రాజకీయాలపై దీపకు ఆసక్తి లేదు
చెన్నై : రాజకీయాలపై జయ మేనకోడలు దీపకు ఆసక్తి, అనుభవం లేదని దీప పేరవై నుంచి వైదొలగిన మాజీ ఎమ్మెల్యే మలరవన్ పేర్కొన్నారు. ఆయన ఆర్‌కేనగర్ ఉప ఎన్నిక సమయంలో దీప ప్రచారం కోసం కోవై నుంచి ప్రచార వాహనాన్ని తయారు చేసి తీసుకురావడమే కాకుండా చెన్నైలోనే బసచేసి ప్రచారంలో పాల్గొన్నారు.
ఇలావుండగా ఆయన హఠాత్తుగా దీప పేరవై నుంచి వైదొలగి మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం నాయకత్వంలో పనిచేసే అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపకు రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజకీయ అనుభవం లేదని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి ఆమె తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదన్నారు. దీంతో తాను పన్నీర్ సెల్వం గూటికి చేరినట్లు మలవరన్ తెలిపారు.