బంగ్లాదేశ్‌ 188 ఆలౌట్‌ | Bangladesh 188 all out | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ 188 ఆలౌట్‌

Published Sun, Mar 24 2024 12:48 AM | Last Updated on Sun, Mar 24 2024 12:48 AM

Bangladesh 188 all out - Sakshi

సిల్హెట్‌: ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజే శ్రీలంక పట్టు బిగించింది. శనివారం రెండో రోజు 32/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 51.3 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. తైజుల్‌ ఇస్లామ్‌ (47; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విశ్వ ఫెర్నాండో 4, కసున్‌ రజిత, లహిరు కుమార చెరో 3 వికెట్లు తీశారు.

తొలి ఇన్నింగ్స్‌లో లంకకు 92 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక ఆట నిలిచే సమయానికి 36 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసింది. ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నే (52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. కెపె్టన్‌ ధనంజయ డిసిల్వా (23 బ్యాటింగ్, 3 ఫోర్లు), విశ్వ ఫెర్నాండో (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్‌ నహిద్‌ రాణాకు 2 వికెట్లు దక్కాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement