fourth test match
-
ఇంగ్లండ్‌తో భారత్ నాలుగో టెస్టు ఫోటోలు
-
టీమిండియా క్రికెటర్లు నెట్స్‌లో బిజిబిజీగా
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగనున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇందుకోసం నెట్స్‌లో కఠోర సాధన చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా సోమవారం మొటేరా మైదానంలో భారత ఆటగాళ్లు కసిగా బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు సాధన చేస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి ముచ్చటిస్తూ కనిపించాడు. కొందరు ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ కనిపించారు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ ఇదే వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U — BCCI (@BCCI) March 1, 2021 -
నాలుగో రోజు వర్షార్పణం
మాంచెస్టర్: ఇంగ్లండ్ చేతికొచ్చిన మ్యాచ్‌పై చినుకులు పడ్డాయి. అలా... ఆఖరి టెస్టులో ఓటమికి సిద్ధమైన దశలో వెస్టిండీస్‌కు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట పూర్తిగా రద్దయింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానమంతా చిత్తడిగా మారడంతో ఒక్క బంతి వేయడం కూడా సాధ్యం కాలేదు. రోజంతా వాన అంతరాయం కలిగించగా... అంపైర్లు పలుమార్లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించారు. అయితే ఏ దశలోనూ మ్యాచ్ జరిగేలా కనిపించలేదు. ఇక చేసేదిలేక భారత కాలమానం ప్రకారం రా.8.40 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 399 పరుగుల ఛేదనలో విండీస్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. విండీస్ బ్యాటింగ్ బలహీనతను బట్టి చూస్తే రెండు రోజులు క్రీజ్‌లో నిలబడటం అసాధ్యంగా కనిపించింది. ఇప్పుడు ఒక రోజంతా వాన బారినపడటం జట్టుకు ఊరట కలిగించింది. ఇక చివరి రోజు మంగళవారం తమ 8 వికెట్లను కాపాడుకొని విండీస్ డ్రా చేసుకోగలదా అనేది ఆసక్తికరం. మరో రోజు కూడా వరుణుడు వారికి అండగా నిలిస్తే విజ్డన్ ట్రోఫీని హోల్డర్ సేన నిలబెట్టుకుంటుంది. -
కొండంత స్కోరు... సిరీస్ ఖరారు!
అనుమానమేమీ లేదు! ఓటమి అన్న ప్రశ్నేలేదు! విజయానికీ ఢోకా లేదు! అదీ కాకపోతే... ‘డ్రా’! అంతే...! కంగారూల గడ్డపై టీమిండియా తొలి ‘చారిత్రక సిరీస్’ విజయానికి రాచబాట పడింది. అద్భుతం ఆవిష్కృతం కానుండటమే ఇక మిగిలింది. కోహ్లి సేన రికార్డులకెక్కడం వంద శాతం ఖాయమైంది. ఇది 2–1తోనా... 3–1తోనా అనేదే తేలాల్సి ఉంది. భారత్ సగర్వంగా నిలవనుండటమే మనం చూడాల్సి ఉంది. చతేశ్వర్ పుజారా వేసిన పటిష్ఠ పునాదిపై చెలరేగిన రిషభ్ పంత్, రవీంద్ర జడేజా భారత్‌కు కొండంత స్కోరును సాధించి పెట్టారు. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ దూకుడైన ఆటతో పరుగుల వరద పారించి ప్రత్యర్థిని పిప్పి చేశారు. ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా ద్విశతక భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పటికే ఆధిక్యం కోల్పోయి మానసికంగానూ దెబ్బతిన్న కంగారూలు... ఎంత పోరాడినా, మరెంత శ్రమించినా కోహ్లి సేనను అందుకోవడం అసాధ్యం. వారు చేయాల్సిందల్లా ఓటమిని తప్పించుకోవడమే. తద్వారా కొంతలో కొంతైనా గౌరవాన్ని కాపాడుకోవడమే. సిడ్నీ: మెరుగైన స్కోరుతో తొలి రోజే సిడ్నీ టెస్టును తమవైపు తిప్పుకొన్న టీమిండియా... రెండో రోజు దానికి రెట్టింపు పైగా పరుగులు చేసి మ్యాచ్‌నే శాసించే స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (373 బంతుల్లో 193; 22 ఫోర్లు) త్రుటిలో డబుల్ సెంచరీ కోల్పోయినా, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (189 బంతుల్లో 159 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (114 బంతుల్లో 81; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో అదరగొట్టారు. ఫలితంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టులో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 622/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. నాథన్ లయన్ (4/178) నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్కస్ హారిస్ (19 బ్యాటింగ్), ఉస్మాన్ ఖాజా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కంగారూలు మన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 598 పరుగులు వెనుకబడి ఉన్నారు. ఆ లోటు తప్ప... అంతా ఏకపక్షమే! ఓవర్‌నైట్ స్కోరు 303/4తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్... హనుమ విహారి (96 బంతుల్లో 42; 5 ఫోర్లు) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు 3 పరుగులు మాత్రమే జోడించిన అతడు... లయన్ బౌలింగ్‌లో స్వీప్‌నకు యత్నించి షార్ట్‌లెగ్‌లో లబ్‌షేన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔటివ్వగా, సమీక్ష కోరినా వ్యతిరేకంగానే రావడంతో విహారి వెనుదిరిగాడు. ఇదే ఓవర్లో 150 మైలురాయిని దాటిన పుజారాకు పంత్ జత కలిశాడు. స్టార్క్ వాడివేడి యార్కర్లను కాచుకుంటూ, గతి తప్పిన లయన్ బంతులను బౌండరీకి పంపిస్తూ ఈ జోడీ లంచ్ విరామం వరకు వికెట్ పడకుండా చూసుకుంది. ఈ సెషన్లో భారత్ 86 పరుగులు చేయగా, ఇందులో పుజారావే 51 ఉండటం గమనార్హం. అలసిపోవడంతో పాటు డబుల్ సెంచరీకి దగ్గరగా ఉండటంతో విరామం తర్వాత పుజారా జోరు తగ్గించాడు. అప్పటికీ 192 పరుగుల వద్ద లయన్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఖాజా క్యాచ్ వదిలేయడంతో అతడికి లైఫ్ దక్కింది. మరో 16 బంతులు ఎదుర్కొన్నా ఒక్క పరుగే చేయగలిగాడు. లయన్ ఓవర్లో బంతిని లెగ్‌సైడ్ పంపబోయి అతడికే క్యాచ్ ఇచ్చాడు. దీంతో పుజారా మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికి స్కోరు 418/6. పంత్–జడేజా జోడీ జోరు... పుజారా వెనుదిరిగిన కాసేపటికే పంత్ అర్ధశతకం (85 బంతుల్లో) పూర్తయింది. ఈ దశలో మహా అయితే భారత్ 500కు అటుఇటుగా చేస్తుందని అంతా భావించారు. కానీ పంత్, జడేజా జోరుతో అది అమాంతం పెరిగిపోయింది. వారిద్దరి ధాటికి 500, 550, 600 ఇలా ఒక్కో గణాంకం చెదిరిపోయింది. పంత్ ఎప్పటిలానే దూకుడుగా కనిపించగా మరో ఎండ్‌లో కమిన్స్ బౌలింగ్‌లో అద్భుతమైన కట్ షాట్‌తో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఫోర్, ఫుల్ డెలివరినీ లాంగాన్‌లోకి సిక్స్‌గా పంపి జడేజా వేగం పెంచాడు. టీమిండియా 491/6తో ‘టీ’కి వెళ్లింది. ఇక్కడి నుంచే కథ పూర్తిగా మారింది. అప్పటివరకు 16 ఓవర్లలో 73 పరుగులు జత చేసిన ఈ జోడీ... తర్వాత ఎదుర్కొన్న 21.2 ఓవర్లలో ఏకంగా 131 పరుగులు పిండుకుంది. బ్రేక్ తర్వాత లబ్‌షేన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా ఫోర్ కొట్టి పంత్ 137 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు. 89 బంతుల్లో జడేజా అర్ధ శతకం పూర్తయింది. ఆసీస్ మూడో కొత్త బంతి తీసుకున్నాక స్టార్క్, హాజల్‌వుడ్ ఓవర్లలో ఒక్కో ఫోర్ బాదిన జడేజా... కమిన్స్కైతే నాలుగు ఫోర్లతో చుక్కలు చూపాడు. దీంతో జట్టు స్కోరు 600 దాటింది. అటు హాజల్‌వుడ్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు కొట్టిన పంత్ 150 (185 బంతుల్లో) మార్క్‌ను అందుకున్నాడు. సెంచరీ చేస్తాడనిపించిన జడేజా... లయన్ బంతిని భారీ షాట్ ఆడేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చి బౌల్డ్ కావడంతో కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం ఆసీస్ ఇన్నింగ్స్ పది ఓవర్లు సాగింది. పంత్ ఒకింత తేలికైన క్యాచ్ వదిలేయడంతో షమీ వేసిన మూడో ఓవర్లోనే ఖాజాకు లైఫ్ దక్కింది. మరో ఓపెనర్ హారిస్ పెద్దగా ఇబ్బంది పడకుండానే రోజును ముగించాడు. నా ఆట మారలేదు.. భాగస్వామి తప్ప! గతంలో నేను బ్యాటింగ్‌కు దిగిన సందర్భాల్లో టెయిలెండర్లతో కలిసి ఆడాల్సి వచ్చేది. పరుగులు చేయాల్సిన బాధ్యత నాపై ఉండేది. ఇప్పుడు మాత్రం అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మన్ (జడేజా) ఉన్నాడు. దీంతో నా ఆటనేమీ మార్చుకోవాల్సి రాలేదు. ఈ విషయంలో జట్టు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అందుకని క్రీజులో దిగినప్పుడల్లా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నా. భారత్‌లో వెస్టిండీస్‌పై రెండుసార్లు 92 వద్ద ఔటవడంతో నిరుత్సాహపడ్డా. కానీ, వెంటనే తేరుకున్నా. ఇంకా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలోనే ఉన్నా. అందుకని ప్రతి శతకం ప్రత్యేకమైనదే. వీటికంటే, జట్టుకు ఏది కావాలో అది చేయడం నా దృష్టిలో అత్యంత ముఖ్యం. – రిషభ్ పంత్, భారత వికెట్ కీపర్ ‘ఎ’ ప్లస్ కాంట్రాక్టులోకి పుజారా! ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు సెంచరీలతో సహా 521 పరుగులు సాధించిన చతేశ్వర్ పుజారాకు తగిన బహుమతి లభించనుంది. ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘ఎ’ కేటగిరీలో ఉన్న అతడిని ‘ఎ’ ప్లస్‌లోకి తీసుకునేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది. ►8 190ల్లో ఔటైన 8వ భారత బ్యాట్స్‌మన్ పుజారా. అజహర్, ద్రవిడ్, సచిన్ రెండేసి సార్లు, బుదీ కుందరన్, సెహ్వాగ్, కేఎల్ రాహుల్, ధావన్ ఒక్కోసారి ఔటయ్యారు. ►1 ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన తొలి భారత, ఆసియా వికెట్ కీపర్ రిషభ్ పంత్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో శతకం చేసిన తొలి భారత కీపర్ కూడా అతడే. ► 1258 ఈ సిరీస్‌లో పుజారా ఎదుర్కొన్న బంతులు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓ భారత బ్యాట్స్‌మన్‌కు ఇదే అత్యధికం. 2003–04లో ద్రవిడ్ 1203 బంతులు ఆడాడు. ► 2 ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. 2003–04 సిరీస్‌లో 705/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ► 204 ఏడో వికెట్‌కు పంత్–జడేజా జోడించిన పరుగులు. ఏ దేశంపైనైనా భారత్ తరఫున ఇదే అత్యధికం. 2017లో పుజారా–సాహా ఆసీస్‌పై 199 పరుగులు చేశారు. ► 1 చిన్న వయసు (21 ఏళ్ల 91 రోజులు)లో 150 పరుగులు చేసిన తొలి కీపర్ పంత్. తైబు (21 ఏళ్ల 245 రోజులు; 2005లో బంగ్లాదేశ్‌పై) రికార్డును పంత్ సవరించాడు. ► 2 గావస్కర్ తర్వాత ఓ సిరీస్‌లో అత్యధిక నిమిషాలపాటు క్రీజులో నిలిచిన రెండో భారత బ్యాట్స్‌మన్ పుజారా. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పుజారా 1868 నిమిషాలు క్రీజులో గడిపాడు. గతంలో గావస్కర్ (1978 నిమిషాలు; 1971లో వెస్టిండీస్‌పై, 1976 నిమిషాలు; 1981/82లో ఇంగ్లండ్‌పై) ఈ ఘనత సాధించాడు. -
రసపట్టులో నాలుగో టెస్టు
-
ఇదే మంచి అవకాశం
కఠిన పరిస్థితుల్లో చతేశ్వర్ పుజారా చేసిన సెంచరీ భారత జట్టుకు ఆధిక్యాన్ని అందివ్వడంతో పాటు మానసిక బలాన్నిచ్చింది. క్లిష్ట సమయంలో అతడు క్రీజులో పాతుకుపోయి చాలా సహనంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇప్పటి తరం బ్యాట్స్‌మెన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో తెల్ల బంతిని బలంగా బాదేందుకు యత్నిస్తుంటారు. కానీ ఎర్రబంతితో ఆడేటప్పుడు అది అంత సులభం కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రారంభంలో పుజారా కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను కాచుకున్నాడు. ఆ తర్వాత కుదురుకున్నాక విలువైన శతకం బాదాడు. అతనికి ఇషాంత్, బుమ్రాల నుంచి చక్కటి సహకారం లభించడంతో భారత జట్టుకు స్వల్ప ఆధిక్యం దక్కింది. నాలుగో టెస్టు తొలి రెండు రోజుల్లోనే 20 వికెట్లు పడటాన్ని బట్టి చూస్తే పిచ్‌లో జీవం ఉన్నట్లు అనిపిస్తోంది. ఇదే బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతోంది. స్పిన్‌కు అంతగా సహకరించని పిచ్‌పై మొయిన్ అలీ 5 వికెట్లు పడగొట్టడం టీమిండియాను మరింత ఆందోళనకు గురిచేస్తున్న అంశం. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. అందుకే భారత్ 150 నుంచి 200 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించాలనుకోదు. సీమర్లలో బుమ్రా అసాధారణ రీతిలో చెలరేగుతున్నాడు. వేగంతో పాటు బంతిని స్వింగ్ చేస్తూ... ప్రతీ బంతికి వికెట్ తీసేలా కనిపిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో కనిపించిన కసి ఇషాంత్ బౌలింగ్‌లో లేకున్నా నిలకడగా రాణిస్తున్నాడు. షమీని దురదృష్టం వెంటాడుతోంది. అతని బంతులు ఎక్కువ శాతం ఎడ్జ్ తీసుకుంటున్నాయి. సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచినా బౌలర్లు సత్తాచాటడంతో తొలి రోజే భారత్ ఆధిపత్యం కనిపించింది. ఇలాగే కొనసాగితే సిరీస్‌ను సమం చేసేందుకు ఇది చక్కటి అవకాశం. -
సిరీస్‌ను శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధం!
భారత్‌కు పట్టు చిక్కినా... ఇంగ్లండ్ పరుగు పెట్టింది. టాపార్డర్‌ను కట్టడి చేసిన పేసర్లు మిడిలార్డర్ పోరాటంతో వెనుకబడ్డారు. దీంతో ఇంగ్లండ్ తొలి సెషన్లో ఇబ్బందిపడ్డా... రెండో సెషన్లో కోలుకుంది. చివరకు మూడో రోజు ఆటలో స్కోరు 260/8 దాకా చేరింది. మొత్తానికి నాలుగో రోజు నాటకీయత మ్యాచ్‌నే కాదు సిరీస్ ఫలితాన్నే శాసించనుంది. భారత్ గెలుపో... ఓటమి వైపో తేలనుంది. సౌతాంప్టన్: ఈ టెస్టునే కాదు... సిరీస్‌నే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు ఇరు జట్లను ఊరిస్తుంది. దీన్ని నాలుగో రోజు ఆట (ఆదివారం) తేల్చేస్తుంది. మూడో రోజు ఒక సెషన్ భారత్ వైపు మొగ్గితే... మరో సెషన్ ఇంగ్లండ్‌ను నడిపించింది. శనివారం తొలి సెషన్లో భారత పేసర్ల ఉత్సాహంపై రెండో సెషన్లో రూట్ (88 బంతుల్లో 48; 6 ఫోర్లు), మూడో సెషన్లో బట్లర్ (122 బంతుల్లో 69; 7 ఫోర్లు) నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్‌గా ఇంగ్లండ్ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ 3, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీయగా, బుమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ దక్కింది. ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 8 వికెట్లకు 260 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. కరన్ (67 బంతుల్లో 37 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. పేస్ సెషన్... ఓవర్‌నైట్ స్కోరు 6/0తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను భారత పేసర్లు ఇబ్బంది పెట్టారు. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద కుక్ (12)ను బుమ్రా ఔట్ చేయగా, కాసేపటికే మొయిన్ అలీ (9)ని ఇషాంత్ పెవిలియన్ చేర్చాడు. వీళ్లిద్దరి క్యాచ్‌లను రెండో స్లిప్‌లో ఉన్న రాహుల్ అందుకున్నాడు. 33 పరుగుల వద్ద 2 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఓపెనర్ జెన్నింగ్స్ (36; 6 ఫోర్లు), కెప్టెన్ రూట్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు 16 ఓవర్లపాటు ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. అయితే లంచ్ విరామానికి ముందు షమీ బౌలింగ్‌లో జెన్నింగ్స్ వికెట్ల ముందు దొరికిపోవడంతో 59 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. షమీ ఓవర్లో మరో బంతి మిగిలున్నా... అదే స్కోరు (92/3) వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్ మొదలైందో లేదో షమీ తన మిగిలిన బంతితో బెయిర్‌స్టో (0)ను డకౌట్ చేశాడు. బెయిర్‌స్టో నిష్క్రమణతో వచ్చిన స్టోక్స్... కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే బాధ్యత తీసుకున్నాడు. కానీ సమన్వయలోపం ఈ జోడీని ఎక్కువసేపు క్రీజులో నిలువనీయలేదు. అర్ధసెంచరీకి చేరువైన రూట్ లేని పరుగుకోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. ఇషాంత్ బౌలింగ్‌లో స్టోక్స్ మిడాన్‌లో షాట్ ఆడి పరుగందుకున్నాడు. అక్కడే ఉన్న షమీ డైరెక్ట్ హిట్‌తో స్ట్రయికింగ్ వికెట్లను పడేయడంతో 122/5 జట్టు స్కోరు వద్ద రూట్ ఆట ముగిసింది. తర్వాత స్టోక్స్‌కు బట్లర్ జతయ్యాడు. వీళ్లిద్దరు మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను ముగించారు. టీ విరామం అనంతరం నింపాదిగా ఆడుతున్న స్టోక్స్‌ను స్పిన్నర్ అశ్విన్ ఔట్ చేశాడు. అలా 178 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో బట్లర్‌కు కరన్ జతయ్యాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. బట్లర్ 96 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న ఈ జోడీని ఇషాంత్ శర్మ విడగొట్టాడు. బట్లర్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో 55 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆట చివర్లో రషీద్ (11) షమీ బౌలింగ్‌లో కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. -
పుజారా సూపర్ సెంచరీ
టెస్టు క్రికెట్లో తన విలువేమిటో చతేశ్వర్ పుజారా మరోసారి చూపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో, సహచరులంతా వెనుదిరిగిన వేళ ఒక్కడే నిలబడి ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేశాడు. మొయిన్ అలీ తెలివైన బౌలింగ్, మన బ్యాట్స్‌మెన్ స్వయంకృతం కలగలిపి ఒక దశలో ఆధిక్యం కోల్పోయేలా కనిపించిన భారత్.... విదేశీ గడ్డపై పుజారా చిరస్మరణీయ సెంచరీతో కోలుకుంది. రెండు రోజుల ఆట తర్వాత ఇరు జట్లు దాదాపు సమంగా నిలిచిన స్థితిలో నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. సౌతాంప్టన్: ఒక దశలో భారత్ స్కోరు 142/2... క్రీజ్‌లో పుజారాతో పాటు కోహ్లి ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం అప్పటికే 92 పరుగులకు చేరుకుంది. భారీ ఆధిక్యం సునాయాసంగా లభిస్తుందని అనిపించింది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి స్కోరు 195/8కు చేరుకుంది. మరో 51 పరుగులు వెనుకబడి ఉండగా, 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో చతేశ్వర్ పుజారా (257 బంతుల్లో 132 నాటౌట్; 16 ఫోర్లు) పట్టుదలగా నిలబడి శతకంతో చెలరేగాడు. ఇషాంత్‌తో తొమ్మిదో వికెట్‌కు 32, బుమ్రాతో పదో వికెట్‌కు 46 పరుగుల చొప్పున జత చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 273 పరుగులకు ఆలౌటై 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. చివరి రెండు వికెట్లకు భారత్ 78 పరుగులు జోడిస్తే అందులో పుజారా చేసినవే 54 ఉన్నాయి. దాదాపు ఆరు గంటల పాటు క్రీజ్‌లో నిలిచిన పుజారా కెరీర్లో 15వ సెంచరీ సాధించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ (5/63) ఐదు వికెట్లతో చెలరేగగా, బ్రాడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కీలక భాగస్వామ్యం... ఓవర్‌నైట్ స్కోరు 19/0తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొందరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బ్రాడ్ చక్కటి బౌలింగ్‌కు 13 పరుగుల వ్యవధిలో రాహుల్ (19), ధావన్ (23) ఔటయ్యారు. ఈ దశలో మరోసారి జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన బాధ్యత పుజారా, కోహ్లిపై పడింది. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనడంతో లంచ్ సమయానికి భారత్ స్కోరు వంద పరుగులకు చేరింది. విరామం తర్వాత వీరిద్దరు వేగం పెంచి చకచకా పరుగులు సాధించారు. 100 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తయింది. అయితే కరన్ ఈ జోడీని విడదీయడంతో భారత్ పతనం ప్రారంభమైంది. దూరంగా వెళుతున్న బంతిని వెంటాడిన కోహ్లి స్లిప్‌లో కుక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రహానే (11) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. స్టోక్స్ బౌలింగ్‌లో రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ రివ్యూలో అది ‘నోబాల్’గా కనిపించింది. దీనిపై పూర్తిగా స్పష్టత లేకున్నా... టీవీ అంపైర్ మాత్రం ఇంగ్లండ్‌కు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ దశలో మొయిన్ అలీ 14 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. 29 బంతులాడిన రిషభ్ పంత్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, పాండ్యా (4) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాత రివర్స్ స్వీప్ ఆడబోయి అశ్విన్ (1), తర్వాతి బంతికి షమీ (0) క్లీన్ బౌల్డయ్యారు. ఇషాంత్ (14) అండగా నిలవడంతో పుజారా స్కోరును ముందుకు నడిపించాడు. ఇషాంత్ ఔటైన తర్వాత బుమ్రా (6) సహకారంతో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి భారత్‌కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. 119 కోహ్లి టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో గావస్కర్ (117) తర్వాత తక్కువ ఇన్నింగ్స్ (119)లలో ఈ మైలురాయి చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 5 వేల నుంచి 6 వేల పరుగులకు చేరుకునేందుకు కోహ్లి 14 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకోవడం విశేషం. -
86/6 నుంచి 246 వరకు...
గత టెస్టులాగే ఈ మ్యాచ్ భారత్ ఆధిపత్యంతోనే మొదలైంది. కాకపోతే చిన్న మార్పు... ఆ టెస్టు బ్యాటింగ్ జోరుతో మొదలైతే, నాలుగో టెస్టు పేస్ ప్రతాపంతో ఆరంభమైంది. అయితే కరన్ (136 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండు కీలక భాగస్వామ్యాలతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. దీంతో తొలి రోజు నుంచే భారత్ పట్టు బిగించే అవకాశానికి గండికొట్టాడు. సౌతాంప్టన్: ఈ సారి భారత బౌలర్ల వంతు... మన పేసర్లంతా ఇంగ్లండ్‌పై ధ్వజమెత్తారు. వాళ్లేమో బ్యాట్లెత్తారు. బౌలింగ్ దళం ధాటికి ఒక దశలో మూడో సెషన్‌కు ముందే ఇంగ్లండ్ ఆట కట్టేసేలా కనిపించింది. కానీ కరన్ అర్ధసెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. ఏ వందకో, 150 స్కోరుకో ముగిసే ఇన్నింగ్స్‌ను దాదాపు 250 పరుగుల దాకా లాక్కొచ్చాడు. పేసర్లు బుమ్రా (3/46), ఇషాంత్ శర్మ (2/26), షమీ (2/51)లతో పాటు స్పిన్నర్ అశ్విన్ (2/40) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. దీంతో నాలుగో టెస్టు మొదలైన రోజే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కరన్, మొయిన్ అలీ (85 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరే భారత్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. 39వ టెస్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లి తొలిసారి తుది జట్టును మార్చకుండా కొనసాగించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిశాక బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ముగిసే సరికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. పరుగుతో పాటే పతనం... ఇంగ్లండ్ పతనం తొలి పరుగుతోనే మొదలైంది. మూడో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ జెన్నింగ్స్ (0)ను బుమ్రా డకౌట్ చేశాడు. తర్వాత కెప్టెన్ రూట్ (4), బెయిర్‌స్టో (6), కుక్ (17), బట్లర్ (21), స్టోక్స్ (23) ఇలా 35 ఓవర్ల వ్యవధిలో 86 పరుగులకే ఆరుగురు కీలక బ్యాట్స్‌మెన్ ఔటయ్యారు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన కరన్... అలీకి జతయ్యాడు. ఇద్దరు క్రీజ్‌లో కుదురుకున్నాక, ఇన్నింగ్స్‌నూ కుదుటపరిచారు. ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించాక మొయిన్ అలీని అశ్విన్ ఔట్ చేశాడు. రషీద్ (6) త్వరగానే ఔటైనా... బ్రాడ్ (17) అండతో కరన్ రెచ్చి పోయాడు. అర్ధసెంచరీ పూర్తయ్యాక ధాటిగా ఆడాడు. జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. వీరిద్దరు 63 పరుగులు జత చేశారు. బ్రాడ్‌ను బుమ్రా ఔట్ చేయగా, అశ్విన్ బౌలింగ్‌లో కరన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. -
‘సమం’ కోసం సమరం
సౌతాంప్టన్: టెస్టు సిరీస్‌లో 0–2తో వెనుకబడి ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో మూడో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్ అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. నేటి (గురువారం) నుంచి ఇక్కడి రోజ్ బౌల్ స్టేడియంలో జరిగే నాలుగో టెస్టులో సత్తా చాటేందుకు భారత్, ఇంగ్లండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తున్నా... తొలి సెషన్లో గట్టిగా నిలబడగలిగితే ముందుగా బ్యాటింగ్ చేయడమే సరైన నిర్ణయం. తర్వాతి రోజుల్లో స్పిన్ ప్రభావం చూపించవచ్చు. మార్పుల్లేకుండా... కోహ్లి కెప్టెన్‌గా వ్యవహిరించిన 38 టెస్టుల్లో భారత్ ప్రతీ మ్యాచ్‌కు కనీసం ఒక మార్పుతోనైనా బరిలోకి దిగింది. అయితే ఈ సారి దీనికి బ్రేక్ పడవచ్చని కెప్టెన్ పరోక్షంగా చెప్పాడు. మూడో టెస్టులో ప్రతీ ఆటగాడు తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడంతో మార్పులకు అవకాశం కనిపించడం లేదు. అశ్విన్ ఫిట్‌నెస్‌పై కాస్త సందేహాలు ఉన్నా... ఇబ్బందేమీ లేదని కోహ్లి స్పష్టం చేశాడు. కోహ్లి చెలరేగిపోతుండగా... రహానే, పుజారా కూడా ఫామ్‌లోకి వచ్చారు. ఓపెనర్లు ధావన్, రాహుల్‌లతో పాటు పాండ్యా కీలక పాత్ర పోషించనున్నాడు. తుది జట్టులో ఇషాంత్, బుమ్రా ఖాయం కాగా... మ్యాచ్ ఉదయం పిచ్ పరిస్థితిని బట్టి రెండో స్పిన్నర్‌కు అవకాశం ఉంటే షమీ స్థానంలో జడేజా జట్టులోకి వస్తాడు. కొత్తగా ఎంపికైన విహారి, పృథ్వీ షా తమ అవకాశం కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే. అలీ, కరన్‌కు చోటు... మరో వైపు గత టెస్టులో అనూహ్య షాక్‌కు గురైన ఇంగ్లండ్ తమ తప్పులు దిద్దుకునే పనిలో పడింది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ రెండు కీలక మార్పులు చేసింది. అన్‌ఫిట్‌గా ఉన్న క్రిస్ వోక్స్ స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ స్యామ్ కరన్‌ను ఎంచుకోగా... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పోప్‌కు బదులుగా ఆల్‌రౌండర్ మొయిన్ అలీని జట్టులోకి తీసుకుంది. గాయం కారణంగా స్టోక్స్ బౌలింగ్ చేయడంపై సందేహాలు ఉండటంతో అలీ కీలకమవుతాడని రూట్ చెప్పాడు. రషీద్ కూడా ఉండటంతో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఖాయమయ్యారు. కౌంటీల్లో డబుల్ సెంచరీతో అలీ బ్యాటింగ్‌లో తన సత్తాను ప్రదర్శించి జట్టులోకి వచ్చాడు. అయితే ఘోరంగా విఫలమవుతున్న ఓపెనర్లు కుక్, జెన్నింగ్స్‌లకు ఇంగ్లండ్ మరో అవకాశం ఇచ్చింది. 2014లో ఇదే మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 266 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ►మ.గం.3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం -
దక్షిణాఫ్రికా 313/6
జొహన్నెస్‌బర్గ్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు దూరమై బలహీనంగా కనిపిస్తున్న ఆసీస్‌పై దక్షిణాఫ్రికా తొలిరోజు ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ మార్క్రమ్ (152; 17 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకానికి తోడు డివిలియర్స్ (69; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. నిషేధానికి గురైన ముగ్గురి స్థానంలో బర్న్స్, రెన్షా, హ్యాండ్స్కోంబ్ బరిలో దిగారు. మార్క్రమ్, ఎల్గర్ (19)తో తొలి వికెట్‌కు 53, రెండో వికెట్‌కు ఆమ్లా(27)తో 89 పరుగులు జతచేశాడు. ఆ తర్వాత డివిలియర్స్‌తో మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ఒక దశలో 247/2తో పటిష్టంగా కనిపించిన సఫారీలు 52 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం బవుమా (25 బ్యాటింగ్), డికాక్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కొత్త ఆరంభం.. వివాదం అనంతరం జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ టిమ్ పైన్ కొత్త తరహా ఒరవడితో నాయకత్వాన్ని ఆరంభించాడు. మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల జాతీయ గీతాలాపన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లందరితో ఆసీస్ క్రికెటర్లు వరుసగా కరచాలనం చేశారు. సాధారణంగా మ్యాచ్ ముగిశాక కనిపించే ఇలాంటి దృశ్యం మ్యాచ్‌కు ముందు కనిపించడం ఇదే తొలిసారి. టిమ్ పైన్ తన ఆలోచనను డు ప్లెసిస్‌తో పంచుకొని ఈ ఏర్పాటు చేశాడు. ఇది ప్రతీ సారి కొనసాగుతుందని చెప్పలేకపోయినా... తాను కొత్తగా మొదలు పెట్టాలనుకున్నట్లు పైన్ వెల్లడించాడు.పరోక్షంగా ‘మరక’ తర్వాత మళ్లీ కొత్త ఆరంభం చేస్తున్నట్లు అతను చెప్పాడు. -
నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు
మెల్బోర్న్: ఇప్పటికే ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌ను కోల్పోయింది. ఇంకా సాధించడానికేమీ లేదు. కానీ పరువు నిలబెట్టుకోవాలంటే చివరి రెండు టెస్టుల్లో గెలవాలి. ఈ నేపథ్యంలో ‘బాక్సింగ్ డే’ టెస్టులో విజయమే లక్ష్యంగా ఇంగ్లండ్... ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఈ మ్యాచ్ జరగనుంది. వరుస వైఫల్యాలతో ఆటగాళ్లు, ఘోర పరాజయాలతో ఇంగ్లండ్ జట్టు ఈ ‘యాషెస్’లో విలవిల్లాడుతోంది. విశేష అనుభవమున్న కుక్ పేలవ ఫామ్ జట్టును కలవరపరుస్తోంది. బ్రాడ్, మొయిన్ అలీలు కూడా బాధ్యతలకు దూరంగా... జట్టుకు భారంగా మారారు. కెప్టెన్ రూట్‌కు ఇప్పటిదాకా ఆసీస్ గడ్డపై ఏ మ్యాచ్ కూడా కలిసిరాలేదు. భారీ పరాజయాలతోనే మ్యాచ్‌ల్ని, సిరీస్‌ను కోల్పోయాడు. ఇప్పటికైనా సీనియర్లు బాధ్యతలు పంచుకుంటే జట్టు గాడిన పడుతుందని రూట్ భావిస్తున్నాడు. దీంతో కనీసం ట్రోఫీ పోయినా పరువు కాపాడుకోవచ్చని ఆశిస్తున్నాడు. ఇంగ్లండ్ యువ పేసర్ టామ్ కురన్ ఈ టెస్టుతో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా సారథి స్టీవెన్ స్మిత్ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్న కంగారూ జట్టు వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది. గాయపడిన మిచెల్ స్టార్క్ స్థానంలో జాక్సన్ బర్డ్ నాలుగో టెస్టు బరిలోకి దిగుతాడని కెప్టెన్ స్మిత్ చెప్పాడు. ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ 2019 తర్వాత బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2013 నుంచి ఆయన కోచింగ్‌లో ఆసీస్ సొంతగడ్డపై రెండు యాషెస్ సిరీస్‌లను గెలుచుకోగా.. ఇంగ్లండ్‌లో మరో రెండు ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ సాధించింది. జట్లు: ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, బాన్‌క్రాఫ్ట్, ఖాజా, మార్‡్ష, మిచెల్ మార్‡్ష, పైన్, కమిన్స్, హాజల్‌వుడ్, లయన్, బర్డ్. ఇంగ్లండ్: జో రూట్ (కెప్టెన్), కుక్, స్టోన్‌మన్, విన్స్, మలన్, బెయిర్‌స్టో, మొయిన్ అలీ, వోక్స్, కురన్, బ్రాడ్, అండర్సన్. ►ఉ. గం. 5.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ధర్మశాల టెస్టు పరిశీలకుడిగా విజయానంద్
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న నాలుగో టెస్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సంయుక్త కార్యదర్శి ఆర్. విజయానంద్ పరిశీలకునిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధికారులు ఆయనను అభినందించారు. ధర్మశాలలో ఈనెల 25 నుంచి 29 వరకు బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. -
ఆ పిచ్ చూస్తే.. వణికిపోతారు
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మధ్య జరిగే చిట్టచివరి, నాలుగో టెస్టు గురించి ఆస్ట్రేలియా చాలా ఆశాభావంతో ఉంది. ఇప్పటి వరకు జరిగిన మూడింటిలో రెండు జట్లు తలో విజయం సాధించగా, మూడో టెస్టు డ్రా అయింది. ఇప్పుడు నాలుగో టెస్టు వేదిక అయిన ధర్మశాల పిచ్ గురించి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ మంచి ఆశాభావంతో ఉన్నాడు. ఇక్కడ పేస్‌బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌ను చూస్తే భారత జట్టు వణికిపోతుందని వ్యాఖ్యానించాడు. ''ధర్మశాల చాలా అద్భుతమైన గ్రౌండ్. చాలా తక్కువసార్లు మాత్రమే పిచ్ మీద గడ్డి కనిపిస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియన్లు మంచి విశ్వాసంతో ఉంటే, టీమిండియా మాత్రం వణుకుతోంది. ఈ సిరీస్‌లో వాళ్లు అతి విశ్వాసంతో ఉన్నట్లున్నారు. వాళ్ల స్కోర్‌లైన్ దాన్ని చూపిస్తోంది'' అని జాన్సన్ అన్నాడు. జాక్సన్ బర్డ్‌కు బదులు ఇలాంటి పిచ్ మీద పుణె టెస్టు హీరో స్టీవ్ ఓకీఫ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపాడు. నాలుగో టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మొత్తమ్మీద స్పిన్నర్లు మంచి పెర్ఫామెన్స్ చూపించారని, ఇంతకుముందు వాళ్లను జట్టులో ఉంచుతారా లేదా అన్న పరిస్థితి ఉండగా.. ఇప్పుడు తమ ప్రదర్శనతో ఎలాంటి పిచ్‌ల మీదైనా ఫలితాలు సాధించగలమని చూపించుకున్నారని జాన్సన్ చెప్పాడు. నాథన్ లయన్‌కు ఈసారి మంచి బౌన్స్ వస్తుందని, అతడు బాల్‌ను చాలా బాగా టర్న్ చేస్తున్నాడని అన్నాడు. అయితే.. రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిందేనని తెలిపాడు. ధర్మశాల లాంటి పిచ్‌ల మీద బర్డ్ బాగా ఉపయోగపడతాడని చెప్పాడు. -
‘అడ్డంగా’ నిలబడ్డారు!
ఆమ్లా మొదటి పరుగు చేసేందుకు 46 బంతులు తీసుకున్నాడు. ఆమ్లా సరే... వన్డేల్లో 31 బంతుల్లోనే సెంచరీ బాదేసిన డివిలియర్స్ తొలి పరుగు చేసేందుకు పట్టిన బంతులు 33. వీరిద్దరు క్రీజ్‌లో జత కలిశాక ఏకంగా 62 బంతుల పాటు పరుగే తీయలేదు. మొత్తం భాగస్వామ్యం 29.2 ఓవర్లలో 23 మాత్రమే! భారత జట్టులో అసహనం పెరిగిపోతుండగా... ప్రేక్షకులకు పిచ్చెక్కిపోతుండగా, ఇద్దరు బ్యాట్స్‌మెన్ అడ్డంగా నిలబడి నాలుగో రోజు ముగించారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఆదివారం దక్షిణాఫ్రికా ఆటను చూస్తే ‘కోట గోడ’ కూడా ఇంత దుర్భేద్యంగా ఉండదేమో అనిపిస్తుంది. డిఫెన్స్... డిఫెన్స్... డిఫెన్స్... ఏ బంతినైనా, ఎలాంటి బంతినైనా అడ్డుకోవడం ఒక్కటే పని. కాస్త పరుగులు చేయండయ్యా బాబూ అన్నట్లుగా ఫుల్‌టాస్‌లు వేసినా... ఎన్నడూ బౌలింగ్ చేయనివారికి బంతి అప్పగించినా... ఊహూ, మేం కొట్టమంటే కొట్టం అన్నట్లుగా కనిపించింది ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు. అసాధ్యమైన 481 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేమని గుర్తించిన సఫారీలు ‘డ్రా’ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. సిరీస్ చివరికి వచ్చిన తర్వాత ఆ జట్టు అనూహ్య ప్రతిఘటన కనబర్చింది. బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం ఏ మాత్రం ప్రయత్నించకపోవడంతో బౌలర్లకు ఫలం దక్కలేదు. అయినా సరే... ఇప్పటికీ కోహ్లి సేనదే పైచేయి. ఆట చివరిరోజు సోమవారం ఆమ్లా, డివిలియర్స్ జోడీని విడదీస్తే మిగిలిన వికెట్లు పడగొట్టడం భారత జట్టుకు సమస్య కాబోదు. - పోరాడుతున్న దక్షిణాఫ్రికా - లక్ష్యం 481 పరుగులు - రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 72/2 - ఆమ్లా, డివిలియర్స్ దుర్భేద్య డిఫెన్స్ - ఐదో రోజుకు చేరిన చివరి టెస్టు - రహానే రెండో శతకం న్యూఢిల్లీ: భారత్‌లో దక్షిణాఫ్రికా 72 రోజుల సుదీర్ఘ పర్యటన చివరి సీన్‌కు చేరింది. అయితే ఏకపక్షంగా సాగిన మొదటి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే అనూహ్య మలుపు తీసుకున్న ఢిల్లీ టెస్టులో ఆఖరి రోజు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. విజయం కోసం 481 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కెప్టెన్ హషీం ఆమ్లా (207 బంతుల్లో 23 బ్యాటింగ్; 3 ఫోర్లు), ఏబీ డివిలియర్స్ (91 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు 409 పరుగులు చేయడం దాదాపు అసాధ్యం కాబట్టి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాలని పట్టుదలగా ఉన్న సఫారీలు అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే కోహ్లి సేన మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టి విజయం సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 267 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రహానే (206 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, కోహ్లి (165 బంతుల్లో 88; 10 ఫోర్లు) శతకాన్ని చేజార్చుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 334 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 121 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) విలాస్ (బి) మోర్కెల్ 3; ధావన్ (బి) మోర్కెల్ 21; రోహిత్ (బి) మోర్కెల్ 0; పుజారా (బి) తాహిర్ 28; కోహ్లి (ఎల్బీ) (బి) అబాట్ 88; రహానే (నాటౌట్) 100; సాహా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (100.1 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 267. వికెట్ల పతనం: 1-4; 2-8; 3-53; 4-57; 5-211. బౌలింగ్: మోర్కెల్ 21-6-51-3; అబాట్ 22-9-47-1; పీడిట్ 18-1-53-0; తాహిర్ 26.1-4-74-1; ఎల్గర్ 13-1-40-0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) రహానే (బి) అశ్విన్ 4; బవుమా (బి) అశ్విన్ 34; ఆమ్లా (బ్యాటింగ్) 23; డివిలియర్స్ (బ్యాటింగ్) 11; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (72 ఓవర్లలో 2 వికెట్లకు) 72. వికెట్ల పతనం: 1-5; 2-49. బౌలింగ్: ఇషాంత్ 12-7-16-0; అశ్విన్ 23-13-29-2; జడేజా 23-16-10-0; ఉమేశ్ 9-6-6-0; శిఖర్ ధావన్ 3-1-9-0; మురళీ విజయ్ 2-0-2-0. తొలి సెషన్: రహానే సెంచరీ ఓవర్‌నైట్ స్కోరు 190/4తో ఆట ప్రారంభించిన భారత్ మరో 77 పరుగులు జోడించింది. ఐదో ఓవర్లోనే అబాట్ బంతికి కోహ్లి వెనుదిరిగాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన రహానే 54 బంతుల్లోనే 48 పరుగులు చేసి మ్యాచ్‌లో రెండో సెంచరీ అందుకున్నాడు. తాహిర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రహానే శతకం పూర్తి చేయగానే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఎల్గర్ (4)ను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. ఓవర్లు: 19.1, పరుగులు: 77, వికెట్లు: 1 (భారత్) ఓవర్లు: 5, పరుగులు: 5, వికెట్లు: 1 (దక్షిణాఫ్రికా) రెండో సెషన్: మెయిడిన్ల జాతర లంచ్ అనంతరం బవుమా (117 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆమ్లా కలిసి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఎక్కడా పరుగు తీయకుండా డిఫెన్స్‌కే కట్టుబడ్డారు. పొరపాటున బౌలర్ల చేతి నుంచి బంతి జారి పరుగులు రావడం తప్ప... ఈ సెషన్లో భారత్ ఏకంగా 18 మెయిడిన్లు విసిరింది. చివరకు వికెట్ లేకుండానే సెషన్ ముగిసింది. ఓవర్లు: 34, పరుగులు: 35, వికెట్లు: 0 (దక్షిణాఫ్రికా) మూడో సెషన్: ఆమ్లా, ఏబీ సహనం విరామం తర్వాత ఎట్టకేలకు బవుమాను అశ్విన్ బౌల్డ్ చేయడంతో భారత్‌కు ఊరట లభించింది. కానీ ఆ తర్వాత ఆమ్లా, ఏబీ గట్టిగా నిలబడ్డారు. బ్యాట్స్‌మెన్ చుట్టూ ఫీల్డర్లను మోహరించి కోహ్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జోడి సమర్థంగా అడ్డుకుంది. ఆట ముగిసే సమయానికి వీరిద్దరు నెమ్మదిగా ఆడటంలో పలు రికార్డులు సవరించారు. ఓవర్లు: 33, పరుగులు: 32, వికెట్లు: 1 (దక్షిణాఫ్రికా) ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్ రహానే. అంతకుముందు విజయ్ హజారే, గవాస్కర్ (3 సార్లు), ద్రవిడ్ (2 సార్లు), కోహ్లి ఈ ఘనత సాధించారు. కనీసం 50 ఓవర్లు ఆడిన టెస్టు ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా రన్‌రేట్ (1.00 పరుగు) రెండో అత్యల్పం. ఆమ్లా 11.11 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 200 బంతులు ఎదుర్కొన్న తర్వాత ఇంత నెమ్మదిగా ఎవరూ ఆడలేదు. ఆమ్లా, డివిలియర్స్ మధ్య కూడా అత్యంత నెమ్మదైన భాగస్వామ్యం (176 బంతుల్లో 23 పరుగులు) నమోదైంది. ‘దక్షిణాఫ్రికా ఇలా ఆడటం చాలా ఆశ్చర్యం కలిగిం చింది. పరుగులు వచ్చే సునాయాస బంతులను కూడా వారు డిఫెన్స్ ఆడారు. పిచ్ నిజంగానే బౌలింగ్‌కు అనుకూలంగా లేదు. అయితే వారు మరో రోజంతా అలా ఆడలేరు. ఎక్కడో ఒక చోట తప్పులు చేస్తారని, మేం గెలుస్తామని నమ్మకముంది.’ -ఉమేశ్ యాదవ్, భారత బౌలర్ -
టీమిండియా తడబాటు