ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు టీమిండియా లీసెస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఇక ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ చాలా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ప్రాక్టీస్ గేమ్‌లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ తడబడ్డాడు.
ఈ మ్యాచ్‌లో సీమర్లు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బౌలింగ్‌తో రోహిత్‌ను ముప్పుతిప్పులు పెట్టారు. అఖరికి రోమన్ వాకర్ బౌలింగ్‌లో నిర్లక్షమైన షాట్ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదర్కున్న రోహిత్.. కేవలం 25 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కోన శ్రీకర్ భరత్ (111 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించాడు. క్రీజులో భరత్(70),మహ్మద్ షమీ(18) పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8
☝️ | Rohit (25) c Sakande, b Walker.
— Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022
Rohit pulls a short ball from @RomanWalker17 up into the sky, @AbiSakande is under the catch. 👐@imVkohli walks to the middle. Watch him bat. 👇
🇮🇳 IND 50/2
𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/adbXpw0FcA 👈
🦊 #IndiaTourMatch | #LEIvIND pic.twitter.com/5mxQJ5cLKK
Comments
Please login to add a commentAdd a comment