![జయ మృతిలో నిజాలు వెల్లడవుతాయి](/styles/webp/s3/article_images/2017/09/5/71486637089_625x300_0.jpg.webp?itok=Fi5BVpXN)
జయ మృతిలో నిజాలు వెల్లడవుతాయి
మేనకోడలు దీప వెల్లడి
చెన్నై: జయలలిత మరణంలో దాగివున్న మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జయ మేనకోడలు దీప సంచలన ప్రకటన చేశారు. దీప ప్రతి శని, ఆదివారాలలో సాయంత్రం ఆరు గంటల సమయంలో తన మద్దతుదారులతో సమావేశమవుతున్నారు. ఆమె ప్రసంగాన్ని వినేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు.
దీంతో ఆమె తన బలాన్ని నిరూపించుకునేందుకు నిర్ణయించారు. తనను కలిసే నిర్వాహకుల వద్ద మద్దతు లేఖలను స్వీకరిస్తున్నారు. ఒకవేళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోలేకుంటే కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీన జయలలిత పుట్టినరోజున ముఖ్య ప్రకటన చేయనున్నట్లు ప్రకటించారు.