
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను సంచలన బంతితో జడేజా బోల్తా కొట్టించాడు.
ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 28 ఓవర్‌లో జడేజా.. బెయిర్ స్టోకు అద్బుతమైన డెలివరీని సంధించాడు. జడ్డూ వేసిన బంతిని బెయిర్ స్టో వెనుక్కి వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మిడిల్‌లో పడిన బంతి మాత్రం అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.
దీంతో బెయిర్ స్టో షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ 87 పరుగులతో పాటు మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా అధిపత్యం చెలాయిస్తోంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 436 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 61 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది.
— Sitaraman (@Sitaraman112971) January 27, 2024
Comments
Please login to add a commentAdd a comment