in charges
-
బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 9 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో నియమించిన సమన్వయకర్తల వివరాలను వెల్లడించారు. వరంగల్ లోక్‌సభ స్థానం పరకాల: ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్, పాలకుర్తి: మధుసూదనాచారి, మెట్టు శ్రీనివాస్, స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్ వెస్ట్: మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకన్న, ఎస్.సుందర్రాజ్, వరంగల్ ఈస్ట్: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట: కె.వాసుదేవారెడ్డి, సమ్మారావు, భూపాలపల్లి: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. మెదక్ లోక్‌సభ స్థానం సంగారెడ్డి: ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు: భూపాల్‌రెడ్డి, నర్సాపూర్: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మెదక్ : డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, దుబ్బాక: మనోహర్‌రావు, గజ్వేల్: రోజారాధాకృష్ణ శర్మ, సిద్దిపేట: ఫారూఖ్‌హుస్సేన్. కరీంనగర్ లోక్‌సభ స్థానం కరీంనగర్: ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, సిరిసిల్ల: తుల ఉమ, వేములవాడ: గూడూరి ప్రవీణ్, చొప్పదండి: పన్యాల భూపతిరెడ్డి, హుజురాబాద్: నారదాసులక్ష్మణ్రావు, మానకొండూర్: కొండూరి రవీందర్రావు, హుస్నాబాద్: ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు. జహీరాబాద్ లోక్‌సభ స్థానం జహీరాబాద్: దేవిశ్రీప్రసాద్రావు, ఆందోల్: పట్నం మాణిక్యం, నారాయణఖేడ్: మఠం భిక్షపతి, కామారెడ్డి: జనార్దన్‌గౌడ్, ఎల్లారెడ్డి: తిరుమల్‌రెడ్డి, బాన్సువాడ: ధఫెదర్రాజు, జుక్కల్: పోచారం భాస్కర్‌రెడ్డి. పెద్దపల్లి లోక్‌సభ స్థానం చెన్నూరు : తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి: గంట రాములు, మంచిర్యాల: కోలేటి దామోదర్‌గుప్తా, రామగుండం: సీహెచ్.రాకేష్, మంథని: ఓరుగంటి రమణారావు, పెద్దపల్లి: రవీందర్‌సింగ్, ధర్మపురి: రఘువీర్‌సింగ్. భువనగిరి లోక్‌సభ స్థానం ఇబ్రహీంపట్నం: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మునుగోడు : గోపగాని వెంకటనారాయణ గౌడ్, భువనగిరి : నంద్యాల దయాకర్‌రెడ్డి, నకిరేకల్: ఎలిమినేటి సందీప్‌రెడ్డి, తుంగతుర్తి: బూడిద బిక్షమయ్యగౌడ్, ఆలేరు: ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, జనగామ: కంచర్ల రామకృష్ణారెడ్డి. నల్లగొండ లోక్‌సభ స్థానం నల్లగొండ : తిప్పన విజయసింహారెడ్డి, నాగార్జునసాగర్: బండ నరేందర్‌రెడ్డి, హుజూర్నగర్: ఒంటెద్దు నరసింహారెడ్డి, దేవరకొండ: రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మిర్యాలగూడ: బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ: కటికం సత్తయ్యగౌడ్, సూర్యాపేట: ఇస్లావత్ రామచందర్‌నాయక్. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నాగర్‌కర్నూలు: వాల్యనాయక్, గద్వాల: ఎండీ.ఇంతియాజ్ అహ్మద్, అలంపూర్: దేవర మల్లప్ప, కల్వకుర్తి: చాడ కిషన్‌రెడ్డి, వనపర్తి: బైకాని శ్రీనివాస్, అచ్చంపేట: నవీన్‌కుమార్‌రెడ్డి, కొల్లాపూర్: ఆంజనేయగౌడ్. నిజామాబాద్ లోక్‌సభ స్థానం కోరుట్ల : ఎల్.రమణ , ఆర్మూర్: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నిజామాబాద్‌అర్బన్: ప్రభాకర్‌రెడ్డి , అలీం, బాల్కొండ: ఎల్ఎంబీ.రాజేశ్వర్, నిజామాబాద్‌రూరల్: వి.గంగాధర్‌గౌడ్ , బోధన్: డి.విఠల్‌రావు, జగిత్యాల: దావా వసంత, లోక బాపురెడ్డి. -
అన్ని స్థానాలూ గెలిపించుకుందాం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల నేతలు నిర్ణయించుకున్నారు. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం వారు ఆత్మియ సమ్మేళనం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జిలు తాటిపర్తి చంద్రశేఖర్, దద్దాల నారాయణలు ఏకతాటిపైకి వచ్చి మళ్లీ అధికారం సాధించే లక్ష్యంతో పనిచేద్దామని ప్రతిన బూనారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేద్దామని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల నిర్వహణ, ప్రచారం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సమ్మేళనం పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపడంతోపాటు నాయకులంతా ఒక్కటే అనే సంకేతాన్ని ఇవ్వగలిగింది. -
‘హాథ్‌సే హాథ్ జోడో’ ఇన్చార్జీల నియామకం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 26వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్న హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల కోసం కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీ లను నియమించింది. యాత్రలను క్షేత్రస్థాయి నుంచి సమన్వయం చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులకు బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుమతి మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘అసెంబ్లీ’ ఇన్‌చార్జీ్జలు పోటీ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ్జలుగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ్జ సునీల్ బన్సల్ శనివారం ముఖ్యనేతల సమావేశంలో బాంబుపేల్చారు. దీంతో ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాగైతే తాము ఇన్‌చార్జీలుగా తప్పుకుంటామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలగజేసుకుని ఇక్కడున్న పరిస్థితిని, పలువురు ఇన్‌చార్జీ్జలు ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న తీరును వివరించారు. దీంతో అసెంబ్లీ ఇన్చార్జీల పనితీరు, సాధించిన ఫలితాలను ఆరునెలలు పరిశీలించి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని సునీల్ బన్సల్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు, జిల్లాల అధ్యక్షులు ఇతర ముఖ్యనేతలతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీ్జలు వారి పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి ఫలితాలపై బన్సల్ ఆరాతీశారు. బన్సల్‌తోపాటు తరుణ్‌ఛుగ్, అర్వింద్ మీనన్, బండి సంజయ్, డాక్టర్ కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీ పటిష్టానికి పాటుపడండి.. మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని సునీల్ బన్సల్ ఆదేశించారు. ప్రధానంగా మునుగోడులోని అన్ని పోలింగ్‌బూత్‌ల స్థాయిలో ప్రతీ నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శక్తి కేంద్రాలకు (3,4 పోలింగ్ బూత్‌లు కలిపి ఒక కేంద్రం) ఇన్చార్జిలను నియమించి పూర్తిస్థాయిలో పార్టీపటిష్టతకు కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. మండలాల వారీగా ఇన్చార్జీలు లేనిచోట్ల వెంటనే నియామకాలు చేయాలని ఆదేశించారు. వచ్చేనెల 9,10 తేదీల్లో ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’రెండోవిడత బైక్‌ర్యాలీలు ప్రారంభించాలన్నారు. 14 లోక్‌సభ నియోజకవర్గాల్లోని (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా) రెండేసి అసెంబ్లీ స్థానాల్లో ఈ బైక్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరిలోగా రాష్ట్రమంతా కవర్ చేస్తూ బైక్‌ర్యాలీలు పూర్తిచేయాలన్నారు. -
‘మునుగోడు’కు మండలాల వారీ ఇన్చార్జులు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఒక్కో మండలానికి ఇద్దరు కీలక నేతలను కేటాయించింది. ఆయా మండలాలను పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించనుంది. ఇటీవల గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను మొత్తం 14 మందికి బాధ్యతలను అప్పగించనుంది. మునుగోడు ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కీగౌడ్ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇంచార్జులుగా బాధ్యతలు తీసుకున్న నాయకులు పూర్తి స్థాయిలో ఆయా మండలాల్లోనే మకాం వేస్తారని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి పూర్తయ్యేంతవరకు పర్యవేక్షిస్తారని తెలిపాయి. -
దీప ఇన్ చార్జ్‌లు
► నాలుగు డివిజను్లగా ఏర్పాటు ► మొదట్లోనే వ్యతిరేకత ► కమిటీలో మరింత జాప్యం సాక్షి, చెన్నై: ఎంజీఆర్, అమ్మ దీపపేరవైకు ఇన్ చార్జ్ లను ప్రకటించారు. రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి ఇన్ చార్జ్ ల జాబితాను ఆ పేరవై కార్యదర్శి, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప శుక్రవారం విడుదల చేశారు. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా అనేక చోట్ల పదవుల వివాదం ఏర్పడింది. ఇక, పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటులో మరింత జాప్యం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. మేనత్త జయలలిత జయంతి రోజున దీప తన రాజకీయ పయనం గురించి ప్రకటన చేశారు. ఆ మేరకు ఎంజీఆర్, అమ్మ, దీపపేరవైతో తన రాజకీయ పయనం సాగుతుందని చేసిన ప్రకటన మద్దతు దారుల్లోఆనందాన్ని నింపింది. అదే సమయంలో ఆ పేరవై నిర్వాహకులుగా తన మిత్రులు పలువుర్ని నియమించి వివాదాన్ని దీప కొని తెచ్చుకున్నారు. ఈ మంటల్ని చల్లార్చేందుకు మద్దతుదారుల్ని బుజ్జగించేందుకు దీప తీవ్రంగానే శ్రమించాల్సిన పరిస్థితి. తదుపరి ఆమె ఇంటి ముందుగానీ, సమావేశాలకు గానీ మద్దతుదారుల సంఖ్య క్రమంగా తగు్గతూ రావడంతో ఆ శిబిరంలో కలవరం బయలు దేరినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి కమిటీ అన్నది పక్కన పెట్టి, రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి తన పేరవైకు ఇన్ చార్జ్ లను దీప ప్రకటించడం గమనార్హం. ఈ నియామకాలను సైతం ఆయా ప్రాంతాల్లో మద్దతుదారులు వ్యతిరేకిస్తుండడం చర్చకు దారి తీసింది. మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరం దీపకు మళ్లీ పిలుపునిస్తుండడంతో, ఆ శిబిరంలోకి దూకేనా, పేరవైతో ముందుకు సాగేనా, కొత్త పార్టీని పెట్టేనా అన్నది వేచిచూడాల్సిందే. డివిజన్లు : తొలి డివిజన్ లో కన్యాకుమారి, తిరునల్వేలి, తూతు్తకుడి, రామనాథపురం, శివగంగై, విరుదునగర్, మదురై, తేని జిల్లాలను చేర్చారు. రెండో డివిజన్ లో దిండుగల్, తిరుప్పూర్, కోయంబతూ్తరు, నీలగిరి, ఈరోడ్, నామక్కల్, కరూర్, సేలం, మూడో డివిజన్ లో తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు, కడలూరు, నాలుగో డివిజన్ లో ధర్మపురి, కృష్ణగిరి, తిరువణ్ణామలై, కాంచీపురం, వేలూరు, విల్లుపురం, తిరువళూ్లరు, చెన్నై జిల్లాలను చేర్చారు. ఇన్ చార్జ్ లు: దురైయప్ప(తిరునల్వేలి), పుసుం పొన్ పాండియన్ (మదురై), తొండన్ జీ సుబ్రమణి(తూతు్తకుడి), సెంథిల్ మురుగన్ (కన్యాకుమారి), వీరకుమార్ (తేని), భారతీ సుబ్బురాం (విరుదునగర్), సరస్వతి (నామక్కల్), అమినన్ (సేలం), కరుప్పుస్వామి(కరూర్), రాజామణి(నామక్కల్),రాజ పరమ శివం(పుదుకోట్టై), ఇలవలగన్ (పెరంబలూరు), మురుగన(తంజావూరు), సెల్వవినాయ్ గం(కడలూరు), రాజకన్నప్పన్(వేలూరు), హేమచంద్రన్ఇన్ చార్్జల జాబితాలో ఉన్నారు.