సాక్షి,తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రశ్నిస్తామన్న భయంతోనే వైఎస్సార్‌సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వలేదన్నారు. అయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై మండలి నుంచి నిలదీయాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
- అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం.
- కాని కౌంటర్‌కు స్పీకర్ సమాధానం ఇవ్వడంలేదు.
- అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే.
- కాని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడంలేదు:
- ప్రతిపక్ష హోదాను అంగీకరిస్తే, మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని అధికారపక్షం అంగీకరించడంలేదు.
- ప్రతిపక్ష నాయకుడుకి హక్కుగా మైక్, సమయం లభిస్తుంది.
- అలా ఇవ్వాల్సి వస్తుందని, ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉందని గుర్తించడానికి కూడా ముందుకు రావడంలేదు.
- 40శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
- అందుకే ప్రతిరోజూ మీడియా ద్వారా ఎమ్మెల్యేలు,సీనియర్ నాయకులు మాట్లాడతారు.
- అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదేరీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం.
- పూర్తి వివరాలు ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.
- ఇవన్నీకూడా ప్రతి మండలి సభ్యుడికీ పంపిస్తాం.
- ఆధారాలు చూపిస్తూ..ప్రభుత్వాన్ని నిలదీయండి..ప్రశ్నించండి.
- మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
- ప్రశ్నిస్తే..బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు.
- అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే బడ్జెట్ పత్రాల ద్వారా చెప్పారు.
- దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్రవివరాలను ప్రెస్‌మీట్‌ద్వారా నేను వివరిస్తాను.
- చంద్రబాబు చెప్పేవన్నీ మోసం అని, అబద్ధం అని ఇప్పటికే తేలిపోయింది.
- ఈ ఆరునెలల కాలంలోనే చంద్రబాబు నైజాన్ని ప్రజలు గుర్తించారు.
- ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.
- కష్టాలు అనేవి శాశ్వతం కాదు .
- వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం.
- కచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం.
- జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం.
- వైఎస్సార్‌సీపీ సైనికులుగా మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.
- ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి.
- గట్టిగా ప్రశ్నిస్తే..కేసులు పెడతారన్న భయాందోళనలు అనవసరం.
- నేను మీకు అండగా ఉంటాను.
- నా వయసు చిన్నదే.
- మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తాను.
- మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం.
- ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజినీరింగ్ చేశాం.
- ఎక్కడాలేని మార్పులు తీసుకు వచ్చాం.
- కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను తప్పకుండా గుర్తిస్తారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment