Ongole Parliament
-
Prakasam: కూటమిలో లుకలుకలు.. రెబల్ అభ్యర్థిగా ఆమంచి స్వాములు!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తు పారీ్టల్లో కుమ్ములాటలు ముదిరి పాకాన పడుతున్నాయి. పొత్తుల పేరుతో సీట్లు దక్కని జనసేనలు అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారు. జిల్లాలో పొత్తులో భాగంగా దర్శి, గిద్దలూరు నుంచి అవకాశం వస్తే పోటీ చేయాలని ఆశించారు. అయితే గిద్దలూరు సీటు టీడీపీకి కేటాయించడంపై గ్లాసు పార్టీ నేతలు భంగపడి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ పార్టీ నేత ఆమంచి స్వాములు ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు. దర్శి సీటును ఒకవేళ జనసేనకు ఇచ్చినా టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక జిల్లా కేంద్రం ఒంగోలులో టీడీపీ ప్రచారానికి జిల్లా జనసేన నేతలు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది రెండు పార్టీల పరిస్థితి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పశ్చిమ ప్రకాశంలో కీలకమైన గిద్దలూరు నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడం పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మొదటి నుంచి ఈ సీటును జనసేనకు ఇస్తామంటూ ప్రచారం చేసి చివరికి తెలుగుదేశం పార్టీకి కేటాయించడం వెనక దుష్ట శక్తుల కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అయితే టీడీపీ, జనసేన పొత్తుల తరువాత కూడా కొంతకాలం ఇదే కథ నడిపించారు. చివరికి గిద్దలూరు సీటు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన నాయకులు మోసపోయినట్లు గ్రహించారు. నమ్మించి మోసం చేశారని ఆగ్రహం చెందిన ఆమంచి స్వాములు జనసేన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలు జరుగుతుండగానే టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి జనసేనలో చిచ్చు పెట్టారు. రెండు గ్రూపులను సృష్టించారు. జనసేనలో కాసుల పాండు, బెల్లంకొండ సాయిబాబు గ్రూపులు ఏర్పడ్డాయని కార్యకర్తలు మండిపడుతున్నారు. దర్శిపై దోబూచులు.. దర్శి నియోజకవర్గంలో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇది కూడా మొదట్నుంచీ జనసేనకు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఎన్నారై గరికపాటి వెంకట్ ప్రచారాన్ని సైతం చేసుకుంటూ వచ్చారు. సీటు తనకే వస్తుందని ఆశపడ్డారు. పలు కార్యక్రమాలను సైతం నిర్వహించారు. అయితే ఈ సీటుపై టీడీపీ అధినేత చంద్రబాబు తనస్టైల్లో కుట్రలకు తెరతీశారు. దర్శిపై దోబూలాట మొదలెట్టారు. ఎల్లో మీడియా ద్వారా రోజుకో ప్రచారాన్ని చేయిస్తూ వస్తున్నారు. ఈ సీటును జనసేనకు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రటించినప్పటికీ దర్శిపై క్లారిటీ ఇవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చి పది రోజులవుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది. దీంతో కూటమి పారీ్టలో నాయకులు, కార్యకర్తలు చిరాకుపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి జనసేన తరఫున ఎవరు పోటీ చేసినా అభ్యర్థి మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఉండేలా చంద్రబాబు తెరవెనుక మంత్రాంగం నెరపుతున్నట్టు సమాచారం. రెబల్‌గా స్వాములు.. ఆమంచి స్వాములు ఆదివారం రాత్రి కంభంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో తెలుగుదేశం నాయకత్వంపై ఫైర్ కావడం సంచలనం సృష్టించింది. ఓడిపోయే సీట్లను జనసేనకు కట్టబెడుతున్నారని ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారం లేపాయి. జిల్లా నుంచి కనీసం ఒక్క సీటైనా జనసేనకు ఎందుకు కేటాయించలేదన్న ఆయన ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, పొత్తు విషయంలో పునరాలోచించుకోవాలని పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన సూచించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమంచి స్వాములు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్వాములు ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. జనసేనలో...గొడవలు.. గ్రూపులు జనసేన పార్టీలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా గ్రూపులు, గొడవలతో సతమతమవుతోంది. కొండపి నియోజకవర్గంలో ఇన్చార్జి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు బత్తిన రాజేష్ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది. ఇటీవల సింగరాయకొండలో ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒంగోలు సంగతి తెలిసిందే. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ వర్గాలు తరచుగా ఘర్షణ పడుతున్నారు. గత నెలలో రియాజ్ వర్గం అరుణను వెంటాడి దాడి చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరుణ తన మీద జరిగిన దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా ఇప్పడు తాను పొత్తుల పనిలో బిజీగా ఉన్నాను.. ఎన్నికల తరువాత కూచొని మాట్లాడుదామని చెప్పడం విమర్శలపాలైంది. యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జిగా పి.గౌతం రాజును నియమించారు. గుంటూరులో వైద్యం చేసే ఆయన ఏడాది క్రితమే ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వీలు చిక్కినప్పుడు మాత్రమే యర్రగొండపాలేనికి వచ్చిపోతున్నారు. మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో జనసేన నామమాత్రంగా ఉంది. మార్కాపురంలో ఇమ్మడి కాశీనాథ్ ఒక్కడే హోల్ అండ్ సోల్ నాయకుడిగా చెలాయిస్తున్నారు. -
బాబు ష్యూరిటీ.. సీటుకు లేదు గ్యారంటీ..!
తెలుగుదేశం పార్టీ ‘జయహో బీసీ’ అంటూ గుంటూరులో ఆర్భాటంగా సమావేశం నిర్వహించింది. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగటమే లక్ష్యం అంటూ డిక్లరేషన్ ప్రకటించింది. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటోంది. జిల్లాకు చెందిన ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు ఎంపీ సీటు ఇస్తానని సాక్షాత్తూ చంద్రబాబే హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బున్న బడా వ్యక్తి కళ్లెదుట కనిపించేసరికి ఆ నేతను కరివేపాకులా తీసిపడేశారు. ఇదేనా బీసీ డిక్లరేషన్ అంటూ పార్టీ కేడర్ అంతర్గతంగా మథనపడుతోంది. గతంలో మాదిగానే బీసీ నినాదం కేవలం ఎన్నికలకే పరిమితం చేస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీని టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన భావించారు. కనిగిరి, గిద్దలూరు శాసనసభా స్థానాల్లో ఏదైనా ఒక సీటు కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. అయితే అసెంబ్లీ సీటు ఇవ్వడం కుదరదని, అందుకు బదులుగా పార్లమెంటు సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తారని భావించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు బీసీలకు సీటు కేటాయించింది. కందుకూరు, కనిగిరి స్థానాల్లో బీసీలను పోటీకి దింపింది. ఆ పోటీగా టీడీపీ కూడా జిల్లాలో బీసీలకు సీటు తప్పకుండా ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కనీసం ఒక్క బీసీకి కూడా సీటు కేటాయించలేదు. నూకసాని పేరును అసలు పరిగణలోకి తీసుకోలేదు. రెండో విడతలో అయినా టికెట్ వస్తుందని భావించారు. పార్టీలో చేరకుండానే మాగుంటకు సీటు ? నూకసాని బాలాజీ ప్రస్తుతం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తానని చంద్రబాబు మాట ఇవ్వడంతో ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఒంగోలు నుంచి టీడీపీ తరఫున తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేయనున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సొంతంగా ప్రకటించుకోవడంతో నూకసాని ఖంగుతిన్నారు. ఇంకా పార్టీలో చేరని వ్యక్తి ఈ సీటు నాది అని ప్రకటించుకోవడమేమిటని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మాగుంటకు సీటు ఇవ్వాలనుకుంటే ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు ప్రకటించాలి కానీ అందుకు విరుద్ధంగా మాగుంట ప్రకటించుకోవడం ఏమిటని చర్చించుకుంటున్నారు. ఇది టీడీపీ బలహీనతకు అద్దం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాఘవరెడ్డి పేరును ప్రస్తావిస్తూ పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే చేయడం బీసీల పట్ల టీడీపీ చిన్నచూపునకు ఇది నిదర్శనమని పార్టీ నేతలే చెబుతున్నారు. డబ్బుల్తో వస్తే బీసీలను పక్కన పెడతారా... ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు డబ్బున్న నాయకుడు రాగానే బీసీలను పక్కన పెట్టేశారని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మాగుంట అనేక పార్టీలు మారారని, కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి అక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మళ్లీ ఇప్పుడు టీడీపీలోకి మారుతున్నారని, లిక్కర్ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు తరచుగా పార్టీలు మారుతున్న మాగుంటకు వచ్చీ రాగానే రెడ్ కార్పెట్ పరచడమేంటి అని విమర్శిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న బీసీల కంటే పార్టీలు మారే మాగుంటలే ఎక్కువయ్యారా అని మండిపడుతున్నారు. అడుగడుగునా అవమానాలే.. పార్లమెంట్ అధ్యక్షుడైనప్పటికీ పార్టీ సమావేశాలకు పిలవకుండా, సమావేశాల్లో పాల్గొనకుండా అడుగడుగునా అవమానిస్తోంది. ఒకవైపు బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్లు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తుంటే , మరోవైపు వెనకబడిన తరగతులు మా వెనకాలే నడవాలి, పెత్తనం మాత్రం మా చెప్పు చేతుల్లోనే ఉండాలంటూ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పార్టీలో సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులను ప్రోత్సహిస్తూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను వాడుకొని వదిలేస్తున్నాడన్న విమర్శలు వినవస్తున్నాయి. గత ఆదివారం నగరంలోని ఒక హోటల్లో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంతో కీలకమైన ఈ సమావేశంలో అటు టీడీపీ నాయకులు, ఇటు జనసేన నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటు అధ్యక్షుడైన నూకసానికి పిలుపులేదు. కనీస మర్యాదగా సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. సోమవారం టీడీపీ, జనసేన నాయకులు కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటికెళ్లి కలిశారు. కేవలం బీసీ అయినందునే నూకసానిని అవమానిస్తున్నారని ఆయన వర్గం విమర్శిస్తోంది. జిల్లా పార్లమెంటు అధ్యక్షుడైన నూకసాని భాగ్యనగర్‌లో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దామచర్ల గుంటూరు రోడ్డులో నగర కార్యాలయం పేరుతో సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు జిల్లా కార్యాలయానికి రావలసి ఉంటుంది. కానీ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర నాయకులను వెళ్లకుండా దామచర్ల అడ్డుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై అనేక సార్లు అధినాయకుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా సొంత సామాజికవర్గానికే వత్తాసు పలికారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు సైతం నూకసానిని ఆహ్వానించడం లేదు. ఒకవైపు పార్టీని నమ్ముకున్న బీసీలకు మొండిచేయి ఇస్తూ జయహో బీసీ, బీసీ డిక్లరేషన్ అంటూ నాటకాలాడుతున్నారని బీసీ నాయకులు విమర్శిస్తున్నారు. -
అన్ని స్థానాలూ గెలిపించుకుందాం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల నేతలు నిర్ణయించుకున్నారు. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం వారు ఆత్మియ సమ్మేళనం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జిలు తాటిపర్తి చంద్రశేఖర్, దద్దాల నారాయణలు ఏకతాటిపైకి వచ్చి మళ్లీ అధికారం సాధించే లక్ష్యంతో పనిచేద్దామని ప్రతిన బూనారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేద్దామని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల నిర్వహణ, ప్రచారం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అందరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సమ్మేళనం పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపడంతోపాటు నాయకులంతా ఒక్కటే అనే సంకేతాన్ని ఇవ్వగలిగింది. -
ప్రచారం చేయకుండానే జగ్గయ్య గెలుపు
ఎన్నికలంటేనే ప్రచారం.. హంగూ ఆర్భాటాలు.. కానీ, ఏ ప్రచారం చేయకుండానే సినీ నటుడు కొంగర జగ్గయ్య భారీ మెజార్టీతో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అందరి కంటే ముందు రాజకీయ ప్రవేశం చేసి ఎన్నికల్లో గెలిచిన నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1967లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. సినీ నటుడు కావడంతో పెద్దగా ప్రచారం చేయకపోయినా ఎంపీగా గెలుపొందారు. జగ్గయ్య ప్రత్యర్థులు మాదాల నారాయణస్వామి (సీపీఎం), జాగర్లమూడి లక్ష్మీనారాయణ (సీపీఐ)లు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా గెలవలేకపోయారు. జగ్గయ్య కేవలం నాలుగు బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రెండోసారి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చినా ఆయన పోటీ చేయలేదు. -
రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మార్కాపురం: ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని మార్కాపురం డివిజన్లో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మార్కాపురం రైల్వేస్టేషన్లో డివిజన్లోని రైల్వేస్టేషన్లలో నెలకొన్న సమస్యలపై గుంటూరు డివిజనల్ మేనేజర్ ప్రసాద్‌తో కలిసి శుక్రవారం సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిధిలో పాములపల్లి, సైదాపురం, సంగంపేట రైల్వేగేట్లను ఇటీవల మూసివేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తన దృష్టికి తెచ్చారన్నారు. అలాగే గరీభ్థ్ ్రరైలును గిద్దలూరులో ఆపాలని, మార్కాపురం-తెనాలి ప్యాసింజర్ రైలును గిద్దలూరు వరకు పొడిగించాలని, సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలు ఆలస్యాన్ని తగ్గించాలని, కర్నూలు - నంద్యాల ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను గిద్దలూరు వరకు పొడిగించాలని ఆయన కోరారన్నారు. ఆయా అంశాలపై గుంటూరు డివిజనల్ మేనేజర్‌తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పాములపల్లి గేటును మళ్లీ తెరుస్తారని, సైదాపురం, సంగంపేట గేట్ల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు చూపేందుకు అధికారులు హామీ ఇచ్చారన్నారు. గరీభ్థ్న్రు గిద్దలూరులో నిలిపేందుకు, మార్కాపురం వరకు వస్తున్న తెనాలి ప్యాసింజర్‌ను గిద్దలూరు వరకు పొడిగించేందుకు హామీ ఇచ్చారన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు రైల్వేస్టేషన్లో అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను వారానికి మూడు రోజులే నిలుపుతున్నారని..మిగిలిన రోజుల్లో హౌరా ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌గా వెళ్లే సమయంలో తర్లుపాడులో ఆపాలని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరడంతో ఆ విషయంపై కూడా రైల్వే అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. రైలు ఆపేందుకు అధికారులు హామీ ఇచ్చారన్నారు. మార్కాపురం రైల్వేస్టేషన్లో ప్రయాణికులు నిలిచేందుకు షెడ్‌ను పొడిగించాలని..శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం వీఐపీ లాంజ్, ఇతర సౌకర్యాలు కల్పించాలన్న తమ విజ్ఞప్తిని అధికారులు అంగీకరించారన్నారు. ప్రయాణికులు సామాన్లు భద్రపరచుకునేందుకు క్లాక్ రూమ్ ఏర్పాటు చేయాలన్న ప్రయాణికుల సంఘ విజ్ఞప్తికి డీఆర్ఎం సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారని చెప్పారు.ముంబయి-గుంటూరు వయా గుంతకల్ మీదుగా రైలు కావాలని రైల్వే బోర్డు చైర్మన్‌తో పాటు మంత్రిని అడిగినట్లు తెలిపారు. దొనకొండ-ఒంగోలు రైల్వే మార్గాన్ని నిర్మించాలని తాను కోరినట్లు తెలిపారు. మార్కాపురం రైల్వేస్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో గుంటూరు డివిజన్ డీఆర్ఎం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కేవీ.రమణారెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దామరాజు శ్రీనివాస క్రాంతి కుమార్, మార్కాపురం ఎంపీపీ మాలకొండయ్య, మార్కాపురం, తర్లుపాడు జెడ్పీటీసీలు జె.వి.రంగారెడ్డి, ఆర్.బాషాపతిరెడ్డి, పట్టణ, రూరల్, పెద్దారవీడు అధ్యక్షుడు బట్టగిరి తిరుపతిరెడ్డి, గాయం కొండారెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఆవులమంద పద్మ పాల్గొన్నారు. -
ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి ఘనవిజయం