Development of railway stations
-
కుటుంబ పాలన.. ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో భారత్ యావత్తూ ముందుకొస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలోని ఓ వర్గం తాము పనిచెయ్యం, ఇతరులను పనిచెయ్యనివ్వబోమన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి అని వాపోయారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన పార్లమెంట్ భవనం నిర్మించామని, ప్రజాస్వామ్యానికి అదొక చిహ్నమని, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అది ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. అలాంటి పార్లమెంట్‌ను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అందులోకి అడుగుపెట్టేందుకు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేయడాన్ని కూడా వ్యతిరేకించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పారీ్టలు కేవలం ఎన్నికల సమయంలోనే సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను స్మరిస్తాయని, తాము గుజరాత్లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గత 70 ఏళ్లలో మన అమర జవాన్ల కోసం కనీసం యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించలేదని కాంగ్రెస్ పారీ్టపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాము నిర్మిస్తే నిస్సిగ్గుగా బహిరంగంగా విమర్శలు చేశాయని దుయ్యబట్టారు. దేశ ప్రగతికి రెక్కలు తొడుగుతున్న యువత ప్రతికూల రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలను, పార్టీ రాజకీయాలను లెక్కచేయకుండా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రస్తుతం రోజ్‌గార్ మేళా కొనసాగుతోందన్నారు. దేశంలో మార్పు మొదలైందని, దేశ అభివృద్ధితో యువతకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మన యువత కొత్త రెక్కలు తొడుగుతున్నారని ప్రశంసించారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఈ నెల 9న జరిగే ‘క్విట్ ఇండియా’ వార్షికోత్సవాన్ని మోదీ ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక దినం అని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇచి్చన రోజు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశమంతా క్విట్ ఇండియా అంటూ బిగ్గరగా నినదిస్తోందని వివరించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు వంటివి దేశం వదిలి వెళ్లిపోవాలని ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది లాగే ఈసారి కూడా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సదుపాయాలు పెరగడం, జీవనం సులభతరం కావడంతో దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య మరింత పెరిగిందని వివరించారు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినవారి సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందన్నారు. ‘అమృత్‌భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ది కోసం మోదీ శంకుస్థాపన చేయగా, వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 55, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
పర్యాటకాభివృద్ధికి రైల్వేస్టేషన్ల రీ డెవలప్మెంట్
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి రైల్వేస్టేషన్ల రీ డెవలప్మెంట్ దోహదపడనుంది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. రైల్వేస్టేషన్ల రీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కింద ఏపీలో తిరుపతి, నెల్లూరు స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ రెండింటిని రూ.660 కోట్లు వెచ్చించి మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే గుంతకల్ స్టేషన్‌ను రూ.25 కోట్లతో రైల్వే అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మాదిరిగా ఫ్రంట్ వ్యూను అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. తిరుపతి, నెల్లూరు స్టేషన్ల రీ డెవలప్మెంట్ కోసం రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) గతేడాది టెండర్లను ఆహ్వానించింది. అర్హత గల కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేశామని ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇప్పటికే నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పించేందుకు ప్రీ బిడ్ సమావేశాలను పూర్తి చేశారు. వీటిలో జీఎంఆర్, ఒబెరాయ్, ఆంబియెన్స్, ఆదానీ గ్రూప్, గోద్రేజ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, తదితర నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసి 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. రైల్వేస్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో షాపింగ్, సినిమా హాళ్లు, హాస్పిటాలిటీ, ఫుడ్ కోర్టులు, క్లోక్ రూంలు, వసతి గృహాలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు వంటివాటిని అంతర్జాతీయ స్థాయిలో నిరి్మస్తారు. అలాగే ఫ్రెండ్లీ యాక్సెస్ ర్యాంప్‌లు, ఎలివేటర్లు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. పీపీపీ విధానంలో అభివృద్ధి తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.530 కోట్లతో, నెల్లూరు స్టేషన్‌ను రూ.130 కోట్లతో రీ డెవలప్మెంట్ చేయనున్నారు. టెండర్లు ఖరారయ్యాక మూడేళ్లలోపు రీ డెవలప్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు స్టేషన్లను పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద అభివృద్ధి చేస్తారు. ఈ ఏడాది బడెŠట్ట్లో తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.5 కోట్లను కేటాయించారు. ఇక విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సాంకేతిక–ఆర్థిక సాధ్యాసాధ్య అధ్యయనం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా పీపీపీ విధానంలోనే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. -
రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మార్కాపురం: ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని మార్కాపురం డివిజన్లో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మార్కాపురం రైల్వేస్టేషన్లో డివిజన్లోని రైల్వేస్టేషన్లలో నెలకొన్న సమస్యలపై గుంటూరు డివిజనల్ మేనేజర్ ప్రసాద్‌తో కలిసి శుక్రవారం సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిధిలో పాములపల్లి, సైదాపురం, సంగంపేట రైల్వేగేట్లను ఇటీవల మూసివేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తన దృష్టికి తెచ్చారన్నారు. అలాగే గరీభ్థ్ ్రరైలును గిద్దలూరులో ఆపాలని, మార్కాపురం-తెనాలి ప్యాసింజర్ రైలును గిద్దలూరు వరకు పొడిగించాలని, సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలు ఆలస్యాన్ని తగ్గించాలని, కర్నూలు - నంద్యాల ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను గిద్దలూరు వరకు పొడిగించాలని ఆయన కోరారన్నారు. ఆయా అంశాలపై గుంటూరు డివిజనల్ మేనేజర్‌తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పాములపల్లి గేటును మళ్లీ తెరుస్తారని, సైదాపురం, సంగంపేట గేట్ల వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు చూపేందుకు అధికారులు హామీ ఇచ్చారన్నారు. గరీభ్థ్న్రు గిద్దలూరులో నిలిపేందుకు, మార్కాపురం వరకు వస్తున్న తెనాలి ప్యాసింజర్‌ను గిద్దలూరు వరకు పొడిగించేందుకు హామీ ఇచ్చారన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు రైల్వేస్టేషన్లో అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను వారానికి మూడు రోజులే నిలుపుతున్నారని..మిగిలిన రోజుల్లో హౌరా ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌గా వెళ్లే సమయంలో తర్లుపాడులో ఆపాలని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరడంతో ఆ విషయంపై కూడా రైల్వే అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. రైలు ఆపేందుకు అధికారులు హామీ ఇచ్చారన్నారు. మార్కాపురం రైల్వేస్టేషన్లో ప్రయాణికులు నిలిచేందుకు షెడ్‌ను పొడిగించాలని..శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం వీఐపీ లాంజ్, ఇతర సౌకర్యాలు కల్పించాలన్న తమ విజ్ఞప్తిని అధికారులు అంగీకరించారన్నారు. ప్రయాణికులు సామాన్లు భద్రపరచుకునేందుకు క్లాక్ రూమ్ ఏర్పాటు చేయాలన్న ప్రయాణికుల సంఘ విజ్ఞప్తికి డీఆర్ఎం సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారని చెప్పారు.ముంబయి-గుంటూరు వయా గుంతకల్ మీదుగా రైలు కావాలని రైల్వే బోర్డు చైర్మన్‌తో పాటు మంత్రిని అడిగినట్లు తెలిపారు. దొనకొండ-ఒంగోలు రైల్వే మార్గాన్ని నిర్మించాలని తాను కోరినట్లు తెలిపారు. మార్కాపురం రైల్వేస్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో గుంటూరు డివిజన్ డీఆర్ఎం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కేవీ.రమణారెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దామరాజు శ్రీనివాస క్రాంతి కుమార్, మార్కాపురం ఎంపీపీ మాలకొండయ్య, మార్కాపురం, తర్లుపాడు జెడ్పీటీసీలు జె.వి.రంగారెడ్డి, ఆర్.బాషాపతిరెడ్డి, పట్టణ, రూరల్, పెద్దారవీడు అధ్యక్షుడు బట్టగిరి తిరుపతిరెడ్డి, గాయం కొండారెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఆవులమంద పద్మ పాల్గొన్నారు.