Deepa Jayakumar
-
రాజకీయాలకు రాంరాం: దీప
సాక్షి, చెన్నై: రాజకీయాల నుంచి తప్పు కుంటున్నట్లు తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మేనకోడలు, ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’వ్యవస్థాపక అధ్యక్షురాలు దీప ప్రకటించారు. జయలలిత కన్నుమూసిన తర్వాత జయ అన్న కుమార్తెగా రాజకీయాలకు, ఆస్తికి తానే వారసురాలి నంటూ దీప గతంలో తెరపైకి వచ్చారు. అన్నా డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ను స్థాపించి రాజకీయ అరం గేట్రం చేశారు. జయ మరణంతో ఖాళీగా మారిన చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమై మధ్యలో విరమించుకున్నారు. పేరవైలో కీలక బాధ్యతలను తన కారు డ్రైవర్‌కు అప్పగించడంతో ఆగ్రహించిన దీప భర్త మాధవన్ ఎంజేడీఎంకే అనే కొత్త పార్టీని స్థాపించారు. దీపను వీడి దూరంగా వేరే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీప పేరవైకి ఆశించి నంతగా ప్రజల నుంచి ఆదరణ దక్కలేదు. ఈ తరుణంలో దీప మాట్లాడుతూ‘రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను. భవిష్యత్‌లో మళ్లీ రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదు’ అన్నారు. -
దీపకు ఆ హక్కు లేదు: గౌతమ్ మీనన్
పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను నిషేధించాలని కోరే హక్కు ఆమె సోదరుడి కూతురు దీపకు లేదని దర్శకుడు గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. ‘క్వీన్’ పేరుతో గౌతమ్ మీనన్ జయలలిత బయోపిక్‌ను వెబ్ సిరీస్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్‌ను ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నటి కంగనారనౌత్ జయలలితగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా జయలలిత బయోపిక్‌ను తన అనుమతి లేకుండా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత సోదరుడి కూతురు జే.దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జయలలిత బయోపిక్‌లపై నిషేధం విధించలేమని పేర్కొంటూ దీప పిటిషన్‌ను కొట్టి వేశారు.(క్వీన్ రివ్యూ: ‘అమ్మ’గా అదరగొట్టిన రమ్యకృష్ణ) ఈ క్రమంలో ఆమె మరో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి దర్శకుడు గౌతమ్‌మీనన్, దర్శకుడు విజయ్‌లకు బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా జయలలిత బయోపిక్ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. దీంతో దర్శకుడు గౌతమ్ మీనన్ తరఫు న్యాయవాది కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అందులో దీపకు జయలలిత బయోపిక్ చిత్రాలను నిషేధించాలనే అర్హతగానీ, హక్కుగానీ లేవన్నారు. జయలలిత సొంత బంధువునని చెప్పుకొనే దీప పలుమార్లు తాను జయలలితను కలుసుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యానని చెప్పారన్నారు. అయినా తాను రూపొందించిన ‘క్వీన్’ సిరిస్ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినదని, అనితా శివకుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించిన సిరీస్ అని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు. -
జయలలిత మేనకోడలి సంచలన నిర్ణయం
చెన్నై: ‘పురుచ్చి తలైవి’ జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్.. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే గత కొద్ది రోజులుగా దీప తన పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దీప పార్టీ, ఏఐఏడీఎంకేకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ విలీనంపై దీప స్పందించారు. త్వరలోనే తన పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. ‘‘అమ్మ’ మరణానంతరం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో మీరంతా చూశారు. ఆ సమయంలో కొందరు అభిమానులు నా ఇంటికి వచ్చి అమ్మ వారసురాలిగా కొనసాగలని కోరారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు నేను ‘ఎంజీఆర్ అమ్మ దీప పెరవాయి’ అనే నూతన పార్టీని ప్రారంభించాను. కానీ రాజకీయాలు నాకు సంతృప్తినివ్వలేదు. అంతేకాక ఓ మహిళ రాజకీయాల్లో రాణించడం అంత సులువు కాదని కూడా గ్రహించాను. అది కాక ఈ మధ్య నా ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదు. పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించలేను. అందుకే మా పార్టీని ఏఐఏడీఎంకేలో విలీనం చేయాలని భావిస్తున్నాను. గత లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ ఏఐఏడీఎంకే పార్టీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ విలీనానికి మా కాడర్ కూడా పూర్తి మద్దతిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు దీప. -
రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా.. మళ్లీ రాను
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మేనకోడలు దీప జయకుమార్ రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆమె చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చి అన్ని పోగొట్టుకున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు. తన జీవితంలో రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన పెద్ద తప్పని ఆవేదన చెందారు. జన్మలో తిరిగి మళ్లీ రాజకీయాల్లోకి రానని ఆమె స్పష్టం చేశారు. కాగా జయలలిత మరణం తర్వాత ఆమె రాజకీయ వారసత్వంపై అన్నాడీఎంకే నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. జయలలితకు నిజమైన రక్త వారసురాలు తానేనంటూ ఆమె అన్న కుమార్తె దీప రాజకీయాల్లో ప్రవేశించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు తన వైపు నిలపుకునేందుకు అప్పట్లో అమె పెద్ద ప్రయత్నమే చేశారు. ఈ నేపథ్యంలోనే దీపా ‘ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై’ అనే రాజకీయ పార్టీని కూడా నెలకొల్పారు. కానీ అభిమానుల నుంచి అనుకున్నంత మద్దతు లేకపోవడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. దీంతో రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. -
తెరపైకి మళ్లీ దీప
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా తెరమరుగైపోయిన జయలలిత అన్న కుమార్తె దీప హఠాత్తుగా మరోసారి తెరపైకి వచ్చారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై (ఎంఏడీపీ) తరఫున అన్నినియోజకవర్గాల్లో అభ్యర్థులను దించేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు శని, ఆదివారాల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆపార్టీలో అగాధం ఏర్పడింది. రాష్ట్రంలో రాజకీయశూన్యత నెలకొంది. జయలలితకు రక్తసంబందీకులుగా దీప, ఆమె సోదరుడు దీపక్ మాత్రమే మిగిలారు. జయలలిత తల్లి సంధ్య నివసించిన టీ నగర్‌లోని ఇంట్లోనే దీప నివసిస్తున్నారు. జయలలిత జీవించి ఉన్నంతకాలం దీప ఎవ్వరికీ తెలియదు. అమ్మ మరణం తరువాత అకస్మాత్తుగా రాజకీయాలపై ఆసక్తిచూపిన ప్రజల్లోకి వచ్చారు. అయితే అన్నాడీఎంకే తన చేతుల్లోంచి చేజారిపోకూడదని భావించిన శశికళ...దీప ప్రయత్నాలను తెరవెనుక నుంచి అడ్డుకున్నారు. అయితే అమ్మ అంటే ఎంతో అభిమానం పెంచుకున్న తమిళ ప్రజలు దీప బాహ్యరూపం కూడా అలానే ఉండడంతో జయలలితను ఆమెలో చూసుకున్నారు. అన్నాడీఎంకే నుంచి పన్నీర్‌సెల్వం విడిపోవడంతో పార్టీ రెండుగా చీలిపోతుందని, అదే సమయంలో పార్టీని తన చేతుల్లోకి తీసుకోవచ్చని దీప ఆశించారు. అయితే ఎడపాడి, పన్నీర్‌సెల్వం ఏకంకాగా దీపకు నిరాశే మిగిలింది. ఈ పరిణామాన్ని ఊహించని దీప వెంటనే ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పేరుతో పార్టీని స్థాపించారు. అన్నాడీఎంకే నుంచి కొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు పేరవైలో చేరారు. అయితే ఎంతవేగంగా చేరారో ఆదే వేగంతో వెళ్లిపోయారు. దీప వ్యవహారశైలి, భర్త మాధవన్ తగాదాలు మిన్నంటాయి. పేరవైలోని అగ్రనేతలు భార్యాభర్తలకు నచ్చజెప్పడం తలనొప్పిగా మారింది. చివరకు మాధవన్ సైతం దీపతో విభేదించి వేరు పార్టీ పెట్టారు. ఇలా వరుస పరిణామాలతో దీప ఉనికే లేకుండా పోయింది. ఎన్నికల వేళ.. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఎన్నికల వేడిరాజకుని ఉన్న స్థితిలో దీప అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చారు. 40 పార్లమెంటు స్థానాలు, ఉప ఎన్నికలు జరిగే 18 అసెంబ్లీ స్థానాల్లో ఏడీపీ అభ్యర్థులను పోటీపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆశావహుల నుంచి శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తానని శుక్రవారం ప్రకటించారు. దీప సైతం పోటీచేస్తారని సమాచారం. అయితే ఎంఏడీపీ ఒంటరిపోరా, ఏదైనా కూటమితో చేతులు కలుపుతారా అనేది స్పష్టం కాలేదు. రాష్ట్రంలోని రెండుకూటములు ఎవరి వ్యూహాల్లో వారుండగా ఉరుములేని పిడుగువలె దీప రంగంలోకి దిగడం అన్ని పార్టీలనూ ఆలోచనలో పడేసింది. -
జయ ఆస్తుల తనిఖీ బాధ్యత దీప, దీపక్‌లకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈసీ, న్యాయస్థానంలో దాఖలు చేసిన జాబితా ప్రకారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను సరిచూసే బాధ్యతను ఆమె అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపలకు మద్రాసు హైకోర్టు మంగళవారం అప్పగించింది. దక్షిణ చెన్నై జిల్లా జయలలిత పేరవై సహాయ కార్యదర్శి పుహళేంది, జానకిరామన్ కోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. జయలలితకు రూ.55 కోట్ల ఆస్తులున్నట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సమయంలో బెంగళూరు కోర్టు తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు సైతం నిర్ధారించింది. అయితే జయ ఆస్తుల ప్రస్తుత విలువ రూ.913.41 కోట్లు. అవన్నీ చట్టవిరుద్ధంగా థర్డ్‌పార్టీ స్వాధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని భద్రం చేయాలి, ఒక పద్ధతిలో వాటిని నిర్వహించాలని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అదే కోర్టులో వారు అప్పీలు చేశారు. ఈ అప్పీలు పిటిషన్‌ను న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ఖద్దూస్లతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. జయలలిత రెండోతరం వ్యక్తులైన దీపక్, దీపలను ఈ పిటిషన్‌పై బదులివ్వాల్సిందిగా ఆదేశించింది. ఈకేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్ ముందు జయలలిత దాఖలు చేసిన వివరాలు, ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పులో చూపిన ఆస్తుల వివరాలు సరిచూడాల్సిందిగా దీపక్, దీపలను కోర్టు ఆదేశించింది. కోర్టులో దాఖలు చేసిన ఆస్తుల వివరాల్లో ఏదైనా విస్మరించారా? అనేది గమనించాల్సిందిగా సూచించింది. ఈసీ లేదా కోర్టు దృష్టికి రాని ఆస్తులు ఏవైనా ఉంటే వాటి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి కేసును వాయిదా వేసింది. -
దీప ఇంట్లో నకిలీ ఐటీ దాడులు.. దిమ్మతిరిగే ట్విస్ట్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప నివాసంలో ఇటీవల నకిలీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. దీప నివాసంలో తనిఖీల పేరిట నకిలీ ఐటీ అధికారిగా వెళ్లిన వ్యక్తి తాజాగా పోలీసుల ముందు లొంగిపోయారు. దీప భర్త మాధవన్ ప్రోత్బలం మేరకే తాను నకిలీ ఐటీ దాడుల డ్రామాకు తెరలేపానని, దీపను భయపెట్టేందుకే తాము ఇలా చేసినట్టు అతను పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీప జయకుమార్ ఇంట్లో శనివారం ఉదయం ఆదాయపన్ను అధికారులు సోదాలు నిర్వహించారనే వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. పార్టీ పదవులను అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడలు జరిగినట్లు అందరూ భావించారు. అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్ సంచలనం కలిగించింది. దాడి చేసింది అసలు ఐటీ అధికారులు కాదు. గ్యాంగ్ సినిమా తరహాలో నకిలీ ఇన్‌కం టాక్స్ అధికారులు ఈ దాడులకు యత్నించారని తేలింది. ఐటీ దాడులకు వచ్చిన అధికారుల తీరుపై అనుమానం రావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీప నివాసానికి చేరుకొనేలోపే నకిలీ ఐటీ గ్యాంగ్ మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. సినిమాలో మాదిరి పెద్ద ఎత్తున డబ్బు, వస్తువులను దోపిడీ చేయవచ్చనే ఉద్దేశంతోనే నకిలీ దాడులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తుండగా.. తాజాగా లొంగిపోయిన నిందితుడు.. సంచలన విషయాలు తెలిపారు. -
విశాల్,దీప ఇద్దరికీ ఈసీ బిగ్ షాక్!
-
దీప జయకుమార్‌కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై : జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె స్వతంత్ర్య అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆమె పేర్కొన్న అంశాలు అసంపూర్తిగా ఉన్నాయంటూ తెలిపారు. జయ మృతి తర్వాత ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పేరిట ఓ పార్టీని స్థాపించిన ఆమె.. ఆ సమయంలో జయకు అసలైన వారసురాలిని తానే అని ప్రకటించుకున్నారు. ఆపై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపొంది తీరతానని ధీమా వ్యక్తం చేశారు కూడా. కాగా, ఈసీ నిర్ణయంతో ఆమె ఎన్నికకు దూరమైనట్లయ్యింది. ప్రస్తుతం ఆర్కే నగర్ కు పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు నటుడు విశాల్, ముఖ్యంగా బహిష్కృత నేత దినకరన్ ఈ ఎన్నికను సవాల్ గా తీసుకోవటంతో రాజకీయ వర్గాలు పోటీని ఆసక్తిగా తిలకించబోతున్నాయి. ఎన్నికల సంఘం డిసెంబర్ 21న ఎన్నిక, 24 న కౌంటింగ్ నిర్వహించనుంది. -
ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
సాక్షి, చెన్నై: ఔను.. దీప, మాధవన్‌లు మళ్లీ ఒక్కటయ్యారు. అభిప్రాయ భేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ దంపతులు మళ్లీ ఒక్కటి కావడం దీపజయకుమార్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు వెన్నుపోటు పొడిచే యత్నం చేసిన మిత్రుడు రాజాను దీప ఇంటి నుంచి సాగనంపినట్టు పేరవై వర్గాలు తెలిపాయి. ఆస్తులకే కాదు, రాజకీయంగానూ జయలలితకు తానే వారసురాలినని ఆమె మేనకోడలు దీప చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మొదట రాజకీయంగా ఎదుగుదలకు భర్త మాధవన్ వెన్నంటి ఉంటూ వచ్చిన దీప.. ఇటీవల 'ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై' పేరిట సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీపకు వ్యతిరేకంగా మరో పేరవై (ఫ్రంట్)ను ఏర్పాటుచేసి కేడర్‌ను చీల్చేందుకు మాధవన్ తీవ్రంగానే ప్రయత్నించారు. మాధవన్ బయటకు వెళ్లడంతో పేరవై వ్యవహారాల్లో మిత్రుడు రాజాకు దీప పూర్తిస్థాయిలో స్వేచ్చ ఇచ్చారు. పదవుల పంపకం, నియామకాల విషయంలో రాజా చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వచ్చినా.. తొలుత దీప పట్టించుకోలేదు. తొలినాళ్లల్లో వెలుగులీనిన దీప శిబిరం ప్రస్తుతం అడ్రస్సు గల్లంతయ్యే స్థితికి చేరుకుంది. మిత్రుడు రాజా వెన్నంటి ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నాడని, ‘పేరవై’ ను దెబ్బతీస్తున్నాడని గమనించిన దీప.. ఎట్టకేలకు రాజాను టీ నగర్‌లోని నివాసం నుంచి సాగనంపారు. భర్త మాధవన్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. పేరవై వ్యవహారాల మీద దృష్టి పెట్టి మళ్లీ బలోపేతం వైపు దీప అడుగులు వేస్తున్నారు. ఆరు నెలల తర్వాత శుక్రవారం రాత్రి టీనగర్‌లోని దీప ఇంటికి వచ్చిన మాధవన్‌ను చూసిన పేరవై వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. జయలలిత సమాధి వద్దకు భర్త మాధవన్‌తో కలిసి అర్థరాత్రి వచ్చిన దీప నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు వేరు, కుటుంబం వేరు అని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే పరిణామాలను గుర్తుచేస్తూ మళ్లీ రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని, అన్నాడీఎంకేకు ఏదో రోజు తానే పెద్దదిక్కుగా నిలబడడం ఖాయమని అన్నారు. -
న్యాయ విచారణపై దీప అభ్యంతరం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి న్యాయ విచారణకు ఆదేశించడాన్ని జయ మేనకోడలు దీపా జయకుమార్ తప్పుబట్టారు. న్యాయవిచారణకు ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందని, అన్నాడీఎంకే కార్యకర్తలను వెర్రివాళ్లను చేసేందుకే ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. 'అమ్మ' మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మారుస్తామని పళనిస్వామి ప్రకటించడంపై దీప అభ్యంతరం వ్యక్తం చేశారు. జయ ఇల్లుపై తనకు.. తన సోదరుడికే నైతికంగా, చట్టబద్ధంగా, అధికారాలు ఉన్నాయని చెప్పారు. జయలలిత రక్తసంబధికులను సంప్రదించకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా, జయ మరణంపై విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. -
‘దినకరన్ బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు’
చెన్నై: తనను టీటీవీ దినకరన్ బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ముందునుంచి పార్టీ కోసం పనిచేస్తున్న క్షేత్రస్థాయి కార్యవర్గమంతా జయవారసురాలిగా పార్టీని తన చేతుల మీదుగా నడపాలని కోరుకుంటున్నారని, పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు తనకే రావాలని భావిస్తున్నారని చెప్పారు. శనివారం ఉదయం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆమె ‘ముందు నుంచే పార్టీకి మూలంగా ఉన్న నాయకత్వమంతా కూడా నాతోనే ఉంది. అమ్మ వారసత్వాన్ని నేనే కొనసాగించాలనే మద్దతు నానాటికీ పెరుగుతోంది. జనరల్ సెక్రటరీగా నాకు మద్దతు భారీగా ఉంది. అయినప్పటికీ తనకే మద్దతు ఉన్నట్లు దినకరన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. నన్ను బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’ దీపా జయకుమార్ చెప్పారు. -
సోదరుడిపై దీప సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వ పోరు మరో మలుపు తిరిగింది. జయ వారసురాలిని తానేనని ప్రకటించుకున్న ఆమె మేనకోడలు దీపా కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత సోదరుడు దీపక్ జయకుమార్‌పై విరుచుకుపడ్డారు. దీపక్.. శశికళ వర్గంతో చేతులు కలిపి తనను మోసం చేశాడని పేర్కొన్నారు. ‘దీపక్ తెల్లవారుజామున 5.30 గంటలకు నాకు ఫోన్ చేసి పోయెస్ గార్డెన్‌కు రమ్మని చెప్పాడు. మీరు నన్ను లోపలికి అనుమతించడం లేద’ని పోలీసులతో దీప వాగ్వాదానికి దిగారు. జయ నివాసంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన మద్దతుదారులతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని అన్నారు. పోయెస్ గార్డెన్ వస్తువులు మాయమవుతున్నాయని ఆరోపించారు. తనను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. కాగా, జయలలిత ఆస్తులను తనకు, తన సోదరికి సమానంగా రాసిచ్చారని గతంలో దీపక్ కుమార్ తెలిపారు. జయ ఆస్తులు తమిద్దరికీ చెందుతాయని అన్నారు. మరోవైపు ఈ వివాదంపై మంత్రి డి. జయకుమార్ స్పందించారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. -
రాజకీయాలపై దీపకు ఆసక్తి లేదు
చెన్నై : రాజకీయాలపై జయ మేనకోడలు దీపకు ఆసక్తి, అనుభవం లేదని దీప పేరవై నుంచి వైదొలగిన మాజీ ఎమ్మెల్యే మలరవన్ పేర్కొన్నారు. ఆయన ఆర్కేనగర్ ఉప ఎన్నిక సమయంలో దీప ప్రచారం కోసం కోవై నుంచి ప్రచార వాహనాన్ని తయారు చేసి తీసుకురావడమే కాకుండా చెన్నైలోనే బసచేసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇలావుండగా ఆయన హఠాత్తుగా దీప పేరవై నుంచి వైదొలగి మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం నాయకత్వంలో పనిచేసే అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపకు రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజకీయ అనుభవం లేదని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి ఆమె తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదన్నారు. దీంతో తాను పన్నీర్ సెల్వం గూటికి చేరినట్లు మలవరన్ తెలిపారు. -
ఔను వాళ్లిద్దరూ ఒకటయ్యారు
చెన్నై : తమిళనాడు ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదా ప్రకటన వెలువడినప్పటి నుంచి పలు రకాల సంచలనాలు జరిగాయి. అందులో దీప– మాధవన్ ఒకటైన సంఘటన ఒకటి. జయలలిత అన్న కుమార్తె ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై కార్యదర్శి దీప, తన భర్త మాధవన్‌తో టీనగర్లో నివసిస్తున్న విషయం తెలిసిందే. జయ మృతి అనంతరం రాజకీయాల్లో ప్రవేశించడం వల్ల కుటుంబంలో గందరగోళం నెలకొంది. దంపతుల మధ్య నెలకొన్న కలహాల కారణంగా దీపను వదిలి మాధవన్ ఒంటరిగా హోటల్లో బస చేశారు. ఆర్కేనగర్ ఎన్నికల నామినేషన్ దాఖలులో దీప భర్త పేరును సూచించలేదు. తనకు మాధవన్‌తో ఎలాంటి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన దీప మాటలను పట్టించుకోకుండా దీప పిలిస్తే ప్రచారానికి సిద్ధం అని మాధవన్ ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్కేనగర్ ఎన్నిక వాయిదాతో దీప, మాధవన్ ఒకటయ్యారు. దీనిపై ప్రశ్నించిన వారితో ఇది తమ సొంత విషయం అని దీప చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీపకు హత్యా బెదిరింపుల కేసు వాయిదా ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కార్యదర్శి జె.దీపకు గత 31, 4వ తేదీల్లో టీనగర్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్ ఫోన్లో హత్య బెదిరింపులు చేశాడు. దీనిపై పార్టీ ప్రచార కార్యకర్త పొన్ పాండ్యన్ మాంబలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ నంబర్, ఫేస్బుక్లో అతడి ఫొటోను పోలీస్ స్టేషన్లో చూపించారు. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు న మోదు కాలేదు. పసుమ్‌పొన్ పాండియన్ న్యాయవాది సుబ్రమణి ద్వారా సైదాపేట 17వ న్యాయస్థానంలో మహమ్మద్ ఆసిఫ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ అంకాళేశ్వరి ఈ కేసుపై విచారణను14వ తేదీకి వాయిదా వేశారు. -
అత్త నియోజకవర్గంలో దీప బోటు తేలుతుందా?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో ఆమె మృతితో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జయలలిత రాజకీయ వారసత్వం తమదేనంటూ వాదిస్తున్న పలు పార్టీలు, పలువురు నేతలు కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జయలలిత వారసత్వం తనదేనంటూ ఒకవైపు ఆమె నెచ్చెలి శశికళ, నమ్మినబంటు పన్నీర్ సెల్వం పోట్లాడుతుండగా.. మరోవైపు అసలైన వారసురాలిని తానేనంటూ జయ మేనకోడలు దీపాజయకుమార్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో స్వయంగా బరిలోకి దిగిన దీపాజయకుమార్కు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 'బోటు' గుర్తును కేటాయించింది. జయలలిత నాయకత్వం వహించిన అన్నాడీఎంకే పార్టీ ఎవరికీ చెందాలనే దానిపై ఇటు శశికళ వర్గం, అటు పన్నీర్ వర్గం ఎన్నికల సంఘం గడపను తొక్కడంతో ఇప్పటికిప్పుడే ఎవరిదో తేల్చడం కష్టమంటూ.. ఆ ఇద్దరికీ కొత్త గుర్తులను ఈసీ కేటాయించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే రెండాకుల గుర్తును స్తంభింపజేసిన ఈసీ.. శశికళ వర్గానికి 'టోపీ' గుర్తును, పన్నీర్ వర్గానికి 'రెండు విద్యుత్ దీపాల' గుర్తును కేటాయించింది. తాజాగా ఆర్కే నగర్లో అదృష్టం పరీక్షించుకుంటున్న దీపాజయకుమార్కు 'బోటు' (పడవ) గుర్తును ఖరారుచేసింది. దీంతో అత్త స్థానంలో సత్తా చాటి రాజకీయంగా ఎదగాలనుకుంటున్న దీపాజయకుమార్ పడవ మునుగుందా? తేలుతుందా? అన్నది త్వరలో తేలనుంది. -
జయలలిత మేనకోడలు దీప ఆస్తులివే
చెన్నై: తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తనకు మొత్తం 3.05 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్టు ప్రకటించారు. రెండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, రూ. 1.05 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. గురువారం ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన దీప.. అఫిడవిట్లో ఈ వివరాలను తెలియజేశారు. 2016-17 వార్షిక ఏడాదికి గాను తనకు రూ. 5.37 లక్షలు ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. గతేడాది రూ. 17.50 లక్షలకు 1600 చదరపు అడుగుల స్థిరాస్తిని కొనుగోలు చేశానని, దీని మార్కెట్ విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని దీప అఫిడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకులకు రూ. 6.15 లక్షలు లోన్ చెల్లించాల్సివుందని, మరో ముగ్గురి నుంచి రూ. 70.65 లక్షలు అప్పు తీసుకున్నానని తెలిపారు. 2016లో 50,390 రూపాయలు వెచ్చించి ఓ స్కూటర్ కొన్నానని వెల్లడించింది. తనకు 23.80 లక్షల రూపాయల విలువైన 821 గ్రాముల బంగారం, రూ. 1.72 లక్షల విలువైన వెండి, రూ. 4 లక్షల విలువైన 20 కేరట్ వజ్రాలు ఉన్నట్టు తెలిపారు. చేతిలో రూ. 3.50 లక్షల నగదు ఉందని, బ్యాంకులో రూ. 1.77 లక్షలు సేవింగ్ డిపాజిట్లు ఉన్నట్టు దీప వెల్లడించారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత నెలలో ఎంజీఆర్ అమ్మ దీప పెరవయి రాజకీయ వేదికను ప్రారంభించిన ఆమె ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. -
మరింత వేడెక్కిన ఆర్కేనగర్ బరి
జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల బరి మరింత వేడెక్కింది. తాజాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 12వ తేదీన జరగనున్న ఈ ఉప ఎన్నికలలో తాను ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నట్లు ఆమె తెలిపారు. పోలింగ్ అధికారి ప్రవీణ్ నాయర్‌కు ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. దానికి ముందుగా చెన్నై మెరీనా బీచ్‌లోని అమ్మ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. జయలలిత మరణం తర్వాత ముందుగా వచ్చింది ఆర్కేనగర్ వాసులేనని, ఇప్పుడు అమ్మకు అసలైన వారసులు ఎవరన్న విషయాన్ని వాళ్లే ఈ ప్రపంచానికి చాటి చెబుతారని ఉద్వేగంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. అన్నాడీఎంకేకు మంచి నాయకత్వం అవసరమని, కేవలం తాను మాత్రమే జయలలిత చూపించిన మార్గంలో పార్టీని నడిపించగలనని కార్యకర్తలు భావిస్తున్నారని దీప అన్నారు. ఎన్నికల కమిషన్ తమకు ఏ గుర్తు కేటాయిస్తే దానిమీదే పోటీ చేస్తానని తెలిపారు. తాను ప్రచారం ప్రారంభించగానే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని వివరించారు. -
మనసు మార్చుకున్న దీప భర్త మాధవన్
చెన్నై: రాజకీయాల్లో గందరగోళం ఎవరికైనా సహజమే. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పార్టీ ప్రారంభించినప్పటీ నుంచి అయోమయ పరిస్థితిలో ఉన్నారు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్, మాధవన్ దంపతులు. అన్నాడీఎంకే నిర్వాహకుల బలవంతంపై జయలలిత అన్న కుమార్తె దీపా ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నిర్వాహకుల ఏర్పాటులో దీపా, మాధవన్‌ల మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాధవన్ దీపాతో విడిపోయి ప్రత్యేక పార్టీని ప్రకటించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ.. దీపాకు, తనకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తెలిపారు. తామంటే గిట్టని వాళ్లు ఇలాంటి వదంతులను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. దీపాను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో పార్టీ ప్రారంభించినట్టు తెలిపారు. పార్టీ పేరు, ఆర్కేనగర్లో పోటీ చేయడం వంటి విషయాలపై కార్యకర్తలతో చర్చలు జరిపిన అనంతరం ప్రకటిస్తామని మాధవన్ తెలిపారు. నిన్న మాధవన్ జయలలిత సమాధి దర్శించుకుని అంజలి ఘటించారు. -
చిన్నమ్మ శిబిరంలో కలవరం!
చెన్నై : ‘ న్యాయం జరగాల్సిందే...ఎవ్వరికీ భయపడను, పది రోజులు గడువు ఇస్తున్నా...లేదంటే శిబిరం మారతా...’ అని అన్నాడీఎంకే సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ హెచ్చరిక చిన్నమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. తమతో చేతులు కలపాలని పన్నీరు శిబిరం ఎమ్మెల్యేలు ఆయనకు ఆహ్వానాలు పలికే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే తాత్కాళిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరం చేతిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రభుత్వానికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలు జారుకుంటే చాలు ప్రభుత్వం కుప్పకూలినట్టే. ఈ సమయంలో తరచూ ఏదో ఒక ఎమ్మెల్యే చడీ చప్పుడు కాకుండా అధిష్టానానికి బెదిరింపులకు ఇవ్వడం, బుజ్జగింపుల సమయంలో తమ సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో కోయంబత్తూరు జిల్లా సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ బహిరంగంగా ఆదివారం బెదిరింపులు ఇవ్వడం చిన్నమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. ప్రమాదంతో బెదిరింపు : సూళూరు పచ్చపాళయంలో ఆనందకుమార్‌కు చెందిన క్వారీ ఉంది. ఇక్కడ శుక్రవారం జరిగిన ప్రమాదంలో పళనికి చెందిన బాలన్, శక్తి వేలన్ కార్మికులు గాయపడ్డారు. శనివారం వీరు ఆసుపత్రిలో మరణించారు. ఆ కుటుంబాలకు తలా రూ.మూడు లక్షలు ముట్టచెప్పి, సాధారణ ప్రమాదంగా మార్చేసి ఆ యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఈ సమాచారంతో ఎమ్మెల్యే కనకరాజ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆదివారం ఆ క్వారీ పరిసరాల్లో పరిశీలించారు. అక్కడి ప్రజలు ఈ క్వారీ రూపంలో ఎదుర్కొంటున్న కష్టాలను, వారి గోడును విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ క్వారీ రూపంలో తన నియోజకవర్గ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. ఇక, తానెవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని, సీఎం పళనిస్వామికి కూడా భయపడనని స్పష్టం చేశారు. క్వారీకి శాశ్వతంగా తాళం వేయడం, ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. పది రోజుల్లో న్యాయం జరగని పక్షంలో, ప్రజలు కోరుకునే శిబిరంలోకి చేరాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తాను వెనక్కు తగ్గనని, చిన్నమ్మ శిబిరంకు గుడ్‌బై చెప్పి మరో శిబిరంలోకి వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన ఆ ప్రకటన చేశారో లేదో ఆగమేఘాలపై మంత్రి ఉడుమలై కే రాధాకృష్ణన్ కనకరాజ్ ఇంటికి చేరుకుని బుజ్జగించారు. ఇందుకు ఏ మాత్రం ఆ ఎమ్మెల్యే తగ్గని దృష్ట్యా, నిరాశతో వెనుదిరిగారు. ఇక, తమ శిబిరం వైపు త్వరితగతిన వచ్చేయాలని మాజీ సీఎం పన్నీరు మద్దతు ఎమ్మెల్యే కనకరాజ్‌కు పిలుపునిచ్చే పనిలో పడ్డారు. ఇక, జయలలిత మేన కోడలు దీప పేరవైలో కీలక నేతగా ఉన్న తిరుచ్చికి చెందిన మాజీ ఎమ్మెల్యే సౌందరరాజన్ టాటా చెప్పేసి పన్నీరు శిబిరం వైపుగా వచ్చేశారు. వస్తూ వస్తూ, దీపకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పేరవై వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది. ఆయన దిష్టిబొమ్మల్ని దగ్ధం చేసే పనిలో దీప మద్దతు సేన నిమగ్నమైంది. -
దీపా వర్సెస్ దినకరన్: టైట్ ఫైట్
-
దీపా వర్సెస్ దినకరన్: టైట్ ఫైట్
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక టైట్ ఫైట్ గా మారబోతుంది. అన్నాడీఎంకే నుంచి ఆర్కే నగర్ కు పోటీచేయబోయే అధికారిక అభ్యర్థి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరనే అని తెలిసింది. ఏప్రిల్ 12 ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరుగనుంది. దినకరన్ సైతం ఆర్కే నగర్ నుంచి పోటీకి అవకాశమొస్తే ఏ మాత్రం వెనుకాడబోనని అంతకముందే ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న జయలలిత రెండు సార్లు ఇక్కడి నుంచే పోటికి దిగి గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు జయలలిత అసలు వారసురాలిగా నిరూపించుకోవడానికి ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. తనకు ఆర్కే నగర్ వాసుల మద్దతున్నట్టు తెలిపిన దీపా జయకుమార్, గత ఫిబ్రవరిలోనే ఎంజీఆర్ అమ్మ దీపా ఫెడరేషన్ పేరుతో పొలిటికల్ పార్టీని ఆవిష్కరించారు. అన్నాడీఎంకే రెబల్ ఓ పన్నీర్ సెల్వం క్యాంపు సైతం దీపా జయకుమార్ కే మద్దతివ్వాలని లేదా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఒకవేళ పన్నీర్ సెల్వం, దీపా జయకుమార్ కు మద్దతు పలికితే ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతిపక్షం డీఎంకే సైతం ఈ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించబోతుంది. అయితే జయలలిత పార్టీ నుంచి గెంటివేయబడ్డ దినకరన్ నే అన్నాడీఎంకే పోటీకి దింపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
ఆర్కే నగర్ లో బహుముఖ పోటీ!
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమవడంతో అందరి దృష్టి ఈ ఉప ఎన్నికపై నిలిచింది. ‘అమ్మ’ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అన్నాడీఎంకే భావిస్తుండగా, ఇక్కడ పాగా వేసి సత్తా చాటాలని డీఎంకే వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా తమకు మద్దతు ఇవ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. వామపక్షాలను కోరారు. అన్నాడీఎంకే తరపున దినకరన్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇక ‘కెప్టెన్’ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే అభ్యర్థిగా ఆ పార్టీ ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్ పేరును ఖారారైంది. విజయకాంత్ సతీమణి ప్రేమలతను పోటీ దింపాలని పలువురు నేతలు కోరుతున్నారు. పన్నీర్ సెల్వం శిబిరం నుంచి పోటీకి దిగనున్నట్టు మాజీ డీజీపీ తిలకవతి సూచనప్రాయంగా వెల్లడించారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా సొంత పార్టీ తరపున బరిలోకి దిగుతానని ప్రకటించారు. ప్రజా సంక్షేమ వేదిక(పీడబ్ల్యూఎఫ్) కూడా పోటికి సిద్ధమవడంతో బహుముఖ పోరు తప్పదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. కాగా, ఆర్కే నగర్ లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి శశికళ వర్గం నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని దీప ఆరోపించారు. -
నన్ను వేధిస్తున్నారు: జయ మేనకోడలు
చెన్నై : జయలలిత వారసురాలిగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కు వేధింపులు ప్రారంభమయ్యాయట. ఏప్రిల్ 12 న జరుగబోయే ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదని వేధిస్తున్నారని దీపా జయకుమార్ సోమవారం ఆరోపించారు. ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని తాను ప్రకటించినప్పటి నుంచి వివిధ రకాలుగా తనను పరోక్షంగా వేధిస్తున్నారని చెప్పారు. కనీసం తాను ఇంట్లో కూడా ఉండటం లేదని, తనకు వ్యతిరేకంగా పలువురు గూండాలు అక్కడికి వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు వారు ఎవరి వర్గానికి చెందిన వారో కూడా తెలియడం లేదన్నారు. ఈ ఉప ఎన్నికల నుంచి తనని విరమింపజేయడానికి పలు కుట్రలు జరుగుతున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 24నే ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై అనే కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతున్నట్టు దీపా జయకుమార్ ప్రకటించారు. ఈ ఫోరం ప్రారంభించడానికి ముందు కూడా చాలా మంది తనకు అడ్డంకులు సృష్టించారని దీపా జయకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. జయలలిత పోటీచేసే ఆర్కే నగర్ నుంచి దీపా జయకుమార్ పోటీ చేసి అమ్మ అసలు వారసురాలిగా నిరూపించుకోవాలని ఆమె శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జయలలిత మరణించడంతో ఆమె స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి దీపా పోటీచేస్తున్నారు. ఆర్కే నగర్ వాసులు కూడా చిన్నమ్మను పక్కన పెట్టి, దీపా జయకుమార్ కే తమ మద్దతు తెలుపుతున్నారు. -
దీప ఇంటి ముందు ఆందోళన
తిరువొత్తియూరు: దీపా జయకుమార్ ఇంటి ముందు ఆమె మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్న కుమార్తె దీప ఇటీవలి కాలంలో ఎంజీఆర్ అమ్మా దీప పేరవై పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించారు. టి.నగర్ శివజ్ఞానం వీధిలో ఉన్న ఇంటిలో దీపను కలుసుకోవడానికి మద్దతుదారులు వెళ్లారు. కాని ఆమెను కలుసుకోవడానికి వీలు కాలేదు. దీంతో ఆమె మద్దతుదారులు దీప ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తమను కలుసుకోవడానికి వీలు కల్పించని పక్షంలో ఓ.పన్నీర్‌సెల్వం వర్గంలో చేరిపోతామని హెచ్చరించారు. రోజూ మద్దతుదారులను కలుసుకుని సంప్రదింపులు చేస్తానని దీప తెలిపడంతో బుధవారం తిరువొత్తియూరు నుంచి అడ్వొకేటు జహీర్‌తో సహా ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు దీప ఇంటి ముందు గుమికూడారు. కాని దీపను కలుసుకోవడానికి వీలు కాలేదు. ఆమెను కలుసుకోవడానికి వీలు లేకుండా ప్రైవేటు సెక్యూరిటీ అడ్డుకున్నారు. -
పన్నీర్ దీక్ష.. కంటతడి పెట్టిన మహిళలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ లేదా న్యాయ విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు పన్నీర్‌సెల్వం దీక్షలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షా శిబిరం నుంచి చేసిన ప్రసంగాల్లో అమ్మ పాలనను వివరిస్తుండగా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకం, ముఖ్యంగా మహిళలు కన్నీరు పెట్టారు. పన్నీర్ మద్దతుదారులు సైతం తమిళనాడులోని 32 జిల్లాల్లో నిరాహార దీక్షలు జరిపారు. రాజకీయాలు, పార్టీ, పదవులకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా జయ వద్ద క్షమాపణలు కోరిన శశికళ నేడు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దీక్షా శిబిరం నుంచి పన్నీర్ చేసిన ప్రసంగంలో దుయ్యబట్టారు. పార్టీ నుంచి బహిష్కృతులైన వారి కబంద హస్తాల నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే ధర్మయుద్ధాన్ని ప్రారంభించానని ఆయన తెలిపారు. అమ్మ అడ్మిటైన నాటి నుంచి మరణించే వరకు 74 రోజులపాటూ ఆసుపత్రికి వెళుతున్నా ఒక్కరోజు కూడా జయను చూసేందుకు అవకాశం లేకుండా అడ్డుకున్నారని, విదేశాలకు పంపి మెరుగైన చికిత్స చేయిద్దామని తాను సూచించినా శశికళ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. జయ ఆరోగ్య పరిస్థితిపై తనకు క్రమం తప్పకుండా సమాచారం ఇచ్చానని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ చేసిన ప్రకటన అవాస్తవమని, ఆయన ఆ ప్రకటనను ఉపసంహరించుకోకుంటే కోర్టులో కేసు దాఖలు చేస్తానని పన్నీర్ సెల్వం హెచ్చరించారు. జయ మరణంలోని మర్మంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలో న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణ జరిపించాలని తాను కోరుతున్నానని అన్నారు. పన్నీర్ సెల్వం దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. జయకు అపోలో ఆసుపత్రిలో అందించిన పలురకాల చికిత్సలకు ముందు అనుమతి పత్రాలు మరణ ధ్రువీకరణ పత్రం స్వీకరణకు సంతకాలు పెట్టిన వారి పేర్లు బయటపెట్టాలని ఆమె మేనకోడలు ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధినేత్రి దీపా జయకుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. జయ మరణంపై నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం న్యాయ విచారణ అవసరమని ఆమె అన్నారు. -
ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ఆవిర్భావం
రాజకీయ ఫోరాన్ని ప్రారంభించిన దీప సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మేనకోడలు దీప ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ అనే రాజకీయ ఫోరంను శుక్రవారం ప్రకటించారు. జయలలిత, ఎంజీఆర్ చిత్రాలతో కూడిన పేరవై పతాకాన్ని ఆవిష్కరించి.. తీర్మానాలను వివరించారు. ఇది రాజకీయ పార్టీ కాదు సంఘం మాత్రమేనన్నారు. అన్నాడీఎంకే చిహ్నమైన రెండు ఆకుల గుర్తును తిరిగి స్వాధీనం చేసుకొని.. అమ్మ పాలన అందించడమే లక్ష్యమని ప్రకటించారు. మీడియానుద్దేశించి దీప మాట్లాడుతూ.. శశికళ దుష్ట శక్తి అని అభివర్ణించారు. ఆర్కే నగర్ నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఘనంగా అమ్మ జయంతి వేడుకలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69వ జయంతి వేడుకలు శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తమిళనాడు ప్రభుత్వం, అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు, తిరుగుబాటు నేత, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఆధ్వర్యంలో వాడవాడలా పలుసేవా కార్యక్రమాలు నిర్వహించారు. ‘‘పార్టీని కాపాడండి.. ప్రజల కోసం పనిచేయండి’’అని బెంగళూరు జైలులో ఉన్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ వీకే శశికళ ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులను కోరారు. శశికళ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుంచి అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటానని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శపథం చేశారు. ఆర్కేనగర్లో ఆమె 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ శుక్రవారం భేటీ అయ్యారు. తమిళనాట రాజకీయ పరిస్థితులపై చర్చించారు. -
కొత్త పార్టీ ప్రకటించిన జయ మేనకొడలు దీప
-
కొత్త పార్టీని ప్రకటించిన జయ మేనకోడలు దీప
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ప్రారంభించారు. దీనికి ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరు పెట్టారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా దీప ఈ ప్రకటన చేశారు. దీప మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో కలసి పనిచేయనని చెప్పారు. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. జయలలితకు తానే అసలైన వారసురాలినని చెప్పారు. జయలలిత మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన దీప.. అమ్మ జయంతి రోజున తదుపరి ప్రణాళిక ప్రకటిస్తానని చెప్పారు. శశికళకు వ్యతిరేకంగా గళం విప్పారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించారు. కాగా తదనంతర పరిణామాల్లో ఆమె పన్నీరుకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా జయలలిత అభిమానులు తనను కోరుతున్నారని చెప్పారు. పళనిస్వామి ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రికాదని విమర్శించారు. -
దీపా యూ టర్న్?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు వ్యతిరేకంగా స్పందిస్తే, మేనకోడలు దీపా మాజీ సీఎం పన్నీరు సెల్వంకు షాక్ ఇచ్చేలా సిద్ధం అవుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గురువారం చోటు చేసుకున్నాయి. ఇక, శుక్రవారం దీపా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో అన్న ఎదురుచూపులు పెరిగాయి. దివంగత సీఎం జయలలిత రాజకీయ వారసురాలు తానేనని ఆమె మేన కోడలు దీపా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకేలోని కింది స్థాయి కేడర్ ఆమె ఇంటి ముందు వాలిపోయారు. ఈ సమయంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం పెదవి విప్పడంతో దీపా ఇంటి ముందుకు కేడర్ రాక తగ్గిందని చెప్పవచ్చు. పన్నీరు శిబిరం వైపుగా కేడర్ పరుగులు తీయడంతో తాను సైతం అని దీపా స్పందించారు. పన్నీరు శిబిరానికి తన మద్దతు ప్రకటించారు. ఆ తదుపరి ఎన్నడూ ఆ శిబిరం వైపుగా ఆమె వెళ్ల లేదు. తమను కలుపుకొని వెళ్లడం లేదంటూ దీపా మద్దతుదారులు పన్నీరు శిబిరంపై విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా ఆ శిబిరంలో ఉన్న జయలలిత మేనల్లుడు దీపక్ పెదవి విప్పి సంచలనం సృష్టించారు. అదే సమయంలో పన్నీరు శిబిరానికి షాక్ ఇచ్చే రీతిలో దీపా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు దీపా ఇంటి పరిసరాల్లో తాజాగా చోటు చేసుకోవడం గమనార్హం. పన్నీరు శిబిరంలోకి చేరిన దీపా, హఠాత్తుగా యూటర్న్ తీసుకునేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. దీపా పేరవై వర్గాలు ఏకంగా పన్నీరు శిబిరం మీద విమర్శలు గుప్పించే పనిలో పడ్డ నేపథ్యంలో గురువారం టీనగర్లో కొత్త జెండాలు ప్రత్యక్షం అయ్యాయి. దీపా ఇంటి పరిసరాల్లో ఈ జెండాలు హోరెత్తడంతో పన్నీరుతో కలిసి అడుగులు వేయకుండా, మేనత్త చరిష్మాతో ఒంటరిగానే ముందుకు సాగేందుకు ఆమె నిర్ణయించారా అన్న ప్రశ్న బయలు దేరింది. అన్నాడీఎంకే జెండా తరహాలో నలుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతో మధ్యలో జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై చిత్ర పటాలను ఆ జెండాల్లో పొందు పరచడంతో దీపా కొత్త పార్టీ ప్రకటిస్తారా అన్న చర్చ ఊపందుకుంది. పన్నీరు నేతృత్వంలో శుక్రవారం ఆర్కేనగర్ వేదికగా జరగనున్న సభకు దీపా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు ఆ పేరవై వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం ఉత్కంఠకు దారి తీసింది. జయలలిత జయంతి సందర్భంగా జరగనున్న ఈ సభలో దీపా కూడా కనిపిస్తారన్న ఆశతో పన్నీరు శిబిరం ఉన్నా, ఆమె హాజరయ్యేది అనుమానమేనని పేరవై వర్గాలు పేర్కొంటుండడం గమనించాల్సిన విషయం. ఉదయాన్నే మేనత్త జయలలిత సమాధి వద్ద నివాళులర్పించినానంతరం ఇంటి వద్దకు చేరుకునే దీపా, మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు పేరవై వర్గాలు పేర్కొంటుండడంతో అందరిచూపు టీనగర్ వైపుగా మరలింది. మేనత్త జయంతి సందర్భంగా దీపా ఏ ప్రకటన చేస్తారో అన్న ఎదురుచూపులు పెరిగాయి. పన్నీరు శిబిరం మాత్రం దీపా తమ సభకు తప్పకుండా హాజరవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. -
ఆర్కే నగర్ బరిలో ఎవరెవరు?
తమిళ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి జయలలిత మరణం తర్వాత ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె నెచ్చెలి శశికళ భావించారు. ఎటూ అమ్మ మీద అభిమానంతో చిన్నమ్మను గెలిపిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అనుకున్నారు. కానీ ఇంతలో సుప్రీంకోర్టు తీర్పు ఆమెకు అశనిపాతంలా మారడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు తన అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ను ఆర్కే నగర్ బరిలోకి దించాలని శశికళ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గురువారం ప్రకటించిన మంత్రివర్గంలో కూడా దినకరన్‌కు స్థానం ఉంటుందని చాలామంది భావించారు. అయితే, ఎమ్మెల్యే పదవి లేకుండా నేరుగా మంత్రిని చేస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో.. ముందుగా అతడిని ఆర్కే నగర్ బరిలో దించి, ఆ తర్వాత కీలకమైన మంత్రిత్వ శాఖ అప్పగించాలన్నది శశికళ ఆలోచన అని అంటున్నారు. అయితే, ఇప్పటికే శశికళ మీద కొంత వ్యతిరేకత ఉన్న ఆర్కే నగర్ వాసులు.. ఆమె అక్క కొడుకు, పలు ఆర్థికపరమైన ఆరోపణలు ఉన్న దినకరన్‌ను ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా అనుమానంగానే ఉంది. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం కూడా ఆర్కేనగర్ స్థానం మీద గట్టిగా దృష్టిపెట్టింది. తాము ఎంతగా అనుకున్నా ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం ఒక ఎత్తయితే శశికళ వర్గీయులకు ఆ పదవి దక్కడాన్ని పన్నీర్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మ ఆశయాల సాధనే తన లక్ష్యమని ప్రకటించిన ఆయన.. ముమ్మూర్తులా జయలలితలాగే కనిపించే దీపా జయకుమార్‌ను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీపకు ఎటూ శశికళ పోలికలు ఉండటం, ఆర్కే నగర్ వాసులు తాము అమ్మ కోసమే ఉన్నామని ఇంతకుముందు సైతం చెప్పడంతో ఆమెను పోటీకి దింపితే గెలవడం ఖాయమన్న అంచనాలు పన్నీర్ వర్గానికి ఉన్నాయి. దీపను ముందుకు పెట్టడం ద్వారా మళ్లీ కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా పొందగలిగితే, పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం కూడా పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వాన్ని కూల్చే విషయం వరకు వస్తే డీఎంకే సైతం మద్దతిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. ముందుగా ఆర్కే నగర్ స్థానం మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు. మరో నాలుగు నెలలే ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆరు నెలల్లోగా మళ్లీ ఎన్నిక నిర్వహించాలి. జయలలిత డిసెంబర్ 5వ తేదీన మరణించారు. దాంతో జూన్ లోగా ఎన్నిక నిర్వహించి, కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవాలి. ఇప్పటికే రెండు నెలల సమయం ముగియడంతో మరో నాలుగు నెలల్లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎవరికి వాళ్లు పావులు కదుపుతున్నారు. -
‘శశికళకు ఆ హక్కు లేదు’
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నటరాజన్ కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్వాగతించారు. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం మంచి తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే సారథ్యం వహించే నాయకుడు శశికళ చేతిలో కీలుబొమ్మ కారాదని ఆమె ఆకాంక్షించారు. జయలలిత కోరుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి కావాలన్నారు. తమిళనాడు ప్రజలకు నాయకత్వం వహించే హక్కు శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు లేదని స్పష్టం చేశారు. జయలలిత తన జీవితంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదని, దేన్ని కాక్షించలేదని చెప్పారు. ప్రజాసేవకే అంకితమవ్వాలని ‘అమ్మ’ కోరుకుందని తెలిపారు. -
‘శశికళకు ఆ హక్కు లేదు’
-
జయ మృతిలో నిజాలు వెల్లడవుతాయి
మేనకోడలు దీప వెల్లడి చెన్నై: జయలలిత మరణంలో దాగివున్న మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జయ మేనకోడలు దీప సంచలన ప్రకటన చేశారు. దీప ప్రతి శని, ఆదివారాలలో సాయంత్రం ఆరు గంటల సమయంలో తన మద్దతుదారులతో సమావేశమవుతున్నారు. ఆమె ప్రసంగాన్ని వినేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు. దీంతో ఆమె తన బలాన్ని నిరూపించుకునేందుకు నిర్ణయించారు. తనను కలిసే నిర్వాహకుల వద్ద మద్దతు లేఖలను స్వీకరిస్తున్నారు. ఒకవేళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోలేకుంటే కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీన జయలలిత పుట్టినరోజున ముఖ్య ప్రకటన చేయనున్నట్లు ప్రకటించారు. -
దీప మద్దతిస్తానంటే తీసుకుంటా: పన్నీర్
► గవర్నర్ తమిళనాడు రాగానే కలుస్తా ► కేంద్రం మద్దతిస్తామంటే తప్పకుండా తీసుకుంటా ► అమ్మ నన్ను రెండుసార్లు సీఎం చేశారు చెన్నై జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతిస్తానంటే తప్పకుండా తీసుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉంటారని తెలిపారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమిళ ప్రజలకు అండగా ఉందని, తమిళ ప్రజలకు ఎవరు మద్దతిచ్చినా దాన్ని తాము అంగీకరిస్తామని పన్నీర్ సెల్వం చెప్పారు. తాను ప్రజల్లోకి వెళ్తానని, తమిళనాడులో ప్రతి నగరానికీ వెళ్లి తాను అనుకుంటున్న విషయాలు ప్రజలకే చెబుతానని అన్నారు. తన బలమేంటో అసెంబ్లీలో తప్పకుండా నిరూపించుకుంటానని తెలిపారు. గవర్నర్ ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఆయన తిరిగి రాగానే తాను ఆయనను కలుస్తానని కూడా వివరించారు. జయలలిత 16 సంవత్సరాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆమె తనను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారని, ఇదంతా అమ్మ కోరిక మాత్రమేనని, తాను ఆమె అడుగు జాడల్లో నడుస్తానని అన్నారు. -
జయ మేనకోడలు కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జయలలిత వారసత్వం కోసం అధికారికంగా పోరు మొదలైంది. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జయకు అసలైన వారసురాలిని తానేనని, ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని మంగళవారం ప్రకటించారు. జయలలిత రాజకీయ వారసురాలిగా మరొకరని అంగీకరించబోనని పరోక్షంగా శశికళ నటరాజన్‌ను ఉద్దేశిస్తూ తేల్చి చెప్పారు. తమిళ ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితం అంకితమని, ఈ రోజు తన జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టానని అన్నారు. ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా చెన్నై మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం దీప మీడియా సమావేశంలో మాట్లాడారు. జయలలిత శైలి వస్త్రధారణతో వచ్చిన దీప.. అచ్చం అమ్మలాగే కనిపించారు. జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న తన తదుపరి రాజకీయ ప్రణాళికను వెల్లడిస్తానని దీప చెప్పారు. త్వరలో తన మద్దతుదారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎంజీఆర్, జయలలిత అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. జయలలిత అభిమానుల్లో ఎక్కువ మంది తన వెంటే ఉన్నారని, అలాగే అన్నా డీఎంకే కార్యకర్తలందరూ తనకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అన్నా డీఎంకే కేడర్ ఇప్పటికే తనను ఆహ్వానించిందన్నారు. శశికళ నటరాజన్ కుటుంబంపై దీప విమర్శలు చేశారు. తమ సలహాలు తీసుకుని జయలలిత పనిచేసేవారని శశికళ కుటుంబం చేస్తున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. తన పేరును చెడగొట్టేందుకు చాలా పుకార్లు ప్రచారం చేశారని ఆరోపించారు. -
చిన్నమ్మకు వణుకు పుట్టిస్తోంది
చెన్నై: జయలలిత వారసురాలిగా చక్రం తిప్పాలని ఆశిస్తున్న అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌కు జయ మేనకోడలు దీపా జయకుమార్ వణుకు పుట్టిస్తున్నారు. తానే జయలలితకు అసలైన వారసురాలినంటూ చిన్నమ్మకు సవాల్ విసురుతున్నారు. దీపకు పెరుగుతున్న జనాదరణను చూసి శశికళ వర్గీయులు షాకవుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు శశికళ వర్సెస్ దీప అన్నట్టుగా మారాయి. దివంగత నేత ఎంజీఆర్ శతజయంతి వేడుకలు ఇరు వర్గాల బలప్రదర్శనకు వేదికయ్యాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, జయలలిత రాజకీయ గురువు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా మంగళవారం ఉదయం చెన్నై మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. దీప మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీపకు మద్దతుగా నినాదాలు చేస్తూ, జయ వారసురాలు ఆమేనంటూ బలప్రదర్శనకు దిగినంత పనిచేశారు. దీంతో శశికళ వర్గం ఖంగుతింది. ఎంజీఆర్ సమాధి వద్దకు తరలి వచ్చిన శశికళ వర్గీయులు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేయడంతో మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎంజీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన దీప చుట్టూ భారీ సంఖ్యలో మద్దతుదారులు గుమిగూడారు. అభిమానుల తాకిడి వల్ల ఆమె సమాధి దగ్గరకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఈ రోజు దీప రాజకీయ ప్రకటన చేస్తారని వార్తలు రావడంతో అన్నా డీఎంకే శ్రేణులు ఆసక్తి చూపాయి. శశికళను వ్యతిరేకిస్తున్న నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.. దీపకు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయాల్లోకి రావాలంటూ దీపపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం దీప రాజకీయ ప్రకటన చేస్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మకు దీప సవాల్‌గా మారారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఎటు దారితీస్తాయి? జయ వారసురాలిగా ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? శశికళ, దీప రాజకీయ భవితవ్యం ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుంది. -
అన్నాడీఎంకే శ్రేణులకు జయ మేనకోడలి పిలుపు!
మీ మద్దతుకు కృతజ్ఞతలు.. శాంతంగా ఉండండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా.. అన్నాడీఎంకే, తమిళనాడును సరైన దారిలో నడుపుతా చెన్నై: జయలలిత మరణానంతరం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె మేనకోడలు దీపాజయకుమార్ గురువారం కీలక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లోకి వచ్చే విషయమై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, అది సమీప భవిష్యత్తులోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో శాంతియుతంగా ఉండాలని అన్నాడీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారసురాలు దీపేనంటూ అన్నాడీఎంకే శ్రేణులు తమిళనాడులోని పలుచోట్ల బ్యానర్లు, కటౌట్లు పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం ఇలా తన కటౌట్లు, బ్యానర్లు పెట్టడం ఆపాలని ఆమె పార్టీ కార్యకర్తలను కోరారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలు శాంతంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వారి మద్దతును తాను ఎన్నడూ మరిచిపోనని వ్యాఖ్యానించారు. జయలలిత మృతితో తమిళనాడు రాజకీయాలలో తీవ్ర శూన్యత ఏర్పడిందని, ప్రస్తుతం తాను తన అత్త మృతితో సంతాప భావనలో ఉన్నానని, తనకు కొంత సమయంలో ఇవ్వాలని ఆమె కోరారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, అది సమీప భవిష్యత్తులోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జయలలిత ఆశీస్సులతోనే తాను ముందుకు సాగుతానని, ఆమె తరహాలోనే అన్నాడీఎంకేను, తమిళనాడును సరైన దారిలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. -
జయలలిత పేరుతో కొత్త పార్టీ!
-
జయలలిత పేరుతో అన్నాడీఎంకే!
జయ అన్న కుమార్తె దీప అధ్యక్షురాలు.. సుప్రీం న్యాయవాది పేరున ఆడియో సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న శశికళను వ్యతిరేకిస్తూ ‘జే అన్నాడీఎంకే’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తానని అన్నాడీఎంకే కేసులను సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాది కృష్ణమూర్తి ప్రకటించినట్లుగా ఒక ఆడియో తమిళనాడులో హల్చల్ చేస్తోంది. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకేను తమ చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు శశికళ, సీఎం పన్నీర్‌సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రి ఎడపాడి పళనిస్వామి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మకు వీరాభిమాని అయిన సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి పేరున సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో విడుదలైంది. అందులో... పార్టీలో శశికళ పెత్తనానికి నిరసనగా ’జే అన్నాడీఎంకే’ అనే పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను స్థాపించబోయే పార్టీకి జయలలిత అన్నకుమార్తె దీపను అధ్యక్షురాలిగా నియమిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఆడియోపై శశికళ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణమూర్తిని అడ్డుకుని, అన్నాడీఎంకేతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. తనను చంపుతామని శశికళ మద్దతుదారులు బెదిరించారని వాపోయారు. ఆయనను బెదిరించిన వీడియో కూడా సోషల్ మీడియాకు ఎక్కింది. -
'నాకు మా జయత్తను చూడాలని ఉంది'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చూసేందుకు ఇప్పటి వరకు ఆమె వ్యక్తిగత బంధువులు వచ్చినట్లు ఎక్కడా వినిపించలేదు. అయితే, తొలిసారి, జయ మేన కోడలు అని చెప్పుకుంటూ దీపా జయకుమార్ అనే యువతి చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్దకు వచ్చింది. అయితే, ఆమెను కూడా జయను చూసేందుకు అనుమతించలేదు. దీంతో గేటు వద్ద పడిగాపులు గాస్తున్న ఆమె కాసేపు మీడియాతో మాట్లాడింది. తాను జయలలిత వదిన విజయలక్ష్మీ కూతురునని, జయ తనకు ప్రియమైన అత్తయ్య అని, తనను చాలా బాగా చూసుకుంటుందని మీడియాకు చెప్పింది. తన అత్తయ్య ఆరోగ్యం బాగ లేదని తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని, దీంతో పరుగెత్తుకుంటూ వచ్చేశానని, అయితే, తనను చూడనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని చెప్పింది. దీప ఇంగ్లిష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేట్ జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసింది. టీ నగర్ లో ఉంటున్న ఆమె మీడియా ద్వారా ఈ విషయం తెలిసిందని చెప్పింది. 'ఉన్నత స్థాయి అధికారులు నాకు ఫోన్ చేసి పిలుస్తానని అన్నారు. కానీ ఇప్పటి వరకు పిలవలేదు. మా అమ్మకు 2012లో చాలా సీరియస్ గా ఉన్న సమయంలో కూడా అధికారులు మా అత్తయ్యను(జయ) కలవకుండా చేశారు' అంటూ చెప్పుకొచ్చింది. జయలలిత సోదరుడు జయకుమార్ 1995లో చనిపోయినప్పుడు మాత్రమే జయ తమ ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లిందని చెప్పింది. అసలు ఎందుకు ఇంత రహస్యంగా ఉంచుతున్నారో.. ఈ రహస్యాన్ని కొనసాగిస్తున్నవారెవరో దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.