మార్కాపురం: ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని మార్కాపురం డివిజన్‌లో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మార్కాపురం రైల్వేస్టేషన్‌లో డివిజన్‌లోని రైల్వేస్టేషన్లలో నెలకొన్న సమస్యలపై గుంటూరు డివిజనల్ మేనేజర్ ప్రసాద్‌తో కలిసి శుక్రవారం సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిధిలో పాములపల్లి, సైదాపురం, సంగంపేట రైల్వేగేట్లను ఇటీవల మూసివేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తన దృష్టికి తెచ్చారన్నారు.
అలాగే గరీభ్థ్ ్రరైలును గిద్దలూరులో ఆపాలని, మార్కాపురం-తెనాలి ప్యాసింజర్ రైలును గిద్దలూరు వరకు పొడిగించాలని, సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలు ఆలస్యాన్ని తగ్గించాలని, కర్నూలు - నంద్యాల ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను గిద్దలూరు వరకు పొడిగించాలని ఆయన కోరారన్నారు. ఆయా అంశాలపై గుంటూరు డివిజనల్ మేనేజర్‌తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పాములపల్లి గేటును మళ్లీ తెరుస్తారని, సైదాపురం, సంగంపేట గేట్ల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు చూపేందుకు అధికారులు హామీ ఇచ్చారన్నారు. గరీభ్థ్‌న్రు గిద్దలూరులో నిలిపేందుకు, మార్కాపురం వరకు వస్తున్న తెనాలి ప్యాసింజర్‌ను గిద్దలూరు వరకు పొడిగించేందుకు హామీ ఇచ్చారన్నారు.
మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు రైల్వేస్టేషన్‌లో అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను వారానికి మూడు రోజులే నిలుపుతున్నారని..మిగిలిన రోజుల్లో హౌరా ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌గా వెళ్లే సమయంలో తర్లుపాడులో ఆపాలని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరడంతో ఆ విషయంపై కూడా రైల్వే అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. రైలు ఆపేందుకు అధికారులు హామీ ఇచ్చారన్నారు. మార్కాపురం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు నిలిచేందుకు షెడ్‌ను పొడిగించాలని..శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం వీఐపీ లాంజ్, ఇతర సౌకర్యాలు కల్పించాలన్న తమ విజ్ఞప్తిని అధికారులు అంగీకరించారన్నారు.
ప్రయాణికులు సామాన్లు భద్రపరచుకునేందుకు క్లాక్ రూమ్ ఏర్పాటు చేయాలన్న ప్రయాణికుల సంఘ విజ్ఞప్తికి డీఆర్‌ఎం సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారని చెప్పారు.ముంబయి-గుంటూరు వయా గుంతకల్ మీదుగా రైలు కావాలని రైల్వే బోర్డు చైర్మన్‌తో పాటు మంత్రిని అడిగినట్లు తెలిపారు. దొనకొండ-ఒంగోలు రైల్వే మార్గాన్ని నిర్మించాలని తాను కోరినట్లు తెలిపారు. మార్కాపురం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
విలేకరుల సమావేశంలో గుంటూరు డివిజన్ డీఆర్‌ఎం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కేవీ.రమణారెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దామరాజు శ్రీనివాస క్రాంతి కుమార్, మార్కాపురం ఎంపీపీ మాలకొండయ్య, మార్కాపురం, తర్లుపాడు జెడ్పీటీసీలు జె.వి.రంగారెడ్డి, ఆర్.బాషాపతిరెడ్డి, పట్టణ, రూరల్, పెద్దారవీడు అధ్యక్షుడు బట్టగిరి తిరుపతిరెడ్డి, గాయం కొండారెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఆవులమంద పద్మ పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
Published Sat, Dec 27 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement