Ind Vs Eng 5th Test: Cheteshwar Pujara Or Hanuma Vihari Should Open For India - Sakshi
Sakshi News home page

IND Vs Eng 5th Test: 'ఆ ఇద్దరిలో ఒకరిని టీమిండియా ఓపెనర్‌గా పంపండి'

Published Thu, Jun 30 2022 10:23 AM | Last Updated on Thu, Jun 30 2022 11:27 AM

Cheteshwar Pujara or Hanuma Vihari should open for India 5th test - Sakshi

జూలై1న ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు టీమిండియా ఓపెనర్‌గా ఛతేశ్వర్ పుజారా లేదా హనుమ విహారీని పంపాలని భారత మాజీ పేసర్‌ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు.

అయితే తాజాగా నిర్వహించిన టెస్ట్టులో కూడా రోహిత్‌కు పాజిటివ్‌ గానే తేలింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే ఈ మ్యచ్‌కు రోహిత్‌ దూరమయ్యే అవకాశాలు సృష్టంగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో శుభ్‌మాన్‌ గిల్‌ జోడిగా భారత ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే పుజరా, హునుమా విహారి, మయాంక్‌ అగర్వాల్‌, కెఎస్ భరత్ వంటి వారు ఓపెనింగ్‌ రేసులో ఉన్నారు. "వార్మప్ మ్యాచ్‌లో కేఎస్‌ భరత్‌ అధ్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు అని మనకు తెలుసు. కానీ అతనికి ఉన్న అనుభవం తక్కువ.  ఇక రోహిత్‌కు బ్యాకప్‌గా జట్టులో చేరిన మయాంక్‌కు తగినంత ప్రాక్టీస్‌ చేసే అవకాశం లభించలేదు.

కాబట్టి రోహిత్‌ లాంటి సీనియర్‌ ఆటగాడు అందుబాటులో లేకపోతే.. పుజారా లేదా విహారి లాంటి అనుభం ఉన్న ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది. విహారి ఇప్పటికే రెండు సార్లు భారత్ తరపున ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ముఖ్యంగా ఇది కీలక మ్యాచ్‌ కాబట్టి అనుభవం ఉన్న ఆటగాళ్లకి అవకాశం ఇస్తే మంచింది"అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.
చదవండిENG vs IND: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement