తిరువొత్తియూరు: దీపా జయకుమార్ ఇంటి ముందు ఆమె మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్న కుమార్తె దీప ఇటీవలి కాలంలో ఎంజీఆర్ అమ్మా దీప పేరవై పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించారు. టి.నగర్ శివజ్ఞానం వీధిలో ఉన్న ఇంటిలో దీపను కలుసుకోవడానికి మద్దతుదారులు వెళ్లారు. కాని ఆమెను కలుసుకోవడానికి వీలు కాలేదు. దీంతో ఆమె మద్దతుదారులు దీప ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
తమను కలుసుకోవడానికి వీలు కల్పించని పక్షంలో ఓ.పన్నీర్‌సెల్వం వర్గంలో చేరిపోతామని హెచ్చరించారు. రోజూ మద్దతుదారులను కలుసుకుని సంప్రదింపులు చేస్తానని దీప తెలిపడంతో బుధవారం తిరువొత్తియూరు నుంచి అడ్వొకేటు జహీర్‌తో సహా ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు దీప ఇంటి ముందు గుమికూడారు. కాని దీపను కలుసుకోవడానికి వీలు కాలేదు. ఆమెను కలుసుకోవడానికి వీలు లేకుండా ప్రైవేటు సెక్యూరిటీ అడ్డుకున్నారు.
దీప ఇంటి ముందు ఆందోళన
Published Thu, Mar 9 2017 8:32 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
Advertisement
Advertisement