లండన్: భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో టీమిండియా ఆటగాళ్లు అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ చెప్పారు. నాలుగోరోజు ఆట ముగిసిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆదివారం బీసీసీఐ ప్రకటించంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. వాస్తవానికి మేము వీరి సేవలను భారీగా కోల్పోతున్నాముని'' తెలిపారు. గత 5-6 సంవత్సరాలలో భారత జట్టు బాగా రాణించడంలో వారు ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారు అని ఆయన వెల్లడించారు.
''కానీ నిజం ఏంటింటే వారు ఈ సమయంలో ఇక్కడ లేరు. అందుకే ఆటగాళ్లు కలత చెందారు. తర్వాత మాలో మేము మాట్లడుకుని నాల్గవ రోజు ఆటపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాము. దానికే తగ్గట్టే కుర్రాళ్లు కూడా బాగా ఆడారు. శనివారం రాత్రి రవిశాస్త్రి కొంత అసౌకర్యానికి గురయ్యారు. దీంతో వైద్య బృందం రవిశాస్త్రికి కోవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది'' అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నారు.
చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు
కాగా భారత్ ఖాతాలో మరో విజయం చేకూరాలంటే నాలుగో టెస్టులో చివరి రోజు బౌలర్లు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు.
చదవండి: Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment