టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో మెరిశాడు. తద్వారా ఒకే టెస్టులో సెంచరీ, అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు.
That's another half-century for @RishabhPant17 👏👏#TeamIndia now leads by 316 runs.
— BCCI (@BCCI) July 4, 2022
Live - https://t.co/LL20D1K7si #ENGvIND pic.twitter.com/xXA2WLJcHF
ఇక అంతకుముందు 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరోఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీ, హాప్ సెంచరీ సాధించాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు. అదే విధంగా ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్(203) నిలిచాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ తొలి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండి: Virat Kohli Vs Jonny Bairstow: కావాలని రెచ్చగొడితే ఇదిగో ఇలాగే ఉంటది మరి?
Comments
Please login to add a commentAdd a comment