సాక్షి, ఒంగోలు: ఈ సీజన్‌లో తొలిసారి ఆంధ్ర బ్యాట్స్‌మెన్ తడబడటంతో... ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చేజార్చుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 74/2తో ఆట మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 215 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హనుమ విహారి (70; 6 ఫోర్లు), రికీ భుయ్ (69; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించడంతో ఒకదశలో ఆంధ్ర రెండు వికెట్లకు 157 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. అయితే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో విహారి... ధవళ్ కులకర్ణి బౌలింగ్‌లో రికీ భుయ్ అవుటయ్యాక ఆంధ్ర ఇన్నింగ్స్ కుప్పకూలింది. శార్దుల్ 55 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 117 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై ఓవరాల్ ఆధిక్యం 307 పరుగులకు చేరింది.
అస్సాం పోరాటం...
మరోవైపు గువాహటిలో హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ రంజీ మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడుతోన్న అస్సాం మూడో రోజు 7 వికెట్లకు 300 పరుగులు చేసింది. అమిత్ సిన్హా (96 బ్యాటింగ్; 11 ఫోర్లు), రజాకుద్దీన్ (75; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఏడో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. ప్రస్తుతం అస్సాం 110 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆంధ్ర 215 ఆలౌట్
Published Mon, Nov 20 2017 4:12 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment