కొత్త పార్టీని ప్రకటించిన జయ మేనకోడలు దీప | Deepa Jayakumar launches new party Amma Deepa Peravai | Sakshi
Sakshi News home page

కొత్త పార్టీని ప్రకటించిన జయ మేనకోడలు దీప

Published Fri, Feb 24 2017 6:16 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

కొత్త పార్టీని ప్రకటించిన జయ మేనకోడలు దీప

కొత్త పార్టీని ప్రకటించిన జయ మేనకోడలు దీప

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ప్రారంభించారు. దీనికి ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరు పెట్టారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా దీప ఈ ప్రకటన చేశారు.

దీప మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో కలసి పనిచేయనని చెప్పారు. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. జయలలితకు తానే అసలైన వారసురాలినని చెప్పారు. జయలలిత మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన దీప.. అమ్మ జయంతి రోజున తదుపరి ప్రణాళిక ప్రకటిస్తానని చెప్పారు. శశికళకు వ్యతిరేకంగా గళం విప్పారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించారు. కాగా తదనంతర పరిణామాల్లో ఆమె పన్నీరుకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా జయలలిత అభిమానులు తనను కోరుతున్నారని చెప్పారు. పళనిస్వామి ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రికాదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement