోదవ్వడం విశేషం. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్సింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్, మోయిన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కగా.. బ్రాడ్, కరణ్, రషీద్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఇంగ్లండ్‌తో టెస్ట్ : కష్టాల్లో భారత్
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆరు పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (3) తొలి వికెట్‌గా వెనుదిరిగి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. మరో వికెట్ పడకుండా కేహుల్ రాహుల్ (36), పుజారా (34) భారత్‌ను ఆదుకునే ప్రయత్నంచేశారు. దూకుడుగా అడుతున్న రాహుల్ (36) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 70 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లికి జతకలిసిన పుజారా ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కుదురుకున్న దశలోనే పుజారా 36 పరుగుల వద్ద అండర్సన్ పుజారాను ఔట్ చేసి దెబ్బతీశాడు. ఆ తరువాత వచ్చిన రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రసుత్తం భారత్ నాలుగు కీలక వికెట్ల కోల్పోయి 104 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజ్‌లో కోహ్లి (24) విహారి (0) ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగుల వద్ద ఆలౌటైన విషయం తెలిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ 89 పరుగులతో రాణించగా.. బ్రాడ్ 38 పరుగులు చేసి కీలక సమయంలో ఆదుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఇషాంత్ శర్మ, బూమ్రా చెరో మూడు వికెట్లతో రాణించారు. -
ఒకటి...రెండు...ఇన్నింగ్స్ ముగిసింది!
సాక్షి, గుంటూరు: 1, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0 ఈ అంకెలేంటా అని ఆశ్చర్యపోతున్నారా... ఇవి ఓ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ వరుసగా నమోదు చేసిన స్కోర్లు! మొత్తం పదకొండు మంది కలిసి చేసింది ఒకే ఒక్క పరుగైతే మరో అదనపు పరుగుతో కలుపుకొని జట్టు మొత్తం స్కోరు రెండు. ఈ పరుగులు చేయడానికి ఆ టీం ఆడిన ఓవర్లు 17. అందులో 16 మెయిడిన్లు. క్రీజులోకి వచ్చిన తొమ్మిది మంది ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఒక్కరు తప్ప మిగిలిన నలుగురు ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రత్యర్థి జట్టుకు కేవలం ఒక్క బంతి సరిపోయింది. ఇవేవో గల్లీ క్రికెట్లో నమోదైన గణాంకాలు కావు. బీసీసీఐ అధికారికంగా నిర్వహిస్తున్న మహిళల జాతీయ అండర్–19 సూపర్ లీగ్ మ్యాచ్లోనివి. జేకేసీ కళాశాల మైదానంలో నాగాలాండ్–కేరళ జట్ల మధ్య శుక్రవారం జరిగిన 50 ఓవర్ల మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17 ఓవర్లలో రెండు పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మేనక ఓ పరుగు చేయగా.. మరో పరుగు వైడ్ రూపంలో లభించింది. మిగిలిన పది మంది సున్నాతో సరిపెట్టారు. కేరళ బౌలర్లలో కెప్టెన్ మిన్ను మణి 4, సౌరభ్య 2 వికెట్లతో నాగాలాండ్ వెన్ను విరిచారు. మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు తొలి బంతికే విజయాన్ని సొంతం చేసుకుంది. నాగాలాండ్ బౌలర్ దీపిక వేసిన తొలి బంతి వైడ్‌గా వెళ్లింది. ఆ మరుసటి బంతిని అన్సు ఫోర్ కొట్టడంతో.. ఆట పూర్తైంది. క్రికెట్ చరిత్రలో ఒక్క బంతికే లక్ష్యాన్ని ఛేదించడంతో పాటు అతి తక్కువ సమయం సాగిన మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. ఇటీవల ఇదే టోర్నీలో మేఘాలయ జట్టు 17 పరుగులకే కుప్పకూలింది. బిహార్, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్కిం 18 పరుగులకే ఆలౌటై చెత్త ప్రదర్శన నమోదు చేసింది. -
ఆంధ్ర 215 ఆలౌట్
సాక్షి, ఒంగోలు: ఈ సీజన్లో తొలిసారి ఆంధ్ర బ్యాట్స్‌మెన్ తడబడటంతో... ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చేజార్చుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 74/2తో ఆట మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 215 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హనుమ విహారి (70; 6 ఫోర్లు), రికీ భుయ్ (69; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించడంతో ఒకదశలో ఆంధ్ర రెండు వికెట్లకు 157 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. అయితే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో విహారి... ధవళ్ కులకర్ణి బౌలింగ్‌లో రికీ భుయ్ అవుటయ్యాక ఆంధ్ర ఇన్నింగ్స్ కుప్పకూలింది. శార్దుల్ 55 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 117 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై ఓవరాల్ ఆధిక్యం 307 పరుగులకు చేరింది. అస్సాం పోరాటం... మరోవైపు గువాహటిలో హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ రంజీ మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడుతోన్న అస్సాం మూడో రోజు 7 వికెట్లకు 300 పరుగులు చేసింది. అమిత్ సిన్హా (96 బ్యాటింగ్; 11 ఫోర్లు), రజాకుద్దీన్ (75; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఏడో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. ప్రస్తుతం అస్సాం 110 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
తడబడిన టీమిండియా.. 9 వికెట్లు ఫట్!
కాన్సూర్: ప్రతిష్టాత్మక 500వ టెస్టు మ్యాచ్ లో తొలిరోజు టీం ఇండియా తడబడింది. టాప్ ఆర్డర్ రాణించినా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో నిర్ణీత 87.1 ఓవర్లలో 291 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. న్యూజిల్యాండ్‌తో గురువారం ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ అంచనాలతో బరిలోకి దిగింది. భారత క్రికెట్ చరిత్రలో ఇది 500వ టెస్టు మ్యాచ్ కావడంతో ఎంతో ఆసక్తి రేపిన ఈ టెస్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లి తొమ్మిది పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. భారత్ స్కోరు 42 పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్ గా కేఎల్ రాహుల్(32) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. విజయ్ 123 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన చటేశ్వర పూజారా 84 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 62 పరుగులు చేశారు. వీరిద్దరూ రాణించడంతో ఓ దశలో 46.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 147 పరుగులతో దృఢంగా కనించిన టీమిండియా.. విజయ్, పూజారా, కోహ్లి వెంటవెంటనే కోల్పోవడంతో కష్టాల్లో పడింది. పుజారా, కొహ్లీలు 13 పరుగుల తేడాతో పెవిలియన్ కు చేరడంతో భారీ ఎదురుదెబ్బతగిలింది. అనంతరం బరిలోకి దిగిన రహానే 18, ఆర్జీ శర్మ 35 పరుగులు చేసి వెనుదిరిగారు. స్పిన్నర్ అశ్విన్ 40 పరుగులతో రాణించి సాంట్నెర్ బౌలింగ్ లో టేలర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే డబ్ల్యూపీ సాహా, మహమ్మద్ షమి లు కూడా డక్ అవుట్ అయ్యారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఉమేశ్ యాదవ్ 8 పరుగులు, రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. న్యూజిల్యాండ్ బౌలర్లలో బౌల్ట్, సాంట్నెర్ తలో మూడు వికెట్లు పడగొట్టి రాణించారు.