
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా గల్లీ క్రికెట్ ఆడుతూ బిజీబిజీగా కనిపించాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో హిట్‌మ్యాన్ గల్లీ ప్రాక్టీస్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Rohit Sharma playing gully cricket at woreli, Mumbai. pic.twitter.com/vuHLIVno6D
— Johns. (@CricCrazyJ0hns) June 14, 2022
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బాండ్రాలో నివాసముండే రోహిత్ శర్మ వర్లీ ప్రాంతం వైపు వెళ్తుండగా కొందరు కుర్రాళ్లు రోడ్డుపై క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇది చూసిన రోహిత్ వెంటనే కారు దిగి వారితో కలిసి క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ప్రాక్టీస్ దొరకదనుకున్నాడో ఏమో కాని అక్కడి కుర్రాళ్లకు కూడా ఆవకాశం ఇవ్వకుండా చాలా సేపు బ్యాట్ పట్టుకుని కనిపించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అక్కడున్నవారందరినీ అలరించాడు. అక్కడ ఉన్నంతసేపు రోహిత్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా రోహిత్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్లకు దబిడిదిబిడే అంటు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్టు సిరీస్‌లోని చివరి టెస్ట్ ఆడేందుకు రోహిత్ సేన ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించారు. భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య బర్మింగ్‌హమ్ వేదికగా జులై 1 నుంచి 5 వరకు టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ
చదవండి: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment