ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నటరాజన్ కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్వాగతించారు. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం మంచి తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే సారథ్యం వహించే నాయకుడు శశికళ చేతిలో కీలుబొమ్మ కారాదని ఆమె ఆకాంక్షించారు. జయలలిత కోరుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి కావాలన్నారు.