Jayalalithaa niece
-
న్యాయ విచారణపై దీప అభ్యంతరం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి న్యాయ విచారణకు ఆదేశించడాన్ని జయ మేనకోడలు దీపా జయకుమార్ తప్పుబట్టారు. న్యాయవిచారణకు ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందని, అన్నాడీఎంకే కార్యకర్తలను వెర్రివాళ్లను చేసేందుకే ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. 'అమ్మ' మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మారుస్తామని పళనిస్వామి ప్రకటించడంపై దీప అభ్యంతరం వ్యక్తం చేశారు. జయ ఇల్లుపై తనకు.. తన సోదరుడికే నైతికంగా, చట్టబద్ధంగా, అధికారాలు ఉన్నాయని చెప్పారు. జయలలిత రక్తసంబధికులను సంప్రదించకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా, జయ మరణంపై విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. -
జయలలిత మేనకోడలు దీప ఆస్తులివే
చెన్నై: తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తనకు మొత్తం 3.05 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్టు ప్రకటించారు. రెండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, రూ. 1.05 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. గురువారం ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన దీప.. అఫిడవిట్లో ఈ వివరాలను తెలియజేశారు. 2016-17 వార్షిక ఏడాదికి గాను తనకు రూ. 5.37 లక్షలు ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. గతేడాది రూ. 17.50 లక్షలకు 1600 చదరపు అడుగుల స్థిరాస్తిని కొనుగోలు చేశానని, దీని మార్కెట్ విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని దీప అఫిడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకులకు రూ. 6.15 లక్షలు లోన్ చెల్లించాల్సివుందని, మరో ముగ్గురి నుంచి రూ. 70.65 లక్షలు అప్పు తీసుకున్నానని తెలిపారు. 2016లో 50,390 రూపాయలు వెచ్చించి ఓ స్కూటర్ కొన్నానని వెల్లడించింది. తనకు 23.80 లక్షల రూపాయల విలువైన 821 గ్రాముల బంగారం, రూ. 1.72 లక్షల విలువైన వెండి, రూ. 4 లక్షల విలువైన 20 కేరట్ వజ్రాలు ఉన్నట్టు తెలిపారు. చేతిలో రూ. 3.50 లక్షల నగదు ఉందని, బ్యాంకులో రూ. 1.77 లక్షలు సేవింగ్ డిపాజిట్లు ఉన్నట్టు దీప వెల్లడించారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత నెలలో ఎంజీఆర్ అమ్మ దీప పెరవయి రాజకీయ వేదికను ప్రారంభించిన ఆమె ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. -
నన్ను వేధిస్తున్నారు: జయ మేనకోడలు
చెన్నై : జయలలిత వారసురాలిగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కు వేధింపులు ప్రారంభమయ్యాయట. ఏప్రిల్ 12 న జరుగబోయే ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదని వేధిస్తున్నారని దీపా జయకుమార్ సోమవారం ఆరోపించారు. ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని తాను ప్రకటించినప్పటి నుంచి వివిధ రకాలుగా తనను పరోక్షంగా వేధిస్తున్నారని చెప్పారు. కనీసం తాను ఇంట్లో కూడా ఉండటం లేదని, తనకు వ్యతిరేకంగా పలువురు గూండాలు అక్కడికి వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు వారు ఎవరి వర్గానికి చెందిన వారో కూడా తెలియడం లేదన్నారు. ఈ ఉప ఎన్నికల నుంచి తనని విరమింపజేయడానికి పలు కుట్రలు జరుగుతున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 24నే ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై అనే కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతున్నట్టు దీపా జయకుమార్ ప్రకటించారు. ఈ ఫోరం ప్రారంభించడానికి ముందు కూడా చాలా మంది తనకు అడ్డంకులు సృష్టించారని దీపా జయకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. జయలలిత పోటీచేసే ఆర్కే నగర్ నుంచి దీపా జయకుమార్ పోటీ చేసి అమ్మ అసలు వారసురాలిగా నిరూపించుకోవాలని ఆమె శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జయలలిత మరణించడంతో ఆమె స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి దీపా పోటీచేస్తున్నారు. ఆర్కే నగర్ వాసులు కూడా చిన్నమ్మను పక్కన పెట్టి, దీపా జయకుమార్ కే తమ మద్దతు తెలుపుతున్నారు. -
దీపకు పేరవై చిచ్చు
► తప్పుకున్న మాధవన్ ► మద్దతుదారుల్లో అసంతృప్తి సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప కుటుంబంలో ‘పేరవై’ చిచ్చు రగిలింది. ఇందులో నుంచి తాను తప్పకుంటున్నట్టు దీప భర్త మాధవన్ ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలు మద్దతుదారుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. దివంగత సీఎం జయలలిత రాజకీయ వారసురాల్ని తానేనని ఆమె మేనకోడలు దీప ప్రకటించడం అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ పెద్ద సంఖ్యలో హర్షం వ్యక్తం చేశాయి. దీప ఇంటి ముందు పెద్ద ఎత్తున వాలడంతో ఇక, రాజకీయ పయనానికి జయలలిత మేనకోడలు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై పేరుతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు. అయితే, ఆమెకు రాజకీయ అనుభవం తక్కువే. సరిగ్గా సలహాలు ఇచ్చే వారు తక్కువేనని చెప్పవచ్చు. ఈ రెండు వెరసి దీప పేరవైలో సమస్యల సృష్టికి కారణం అయ్యాయన్న ప్రచారం సాగుతోంది. ఆ పేరవైకు నిర్వాహకుల ఎంపిక మొదటి నుంచి వివాదానికి దారి తీసూ్తవస్తోంది. వారికి వ్యతిరేకంగా అసంతృప్తి రగులుతున్న సమయంలో ఇన్ చార్జల నియామక ప్రకటన దీపను ఇరకాటంలో పడేసినట్టుం ది. అసలు ఆ జాబితాను ఆమె అధికారికంగా ప్రకటించినట్టు సమాచారం. మీడియాల్లో ఆ జాబితా హల్చల్ సృష్టించడంతో ఇక, ఆ పేరవైలో మరింతగా చిచ్చు రగిలింది. ఆ జాబితాకు వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసనలు బయలు దేరాయి. ఈ సమయంలో దీప కుటుంబంలోనూ ఆ పేరవై చిచ్చు రగల్చడం చర్చకు దారి తీసింది. తప్పుకున్న మాధవన్ : జయలలిత మరణం తదుపరి తెరమీదకు వచ్చిన దీపకు వెన్నంటి ఆమె భర్త మాధవన్ ఉంటూ వస్తున్నారు. దీప ఎక్కడికి వెళ్లినా, ఆయన అనుసరిస్తున్నారు. రాజకీయ అరంగేట్రం, పేరవై ఏర్పాటు ప్రకటన వరకు తోడునీడగా మాధవన్ ఉన్నారు. అయితే, ఆ పేరవై నిర్వాహకుల ఎంపిక, ఇన్ చార్జ్ ల జాబితా దీప కుటుంబంలోని చిచ్చు రగిల్చినట్టుంది. ఈ విషయాల్లో తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేని మాధవన్, ఆ పేరవై నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం చర్చకు దారి తీశాయి. మూడు నెలలుగా దీప వెన్నంటి ఉన్న ఆయన రెండు మూడు రోజులుగా దూరంగా ఉంటూ రావడంతో కొందరు మీడియా ప్రతినిధులు కదిలించి ఉన్నారు. తాను పేరవై వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకోదలచుకోలేని, దీప ఉన్నత స్థానంలో ఉంటే ఆనందించే మొదటి వ్యక్తి తానేనని మాధవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. తాను తప్పుకుంటున్నానని, ఆ పేరవైతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పందించడం మద్దతుదారుల్లో అసంతృప్తిని రగిల్చింది. ఇంటి వద్దకు వచ్చే మద్దతుదారులతో సంప్రదింపులు సాగించడం, సూచనలు సలహాలు ఇవ్వడంలో మాధవన్ ఇన్నాళ్లు ముందున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన తప్పుకోవడం ఆయనతో సన్నిహితంగా ఉండే మద్దతుదారులతో పాటు, దీప పేరవై మద్దతు దారుల్లో అసంతృప్తి బయలు దేరినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
దీప ఇన్ చార్జ్‌లు
► నాలుగు డివిజను్లగా ఏర్పాటు ► మొదట్లోనే వ్యతిరేకత ► కమిటీలో మరింత జాప్యం సాక్షి, చెన్నై: ఎంజీఆర్, అమ్మ దీపపేరవైకు ఇన్ చార్జ్ లను ప్రకటించారు. రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి ఇన్ చార్జ్ ల జాబితాను ఆ పేరవై కార్యదర్శి, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప శుక్రవారం విడుదల చేశారు. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా అనేక చోట్ల పదవుల వివాదం ఏర్పడింది. ఇక, పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటులో మరింత జాప్యం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. మేనత్త జయలలిత జయంతి రోజున దీప తన రాజకీయ పయనం గురించి ప్రకటన చేశారు. ఆ మేరకు ఎంజీఆర్, అమ్మ, దీపపేరవైతో తన రాజకీయ పయనం సాగుతుందని చేసిన ప్రకటన మద్దతు దారుల్లోఆనందాన్ని నింపింది. అదే సమయంలో ఆ పేరవై నిర్వాహకులుగా తన మిత్రులు పలువుర్ని నియమించి వివాదాన్ని దీప కొని తెచ్చుకున్నారు. ఈ మంటల్ని చల్లార్చేందుకు మద్దతుదారుల్ని బుజ్జగించేందుకు దీప తీవ్రంగానే శ్రమించాల్సిన పరిస్థితి. తదుపరి ఆమె ఇంటి ముందుగానీ, సమావేశాలకు గానీ మద్దతుదారుల సంఖ్య క్రమంగా తగు్గతూ రావడంతో ఆ శిబిరంలో కలవరం బయలు దేరినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి కమిటీ అన్నది పక్కన పెట్టి, రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి తన పేరవైకు ఇన్ చార్జ్ లను దీప ప్రకటించడం గమనార్హం. ఈ నియామకాలను సైతం ఆయా ప్రాంతాల్లో మద్దతుదారులు వ్యతిరేకిస్తుండడం చర్చకు దారి తీసింది. మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరం దీపకు మళ్లీ పిలుపునిస్తుండడంతో, ఆ శిబిరంలోకి దూకేనా, పేరవైతో ముందుకు సాగేనా, కొత్త పార్టీని పెట్టేనా అన్నది వేచిచూడాల్సిందే. డివిజన్లు : తొలి డివిజన్ లో కన్యాకుమారి, తిరునల్వేలి, తూతు్తకుడి, రామనాథపురం, శివగంగై, విరుదునగర్, మదురై, తేని జిల్లాలను చేర్చారు. రెండో డివిజన్ లో దిండుగల్, తిరుప్పూర్, కోయంబతూ్తరు, నీలగిరి, ఈరోడ్, నామక్కల్, కరూర్, సేలం, మూడో డివిజన్ లో తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు, కడలూరు, నాలుగో డివిజన్ లో ధర్మపురి, కృష్ణగిరి, తిరువణ్ణామలై, కాంచీపురం, వేలూరు, విల్లుపురం, తిరువళూ్లరు, చెన్నై జిల్లాలను చేర్చారు. ఇన్ చార్జ్ లు: దురైయప్ప(తిరునల్వేలి), పుసుం పొన్ పాండియన్ (మదురై), తొండన్ జీ సుబ్రమణి(తూతు్తకుడి), సెంథిల్ మురుగన్ (కన్యాకుమారి), వీరకుమార్ (తేని), భారతీ సుబ్బురాం (విరుదునగర్), సరస్వతి (నామక్కల్), అమినన్ (సేలం), కరుప్పుస్వామి(కరూర్), రాజామణి(నామక్కల్),రాజ పరమ శివం(పుదుకోట్టై), ఇలవలగన్ (పెరంబలూరు), మురుగన(తంజావూరు), సెల్వవినాయ్ గం(కడలూరు), రాజకన్నప్పన్(వేలూరు), హేమచంద్రన్ఇన్ చార్్జల జాబితాలో ఉన్నారు. -
కొత్త పార్టీ ప్రకటించిన జయ మేనకొడలు దీప
-
కొత్త పార్టీని ప్రకటించిన జయ మేనకోడలు దీప
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ప్రారంభించారు. దీనికి ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరు పెట్టారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా దీప ఈ ప్రకటన చేశారు. దీప మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో కలసి పనిచేయనని చెప్పారు. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. జయలలితకు తానే అసలైన వారసురాలినని చెప్పారు. జయలలిత మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన దీప.. అమ్మ జయంతి రోజున తదుపరి ప్రణాళిక ప్రకటిస్తానని చెప్పారు. శశికళకు వ్యతిరేకంగా గళం విప్పారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించారు. కాగా తదనంతర పరిణామాల్లో ఆమె పన్నీరుకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా జయలలిత అభిమానులు తనను కోరుతున్నారని చెప్పారు. పళనిస్వామి ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రికాదని విమర్శించారు. -
నాక్కూడా అపాయింట్ మెంట్ ఇవ్వండి!
చెన్నై: అన్నాడీఎంకేలో అధికారం కోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య కుమ్ములాట జరుగుతుండగా నేనున్నానంటూ జయలలిత మేనకోడలు దీప ముందుకు వచ్చారు. ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోవడంతో ఆయనను కలిసేందుకు ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీపకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీప మద్దతుదారులు రాజ్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, జయలలితకు తాను వారసురాలిని తానేనని దీప ఇంతకుముందు ప్రకటించుకున్నారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు ఎంతమాత్రం కోరుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. దీప మద్దతు ఇస్తే తీసుకుంటానని పన్నీర్ సెల్వం ఇంతకుముందు పేర్కొన్నారు. -
జయ మేనకోడలు కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జయలలిత వారసత్వం కోసం అధికారికంగా పోరు మొదలైంది. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జయకు అసలైన వారసురాలిని తానేనని, ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని మంగళవారం ప్రకటించారు. జయలలిత రాజకీయ వారసురాలిగా మరొకరని అంగీకరించబోనని పరోక్షంగా శశికళ నటరాజన్‌ను ఉద్దేశిస్తూ తేల్చి చెప్పారు. తమిళ ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితం అంకితమని, ఈ రోజు తన జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టానని అన్నారు. ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా చెన్నై మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం దీప మీడియా సమావేశంలో మాట్లాడారు. జయలలిత శైలి వస్త్రధారణతో వచ్చిన దీప.. అచ్చం అమ్మలాగే కనిపించారు. జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న తన తదుపరి రాజకీయ ప్రణాళికను వెల్లడిస్తానని దీప చెప్పారు. త్వరలో తన మద్దతుదారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎంజీఆర్, జయలలిత అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. జయలలిత అభిమానుల్లో ఎక్కువ మంది తన వెంటే ఉన్నారని, అలాగే అన్నా డీఎంకే కార్యకర్తలందరూ తనకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అన్నా డీఎంకే కేడర్ ఇప్పటికే తనను ఆహ్వానించిందన్నారు. శశికళ నటరాజన్ కుటుంబంపై దీప విమర్శలు చేశారు. తమ సలహాలు తీసుకుని జయలలిత పనిచేసేవారని శశికళ కుటుంబం చేస్తున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. తన పేరును చెడగొట్టేందుకు చాలా పుకార్లు ప్రచారం చేశారని ఆరోపించారు. -
చిన్నమ్మకు వణుకు పుట్టిస్తోంది
చెన్నై: జయలలిత వారసురాలిగా చక్రం తిప్పాలని ఆశిస్తున్న అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌కు జయ మేనకోడలు దీపా జయకుమార్ వణుకు పుట్టిస్తున్నారు. తానే జయలలితకు అసలైన వారసురాలినంటూ చిన్నమ్మకు సవాల్ విసురుతున్నారు. దీపకు పెరుగుతున్న జనాదరణను చూసి శశికళ వర్గీయులు షాకవుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు శశికళ వర్సెస్ దీప అన్నట్టుగా మారాయి. దివంగత నేత ఎంజీఆర్ శతజయంతి వేడుకలు ఇరు వర్గాల బలప్రదర్శనకు వేదికయ్యాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, జయలలిత రాజకీయ గురువు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా మంగళవారం ఉదయం చెన్నై మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. దీప మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీపకు మద్దతుగా నినాదాలు చేస్తూ, జయ వారసురాలు ఆమేనంటూ బలప్రదర్శనకు దిగినంత పనిచేశారు. దీంతో శశికళ వర్గం ఖంగుతింది. ఎంజీఆర్ సమాధి వద్దకు తరలి వచ్చిన శశికళ వర్గీయులు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేయడంతో మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎంజీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన దీప చుట్టూ భారీ సంఖ్యలో మద్దతుదారులు గుమిగూడారు. అభిమానుల తాకిడి వల్ల ఆమె సమాధి దగ్గరకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఈ రోజు దీప రాజకీయ ప్రకటన చేస్తారని వార్తలు రావడంతో అన్నా డీఎంకే శ్రేణులు ఆసక్తి చూపాయి. శశికళను వ్యతిరేకిస్తున్న నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.. దీపకు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయాల్లోకి రావాలంటూ దీపపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం దీప రాజకీయ ప్రకటన చేస్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మకు దీప సవాల్‌గా మారారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఎటు దారితీస్తాయి? జయ వారసురాలిగా ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? శశికళ, దీప రాజకీయ భవితవ్యం ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుంది. -
అన్నాడీఎంకే ఆశా దీపం
► దీపపై పెరుగుతున్న ఒత్తిడి ► సేలంలో జయలలిత దీప పేరవై ►మూడు వారాల్లోనిర్ణయం ► జయ మేనకోడలు దీప వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మలేని అన్నాడీఎంకేకు జయలలిత మేనకోడలు దీప ఆశాదీపమనే ప్రచారం ఊపందుకుంది. జిల్లా నలుమూలల నుంచి దీప ఇంటికి చేరుకుని రాజకీయ అరంగేట్రంపై ఒత్తిడి పెరుగుతోంది. అన్నాడీఎంకేకు అన్నీతానై వ్యవహరించిన జయలలిత ఎవ్వరినీ తన వారసురాలిగా ప్రకటించకుండానే కన్నుమూశారు. జయకు అత్యంత సన్నిహితురాలిగా ఉండడమే ఏకైక అర్హతగా శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం వెనుక నెలకొన్న అనుమానాలు, జయ రక్తసంబంధీకురాలైన దీపను దరిచేరనీయక పోవడం శశికళ కుట్రగా అనుమానిస్తున్నారు. అన్నాడీఎంకేలోని అగ్రనేతలంతా కలిసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ద్వితీయశ్రేణీ మొదలుకుని కింది స్థాయి వరకు మండిపడుతున్నారు. అంతటితో ఆగక సీఎం పదవిని కూడా కట్టబెట్టే ప్రయత్నాలను సహిం చలేక పోతున్నారు. శశికళ పోస్టర్లు, ఫ్లెక్సీలు చింపివేయడం ద్వారా తమ అగ్రహాన్ని బహిరంగంగా చాటుకుంటున్నారు. అన్నాడీఎంకేకు అసలైన వారసురాలు దీప మాత్రమేనని పట్టుబట్టే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. శశికళ స్థానంలో దీపను కూర్చోబెట్టాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీప పేరున గత కొంతకాలంగా పోస్టర్లు వెలిశాయి. జయలలిత మరణించే వరకు దీప అంటే ఎవరో తెలియదు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దీప గురించే చర్చ. తన బొమ్మతో పోస్టర్లు వేయరాదని దీప అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ఆగని అభిమానగణం చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి తండోపతండాలుగా చేరుకోవడం ప్రారంభించారు. వచ్చేపోయే అభిమానులతో దీప ఇంటి పరిసరాలు నిత్యం రద్దీగా మారిపోయాయి. జయ రాజకీయ వార సురాలిగా అన్నాడీఎంకేలో చేరాలని దీపపై వత్తిడి చేస్తూ రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి ఆమె ఇంటికి వస్తున్నారు. కడలూరు, సేలం, వేలూరు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు మంగళ, బుధవారాల్లో దీపను కలుసుకున్నారు. ఇంటి బాల్కనీ నుండి అందరికీ అభివాదం చేస్తూ అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నమైన రెండాకుల గుర్తుగా రెండువేళ్లను చూపడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయింది.ఈ సందర్బంగా దీప మాట్లాడుతూ, అత్త మరణం తనను కలిచి వేసిందని, ఆమె మరణంపై ఉన్న నెలకొన్ని ఉన్న అనుమానాలపై కోర్టులోని పిటిషన్ల మూలంగా త్వరలో ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ప్రధానంగా ఈ కారణం చేతనే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తనపై చలామణి ఉన్న వార్తలన్నీ ఊహాగానాలని అన్నారు. మరో మూడు వారాల్లో మీరు ఆశించిన నిర్ణయాన్నే ప్రకటిస్తానని దీప హామీ ఇచ్చారు. మంగళవారం చెన్నైలోని దీపను కలుసుకున్న సేలంకు చెందిన వారే బుధవారం నాడు ‘జయలలిత దీప పేరవై’ అనే అభిమాన సంఘాన్ని స్థాపించడం గమనార్హం -
జయలలిత పేరుతో కొత్త పార్టీ!
-
జయలలిత పేరుతో అన్నాడీఎంకే!
జయ అన్న కుమార్తె దీప అధ్యక్షురాలు.. సుప్రీం న్యాయవాది పేరున ఆడియో సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న శశికళను వ్యతిరేకిస్తూ ‘జే అన్నాడీఎంకే’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తానని అన్నాడీఎంకే కేసులను సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాది కృష్ణమూర్తి ప్రకటించినట్లుగా ఒక ఆడియో తమిళనాడులో హల్చల్ చేస్తోంది. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకేను తమ చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు శశికళ, సీఎం పన్నీర్‌సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రి ఎడపాడి పళనిస్వామి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మకు వీరాభిమాని అయిన సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి పేరున సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో విడుదలైంది. అందులో... పార్టీలో శశికళ పెత్తనానికి నిరసనగా ’జే అన్నాడీఎంకే’ అనే పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను స్థాపించబోయే పార్టీకి జయలలిత అన్నకుమార్తె దీపను అధ్యక్షురాలిగా నియమిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఆడియోపై శశికళ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణమూర్తిని అడ్డుకుని, అన్నాడీఎంకేతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. తనను చంపుతామని శశికళ మద్దతుదారులు బెదిరించారని వాపోయారు. ఆయనను బెదిరించిన వీడియో కూడా సోషల్ మీడియాకు ఎక్కింది. -
అచ్చం జయే.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే!
-
అచ్చం జయే.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే!
చెన్నై: మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులకు బుధవారం సాయంత్రం ఒకింత ఉద్వేగపూరితమైన అనుభవం ఎదురైంది. జయలలితకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను చూసి.. 'అమ్మ' అభిమానులు చూపు తిప్పుకోలేకపోయారు. దీప అచ్చం జయలలిత పోలికలతో ఉండటంతో ఆమెను చూసి కొందరు ఉద్వేగానికి లోనయ్యారు. దీప, తన కుటుంబసభ్యులు కొందరితో కలిసి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించింది. ఆమె జయలలిత స్మారక ప్రదేశంలో ప్రదక్షణ చేస్తున్నప్పుడు.. దీపను చూసేందుకు అక్కడున్న వారు పెద్ద ఎత్తున గుమిగూడారు. కొంతమంది అమ్మను చూసినట్టు భావించి భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మహిళలు దీప వద్దకు వెళ్లి 'నిన్ను చూస్తే అచ్చం అమ్మను చూసినట్టే ఉంది. ఆమె పోలికలు నీ ముఖంలో కనిపిస్తున్నాయి' అని పేర్కొన్నారు. కొద్ది క్షణాల్లోనే చాలామంది పోటెత్తారు. కొంతమంది ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ఎటూ కదలకుండా ఆమె చుట్టూ జనాలు మూగడంతో అతికష్టం మీద భద్రతవలయంలో ఆమెను స్థానికంగా ఉన్న స్క్వేర్ పోలీసు స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత పంపించారు. జయలలిత అంత్యక్రియలను శశికళ చేయడం తనకు బాధ కలిగించిందని అంతకుముందు దీప పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె బుధవారం ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ.. తన మేనత్త జయలలిత మృతి విషయంలో అనేక ఆంతరంగిక విషయాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. నిజానికి జయలలితకు నివాళులర్పించేందుకు కూడా దీపకు శశికళ వర్గీయులు సరిగ్గా అనుమతించలేదు. మెరీనా బీచ్ వద్ద జయలలిత భౌతికకాయాన్ని తరలించిన తర్వాత కేవలం ఒకసారి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించేందుకు శశికళ బంధువులు దీపను అనుమతించారు. ఆ వెంటనే వారు జయలలిత పార్థీవదేహాన్ని చుట్టుముట్టి.. అక్కడినుంచి దీపను పంపించివేశారు. అంతకుముందు గత ఆదివారం కూడా దీప అపోలో ఆస్పత్రి వద్ద కనిపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అత్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకుంది. కానీ ఆమె ప్రయత్నం సఫలం కాలేదు. గతంలో అపోలో ఆస్పత్రి వద్ద జయలలిత వారసురాలిని తానేనంటూ దీప హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. జయకుమార్ దంపతులు కొన్నాళ్లు జయలలితతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది. -
శశికళ చేయడం బాధ కలిగించింది
-
శశికళ చేయడం బాధ కలిగించింది
- అంత్యక్రియలపై ‘సాక్షి’తో జయలలిత అన్న కూతురు దీప - జయ మృతి వెనక ఆంతరంగిక విషయాలున్నాయి - త్వరలోనే వాటిని బయటపెడతాను చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలను శశికళ చేయడం తనకు బాధ కలిగించిందని జయలలిత అన్న కూతురు దీప పేర్కొన్నారు. ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడం తాను ఇంతవరకు చూడలేదన్నారు. ఆమె బుధవారం ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ.. తన మేనత్త జయలలిత మృతి విషయంలో అనేక ఆంతరంగిక విషయాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. గతంలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో అపోలో ఆస్పత్రి వద్ద దీప హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. జయకుమార్ దంపతులు కొన్నాళ్లు జయలలితతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది. ఆ తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు రావడంతో జయకుమార్ పోయెస్‌గార్డెన్ వదిలి చెన్నై టీనగర్లో కాపురం పెట్టారు. 1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. 2013లో వదిన చనిపోరుునప్పుడు మాత్రం జయలలిత వెళ్లలేదు. ఇటీవల జరిగిన మేనకోడలు దీప వివాహానికి కూడా ఆమె హాజరుకాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకొనివచ్చారు. ఈ సందర్భంగా వధూవరులకు అత్త హోదాలో జయలలిత ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. కాగా, మరోవైపు దీప వైవాహిక జీవితం కొన్నాళ్లు సజావుగా సాగినా ఆ తర్వాత భర్తతో విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె అత్త జయలలితకు చేరువకావాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఇటీవల జయ ఇంటి వద్ద ఆమె గంటసేపు నిరీక్షించినా అనుమతి రాలేదు. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఈ ఇల్లు మా నానమ్మ(జయలిత తల్లి సంధ్య) నాకు రాసిచ్చింది. మా ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మీరెవరు?’అంటూ దీప ఆ సందర్భంలో సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడింది. మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం పోయెస్‌గార్డెన్‌లోని కొందరికి ఇష్టం లేదంటూ శశికళపై పరోక్ష ఆరోపణలు కూడా చేసింది. జయలలితే తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని గతంలో దీప ప్రయత్నాలు చేసింది. కానీ అవి సఫలం కాలేదు. జయలలిత మృతి నేపథ్యంలో రాజకీయ వారసురాలిగా మళ్లీ తెరపైకి వచ్చేందుకు దీప ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
జయలలిత మేనకోడలు సంచలన వ్యాఖ్యలు