టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 27 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. బెయిర్ స్టో 12, బెన్ స్టోక్స్(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3, షమీ ఒక వికెట్ తీశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ ఇంకా 332 పరుగులు వెనుకబడి ఉంది.
►24 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. బెయిర్ స్టో 11, జాక్ లీచ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.
►15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో రూట్, బెయిర్‌స్టో ఉన్నారు.
►8 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో రూట్, పోప్ ఉన్నారు
6 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 30/2
6 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. క్రీజులో రూట్, పోప్ ఉన్నారు
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
27 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జాక్ క్రాలీ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో శుబ్‌మాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం
ఇంగ్లండ్-భారత్ రెండో రోజు ఆటకు వర్షం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ, పోప్ ఉన్నారు.
తొలి వికెట్‌ను కోల్పోయిన ఇంగ్లండ్
తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన లీస్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
భారత్ 416 పరుగులకు ఆలౌట్
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో రిషబ్ పంత్(146), జడేజా(104) పరుగులతో రాణించారు. అఖరిలో కెప్టెన్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 31పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పొట్స్ 2 వికెట్లు,బ్రాడ్,రూట్,స్టోక్స్ తలా వికెట్ సాధించారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్.. జడేజా ఔట్
375 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 104 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్
371 పరుగులు వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన షమీ.. బ్రాడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ బుమ్రా వచ్చాడు.
సెంచరీతో చెలరేగిన జడేజా..
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగాడు. 183 బంతుల్లో జడేజా సెంచరీ సాధించాడు. 79 ఓవర్ల ముగిసేసరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. క్రీజులో జడేజా, షమీ ఉన్నారు.
77 ఓవర్లకు టీమిండియా స్కోర్: 357/7
77 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(87),షమీ(9) పరుగులతో ఉన్నారు.
రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్
338/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో టీమిండియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. క్రీజులో రవీంద్ర జడేజా(83),షమీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment