Farokh Engineer
-
టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..!
టెస్టు క్రికెట్లో రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో మెరిశాడు. తద్వారా ఒకే టెస్టులో సెంచరీ, అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు. That's another half-century for @RishabhPant17 👏👏#TeamIndia now leads by 316 runs. Live - https://t.co/LL20D1K7si #ENGvIND pic.twitter.com/xXA2WLJcHF — BCCI (@BCCI) July 4, 2022 ఇక అంతకుముందు 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరోఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీ, హాప్ సెంచరీ సాధించాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు. అదే విధంగా ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్(203) నిలిచాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ తొలి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: Virat Kohli Vs Jonny Bairstow: కావాలని రెచ్చగొడితే ఇదిగో ఇలాగే ఉంటది మరి? -
పుజారాను తప్పించి సూర్యకుమార్‌కు అవకాశం ఇవ్వండి..
ముంబై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హెడింగ్లే వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్ కోసం టీమిండియాలో ఓ కీలక మార్పు చేయాలని భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ డిమాండ్ చేశాడు. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న టీమిండియా నయా వాల్ పుజారాను తప్పించి, డాషింగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 70 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచిన పుజారా స్థానంలో సూర్యకుమార్‌ను తుది జట్టులో ఆడిస్తే భారత విజయావకావాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డాడు. పుజారా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ భారత టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి తెస్తున్నాడని, అతని స్థానంలో వేగంగా పరుగులు చేయగల సూర్యను ఆడిస్తే టపార్డర్పై భారం తగ్గుతుందని పేర్కొన్నాడు. పుజారా సహా రహానే కూడా ప్రస్తుతం ఫామ్ లేమితో సతమవుతున్నారని, ఆడిన మ్యాచ్‌ల్లో కూడా నిదానంగా పరుగులు చేస్తూ జట్టుకు నిరుపయోగంగా మారారని విమర్శించాడు. పుజారా, రహానే క్లాస్ ప్లేయర్లే అయ్యిండొచ్చు కానీ, సూర్యకుమార్ ఓ మ్యాచ్ విన్నర్ అని ఆకాశానికెత్తాడు. సూర్యకుమార్ వేగంగా పరుగులు సాధించడంతో పాటు మిడిలార్డర్లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పగల సమర్ధుడని కితాబునిచ్చాడు. అందుకే పుజారా, రహానేల్లో ఒకరిపై వేటు వేసి సూర్యకుమార్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా, ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుని.. ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్లో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఇంగ్లండ్‌లోని భారత్ జట్టుతో చేరారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుబట్టి మరీ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను ఇంగ్లండ్‌కి పిలిపించాడు. అయితే, లార్డ్స్ టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దాంతో పృథ్వీ షా మూడో టెస్టులో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే పుజారా స్లో ఇన్నింగ్స్‌లపై గుర్రుగా ఉన్న టీమిండియా మేనేజ్మెంట్.. సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ డ్రాగా ముగియగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 1-0తో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చదవండి: ఫవాద్ ఆలామ్ అజేయ శతకం.. పటిష్ట స్థితిలో పాక్ -
కోహ్లికి అందమైన భార్య అనుష్క.. మాకేం పని?
న్యూఢిల్లీ: ఇటీవల భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్, టీమిండియా కెప్టెన్ కోహ్లి భార్య అనుష్క శర్మల మధ్య వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత కోహ్లికి సరైన ప్రాక్టీస్ లేదని, అనుష్క శర్మ బౌలింగ్‌ను లాక్డౌన్లో ప్రాక్టీస్ చేయడంతో విఫలం అవుతున్నాడని గావస్కర్ వ్యాఖ్యానించాడు. దీనిపై సోషల్ మీడియాలో ఒక వర్గం అభిమానులతో పాటు అనుష్క శర్మ కూడా మండిపడ్డారు. కోహ్లి బ్యాటింగ్ వైఫల్యం విషయంలో తనను ఎందుకు లాగుతున్నారంటూ కౌంటర్ ఎటాక్ దిగారు. ‘మిస్టర్ గావస్కర్... మీ వ్యాఖ్య అమర్యాదగా ఉంది. అయితే భర్త ఆట గురించి భార్యను తప్పు పడుతున్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్య మీ నుంచి ఎలా వచ్చింది. ఇన్నేళ్లుగా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి కామెంటరీలో మీరు ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు కూడా అలాంటి గౌరవం ఇవ్వాలని మీరు అనుకోలేదా’ అంటూ ప్రశ్నించారు. అనుష్క కామెంట్స్‌పై గవాస్కర్ స్పందిస్తూ.. తాను ఎలాంటి తప్పుడు మాట మాట్లాడలేదని, కొందరు వక్రీకరించడంతో సమస్య వచ్చిందంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ అనుష్కపై విమర్శలు ఎక్కడ చేశానో చూపించాలన్నారు.(చదవండి:నా కెప్టెన్సీ స్కిల్స్‌కు అతనే కారణం: రోహిత్) ఈ వివాదంపై ఇప్పటికే గావస్కర్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతుగా నిలవగా, తాజాగా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ కూడా అండగా నిలిచారు. ‘నాకు గావస్కర్ గురించి బాగా తెలుసు. అది గావస్కర్ కాస్త జోక్‌గా చెప్పారనే నేను అనుకుంటున్నా. ఇందులో ఎటువంటి తీవ్రత లేదు. దీనిపై రాద్దాంతం అనవసరం’ అని ఫరూక్ అన్నారు. నా విషయంలో ఇదే తంతు.. గతంలో అనుష్క శర్మను విమర్శించిన క్రమంలో తనపై కూడా ఇలానే విమర్శలు వచ్చాయన్నారు. ఆ వివాదాన్ని కూడా రాద్దాంత చేశారని ఫరూక్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో టీమిండియా సెలక్టర్లను విమర్శించే క్రమంలో అనుష్క శర్మకు టీ కప్పులు ఇవ్వడానికి వెళ్లారా అంటూ ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. దీనిపై అనుష్క శర్మ స్పందిస్తూ.. ఫరూక్‌పై మండిపడ్డారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన 82 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్.. ‘ అనుష్కను నేను కానీ గావస్కర్ కానీ ఎందుకు విమర్శిస్తాం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అనుష్క అందమైన భార్య. వారిని విమర్శించే అవసరం మాకు లేదు. గావస్కర్ ఏదో సరదాగా వ్యాఖ్యానించి ఉంటారు. అంతేకానీ వేరే ఉద్దేశం ఉండదని నా అభిప్రాయం’ అని ఫరూక్ పేర్కొన్నారు.(చదవండి: ఊరిస్తున్న సన్‌రైజర్స్ టైటిల్ సెంటిమెంట్!) గతేడాది వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా సెలక్షన్ కమిటీతో పాటు అనుష్క శర్మను ఫరూక్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘మన సెలక్షన్ కమిటీ ఎంపికకు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. వారు ఆడింది 10 నుంచి 12 టెస్టులు మాత్రమే. అసలు వరల్డ్‌కప్‌కు వెళ్లిన సెలక్టర్లు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ వారు భారత జెర్సీలు ధరించడంతో సెలక్టర్లలో ఒకరిగా అనుకున్నా(ఎంఎస్కే ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ). ఈ సెలక్టర్లు కోహ్లి భార్య అనుష్కకు టీ కప్‌లు అందివ్వడం నేను చూశా. నాతో పాటు అంతా చూసి ఉండవచ్చు. అనుష్క శర్మకు టీ కప్‌లు ఇవ్వడం కోసం వారు పని చేశారు’ అని ఘాటుగా స్పందించారు. అది అప్పట్లో వివాదానికి దారి తీసింది. -
‘నేను అధ్యక్షుడ్ని కాదు.. రెగ్యులర్ కెప్టెన్‌ను కాదు’
ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చింది. రోహిత్‌కు ఊహించని ప్రశ్న ఎదురు కావడంతో కాస్త అసహనంతో మాట్లాడాడు. ఇటీవల విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మను విమర్శిస్తూ టీమిండియా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్‌ను మీడియా అడిగింది. అనుష్కకు టీ కప్‌లు అందివ్వడానికి మన సెలక్షన్ కమిటీ ఉందంటూ ఫరూక్ విమర్శించగా, అది పెద్ద రచ్చ అయ్యింది. (ఇక్కడ చదవండి: అనుష్కకు టీ కప్‌లు ఇవ్వడానికి వెళ్లారా?) దీనిపై అనుష్క శర్మ సైతం మండిపడటంతో ఫరూక్ క్షమాపలు చెప్పారు. అయినప్పటికీ దీనిపై రోహిత్‌ను అడగటంతో ఆవేశంగా మాట్లాడాడు. ‘ నేనైమైనా అధ్యక్షుడ్నా(బీసీసీఐ).. లేక రెగ్యులర్ కెప్టెన్ హోదాలో ఉన్నానా. ఈ విషయంపై ఏమి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి. మీకు వివరణ కావాలంటే ఫరూక్ సర్నే అడగండి. అతను ఏమి చెప్పడో మీకు తెలుస్తుంది. దీనిపై నేను ఏమీ మాట్లాడలేను. నేను మాట్లాడటానికి ఏముంది. ఫరూక్ సర్ ఏమి చెప్పాడనే విషయంలో తలదూర్చను’ అని రోహిత్ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: మీ అందరికీ నేనే దొరికానా?: అనుష్క ఫైర్) -
‘టీ కప్పులో తుఫాను’
న్యూఢిల్లీ: ముందూ వెనక చూడకుండా భారత మాజీ క్రికెటర్ ఒకరు చేసిన వ్యాఖ్య గురువారం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ ఒక మీడియాతో మాట్లాడుతూ...‘ఇటీవల జరిగిన వరల్డ్ కప్ సమయంలో నేను భారత సెలక్టర్లను చూశాను. వారిలో ఒక్కరిని కూడా నేను గుర్తుపట్టను. టీమిండియా బ్లేజర్ వేసుకున్న ఒక వ్యక్తిని అడిగితే తాను సెలక్టర్‌ను అని చెప్పాడు. ఇంతకీ వారు చేస్తున్న పనేమిటో తెలుసా. కెప్టెన్ కోహ్లి భార్య అనుష్క శర్మకు అతను టీ అందిస్తున్నాడు’ అని ఫరూఖ్ వ్యాఖ్యానించారు. దీనిపై అనుష్క శర్మ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించింది. తాను, కోహ్లి స్నేహితులుగా ఉన్ననాటినుంచి అనవసరపు వివాదాల్లోకి తనను ఎన్నో సార్లు లాగారని, భార్యగా మారిన తర్వాత కూడా అది కొనసాగిందని ఆమె చెప్పింది. అయితే తానెప్పుడూ ఇలాంటి వాటిపై స్పందించలేదని, ఇప్పుడు మాత్రం తప్పడం లేదని బదులిచ్చింది. ‘నేను నా సొంత డబ్బులతో మ్యాచ్, ఫ్లయిట్ టికెట్లు కొంటాను. ప్రపంచ కప్‌లో నేను ఒకే ఒక మ్యాచ్‌కు వచ్చాను. ఫ్యామిలీ బాక్స్‌లోకి కూర్చున్నాను తప్ప సెలక్టర్ల బాక్స్‌లో కాదు. సెలక్టర్లను విమర్శించాలనుంటే నేరుగా అనండి కానీ నన్ను లాగవద్దు. ఈ వ్యాఖ్య చాలా బాధించడంతోనే నేను మాట్లాడుతున్నాను. అయినా నేను టీ తాగను. కాఫీ మాత్రమే తాగుతాను’ అని అనుష్క వ్యాఖ్యానించింది. అనంతరం యు టర్న్ తీసుకున్న ఫరూఖ్ ఇంజినీర్ తాను సరదాగా మాత్రమే అలా అన్నానని చెప్పారు. ‘ఫరూఖ్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం. దురుద్దేశపూరితం. పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి. ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ భార్య కూర్చున్న బాక్స్ దరిదాపుల్లో కూడా సెలక్టర్లు లేరు. ఏదో పిచ్చి ప్రేలాపన చేసి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. తప్పుడు ఆరోపణలతో భారత సెలక్టర్లతో పాటు కెప్టెన్ భార్య పరువు కూడా తీస్తున్నారు. 82 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి దానికి తగినట్లుగా వ్యవహరించాలి’ –ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ చైర్మన్ -
అనుష్కకు టీ కప్‌లు ఇవ్వడానికి వెళ్లారా?
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీపై మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మనకున్న క్రికెట్ సెలక్షన్ కమిటీ మికీ మౌస్ సెలక్షన్ కమిటీ అంటూ మండిపడ్డాడు. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో పనిచేస్తున్న సెలక్షన్ కమిటీని ఏ అంశాల ఆధారంగా ఎంపిక చేశారంటూ విమర్శలు గుప్పించాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మకు టీ కప్‌లు అందివ్వాలంటే ఈ తరహా సెలక్షన్ కమిటీనే సరైనదేమోనంటూ ఎద్దేవా చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అనుష్క శర్మకు సెలక్టర్లు టీ కప్‌లు ఇచ్చిన విషయాన్ని అందరితో పాటు తాను చూశానంటూ ఫరూక్ విమర్శించాడు. ‘మన సెలక్షన్ కమిటీ ఎంపికకు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. వారు ఆడింది 10 నుంచి 12 టెస్టులు మాత్రమే. అసలు వరల్డ్‌కప్‌కు వెళ్లిన సెలక్టర్లు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ వారు భారత జెర్సీలు ధరించడంతో సెలక్టర్లలో ఒకరిగా అనుకున్నా(ఎంఎస్కే ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ). ఈ సెలక్టర్లు కోహ్లి భార్య అనుష్కకు టీ కప్‌లు అందివ్వడం నేను చూశా. నాతో పాటు అంతా చూసి ఉండవచ్చు. అనుష్క శర్మకు టీ కప్‌లు ఇవ్వడం కోసం వారు పని చేశారు’ అని పుణెలోని వెంగసర్కార్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వెళ్లిన ఫరూక్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించారు. మన సెలక్షన్ కమిటీలో వెంగసర్కార్ వంటి ఒక ప్రముఖ వ్యక్తి ఉండాల్సిందని పేర్కొన్నాడు. అదే సమయంలో క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ)ను కూడా ఫరూక్ వదిలి పెట్టలేదు. అది ఉపయోగం లేని పరిపాలక కమిటీ అంటూ విమర్శించాడు. అందులోని సభ్యులకు రూ. 3 కోట్లకుపైగా కేటాయించడం ఇంకా పనికి మాలిన చర్యగా ఫరూక్ అభివర్ణించాడు.