
టెస్టుల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కరోనా కారణంగా గతేడాది ఇంగ్లండ్‌తో వాయిదా పడిన ఐదో టెస్టు ఎడ్డ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకు 23 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్‌తో ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా రికార్డులకెక్కాడు.
అంతకుముందు 1981-82 ఇంగ్లండ్ సిరీస్‌లో భారత దిగ్గజం కపిల్ దేవ్ ఇంగ్లండ్‌పై 22 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా సిరీస్‌లో కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. ఇక 14 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: ICC Player Of Month Nominations: ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న క్రికెటర్లు వీరే