Leicestershire team
-
రాణించిన శుబ్‌మన్ గిల్.. 'డ్రా' గా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్..!
లెస్టర్‌షైర్ జట్టుతో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత జట్టు ‘డ్రా’ గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 364/7 వద్దే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి లెస్టర్షైర్కు 367 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లెస్టర్‌షైర్ 66 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. లెస్టర్ జట్టుకు ఆడిన భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. స్పిన్నర్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: India vs Ireland 1st T20I: ఐర్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం -
కోహ్లి వికెట్ తీశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటా..!
Roman Walker: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా లీస్టర్‌షైర్‌తో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ బౌలర్ రోమన్ వాకర్ 5 వికెట్ల ప్రదర్శనతో రెచ్చిపోవడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (246/8 డిక్లేర్) పరిమితం కాగా.. టీమిండియా బౌలర్ల ధాటికి లీస్టర్‌షైర్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్, విహారి క్రీజ్‌లో ఉన్నారు. ☝️ | Kohli (33) lbw Walker.@RomanWalker17 strikes again! This time he hits the pads of Kohli, and after a long wait the umpire's finger goes up. Out or not out? 🤔 🇮🇳 IND 138/6 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/adbXpwig48 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND pic.twitter.com/iE9DNCUwLO — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 ఇదిలా ఉంటే, తొలి రోజు ఆటలో కోహ్లి, రోహిత్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/25) పడగట్టిన రోమన్ వాకర్ కోహ్లి వికెట్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న 21 ఏళ్ల వాకర్ కోహ్లి వికెట్ పడగొట్టడంపై స్పందిస్తూ.. తొలి ఇన్నింగ్స్‌లో నా పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది.. ప్రపంచంలోనే మేటి బ్యాటర్ అయిన విరాట్ కోహ్లి వికెట్ నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది.. కోహ్లి వికెట్ సాధించిన అనంతరం నా టీమ్ మేట్స్ కొందరు మెసేజ్ చేశారు.. కోహ్లి వికెట్ గురించి నీ మనవళ్లతో గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.. అవును వరల్డ్ క్లాస్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఔట్ చేశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటానని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన వాకర్ 57 బంతుల్లో 7 ఫోర్లతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: సిక్సర్‌తో పంత్ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా! -
రోహిత్ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు టీమిండియా లీసెస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఇక ఐపీఎల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ చాలా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ప్రాక్టీస్ గేమ్‌లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ తడబడ్డాడు. ఈ మ్యాచ్‌లో సీమర్లు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బౌలింగ్‌తో రోహిత్‌ను ముప్పుతిప్పులు పెట్టారు. అఖరికి రోమన్ వాకర్ బౌలింగ్‌లో నిర్లక్షమైన షాట్ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదర్కున్న రోహిత్.. కేవలం 25 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కోన శ్రీకర్ భరత్ (111 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించాడు. క్రీజులో భరత్(70),మహ్మద్ షమీ(18) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8 ☝️ | Rohit (25) c Sakande, b Walker. Rohit pulls a short ball from @RomanWalker17 up into the sky, @AbiSakande is under the catch. 👐@imVkohli walks to the middle. Watch him bat. 👇 🇮🇳 IND 50/2 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/adbXpw0FcA 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND pic.twitter.com/5mxQJ5cLKK — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 -
తేలిపోయిన భారత బౌలర్లు
లెస్టర్‌షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా రాబ్సన్, స్మిత్ సెంచరీలు లెస్టర్‌షైర్: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు ‘డ్రా’తో ఆరంభించింది. బౌలర్లు తేలిపోవడంతో లెస్టర్‌షైర్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. వర్షం కారణంగా రెండోరోజు ఆట పూర్తిగా రద్దు కాగా... చివరి రోజు 62 ఓవర్ల ఆట సాధ్యమైంది. లెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసి 16 పరుగుల ఆధిక్యం సంపాదించింది. లెస్టర్‌షైర్‌ను ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. కెప్టెన్ ధోని 10 మంది బౌలర్లను మార్చినా లాభం లేకుండా పోయింది. ఓపెనర్ రాబ్సన్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ గ్రెగ్ స్మిత్ భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. ఇద్దరూ సెంచరీలతో రాణించారు. చివరికి రాబ్సన్ (146 బంతుల్లో 126; 24 ఫోర్లు), స్మిత్ (102 బంతుల్లో 101; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. వీళ్లిద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత రెడ్‌ఫ్రెన్ ధాటిగా బ్యాటింగ్ చేసి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. లెస్టర్‌షైర్ జట్టు ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత వర్షం కురవడంతో స్కోరు 349/5 పరుగుల దగ్గర మ్యాచ్ నిలిచిపోయింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను ముగించేందుకు అంగీకరించారు. భారత బౌలర్లలో ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టగా, పంకజ్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు.