ఈ సీజన్‌లో శుభారంభం చేసేందుకు భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల ముఖాముఖి సిరీస్‌లో పాల్గొనేందుకు రోహిత్ శర్మ బృందం సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌లోని కీలక బౌలర్లను సమర్థంగా ఎదుర్కోనేందుకు టీమిండియా కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా బంగ్లా స్పీడ్‌స్టర్ నహిద్ రాణా శైలీని పోలిన పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్‌ను నెట్‌బౌలర్‌గా వినియోగించుకుంటుంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న నహిద్ పాక్ గడ్డపై చెలరేగాడు. బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్‌లో కీలకభూమిక పోషించాడు.
ఈ నేపథ్యంలో 6 అడుగుల 4.5 అంగుళాల పొడగరి పేసర్ గుర్నూర్ బంతుల్ని రోహిత్, కోహ్లి తదితర బ్యాటర్లు అదేపనిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వెటరన్ బౌలర్ అశ్విన్ స్పిన్ వేయగల తమిళనాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అజిత్ రామ్ కూడా నెట్స్‌లో బ్యాటర్లకు అందుబాటులో ఉన్నాడు.
చెన్నై పిచ్ ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లకు సమాన అవకాశాలు కల్పించనుండటంతో జట్టు మేనేజ్‌మెంట్ తుదిజట్టు కూర్పుపై త్వరలోనే కసరత్తు పూర్తిచేయనుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆదివారం ఢాకా నుంచి నేరుగా చెన్నైకి చేరుకోనుంది.
చదవండి: Diamond League: నీరజ్ చోప్రాకు షాక్.. సెంటీమీటర్ తేడాతో టైటిల్ మిస్
Comments
Please login to add a commentAdd a comment