అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగనున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇందుకోసం నెట్స్‌లో కఠోర సాధన చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా సోమవారం మొటేరా మైదానంలో భారత ఆటగాళ్లు కసిగా బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు సాధన చేస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి ముచ్చటిస్తూ కనిపించాడు. కొందరు ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ కనిపించారు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ ఇదే వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U
— BCCI (@BCCI) March 1, 2021
Comments
Please login to add a commentAdd a comment