కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన భారత్-ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు ఎడ్జ్‌బస్టన్ వేదికగా శుక్రవారం(జూలై1) ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో.. భారత సారథ్య పగ్గాలు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చి, శార్థూల్ ఠాకూర్, రవిచంద్ర అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సూచించాడు. జట్టులోకి శార్దూల్ ఠాకూర్, అశ్విన్‌లను ఎందుకు తీసుకోవాలో తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా వివరించాడు.
"ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్, అశ్విన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కాలి అని నేను భావిస్తున్నాను. ఇంగ్లండ్ పిచ్‌లు ఎక్కువగా పేసర్లకు అనుకూలిస్తాయి. కాబట్టి జడేజాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. ఒక వేళ భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే షమీ, బుమ్రా, సిరాజ్‌ల పేస్ త్రయంతో బరిలోకి దిగాలి. అక్కడ పరిస్థితుల బట్టి ఉమశ్ యాదవ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
గతేడాది ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉంది. ఒక్క జో రూట్ తప్ప మిగితా ఆటగాళ్లు ఎవరూ అంతగా రాణించలేదు. అయితే ఈ ఏడాది మాత్రం ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్‌తో బరిలోకి దిగాలి, లేదంటే భారత్‌కు గెలవడం కష్టమే అని చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్‌కు కొవిడ్ పాజిటివ్..!
Comments
Please login to add a commentAdd a comment