![Ys Jagan Holds Key Meeting With Ysrcp Senior Leaders](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/ysjagan1.jpg.webp?itok=ubjAGhup)
- ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది
- :పార్టీ సీనియర్ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రం అవుతోందని, అందువల్ల వైఎస్సార్‌సీపీ నాయకత్వమంతా సమష్టిగా సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండ గట్టాలని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. సీనియర్ నేతలకు సూచించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో, అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చించారు.
సూపర్‌సిక్స్ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా.. అందుకే ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ పేర్కొన్నారు.
ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, పేర్ని కిట్టు, కొట్టు సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిగం సురేష్, ఎస్వీ మోహన్‌రెడ్డి, కైలే అనిల్‌కుమార్, కావటి మనోహర్‌నాయుడు, కె.సురేష్‌బాబు, గోరంట్ల మాధవ్, ఈపూరు గణేష్, ఆలూరు సాంబశివారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వంకా రవీంద్రనాథ్, అదీప్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment