దీప ఇన్ చార్జ్‌లు
► నాలుగు డివిజను్లగా ఏర్పాటు
► మొదట్లోనే వ్యతిరేకత
► కమిటీలో మరింత జాప్యం
సాక్షి, చెన్నై: ఎంజీఆర్, అమ్మ దీపపేరవైకు ఇన్ చార్జ్ లను ప్రకటించారు. రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి ఇన్ చార్జ్ ల జాబితాను ఆ పేరవై కార్యదర్శి, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప శుక్రవారం విడుదల చేశారు. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా అనేక చోట్ల పదవుల వివాదం ఏర్పడింది. ఇక, పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటులో మరింత జాప్యం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. మేనత్త జయలలిత జయంతి రోజున దీప తన రాజకీయ పయనం గురించి ప్రకటన చేశారు. ఆ మేరకు ఎంజీఆర్, అమ్మ, దీపపేరవైతో తన రాజకీయ పయనం సాగుతుందని చేసిన ప్రకటన మద్దతు దారుల్లోఆనందాన్ని నింపింది. అదే సమయంలో ఆ పేరవై నిర్వాహకులుగా తన మిత్రులు పలువుర్ని నియమించి వివాదాన్ని దీప కొని తెచ్చుకున్నారు.
ఈ మంటల్ని చల్లార్చేందుకు మద్దతుదారుల్ని బుజ్జగించేందుకు దీప తీవ్రంగానే శ్రమించాల్సిన పరిస్థితి. తదుపరి ఆమె ఇంటి ముందుగానీ, సమావేశాలకు గానీ మద్దతుదారుల సంఖ్య క్రమంగా తగు్గతూ రావడంతో ఆ శిబిరంలో కలవరం బయలు దేరినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి కమిటీ అన్నది పక్కన పెట్టి, రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి తన పేరవైకు ఇన్ చార్జ్ లను దీప ప్రకటించడం గమనార్హం. ఈ నియామకాలను సైతం ఆయా ప్రాంతాల్లో మద్దతుదారులు వ్యతిరేకిస్తుండడం చర్చకు దారి తీసింది. మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరం దీపకు మళ్లీ పిలుపునిస్తుండడంతో, ఆ శిబిరంలోకి దూకేనా, పేరవైతో ముందుకు సాగేనా, కొత్త పార్టీని పెట్టేనా అన్నది వేచిచూడాల్సిందే.
డివిజన్లు : తొలి డివిజన్ లో కన్యాకుమారి, తిరునల్వేలి, తూతు్తకుడి, రామనాథపురం, శివగంగై, విరుదునగర్, మదురై, తేని జిల్లాలను చేర్చారు. రెండో డివిజన్ లో దిండుగల్, తిరుప్పూర్, కోయంబతూ్తరు, నీలగిరి, ఈరోడ్, నామక్కల్, కరూర్, సేలం, మూడో డివిజన్ లో తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు, కడలూరు, నాలుగో డివిజన్ లో ధర్మపురి, కృష్ణగిరి, తిరువణ్ణామలై, కాంచీపురం, వేలూరు, విల్లుపురం, తిరువళూ్లరు, చెన్నై జిల్లాలను చేర్చారు.
ఇన్ చార్జ్ లు: దురైయప్ప(తిరునల్వేలి), పుసుం పొన్ పాండియన్ (మదురై), తొండన్ జీ సుబ్రమణి(తూతు్తకుడి), సెంథిల్ మురుగన్ (కన్యాకుమారి), వీరకుమార్ (తేని), భారతీ సుబ్బురాం (విరుదునగర్), సరస్వతి (నామక్కల్), అమినన్ (సేలం), కరుప్పుస్వామి(కరూర్), రాజామణి(నామక్కల్),రాజ పరమ శివం(పుదుకోట్టై), ఇలవలగన్ (పెరంబలూరు), మురుగన(తంజావూరు), సెల్వవినాయ్ గం(కడలూరు), రాజకన్నప్పన్(వేలూరు), హేమచంద్రన్ఇన్ చార్‌్జల జాబితాలో ఉన్నారు.