జగ్గయ్య (పాతచిత్రం)
ఎన్నికలంటేనే ప్రచారం.. హంగూ ఆర్భాటాలు.. కానీ, ఏ ప్రచారం చేయకుండానే సినీ నటుడు కొంగర జగ్గయ్య భారీ మెజార్టీతో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అందరి కంటే ముందు రాజకీయ ప్రవేశం చేసి ఎన్నికల్లో గెలిచిన నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1967లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. సినీ నటుడు కావడంతో పెద్దగా ప్రచారం చేయకపోయినా ఎంపీగా గెలుపొందారు. జగ్గయ్య ప్రత్యర్థులు మాదాల నారాయణస్వామి (సీపీఎం), జాగర్లమూడి లక్ష్మీనారాయణ (సీపీఐ)లు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా గెలవలేకపోయారు. జగ్గయ్య కేవలం నాలుగు బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రెండోసారి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చినా ఆయన పోటీ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment