
సాక్షి, హైదరాబాద్: ఈనెల 26వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్న హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల కోసం కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీ లను నియమించింది. యాత్రలను క్షేత్రస్థాయి నుంచి సమన్వయం చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులకు బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుమతి మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.