
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. భారత్- ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జులై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. కరోనా వ్యాప్తి వల్ల గతేడాది 5 టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే.
"ఇంగ్లండ్ పర్యటనకు మయాంక్‌ని సిద్ధంగా ఉంచాము. రాహుల్‌కు ప్రత్యామ్నాయం కోసం జట్టు మేనేజ్‌మెంట్‌ను అడిగాము. ఈ నెల 19వ తేదీలోగా మాకు తెలియజేస్తామని చెప్పారు. ఒక వేళ అవసరమైతే మయాంక్ రెండవ బ్యాచ్‌తో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
చదవండి: Wasim Jaffer Trolls Eoin Morgan: 'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment