విజయవాడలో సమావేశమైన ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల నేతలు నిర్ణయించుకున్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో సోమవారం వారు ఆత్మియ సమ్మేళనం నిర్వహించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిలు తాటిపర్తి చంద్రశేఖర్, దద్దాల నారాయణలు ఏకతాటిపైకి వచ్చి మళ్లీ అధికారం సాధించే లక్ష్యంతో పనిచేద్దామని ప్రతిన బూనారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేద్దామని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఎన్నికల నిర్వహణ, ప్రచారం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సమ్మేళనం పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపడంతోపాటు నాయకులంతా ఒక్కటే అనే సంకేతాన్ని ఇవ్వగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment