
సాక్షి, చెన్నై: ఇటీవల ముగిసిన ఆసీస్ పర్యటనలో గాయం కారణంగా ఆఖరి టెస్ట్‌కు దూరమైన భారత స్పీడ్ గన్ జస్ప్రీత్ బూమ్రా.. ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. చెన్నైలో జరుగనున్న తొలి రెండు టెస్ట్‌లకు జట్టులోకి వచ్చిన ఈ రేసు గుర్రం.. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను అనుకరిస్తూ సరదాగా బౌలింగ్ చేశాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ జట్టు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసూ.. మనమింత వరకు యార్కర్‌లు, బౌన్సర్లను వేసే బూమ్రానే చూశాం.. ఇదిగో బూమ్రాలోని సరి కొత్త కోణం అంటూ క్యాప్షన్‌ను జోడించింది.
ఈ వీడియోలో బూమ్రా.. అనిల్ కుంబ్లేలా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరదాగా సాగిన ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, భారత్ తరపున అత్యధిక వన్డే, టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్న అనిల్ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించాడు. గత కొంత కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్న 27 ఏళ్ల జస్ప్రీత్ బూమ్రా వైవిధ్యభరితమైన బౌలింగ్ శైలిని కలిగి ఉంటాడు. అలాంటిది అతను మరొక బౌలర్‌ను అనుకరించడం సరదాగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు ఫిబ్రవరి 5న చెన్నైలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment