
ఓవల్: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్ 1-1తో సమం చేసిన ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారధి జో రూట్ మీడియాతో మాట్లాడూతూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పై అసక్తికర వాఖ్యలు చేసాడు. మేము టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే విరాట్ కోహ్లిని నిశ్శబ్దంగా ఉంచాల్సిన అవసరం ఉందని రూట్ అన్నాడు. ఇప్పటి వరకు విజయవంతంగా ఆ పని చేశామని, మిగతా మ్యాచ్‌ల్లో కూడా దాన్ని కొనసాగించాలన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే 50 పైగా పరుగులు చేశాడని.. జేమ్స్ ఆండర్సన్ అతడిని రెండుసార్లు పెవిలియన్‌కు పంపాడని రూట్ తెలిపాడు.
ఇక ప్రపంచ స్థాయి ఆటగాడు అయిన కోహ్లీని త్వరగా ఔట్ చేయడంలో తమ బౌలర్లకే మొత్తం క్రెడిట్ ఇవ్వాలని అతడు పేర్కొన్నాడు. అతన్ని ఔట్ చేయడానికి మేము కొత్తం మార్గాలను కనుగొన్నమాని అతడు వివరించాడు. రాబోయే మ్యాచులో కోహ్లీ సేనపై మరింత ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తామని రూట్ చెప్పాడు. గత మ్యాచ్‌లో గెలిచామని తమ జట్టు ధీమాగా లేదని జోరూట్ తెలిపాడు. దెబ్బతిన్న భారత్ ప్రతి స్పందన ఎలా ఉంటోందో తనకు తెలుసని, దానికి తగ్గట్లు సిద్దం అవుతున్నామన్నాడు. కాగా సెప్టెంబర్ 2 నుంచి ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది.
చదవండి: IPL 2021: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్
Comments
Please login to add a commentAdd a comment