Deepa
-
గుండె గొంతుక లోన క్రియేటివిటీ
గు... డ్మా... ర్నిం... గ్ అంటూ... కనపడకుండా వినిపించే వారి గొంతులోని హుషారు మన మదిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా పరుగులు పెడుతుందా అనిపిస్తుంది. వారు నోరారా పలకరిస్తుంటే క్షణాలలో ఆత్మీయ నేస్తాలైపోతారు. గలగలా మాట్లాడేస్తూ మనలో ఒకరిగా చేరిపోతారు. ‘ప్రతిరోజూ మా వాయిస్‌ని కొత్తగా వినిపించాల్సిందే, అందుకు కొత్త కొత్త కాన్సెప్ట్‌తో మమ్మల్ని మేం సిద్ధం చేసుకోవాల్సిందే...’ అని చెబుతున్నారు రేడియో ఎఫ్.ఎమ్.లతో తమ గళంతో రాణిస్తున్న మహిళా రేడియో జాకీలు... వారితో మాటా మంతీ...– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిక్రియేటివిటీ అనుకున్నంత సులువు కాదునచ్చిన సినిమా పాటలు (Movie Songs) ఇంట్లో పాడుకుంటూ ఉండే నా గొంతు విని మాకు తెలిసినవారు రేడియోలో ట్రై చేయచ్చు కదా! అన్నారు. అంతే, ఆడిషన్స్‌కు వెళ్లి ఆఫర్ తెచ్చుకున్నాను. అయితే, అది అనుకున్నంత సులువు కాదు. ఇది చాలా క్రియేటివ్ ఫీల్డ్. చాలామందితో డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్‌గా ఉండాలి. ఏ రంగంలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉంటాయి. కానీ, వాటిని మోసుకుంటూ వెళితే నిరూపించుకోలేం. ఒక వైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు రేడియో జాకీగా మార్నింగ్ షో (Morning Show) చేస్తుంటాను. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతూనే నటిగానూ పన్నెండు తెలుగు సినిమాల్లోనూ నటించాను. ఎక్కడ నా క్రియేటివిటీని చూపించగలనో అక్కడ నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, నన్ను నేను మలుచుకుంటూ నా శ్రోతలను అలరిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా థియేటర్ ఆర్టిస్ట్‌గానూ వేదికల మీద ప్రదర్శనలలో పాల్గొంటున్నాను. ఏ వర్క్ చేసినా నా సోల్ రేడియోలో ఉంటుంది. అందుకని, ఎన్ని పనులు ఉన్నా రేడియో లైఫ్‌ను వదలకుండా నా క్రియేటివిటీకి పదును పెడుతుంటాను. – ఆర్జె ప్రవళిక చుక్కల, ఆకాశవాణినవరసాలు గొంతులో పలికించాలిరేడియో (Radio) అనగానే క్యాజువల్‌గా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. కానీ, ఇందులో సృజనాత్మకత, ఉచ్చారణ, భావ ప్రకటనతో పాటు నవరసాలు పలికించాలి. కొన్ని సందర్భాలలో ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, ఎక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ ప్రభావం వర్క్‌పై పడకూడదు. నా గొంతు వేల మంది వింటున్నారు అనే ఆలోచనతో అలెర్ట్‌గా ఉండాలి. హైదరాబాద్ బి కేంద్రంలో యువవాణి ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు పద్దెనిమిదేళ్లుగా ఆకాశవాణిలో పని చేస్తున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమాతారలు, సాహిత్యకారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు... ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరించాను. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందిరినీ నా వాయిస్‌తో అలంరించాను అని గర్వంగా ఉంది. ఆర్మీడే, ప్రధానమంత్రి యోజన పథకాలు, బ్యాంకు, వైద్యం, సమాజంలో బర్నింగ్ ఇష్యూస్... లాంటి వాటిని లైవ్ కవరేజ్లుగా ఇచ్చాను. బెస్ట్ ఆర్.జె. అవార్డులూ అందుకున్నాను. రేడియో అంటే గలగల మాట్లాడటమే కాదు సాంకేతిక సామర్థ్యంతో పాటు అన్ని స్థాయుల వారిని కలుపుకుంటూ పనిచేయాలి. – ఆర్జె దీప నిదాన కవి, ఆల్ ఇండియా రేడియోనన్ను నేను మార్చుకున్నానుఈ రంగంలోకి రాకముందు ఎప్పుడూ రేడియో వినలేదు. ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలిసి, ట్రై చేద్దామని వెళ్లాను. పదకొండేళ్లుగా రేడియోకి అంకితమైపోయాను. గుడ్ ఈవెనింగ్ ట్విన్సిటీస్ అని రెయిన్బోలో వర్క్ చేశాను. ఇప్పుడు వివిధ భారతిలో సాయంకాలం 5 గంటల నుంచి షో చేస్తున్నాను. సినిమా, వైరల్ న్యూస్, ట్రాఫిక్ అప్డేట్స్, యూత్ ట్రెండ్స్, గాసిపింగ్, కరెంట్ టాపిక్స్ .. ఇలా అన్నింటి గురించి చెబుతుంటాను. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎదుటివారిని మెప్పించేలా నన్ను నేను ఎలా మార్చుకోవాలనే విషయాలు రేడియోకి వచ్చాకే తెలుసుకున్నాను. ఏ చిన్న విషయమైనా తక్కువ సమయంలో క్రియేటివ్‌గా, ఆసక్తికరంగా అనిపించేలా చెప్పగలగడం రేడియో ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. – ఆర్జె కృష్ణ కీర్తి, వివిధభారతిఉన్నతంగా తీర్చిదిద్దిందిప్రసారభారతిలో పద్దెనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. రేడియో జాకీలు అనగానే నోటికివచ్చిందేదో వాగేస్తుంటారు అనుకుంటారు. కానీ, మేం ప్రతిరోజూ కొత్తదనంతో శ్రోతలకు పరిచయం అవుతాం. కంటెంట్‌ను సొంతంగా తయారు చేసుకోవడం, సృజనాత్మకతను జోడించడం, గొంతుతోనే కళ్లకు కట్టినట్టుగా వివరించడాన్ని ఓ యజ్ఞంలా చేస్తుంటాం. స్టూడియోలో కూర్చొనే కాకుండా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇలా 52 వివిధ రకాల స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశాను. సినిమా కథ పేరుతో తెరవెనుక జరిగే ప్రతి కష్టాన్నీ వినిపించాను. రేడియో నన్ను ఉన్నతంగా మార్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని చేసింది. యాంకర్‌గా వేదికలపైనా, వివిధ కార్యక్రమాలను చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన రేడియో నాకు దేవాలయంలాంటిది. – ఆర్జె స్వాతి బొలిశెట్టి, ఆల్ ఇండియా రేడియోప్రతిరోజూ హుషారే! నాకు నచ్చిన పనిని డబ్బులు ఇచ్చి మరీ చేయమంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందంతోనే పదేళ్లుగా రేడియో మిర్చిలో ఆర్.జె.గా చేస్తున్నాను. రోజూ చూసేవీ, వినేవీ.. నా ఫ్రెండ్స్‌కి ఎలాగైతే చెబుతానో... శ్రోతలతో కూడా అలాగే మాట్లాడుతుంటాను. కొన్నాళ్ల వరకు నా మాటలను మాత్రమే విన్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాను కూడా. ఆర్జె అంటే మాట్లాడటం ఒకటేనా.. నవ్వించడానికి ఏం చేయచ్చు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రియేటివిటీ ఉన్నవారే ఈ రంగంలో ఉండగలరు. ఎంత హ్యాపీగా మాట్లాడినా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు పడుతుంటాయి.అలాంటప్పుడు ఆ విషయాన్ని కూడా శ్రోతలతో పంచుకుంటాను. ‘ఈ రోజు అస్సలు బాగోలేదు, ఇంట్లో డిష్యూ డిష్యూం.. కానీ ఏం చేస్తాం, ముందుగా ఓ రెండుపాటలు వినేసి లైట్ తీసుకుందాం...’ ఇలా రోజువారి అంశాలకు హ్యాపీనెస్‌ను జతచేసి శ్రోతలకు ఇవ్వడానికి తపిస్తూనే ఉంటాను. నవరాత్రుల టైమ్‌లో తొమ్మిది మంది విభిన్నరంగాలలో విజయాలు సాధించిన మహిళలతో షో చేశాను. శ్రోతల్లో కొందరిని స్టూడియోకి పిలిచి, ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చేత మాట్లాడించాం. ఆర్జె స్వాతి...తో... అని షోలో మొదలుపెట్టే మాటలు, మిర్చి శకుంతల డ్రామా.. చాలా పేరు తెచ్చాయి. కళ్లతో చూసినదాన్ని గొంతులో పలికిస్తా. అదే అందరినీ కనెక్ట్ చేస్తుంది. – ఆర్జె స్వాతి, రేడియో మిర్చిరేడియోతో ప్రేమలో పడిపోయా! ‘సిరివెన్నెల’ నైట్ షోతో నా రేడియో జర్నీప్రారంభించాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ షోస్ అన్నీ చేస్తూ వచ్చాను. పదిహేనేళ్లుగా నేర్చుకుంటూ, పని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను. ముఖ్యమైన రోజుల్లో ప్రముఖులతో మాట్లాడుతూ షో చేస్తుంటాం. మారుతున్న ప్రేమల గురించి చర్చిస్తుంటాను. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అది రేడియో. ఒక వ్యక్తి గొంతు మాత్రమే విని, అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. ఒకమ్మాయి కొన్నేళ్లుగా నా షోస్ వింటూ ఉంది. కుటుంబపరిస్థితుల కారణంగా చనిపోవాలనుకున్న ఆ అమ్మాయి, నాతో చివరిసారిగా మాట్లాడుదామని ఫోన్ చేసింది. షో మధ్యలో ఆపేసి, ఆమెతో మాట్లాడి, ఇచ్చిన భరోసాతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయాను. రేడియో సిటీలో నా జీవితాన్ని మలుపుతిప్పిన ఇలాంటి సంఘటనలు ఎన్నో. – ఆర్జె సునీత, రేడియో సిటీచదవండి: ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?క్రమశిక్షణ నేర్పించిందిచిన్నప్పుడు రేడియో వింటూ మా అమ్మను ‘ఆ రేడియోలోకి ఎలా వెళ్లాలమ్మా!’ అని అడిగేదాన్ని. కానీ, నిజంగానే రేడియో స్టేషన్‌కి వెళ్లడం, అక్కడ నుంచి నా వాయిస్‌ను శ్రోతలకు వినిపించేలా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. రేడియో స్టేషన్లో అడుగుపెడుతూనే బయట ప్రపంచాన్ని మరచిపోతాను. అంతగా నన్ను ఆకట్టుకుంది రేడియో. ఎఐఆర్ పరి«ధులను దాటకుండా మేం పనిచేయాల్సి ఉంటుంది. కరోనా టైమ్‌లో అయితే ఎక్కువ షోస్ చేసేవాళ్లం. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, భరోసా ఇవ్వడానికి భయాలను పక్కనపెట్టేశాం. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, మల్టీటాలెంట్ ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం.. ఇలాంటివెన్నో రేడియో ద్వారానే సాధ్యమయ్యాయి. కాన్సెప్ట్ రాసుకోవడం, తడబాటు లేకుండా మాట్లాడటం, టైమ్ ప్రకారం షోలో పాల్గొనడం.. ఒక క్రమశిక్షణను నేర్పించింది రేడియో. – ఆర్జె లక్ష్మీ పెండ్యాల, ఆల్ ఇండియా రేడియో -
తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!
కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారింది వాయనాడ్. కొండచరియలు వాయనాడ్ని తుడిచిపెట్టేశాయి. ఈ ఘటనలో మొత్తం 295 మంది మృతి చెందారు. వాయనాడ్ విషాదం ఎందరినో కదిలించింది. ప్రముఖులు, సెలబ్రెటీలు తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. అయితే ఈ ఘటనలో ఎన్నో కన్నీటి కథలు, వ్యథలు ఉన్నాయి. ఈ విషాద ఘటనలో ఒక మహిళ తమ వ్యక్తిగత బాధను పక్కన పెట్టి మరీ ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చి అందరిచేత ప్రశంసలందుకుంది. ఆమెనే దీపా జోసెఫ్. ఎవరంటే ఆమె..!కేరళలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ దీపా జోసెఫ్. దారుణ వినాశనాన్ని చవిచూసిన వాయనాడ్‌లో తన అంబులెన్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బాధితులు రక్షించి నిస్వార్థంగా సహాయ సహకారాలు అందించింది. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి తన వంతుగా సాయం అందించి ఆయా మృతదేహాలను వారికి చేరవేసింది. ఆ ఘటనలో బాధితుల మృతదేహాలను అందజేసేటప్పుడూ కొన్ని దృశ్యాలు మెలితిప్పేసేవని చెబుతోంది దీపా. ఒక్కోసారి తనకు కూడ కన్నీళ్లు ఆగేవి కావని చెబుతోంది. ఎవరంటే ఆమె..?కరోనా మహమ్మారి సమయంలో దీపా జోసెఫ్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబ జీవనాధారం కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించింది. కేరళలో ఈ వృత్తిలో పనిచేస్తున్న తొలి మహిళ దీపానే కావడం విశేషం. సవాళ్లతో కూడిన ఈ వృత్తిలో చాలా ధైర్యంగా సాగిపోయింది దీపా. అయితే వ్యక్తిగత విషాదం కారణంగా తన వృత్తి నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. తన కన్న కూతురు బ్లడ్ కేన్సర్‌తో చనిపోవడంతో డిప్రెషన్‌కి వెళ్లిపోయింది దీపా. దీంతో విధులకు గత కొద్ది రోజులుగా దూరంగానే ఉండిపోయింది.వాయునాడ్ దుర్ఘటన గురించి విని మళ్లీ విధుల్లోకి వచ్చి బాధితులకు తన వంతుగా సాయం అందించింది. తన బాధను దిగమింగి ప్రజలకు నిస్వార్థంగా సాయం అందించింది. నిరంతరం రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ..సహాయ సహకారాలు అందించి అందరిచేత ప్రశంసలందుకుంది దీపా. కాగా, ఆమె నాటి విషాద దృశ్యాలను గుర్తు చేసుకుంటూ..బాగా కుళ్లిపోయిన మృతదేహాలను కూడా తరలించినట్లు తెలిపింది. కొన్ని ఘటనల్లో అయితే తెగిపోయిన అవయవాల ఆధారంగా తమ వాళ్లను గుర్తించాల్సిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది దీపా. ఈ అనుభవాలను తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, అదే తన బాధను పక్కన పెట్టి సాయం చేయాలనే దిశగా పురిగొల్పిందని అంటోంది దీపా. ప్రస్తుతం తానింకా విధుల్లోకి వెళ్లడం లేదు కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్‌డ్రైవర్‌గా పనిచేస్తానని తెలిపింది. నిజంగా గ్రేట్ జీవనాధారం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వ్యక్తిగత విషాదంతో పనికి దూరమయ్యింది. కానీ ఆ బాధను కూడా పక్కనపెట్టి వాయనాడ్ విషాదంలోని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం అనేది నిజంగా ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం కూడా.(చదవండి: గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్‌కి భారీ విందు..!) -
Dipa Khosla: ఇన్ఫ్లూయెన్సర్తో మొదలై.. మల్టీపుల్ బ్రాండ్ డీల్స్ స్థాయికి
గ్లోబల్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది దీప ఖోస్లా. వక్తగా ప్రసిద్ధ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ముచ్చటగా మూడోసారి ఆహ్వానం అందుకొని చరిత్ర సృష్టించింది. ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్ప్రెన్యూర్, ఫిలాంత్రపిస్ట్‌గా గుర్తింపు పొందిన దీప ఖోస్లా గెలుపు మంత్రం... ఆత్మవిశ్వాసం. లా స్టూడెంట్ నుంచి కంటెంట్ క్రియేటర్‌గా, ఆ తరువాత ఎంటర్ ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది దీప ఖోస్లా. ఇన్స్టాగ్రామ్ కొత్తగా పరిచయం అవుతున్న కాలం అది. ‘ఇన్ఫ్లూయెన్సర్ అంటే?’ అని ప్రశ్న దగ్గరి నుంచి మొదలైన ఆమె ప్రయాణం మల్టీపుల్ బ్రాండ్ డీల్స్‌తో సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేరింది. ఆమ్స్టర్ డామ్‌లోని సోషల్ మీడియా ఏజెన్సీలో ఇంటర్న్‌షిప్ చేసిన ఫన్ట్ ఇండియన్ డిజిటల్ క్రియేటర్‌గా ప్రత్యేకత సాధించింది. ఆ తరువాత ‘ఇండి వైల్డ్’ (స్కిన్ కేర్ అండ్ బ్యూటీ బ్రాండ్) రూపంలో ఎంటర్ప్రెన్యూర్ గా కూడా అద్భుత విజయం సాధించింది. ఆమె ప్రతి విజయంలో తల్లి సంగీత ఖోస్లా ప్రోత్సాహం ఉంది. ఆమె ఇచ్చిన అపారమైన ధైర్యం ఉంది. ‘ఇండి వైల్డ్’ హెయిర్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. తన తల్లి ఫార్ములా ఆధారంగానే ఈ హెయిర్ ఆయిల్‌ను తయారు చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడానికి కావాల్సింది? ఆత్మవిశ్వాసం. మరి ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అనే ప్రశ్నకు దీప చెప్పే జవాబు ఇది.. ‘ధైర్యంగా ప్రశ్నలు అడగడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. వ్యాపారరంగంలోకి అడుగు పెట్టినప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. అయితే ‘ఓటమి’ అనే భయం నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగేలా, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేలా చేసింది’ భర్తతో కలిసి ‘పోస్ట్ ఫర్ చేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది దీప. ‘దిల్లీలో పుట్టి పెరిగాను. ఊటీ స్కూల్, యూరప్ యూనివర్శిటీలలో చదువుకున్నాను. ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్ యూనివర్శిటీ సమావేశంలో ప్రసంగించడం నా అదృష్టంగా భావిస్తాను. నేను సాధించిన విజయాలే నన్ను అక్కడివరకు తీసుకువెళ్లాయి. విజయం అంటే కొందరికే పరిమితమైనది కాదు. నాలాగే ఎవరైనా విజయం సాధించవచ్చు’ అంటుంది దీప ఖోస్లా. దీప నిరంతరం స్మరించే మంత్రం... ఆత్మవిశ్వాసం మొటిమలతో ఇబ్బంది పడుతూ నలుగురి లో కలవడానికి ఇష్టపడని స్థితి నుంచి బయటకు తీసుకువచ్చి‘స్టార్ ఇన్ఫ్లుయెన్సర్’ను చేసింది ఆ ఆత్మవిశ్వాసమే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వాక్ చేసిన తొలి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చింది, నలుగురిలో మాట్లాడడానికి భయపడే స్థితి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామన్’లో ప్రసంగించే స్థాయికి తీసుకువెళ్లింది ఆ ఆత్మవిశ్వాసమే. తాజాగా... హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సమావేశంలో దీప ఖోస్లాపై రూపొందించిన స్ఫూర్తిదాయకమైన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. 2022లో ‘డైవర్శిటీ ఇన్ ది బ్యూటీ ఇండస్ట్రీ’ అంశంపై మాట్లాడడానికి హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి దీపకు ఆహ్వానం అందించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సమావేశంలో ప్రసంగించిన ఫస్ట్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా చరిత్ర సృష్టించింది దీప ఖోస్లా. పర్సనల్ ఐకాన్.. దీప ఖోస్లాకు తల్లి సంగీత ఖోస్లా పర్సనల్ ఐకాన్. కొండంత అండ. ‘నా వెనుక మా అమ్మ ఉంది’ అనే ధైర్యం దీపను ముందుకు నడిపించింది. తల్లి సంగీత ఖోస్లా ఫార్ములా ఆధారంగానే తమ బ్యూటీ బ్రాండ్‌కు సంబంధించిన ‘హెయిర్ ఆయిల్’ను తయారు చేశారు. సహజ పద్ధతుల్లో ఆరోగ్యంగా ఉండడం, అందంగా కనిపించడం అనేది సంగీత ఖోస్లా ఫిలాససీ. అమ్మ బ్యూటీ ఫిలాసఫీని అనుసరిస్తూ సహజమైన పద్ధతులలో అందంగా కనిపించే టెక్నిక్స్‌ను ఫాలో అవుతుంటుంది దీప ఖోస్లా. ఇవి చదవండి: Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్ -
ప్రేమ పెళ్లి.. రూ.10 లక్షల కట్నం.. అదనపు కట్నం కోసం అత్తింట్లో పోరు
జగిత్యాల: కులం వేరైనా నచ్చిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితానికి కూతురు కూడా పుట్టింది. కూతురు కాపురం సజావుగా సాగుతుందని భావించి ఆ యువతి తల్లిదండ్రులు రూ.10లక్షల కట్నం ముట్టజెప్పారు. ఇంతలోనే ఆమెకు అదనపు కట్నం వేధింపులు ప్రారంభమయ్యాయి. భర్తతోపాటు అత్తామామలు పోరుపెడుతున్నారు. వాటిని తాళలేక ఆ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కథలాపూర్ మండలం దూలూర్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణానికి చెందిన యాగండ్ల దీప అలియాస్ పిల్లి దీప, దూలూర్ గ్రామానికి చెందిన యాగండ్ల ప్రదీప్ నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు అన్యోన్యంగా ఉండడంతోపాటు కూతురు (3) కూడా జన్మించడంతో దీప తల్లిదండ్రులు కొద్దిరోజుల క్రితం రూ.10 లక్షలు ముట్టజెప్పారు. ఈ క్రమంలో ప్రదీప్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. ఆయన వెళ్లినప్పటి నుంచి అత్తమామలు దీపను అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారు. ఇదే విషయాన్ని భర్త ప్రదీప్‌కు చెబితే అతడు కూడా ఫోన్లో వేధించడం ప్రారంభించాడు. అటు కట్టుకున్న భర్త.. ఇటు అత్తామామలు వేధిస్తుండడంతో తట్టుకోలేని దీప మంగళవారం అర్ధరాత్రి తర్వాత తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలాన్ని మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నికోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీపను ఆమె భర్తతోపాటు అత్తమామలు అదనపు కట్నంకోసం వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పిల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంట కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్, కథలాపూర్ ఎస్సై కిరణ్‌కుమార్ ఉన్నారు. తల్లి చనిపోవడం.. తండ్రి గల్ఫ్‌లో ఉండడంతో దీప కూతురు అనాథగా మారింది. -
చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ!.. దత్తపుత్రుడి వల్లే గొడవలచ్చాయని..
దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ – మేన కోడలు దీప జయకుమార్ మధ్య వివాదం ముదిరింది. చిన్నమ్మ శశికళను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలతో జయలలిత మేన కోడలు దీప శనివారం ఓ ఆడియోను విడుదల చేశారు. దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం విషయంలోనే.. తన మేనత్త జయలలిత కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు. శశికళ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణించిన తరువాత ఆస్తికి వారసులుగా ఆమె అన్న కుమార్తె దీప, కొడుకు దీపక్ తెరపైకి వచ్చారు. కోర్టు సైతం వీరినే జయ వారసులుగా ధ్రువీకరించింది. అదే సమయంలో దీప ఓ రాజకీయ పార్టీ స్థాపించి ముందుకు సాగినా, చివరికి వెనక్కి తగ్గింది. అదే సమయంలో జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా దీప తరచూ వ్యాఖ్యల చేసేవారు. తాజాగా శశికళను ఢీకొట్టే విధంగా పలు ఆరోప ణాలు గుప్పిస్తూ.. ఓ ఆడియోను బుజ్జమ్మ దీప విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా వివాదానికి నేపథ్యం ఇదేనా..? జయలలిత మృతి నేపథ్యంలో నెలకొన్న వివాదాన్ని విచారించిన ఆర్ముగ స్వామి కమిషన్‌కు శశికళ లిఖిత పూర్వకంగా సమర్పించిన వాంగ్మూలంలోని కొన్ని అంశాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇందులో దీప కుటుంబం, ఆమె తల్లి విజయలక్ష్మి గురించి శశికళ తీవ్ర వ్యాఖ్యలు చేసిందనే వార్తలొచ్చాయి. దీనిపై దీప తీవ్రంగా మండిపడుతూ ఆడియోను విడుదల చేయడం విశేషం. అనుమానాలెన్నో.. ఇప్పుడున్న మర్యాదను చెడ గొట్టుకోవద్దని, ఏ తప్పు చేయనప్పుడు, నిరూపించుకునేందుకు సిద్ధమా..? అని శశికళకు దీప సవాల్ విసిరారు. సుధాకరన్ పెళ్లి తర్వాత తన తండ్రి జయకుమార్ మరణించారని, ఏ కారణంతో ఈ మరణం సంభవించిందో.. నేటికీ వెల్లడి కాలేదన్నారు. తమపై కక్ష సాధింపులో భాగంగానే లేనిపోని చాడీలను మేనత్త వద్ద శశికళ నూరి పోసిందని మండిపడ్డారు. అందుకే శశికళపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని తాను డిమాండ్ చేస్తూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. తొలుత తన సోదరుడు దీపక్‌ను బలవంతంగా తన గుప్పెట్లోకి శశికళ లాక్కుందని ఆరోపించారు. శశికళకు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మేనత్త జయలలిత మరణం సందర్భంగా శశికళ వ్యవహరించిన తీరు, తమ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించాయని వెల్లడించారు. ఏ తప్పు చేయలేదని చెబుతున్న శశికళ, మేనత్తను చూసేందుకు తమకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని, సీసీ కెమెరాలన్నీ ఎందుకు ఆపేయించారని ప్రశ్నించారు. వారి స్వలాభం, ఆదాయం కోసం తన మేనత్త జయలలితను తప్పుదారి పట్టించి వాడుకున్నారని ఆరోపించారు. నిజాలు, రహస్యాలను మరెన్నో రోజులు దాచి పెట్ట లేరని, త్వరలో అన్ని బయటకు వచ్చి తీరుతాయని స్పష్టం చేశారు. ఆడియో రూపంలో.. వాస్తవాలను స్పష్టంగా తెలియజేస్తే.. తన మేనత్త జయలలిత మృతిపై అనుమానం అనే ప్రశ్నే వచ్చి ఉండేది కాదని ఆడియోలో దీప పేర్కొన్నారు. తన తల్లి విజయలక్ష్మి గురించి మాట్లాడేందుకు మూడో వ్యక్తిగా ఉన్న శశికళకు ఏం అర్హత ఉందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావును కలిసి అప్పట్లో తన తల్లి విజయలక్ష్మి మేనత్త జయలలితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు శశికళ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవానికి తన మేనత్తకు శశికళ రూపంలోనే ప్రమాదం పొంచి ఉండేదని, ఆమెను రక్షించేందుకే తన తల్లి ప్రధానిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం కారణంగానే మేనత్తతో తన కుటుంబానికి మనస్పార్థలు వచ్చినట్లు వివరించారు. తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నిందలను తమ మీద వేయడం శశికళకు కొత్తేమీ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి విజయలక్ష్మి గతంలో కలైంజ్ఞర్ కరుణానిధి, వాలప్పాడి రామమూర్తి వంటి నేతలను కలిసిన సందర్భాలు లేవు అని, ధైర్యం ఉంటే తనతో చర్చకు శశికళ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. మౌనంగా ఉండకుంటే గుట్టు విప్పుతాం.. తన కుటుంబం, తన తల్లి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని శశికళను దీప హెచ్చరించారు. శశికళ నోరు మూసుకుని మౌనం పాటిస్తే ఆమెకే మంచిదని.. లేనిపక్షంలో గుట్టు విప్పాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. తన జీవితాన్ని సర్వనాశనం చేశారని, తన కడుపులో ఉన్న బిడ్డను చిదిమేశారని, తన తల్లి భౌతిక కాయాన్ని కూడా చూడనివ్వకుండా జయలలితను అడ్డుకున్నది శశికళే కదా.. అని ఆరోపించారు. మధ్య తరవాతి స్థాయికి కూడా నోచుకోని శశికళకు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనే విషయంపై.. ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇకనైనా ఈ విషయంపై శశికళను అన్నాడీఎంకే కేడర్ ప్రశ్నించాలని, రాష్ట్ర ప్రజలు సైతం నిలదీయాలని కోరారు. తనకు శశికళ రూపంలో ప్రాణహాని ఉందని ఆరోపించారు. కాగా ఈ దీప వ్యాఖ్యలపై చిన్నమ్మ శశికళ ఎలా స్పందిస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది
‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త. మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని. ‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (ఐ.ఎం.హెచ్.) బ్రిటిష్ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38). కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్ సెంటర్లో పని చేస్తుంటే దీప కేంటిన్లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది. అంతే. హాస్పిటల్లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్ మినిస్టర్ శేఖర్ బాబు, ఎం.పి. దయానిధి మారన్ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో! -
విషాదం.. సూసైడ్ నోట్ రాసి యువ నటి ఆత్మహత్య!
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కోలీవుడ్‌కు చెందిన యంగ్ నటి దీప అలియాస్ పౌలిన్(29) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని విరుగంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో ఉంటున్న దీప శనివారం తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప..మానసిన ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెబుతున్నారు. దీప సంప్రదించడానికి ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా..ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. అందులో తన చావుకు ఎవరు కారణం కాదని చెబుతూనే జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చింది. అయితే అతని పేరు మాత్రం ప్రస్తావించనట్లు సమాచారం. కాగా, పలు తమిళ సినిమాల్లో సహాయ నటిగా అలరించింది దీప. చిన్న పాత్రలు పోషించినా.. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం విశాల్ నటించిన తుప్పరివాలన్ చిత్రంలో దీపా పౌలిన్ సేవకురాలిగా నటిస్తోంది.నాజర్ నటించిన వైదా చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by Powlenjessica Amaranathan💫 (@powlenjessica_offl) -
వేద నిలయం విక్రయించే ప్రసక్తే లేదు.. త్వరలోనే..
సాక్షి, చెన్నై: పోయేస్ గార్డెన్‌లోని వేద నిలయంలోకి మరికొద్ది రోజుల్లో గృహప్రవేశం చేయనున్నట్లు దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తెలిపారు. ఆ భవనాన్ని తాము విక్రయించే ప్రసక్తే లేదని, ఇది తమ పూర్వీకుల ఆస్తి, వారి జ్ఞాపకం అని స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలితకు పోయేస్‌గార్డెన్‌లో వేద నిలయం పేరిట భవనం ఉ న్న విషయం తెలిసిందే. ఆమె మరణించే వరకు అదే భవనంలోనే జీవించారు. ఈ భవనాన్ని గత అన్నా డీఎంకే ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చే ప్రయత్నం చేసి భంగ పడింది. కోర్టులో న్యాయ పో రాటం ద్వారా ఆ భవనాన్ని జయలలిత మేన కోడ లు దీప, మేనల్లుడు దీపక్ సొంతం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భవనం పర్యవేక్షణ, తదితర వ్యవ హారాలు దీప, దీపక్‌కు భారమైనట్టు ప్రచారం జోరందుకుంది. అలాగే ఆ భవనాన్ని విక్రయించేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో దీప మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ ఆడియోను విడుదల చేశారు. ఎన్నో మధుర జ్ఞాపకాలు... పోయేస్ గార్డెన్ నివాసం తమ పూర్వీకుల ఆస్తి అని, ఈ ఇంట్లోనే చిన్నప్పుడు తాను, దీపక్ పెరిగినట్టు దీప గుర్తు చేశారు. మేనత్త జయలలిత, తన తండ్రి జయకుమార్ ఆ ఇంట్లోనే ఎక్కువ కాలం ఉన్నారని, తాను జన్మించింది కూడా ఇదే భవనంలో అని వివరించారు. అభిప్రా య భేదాలతో తన తండ్రి ఆ ఇంట్లో నుంచి టీ నగర్‌లోని మరో పూర్వీకుల ఇంటికి వచ్చేశారని, అయినా, అత్త పిలిచినప్పుడల్లా పోయేస్గార్డెన్కు వెళ్లి వచ్చేవారిమని తెలిపా రు. పూర్తిగా ఆమె రాజకీయాల్లోకి వెళ్లడంతో తాము బయటకు వచ్చేశామని, అయితే, ఇది తమ ఆస్తి కావడంతోనే కోర్టులో న్యాయం దక్కిందని పేర్కొన్నారు. జయలలిత సీఎంగా ఉన్నంత కాలం, ఆమె వెన్నంటి నడిచిన వాళ్లు, పయనించిన వాళ్లు ఎందరో ఉన్నారని, వారందరూ రక్త సంబంధీకులు కాలేరని వ్యాఖ్యలు చేశారు. ఇది చిన్నమ్మ శశికళ కుటుంబానికి సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ భవనం తమ కుటుంబ ఆస్తి అని, దీనిని విక్రయింబోమని స్పష్టం చేశారు. ఈ ఇంటిని అమ్మేస్తామని తాము ఎవ్వరికీ చెప్పలేదని, ఎవరిని సంప్రదించ లేదని తేల్చి చెప్పా రు. వదంతులను నమ్మ వద్దని, వేద నిలయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనతో పాటుగా దీపక్‌పై ఉందన్నారు. మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్లు వెల్లడించారు. -
భర్తతో గొడవ.. ఆస్పత్రిలో చేరిన జయలలిత మేనకోడలు దీప
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప ఆస్పత్రిలో చేరారు. భర్త మాధవన్‌తో గొడవ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఇంటికే ఆమె పరిమితం అయ్యారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ కావడంతో చర్చ బయలుదేరింది. భర్త మాధవన్ – దీపల మధ్య ఇప్పటికే పలు మార్లు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో భర్తతో గొడవ కారణంగానే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అయితే, ఆమె భర్త మాధవన్ దీనిని ఖండించారు. తానే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొనడం గమనార్హం. చదవండి: (అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం) -
ట్విటర్ దీపం
సమస్యలను పరిష్కరించడం, తోటివారికి సాయం చేసే గుణం ఉంటే అధికారం, పదవులు, డబ్బులు లేకపోయినప్పటికీ ట్వీట్స్‌తో సామాజిక సేవ చేయవచ్చని నిరూపించి చూపిస్తోంది ఒడిషా ట్విటర్ క్వీన్ దీపా బారీక్. ఒడిషాలోని బర్గఢ్ జిల్లా టెమ్రీ గ్రామానికి చెందిన దీపా బారీక్ తండ్రి వ్యవసాయదారు. తల్లి అంగన్వాడి వర్కర్. మూడేళ్ల క్రితం దీపకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా వాడాలో తెలుసుకునేందుకు పక్కింట్లో ఉంటోన్న సామాజిక కార్యకర్త దిబాస్ కుమార్ సాహుని కలిసింది. అతను స్మార్ట్ ఫోన్ వాడకం గురించి వివరిస్తూ వివిధ రకాల సోషల్ మీడియా యాప్‌లు దీప ఫోన్లో వేశాడు. వీటితోపాటు ట్విటర్ యాప్ వేస్తూ ‘‘నువ్వు చేసే ట్వీట్‌ను తప్పనిసరిగా ఫలానా వ్యక్తులు చూడాలనుకుంటే వారి అకౌంట్‌ను ట్యాగ్ చేసి పోస్టుచేస్తే వారికి నేరుగా చేరుతుంది’’ అని చెప్పాడు. దిబాస్ చెప్పిన ఈ విషయమే దీపను ఒడిషా ట్విటర్ క్వీన్‌గా మార్చింది. సౌకీలాల్‌తో తొలిసారి.. అది 2019 ఒడిషాలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి గ్రామాల్లో ఇళ్లు కొట్టుకు పోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. టెమ్రీ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామంలో ఇల్లు కొట్టుకుపోవడంతో పేద దంపతులు ఉండడానికి వసతి లేక ఇబ్బందులు పడుతుండడం కనిపించింది దీపకు. అది చూసి చలించిపోయి సౌకీలాల్ దంపతుల సమస్యను వివరిస్తూ.. ఒడిషా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులతోపాటు సోషల్ మీడియా గ్రీవెన్స్ సెల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన 48 గంటల్లోనే గ్రామాభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించి, సౌకీలాల్ ఇల్లు కట్టుకునేందుకు రూ.98 వేల రూపాయలను ఇచ్చారు. ఈ సంఘటన దీపకు ముందుకు సాగడానికి ఉత్సాహాన్ని ఇవ్వడంతో..తరువాత మగదిక్కులేని వితంతువులకు పెన్షన్ కష్టాలు, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారి సమస్యలను రాష్ట్ర ఆశీర్వాద్ యోజన అధికారులకు చేర్చి వితంతువుల సమస్యను పరిష్కరించింది. వికలాంగులకు ప్రభుత్వం అందించే సదుపాయాలన్నింటిని వారి చెంతకు చేర్చడం, బిలాస్పూర్ గ్రామంలో డ్యామ్ మరమ్మతుల కారణంగా పంటపొలాలకు నీళ్లు అందకపోవడంతో.. ఆ సమస్యను నీటిపారుదల అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో రైతులు పంటలు పండించేందుకు నీరు అందింది. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా దీప ఐదు వేలమందికి పైగా సాయం చేయడం విశేషం. దేశంలో ఎక్కడున్నా... నేనున్నానంటూ... వివిధ సమస్యల పరిష్కారానికి దీప ట్వీటర్ సాయంతో చేస్తున్న కృషి స్థానికంగా చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా దీపను కలిసి వివరించడం, ట్విటర్ వేదికగా దీప ఆ సమస్యను సంబంధిత అధికారుల ముందు ఉంచడం, వారు దానిని పరిష్కరించడం చకచక జరిగిపోతున్నాయి. సొంతరాష్ట్రంలో ఇబ్బంది పడుతోన్న వారికేగాక, బతుకుదెరువుకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి సైతం దీప సాయం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఒడిషాకు చెందిన 23 మంది తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ ఇటుకల తయారీ బట్టీలో పనిచేయడానికి చేరారు. బట్టీ యజమాని ఆహారం, నీరు ఇవ్వకుండా, ఎక్కువ గంటలు పనిచేయమంటూ హింసించేవాడు. రోజులు గడిచేకొద్ది వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అది తట్టుకోలేక అక్కడినుంచి ఎలా బయటపడాలా? అనుకుంటోన్న సమయంలో వారిలో ఒకతనికి దీప గురించి తెలియడంతో.. వెంటనే ఈ సమస్య గురించి దీపకు చెప్పారు. వెంటనే ఆమె తెలంగాణ పోలీసులకు ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి 23 మంది కూలీలను రక్షించి సొంతరాష్ట్రానికి పంపించారు. ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న వెయ్యిమంది ఒడిషా కూలీలకి సాయం చేసింది. సమస్యలను వెతుక్కుంటూ.. అడిగిన వారికేగాక, చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం, దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రజాసమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా అధికారులకు చేరవేయడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తోంది దీప. ప్రస్తుతం సైన్స్‌లో పీజీ చేస్తున్న దీప భవిష్యత్‌లో ప్రొఫెసర్ కావాలనుకుంటోంది. ‘‘ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నా లాంటి వారినెందరినో తయారు చేయవచ్చు. ఇలాంటివాళ్లు సమాజంలో మరెంతోమందికి సాయం చేస్తారు’’ అంటూ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం విశేషం. తన ద్వారా సాయం అందిన వారితో దీప. -
జయలలిత ఇంటి తాళాలు మేనకోడలు దీప చేతికి
వేదనిలయం తాళాలను ప్రభుత్వం ఎట్టకేలకు వారసులకు అప్పగించింది. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆమె ఉంటున్న వేద నిలయాన్ని అప్పటి ప్రభుత్వం స్మారక మండపంగా మార్చింది. దానిపై జయలలిత అన్న కుమార్తె, కుమారుడు కోర్టులో సవాలు చేశారు. వేద నిలయం వారసులదేనని కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. సాక్షి ప్రతినిధి, చెన్నై : న్యాయపోరాటం అనంతరం ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంటి తాళాలు ఆమె అన్న కుమార్తె, కుమారుడు దీప, దీపక్ చేతికి వచ్చాయి. ఆమె శుక్రవారం గృహ ప్రవేశం చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 డిసెంబర్ 5న ఆకస్మిక మరణంతో రూ.కోట్ల ఆస్తికి వారసులు ఎవరన్న అంశం చర్చకు వచ్చింది. జయ కు చెన్నై పోయస్గార్డెన్లో సుమారు రూ.100 కోట్లు విలువ చేసే వేద నిలయం పేరున భవంతి ఉంది. జయలలిత మరణించే వరకు అందులోనే ఉన్నారు. అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు సాగించేవారు. అలాగే మరికొన్ని కోట్ల ఆస్తులున్నట్లు ప్రచా రంలో ఉంది. జయ మరణం తర్వాత ఆస్తి వివాదం వేద నిలయం చుట్టూనే తిరిగింది. సీఎంగా అధికారం చేపట్టిన ఎడపాడి పళనిస్వామి వేద నిలయాన్ని జయ స్మారకమండపంగా మార్చేందుకు ప్రయత్నించారు. వారసులం మేముండగా తమ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని జయ అన్న సంతానమైన దీప, దీపక్ కోర్టులో పిటిషన్ వేశారు. ఒక దశలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో వేద నిలయం జయ స్మారక మండపంగా మారిపోయింది. అంతేగాక అప్పటి ప్రభుత్వం ప్రారంభోత్సవం చేసి వేద నిలయం వద్ద జయ స్మారక మండపం అనే బోర్డు పెట్టేసింది. వివాదం పూర్తిగా సమసిపోయే వరకు సందర్శకులను అనుమతించరాదని కోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని దీప, దీపక్ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు చెల్లదని, మూడువారాల్లోగా వేద నిలయాన్ని వారసులకు అప్పగించాలని ఇటీవల తీర్పు చెప్పింది. ఈ ఆదేశాలను అనుసరించి దీప, దీపక్ ఇరువురూ శుక్రవారం చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ విజయరాణి వేద నిలయం తాళాలను వారికి అప్పగించారు. ‘కోర్టు ఆదేశాలను అనుసరించి వేద నిలయం తాళాలను అప్పగించాల్సిందిగా తనకు ఇటీవల వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విచారణ తర్వాత తాళాలు అప్పగించాను’ అని జిల్లా కలెక్టర్ విజయరాణి మీడియాకు తెలిపారు. తాళాలు స్వీకరించగానే దీప, దీపక్ నేరుగా వేద నిలయం చేరుకున్నారు. ఇల్లంతా కలియతిరగడంతోపాటు రోడ్డు వైపున ఉన్న బాల్కనీలోకి వచ్చి ఆనందంతో పరిసరాల్లోని ప్రజలకు అభివాదం చేశారు. -
ముఖమంతా మొటిమలు, సిగ్గు, బిడియం.. కానీ ఇప్పుడు
ముఖం అంతా మొటిమలు, నలుగురిలోకి వెళ్లి మాట్లాడాలంటే సిగ్గు, బిడియంగా ఫీల్ అయ్యే ఆ అమ్మాయే తొలి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగి కేన్స్ ఫిల్మ్ఫెస్టివల్ల్లో రెడ్‌కార్పెట్‌పై నడిచింది. తన ఫ్యాషన్‌తో మెబిలిన్ వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేయడమే గాక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అనర్గళంగా మాట్లాడింది. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఏదో సినిమా కథ కాదు. Indian Influencer Diipa Khosla: భారతీయ కట్టుబొట్టుకు సరికొత్త ఫ్యాషన్‌ను జోడించి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగిన దీపా ఖోస్లా ప్రేరణాత్మక స్టోరీ. పదిలక్షలకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో దూసుకుపోతూ ఏడు అంతర్జాతీయ మ్యాగజీన్ కవర్లపై ఫోటోకు పోజు ఇవ్వడమేగాక, వోగ్, ఎల్లే, గ్రాజియా వంటి ప్రముఖ సంస్థల నుంచి వరుసగా మూడేళ్లు ‘ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌ను గెలుచుకోవడం, బిల్‌బోర్డుపై తన ఫోటో రావడం విశేషం. ఢిల్లీలో నివసిస్తోన్న సంప్రదాయ పంజాబీ కుటుంబంలో పుట్టిన దీపా ఆరేళ్లపాటు ఢిల్లీలోనే ఉంది. తరువాత దీపా తల్లిదండ్రులు తమ మకాంను ముందు చెన్నైకి, తరువాత ఊటీకి మార్చడంతో తన బాల్యం అంతా అక్కడే గడిచింది. ఊటీలోని బ్రిటిష్ బోర్డింగ్ స్కూల్లో చదివిన దీపా తరువాత న్యాయ విద్యను అభ్యసించేందుకు స్కాలర్షిప్ రావడంతో.. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డామ్‌లో అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రధాన సబ్జెక్టుగా లా డిగ్రీని పూర్తిచేసింది. ఆ తరువాత మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు లండన్‌కు వెళ్లింది. పీజీ అయ్యాక లాయర్‌గా ప్రాక్టీస్ చేయడానికి మధ్యలో నాలుగు నెలల ఖాళీ దొరికింది. ఈ సమయంలో లండన్ ఫ్యాషన్ ఏజెన్సీలో చేరి ఇంటర్న్‌షిప్ చేసింది. ఫ్యాషన్‌పై ఆసక్తి పెరగడంతో.. యూరప్ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజెన్సీ లో చేరింది. ఒక్కోటీ నేర్చుకుంటున్న క్రమంలో... అమెరికా, యూరప్ దేశాల నుంచి నుంచి వచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను దగ్గర నుంచి గమనించేది. ‘ఇన్నిదేశాల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కానీ ఇండియా తరపున ఎవరూ లేరు. నేను ఆ లోటు భర్తీ చేయాలి’ అనుకుంది. లైంగిక వేధింపులు, వర్ణ వివక్షత వంటి సమస్యలు ఎదురైనప్పటికీ తనలోని నైపుణ్యాలతో కష్టపడి సత్తా చాటì , ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగింది. రెడ్‌కార్పెట్‌పై బ్రెస్ట్ పంప్స్‌తో.. ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తూ ఎస్టీ లాడర్, కెరాస్టేస్ బ్రాండ్లకేగాక మరెన్నో ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేసింది. కేన్స్, వెనిస్ చిత్రోత్సవాల్లో సెలబ్రెటీ హోదాల్లో పాల్గొంది. 2019లో పోస్ట్ ఫర్ చేంజ్ ఫౌండేషన్‌ను ప్రారంభించి...సోషల్ మీడియా ద్వారా సామాజిక మార్పుకోసం, మహిళా అభ్యున్నతి కోసం కృషిచేస్తోంది. స్త్రీ సాధికారత, జాత్యహంకార ధోరణికి వ్యతిరేకంగా యూఎన్, ఇతర ఎన్జీవోలతో కలసి పనిచేస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న కేన్స్ ఫెస్టివల్లో పాల్గొని సెన్సేషనల్‌గా నిలిచింది. నలుపు, పసుపు రంగు గౌనులో మెరిసిన దీపా తన గౌనుకు బ్రెస్ట్ పంప్స్‌ను అమర్చుకుని రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు పోజులిచ్చి తల్లిపాల ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పింది. నెదర్లాండ్స్‌లో చదివే రోజుల్లో ఒలేగ్ బుల్లర్‌ను ప్రేమించిన దీపా తరువాత అతడినే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఒక పాప. 2015 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ..ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్, బ్యూటీహ్యాకర్గా ఆకట్టుకుంటున్నారు. తన పేరుతో బ్లాగ్ నడుపుతూ ట్రావెల్ స్టోరీలు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ టిప్స్, సలహాలు అందిస్తున్నారు. -
‘అమ్మ’కు వారసులు లేరా?
సాక్షి, చెన్నై: దివంగత అమ్మ జయలలితకు కుటుంబ వారసులు లేరని స్వయంగా సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె మేన కోడలు దీప పేర్కొన్నారు. ఆదివారం వీడియో రూపంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జయలలితకు ఆమె అన్న కుమార్తె గా తాను, కుమారుడిగా తన సోదరుడు దీపక్ వారసులుగా ఉన్నామని గుర్తు చేశారు. మేనత్త జీవించి ఉన్న కాలంలో తమకు చేయాల్సిన వన్నీ చేస్తూ వచ్చారని, అయితే, దురదృవష్టవశాత్తు అందర్నీ వీడి ఆమె అనంత లోకాలకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం తర్వాత సీఎం కుర్చీలో పళనిస్వామిని కొందరు కూర్చోబెట్టి వేడుక చూశా రని ఎద్దేవా చేశారు. అయితే, ప్రస్తుతం సీఎం పళనిస్వామి అమ్మకు కుటుంబ వారసులు లేరని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. వారసులం తాము ఉన్నామని, ఇకపై వారసుల గురించి మాట్లాడే అధికారం సీఎంకు లేదన్నారు. దివంగత నేత ఎంజీఆర్ వారసుల విషయంగా మరికొన్ని పార్టీ లు నినాదాన్ని అందుకున్నాయని గుర్తు చేస్తూ, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. -
ఆగని చక్రాలు
విపత్తు అంటే ఏమిటి? భూమి కంపించడమా? ఉప్పెన ముంచెత్తడమా? అగ్నికీలలు చుట్టు ముట్టడమా? అన్నీ.. విపత్తులే. అన్నిటికన్నా పెద్ద విపత్తు.. ఉద్యోగం కోల్పోవడం! సగటు మనిషికి ఇలాగే ఉంటుంది. విద్య, దీప మాత్రం.. ధైర్యం కోల్పోవడమే పెద్ద విపత్తు అంటున్నారు. విద్యా షెల్కే వయసు 28 ఏళ్లు. ఇద్దరు చిన్న పిల్లలు. ముంబైలోని ఓ రైడ్–షేరింగ్ కంపెనీలో ఉద్యోగం. అకస్మాత్తుగా విపత్తు! ఉద్యోగం పోయింది. కరోనా మింగేసిన కోట్ల మంది మహిళల ఉద్యోగాలలో విద్యది కూడా ఒకటి. ఇంట్లో ఆమె మీద ఆధారపడిన వాళ్లు ఇంకా కొందరు ఉన్నారు. భర్త ఉద్యోగం కూడా ప్రమాదంలో పడేలా ఉంది. ఇంటికి ఇద్దరూ రెండు లైఫ్ బోట్లు. లైఫ్ బోట్ పని ఒడ్డుకు చేర్చడం. లైఫ్ బోటే తలకిందులైతే! విద్య పదోతరగతి వరకు చదివింది. ఆటో నడపడం వచ్చు. పెళ్లయిన కొత్తలో భర్తే ఆమెకు డ్రైవింగ్ నేర్పించాడు. రెండు నెలల క్రితం.. ఉద్యోగం పోయిన వెంటనే విద్యా ఇంకేమీ ఆలోచించకుండా టాక్సీ సర్వీసు మొదలుపెట్టింది. ఆమె ఉండేది ములుంద్ ఏరియా. ఆ చుట్టుపక్కల, దూర ప్రాంతాలకూ ప్రాంతాలకు వెళ్లవలసిన వృద్ధులు, మహిళల కోసం ఆమె టాక్సీ నడుపుతుంది. చార్జీలను పట్టుపట్టి అడగదు. ఇవ్వలేని వాళ్లెవరో ఆమెకు తెలిసిపోతుంది. వాళ్ల దగ్గర తీసుకోదు. కొందరైతే ఆడ కూతురు రోడ్డు మీద టాక్సీ నడుపుతోందన్న మురిపెంతో ఉదారంగా డబ్బు ఇవ్వబోతారు. నవ్వుతూ తిరస్కరించి, ఎంతయిందో అంతే తీసుకుంటుంది విద్య. పుణె, నాసిక్, ఔరంగాబాద్, కొల్హాపూర్, సతారా, సంగ్లీ, నాగపూర్ వంటి మరీ దూర ప్రాంతాలకు కూడా విద్య ముంబై నుంచి టాక్సీ నడుపుతుంటుంది. ఓసారి నాసిక్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు మీద తల్లీ బిడ్డలు నిరాశ్రయంగా కనిపిస్తే వారిని టాక్సీలో ఎక్కించుకుని ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న ఆ మహిళ పుట్టింట్లో వదిలిపెట్టింది. లాక్డౌన్లో భర్త ఇంట్లోంచి వెళ్లగొడితే పిల్లలతో సహా ఆమె రోడ్డున పడిందని ప్రయాణం మధ్య మాటల్లో విద్యకు తెలిసింది. అలాంటి వాళ్ల దగ్గర కూడా ఆమె డబ్బులు తీసుకోదు. డీజిల్ ఖర్చు అని కూడా అనుకోదు. ‘సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ సర్వే ప్రకారం కరోనా వల్ల ఒక్క ఏప్రిల్ నెలలోనే 12 కోట్ల 20 లక్షల మంది మన దేశంలో ఉద్యోగాలు కోల్పోయారు! వారిలో మహిళలు కోటీ 70 లక్షల మంది. భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో ప్రతి నలుగురిలో ఒకరు మార్చి–ఏప్రిల్ నెలల మధ్య కాలంలో మళ్లీ నిరుద్యోగులయ్యారు! మే–జూన్–జూలై నెలల సర్వే వివరాలలో వీళ్ల సంఖ్య మరింత ఎక్కువయ్యే సూచనలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. లాక్డౌన్ మొదలవగానే విద్యలా ఉద్యోగం కోల్పోయిన వారిలో దీపా జోసెఫ్ మరొకరు. ఆమెది కేరళలోని కోళికోడ్. కాలేజ్ బస్ డ్రైవర్‌గా చేస్తుండేది. విద్యాసంస్థలు మూత పడటంతో చేతిలోని పని పోయింది. భర్త, కొడుకు, కూతురు.. ఇదీ ఆమె కుటుంబం. కొడుకు టెన్త్ చదువుతున్నాడు. కూతురు ఎనిమిదో తరగతి. భర్త ఉద్యోగం కూడా రెపరెపలాడుతోంది. ఆ సమయంలో పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు ఆమెను అంబులెన్స్ డ్రైవరును చేశాయి. దీప ఒకోసారి రోజంతా అంబులెన్స్ నడుపుతూనే ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యలానే దీప కూడా తరచు డబ్బులు తీసుకోకుండా సేవాభావంతో రోగుల్ని ఆసుపత్రికి చేరవేస్తుంటుంది. ముంబైలో ఉన్న దీప, కోళికోడ్‌లో ఉన్న విద్య ఒకరికొకరు తెలియకున్నా ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నట్లు వాళ్ల మాటల్ని బట్టి తెలుస్తోంది. ‘‘ఉద్యోగాలు చేస్తున్నవారే కాదు, ఉద్యోగాలు ఇచ్చిన వారు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్న విపత్తు లాంటి పరిస్థితులివి! ఉద్యోగం పోయిందని బాధపడకుండా, మనకు తెలిసిన విద్యతోనే మార్గం వెతుక్కోవాలి. దేన్ని కోల్పోయినా జీవితంలో ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు’’ అంటున్నారు విద్య, దీప. -
జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తికి వారిద్దరూ రెండో తరం వారసులని గురువారం ప్రకటించిన కోర్టు శుక్రవారం తీర్పును సవరిస్తున్నట్లుగా ప్రత్యక్ష వారసులని స్పష్టం చేసింది. అనారోగ్యకారణాలతో జయలలిత అకస్మాత్తుగా కన్నుమూసిన నాటి నుంచి రెండు అంశాలపై రసవత్తరమైన చర్చకు తెరలేచింది. ఒకటి రాజకీయ వారసులు ఎవరు, రెండు అపారమైన ఆమె ఆస్తికి వారసులు ఎవరు..? అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీలో ఎవ్వరినీ నెంబరు టూ స్థాయిలో కూర్చో బెట్టలేదు. ఒకటి నుంచి వంద వరకూ అన్నీ తానై వ్యవహరించారు. ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపినపుడు పన్నీర్‌సెల్వంకు సీఎం బాధ్యతలు అప్పగించినా అది అంతవరకే. పార్టీలో, ప్రభుత్వంలో పన్నీర్‌సెల్వం సహా అందరూ కిందిస్థాయి నేతలుగానే కొనసాగారు. ఆ రెండింటిలో మొదటిదాన్ని కైవసం చేసుకునే యత్నంలో శశికళ బొక్కబోర్లాపడి జైలు జీవి తం గడుపుతోంది. జయ స్థాయిలో శశికళ పార్టీలో చక్రం తిప్పినా అదంతా అనధికారమే. కొంత జయకు తెలియకుండా సాగిపోయినదే. ఇక ఆస్తిని దక్కించుకునేందుకు సైతం శశికళ, టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేసి విఫలమైనారు. జయ అవివాహిత కావడంతో ప్రత్యక్ష వారసులు లేరు. తాను నటుడు శోభన్‌బాబు, జయలలితకు జన్మించిన కుమార్తెను, ఆమె ఆస్తికి తానే వారసురాలినంటూ వేర్వేరుగా ఇద్దరు యువతులు కొన్నాళ్లపాటు హడావిడి చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన యువతి కోర్టులో కేసు కూడా వేసింది. ఆమె వాదనకు బలం లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే కనుమరుగైంది. ఇక జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ సైతం వారసత్వపోరును ప్రారంభించారు. పారీ్టకి, ప్రాపరీ్టకి సైతం తామే వారసులమని దీప మీడియా ముందుకొచ్చారు. చెన్నై పోయస్ గార్డెన్‌లోని నివాసాన్ని జయ స్మారకమందిరంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారు. చదవండి: పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే జయకు రక్తసంబందీకులుగా దీప, దీపక్ మాత్రమే చలామణిలో ఉండడంతో న్యాయస్థానం తీర్పు కూడా వారిద్దరికీ అనుకూలంగా వచ్చింది. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారకమందిరం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. జయ ఆస్తులకు దీప, దీపక్ రెండోతరం వారసులని పేర్కొంది. ముందురోజు చెప్పిన తీర్పులో సవరణలు చేస్తూ జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. ఇతర ఆస్తుల మాటెలా ఉన్నా చెన్నై పోయస్గార్డెన్పై అటు ప్రభుత్వం ఇటు దీప, దీపక్ పట్టుబటి ఉన్నారు. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారక మందిరం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానమే చెప్పిందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తీర్పు వెలువడగానే మీడియా ముందు ధీమా వెలిబుచ్చారు. తాజా తీర్పుతో పోయస్‌గార్డెన్ ఇంటిపై దీప, దీపక్‌కు పూర్తిస్థాయి అధికారం వచ్చినట్లు భావించవచ్చు. జయ ఆస్తుల వ్యవహారంలో ఇంతవరకు శశికళ ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. త్వరలో అదే జరిగితే ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి. చదవండి: వారిద్దరూ అమ్మ వారసులే ఈ తీర్పును ఊహించలేదు: దీప మద్రాసు హైకోర్టు శుక్రవారం తాజా తీర్పును వెలువరించిన అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. ఇలాంటి తీర్పును నేను ఊహించలేదు. అన్నాడీఎంకే సైతం ఈ తీర్పును స్వాగతించాలి. పోయెస్‌గార్డెన్ రోడ్డులోకి ప్రవేశించకుండా నిరోధించారు. వారు ఎవరో మీకు తెలుసు. అత్త (జయలలిత) కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వమే. పోయెస్‌గార్డెన్ ఇంట్లోనే పుట్టాను. అయితే ఆ ఇంటిలోకి నేను వెళ్లకుండా అడ్డుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తమపై అనవసరమైన నిందలు మోపింది. అయితే చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మద్రాసు హైకోర్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జయ ఆస్తులపై మాకు కోర్టు సర్వాధికారం ఇచ్చింది. ప్రత్యక్ష వారసులమని ప్రకటించిన తరువాత ఏఏ హక్కులు వస్తాయో పరిశీలించాలి. అన్ని ఆస్తులు మాకు అప్పగించాలి. వేదనిలయాన్ని జయ స్మారకమందరంగా మార్చాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై, ఆ ఇంటిపై హక్కు కల్పించాలని కోరుతూ గవర్నర్‌ను కలుస్తాను. అన్నాడీఎంకే నుంచి ఇకపై వచ్చే సమస్యలను న్యాయస్తానంలోనే ఎదుర్కొంటాను. జయ ఆస్తుల విషయంలో అన్నాడీఎంకేకు అడ్డంకులు ఎదురవడంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. మాలో కొన్ని భయాలు నెలకొన్నందున సాయుధ పోలీసు బందోబస్తు కల్పించాలి. చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా? జయ ఆస్తుల చిట్టా జయలలిత ఆస్తులను అధికారికంగా లెక్కకట్టేందుకు ఉన్న ఆధారాలు ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో ఆమె చూపిన వివరాలు మాత్రమే. తన వార్షిక ఆదాయం రూ.9.34 కోట్లని 1996లో ఆదాయపు పన్నుశాఖకు లెక్కచూపారు. అధికశాతం వ్యవసాయంపై వచ్చే ఆదాయమని పేర్కొన్నారు. నెలకు ఒక్కరూపాయి జీతం పొందుతున్నట్లు ఆ లెక్కల్లో తెలిపారు. 2011 ఎన్నికల్లో పోటీచేసినపుడు రూ.51.4 కోట్ల ఆస్తి చూపారు. 2016లో రూ.113.73 కోట్ల ఆస్తిని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. చరాస్థి కింది రూ.42 కోట్ల విలువైన బంగారు నగలను చూపారు. స్థలాలు, నిర్మాణాల కింద మరో రూ.72 కోట్ల ఆస్తులను ఆమె చూపారు. బ్యాంకుల్లో రూ.10.63 కోట్ల డిపాజిట్టు చూపగా ఇందులో రెండుకోట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీజ్‌కు గురయ్యాయి. వివిధ కంపెనీల్లో రూ.27.44 కోట్లు పెట్టుబడులున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21289.30 గ్రాముల బంగారం, 1250 కిలోల వెండిని సీజ్ చేశారు. రూ.2.4 కోట్ల అప్పుకూడా ఉందని ఆమె పేర్కొన్నారు. 1992లో కొడనాడులో 900 ఎకరాల టీ ఎస్టేట్‌ను కొనుగోలు చేసి క్రమేణా 1,800 ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరా రూ.1 కోటికి పలుకుతుంది. ఇక లగ్జరీ వసతులతో కొడనాడు బంగ్లా కూడా ఉంది. కొడనాడు ఎస్టేట్ తనకు సొంతమని శశికళ చెబుతున్నారు. జయలలిత పేరున మొత్తం 173 ఆస్తులున్నట్లు సమాచారం. వీటిల్లో కనీసం వంద ఆస్తుల్లోనైనా జయలలితకు పెద్దవాటా ఉండే అవకాశం ఉంది. జయ ఆస్తులపై న్యాయస్థానంలో వాదోపవాదాల్లో రూ.913 కోట్ల ఆస్తులుగా చూపారు. -
పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పటి పవర్ఫుల్ రాజకీయకేంద్రమైన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం స్మారకమందిరం వివాదంలో నలిగిపోతోంది. జయ వారసులు దీప, దీపక్ ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు సమరం సాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై పోయెగార్డెన్‌లో అత్యంత విలాసవంతమైన భవనంలో నివసించేవారు. రాజకీయ వర్గాలు ‘గార్డెన్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. జయలలిత అధికారంలో ఉన్నపుడు ‘గార్డెన్’ నుంచి ఆదేశాలు వచ్చాయా అని ముందుగా ప్రశ్నించేవారు. సచివాలయం కంటే పోయెగార్డెన్ కే ప్రాధాన్యతతో రాజకీయ, అధికార కేంద్రంగా వెలిగిపోయేది. జయ మరణించిన తరువాత కూడా దాని ప్రాభవం తగ్గలేదు. జయకు వందలకోట్ల రూపాయల ఆస్తులున్నా గార్డెన్హౌస్ చుట్టూనే రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. జయకు సొంతమైన వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తికి ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ వారసులని మద్రాసు హైకోర్టు తేల్చడంతో ఇంతకూ ఆస్తులెక్కడెక్కడ ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే అంశంపై జోరుగా చర్చ బయలుదేరింది. (వారిద్దరూ అమ్మ వారసులే) అవినీతి నిరోధకశాఖ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో ఎన్నికల సమయంలో జయలలిత దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో చూపిన ఆస్తులనే పేర్కొన్నారు. జయకు వారసులమని తమను ప్రకటించి ఆమె ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను తమకు అప్పగించాల్సిందిగా దీప, దీపక్ గతంలో వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వెలువడిన తీర్పుతో స్పష్టత వచ్చింది. వారిద్దరూ జయ ఆస్తికి రెండోతరం వారసులని కోర్టు పేర్కొంది. జయ ఆస్తులపై పర్యవేక్షణాధికారం వారిద్దరికీ ఉంటుందని తెలిపింది. పోయెస్ గార్డెన్లోనిఇంటిని జయ స్మారక మందిరంగా మార్చాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సింది ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హర్షం వ్యక్తంచేసిన దీప, దీపక్ ఇద్దరూ కలిసి చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధికి వెళ్లి అంజలి ఘటించారు. గార్డెన్‌లోనే కాపురం: దీప కోర్టు తీర్పులో సైతం గార్డెన్‌కు ప్రాధన్యత ఇవ్వడంతో జయ నివాసం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ, చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం తమ పూర్వీకుల ఆస్తి, ఆ భవనం తమకు సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. జయకు నేరుగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తిని కాజేయాలని ఎందరో చేసిన ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్టవేసింది. పోయెస్‌గార్డెన్ ఇంటిని జయ స్మారకమందిరంగా మార్చడాన్ని అంగీకరించం. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర చట్టంపై కోర్టులో అప్పీలు చేస్తాం. జయకు చెందిన ఆస్తులన్నీ మాకే సొంతం. వాటిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయవాదులతో చర్చిస్తున్నాం. జయ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేస్తాం. చట్టపరమైన సమస్యలు పరిష్కారం కాగానే పోయెస్‌గార్డెన్‌లో నివసిస్తాం. జయ ఆస్తులను స్వాధీనం చేసుకుని కాపాడే బాధ్యత మాపై ఉంది. జయ పేరున మేమే ట్రస్టును ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సేవచేస్తామని దీప చెప్పారు. దీపక్ మాట్లాడుతూ, పోయెస్‌గార్డెన్ ఇల్లు వారసత్వంగా మాకు సంక్రమించిన ఆస్తి, దాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని అన్నారు. జయ స్మారకమందిరంగా ప్రభుత్వం మార్చదలచుకుంటే తాముగా ఇవ్వాలేగాని వారు ఏకపక్ష నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. వేద నిలయంను సీఎం క్యాంపాఫీస్ చేయా లన్న సూచన కూడా సరికాదు. డీఎంకే అధి కారంలోకి వచ్చి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన పక్షంలో అందులో ఉంటారా. మాకు సాయుధ పోలీస్ బందోబస్తు కావాలని కోరలేదు. ఒక ఆస్తి కోసం నన్ను హత్యచేస్తే అందుకు బాధ్యులెవరు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం తమ పూర్వీకుల ఆస్తిని జయ స్మారకమందిరంగా చేసుకుంటే మంచిదని దీపక్ వ్యాఖ్యానించారు.(స్మారక మందిరంగా జయలలిత నివాసం) చిన్నమ్మకు చిక్కే.. జయ ఆస్తులపై కోర్టు ఇచ్చిన తీర్పు శశికళను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. జయలలిత, శశికళ సంయుక్తంగా అనేక సంస్థలు నడుపుతుండేవారు. వాటిల్లోని జయ వాటాను దీప, దీపక్‌లకు కేటాయించాల్సి ఉంటుంది. లేదా జయ ఆస్తులన్నీ ట్రస్ట్ కిందకు తీసుకొస్తే మారుమాట్లాడకుండా శశికళ అప్పగించాల్సి రావచ్చు. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోట వివాదాలు కుదుటపడవచ్చు. ప్రభుత్వానికే అధికారం: సీవీ షణ్ముగం చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు తీర్పుతో స్పష్టమైందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. జయ ఇంటిని స్మారకమందిరంగా మార్చడంపై పునరాలోచించాలని, ఒక భాగం స్మారక మందిరం, మరో భాగం సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మార్చవచ్చని కోర్టు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టు తీర్పు ప్రతులు అందిన తరువాత క్షుణ్ణంగా అధ్యయనం చేసి బదులు పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
వారిద్దరూ అమ్మ వారసులే
సాక్షి చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివాదం కోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది. కొంత ప్రభుత్వానికి మిగిలినది జయ అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్‌కు చెందేలా బుధవారం తీర్పు చెప్పింది. ఈ పంపకాలపై 8 వారాల్లోగా బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. పలుసార్లు అన్నాడీఎంకేను అధికారపీఠంలో కూర్చొనబెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదే స్థాయిలో భారీ ఎత్తున ఆస్తులను సైతం కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనధికారికంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జయలలితకు చెన్నై పోయెస్‌గార్డెన్‌లో బంగ్లా, కొడైకెనాల్లో ఎస్టేట్, హైదరాబాద్‌లో ద్రాక్షతోట రూ.913 కోట్ల విలువైన ఆస్తులున్నాయని అధికారిక సమాచారం. (రక్త సంబంధీకులు వారసులు కారా? ) 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే ఆమె అస్వస్థకు గురై అనూహ్యమైన రీతిలో అదే ఏడాది డిసెంబర్ 5నఅకస్మాత్తుగా కన్నుమూశారు. వివాహం చేసుకోకుండా ఆధ్యంతం కుమారిగానే జీవించినందున ఆమె కూడబెట్టిన కోట్లాది రూపాయల ఆస్తులకు వారసులు ఎవరనే అంశంపై పెద్ద చర్చనీయాంశమైంది. జయ మరణించిన తరువాత ఆదాయపు పన్నుశాఖాధికారులు జయ నివాసం పోయెగార్డెన్‌లో తనిఖీలు చేసినపుడు ఆస్తి పంపకాలు చేసినట్లు ఎలాంటి పత్రాలు దొరకలేదు. జయ రక్త సంబం«దీకులుగా ఆమె అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ మాత్రమే ఉన్నారు. అయితే జయతో వారికి సత్సంబంధాలు, పోయెస్‌గార్డెన్ ఇంటికి రాకపోకలు లేనందున ఆస్తులు వివాదంలో చిక్కుకున్నాయి. జయ ఆస్తికి, రాజకీయాలకు సైతం తామే వారసులమని దీప గళమెత్తినా చట్టబద్ధత లేకుండా పోయింది. పోయెగార్డెన్‌లో ఇంటిని జయస్మారక మందిరంగా మార్చాలని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (స్మారక మందిరంగా జయలలిత నివాసం) అత్త (జయలలిత) ఆస్తులపై ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం అన్నాడీఎంకే ప్రభుత్వానికి లేదని దీప అభ్యంతరం పలికింది. జయ ఆస్తులపై తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని గట్టిగా అడ్డుతగిలింది. ఈ పరిస్థితిలో జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రయివేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే నేత పుహళేంది, జానకిరామన్ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. జయలలిత అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపను ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. జయ చట్టపూర్వక వారసులమైన తమను నిర్వాహకులుగా నియమించాలని వారిద్దరూ కోర్టుకు విన్నవించుకున్నారు. జయ ఆస్తిపన్ను బకాయి ఉన్నారంటూ ఆదాయపు పన్నుశాఖ కొంత ఆస్తిని గతంలోనే జప్తుచేసి ఉంది. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం ‘వేద నిలయం’ను జయ స్మారకమందిరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర చట్టం తీసుకొచ్చింది. జయ ఆస్తులపై దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాలు ముగియగా తీర్పు తేదీని ప్రకటించకుండా న్యాయమూర్తులు ఈ కేసును వాయిదావేశారు. జయ ఆస్తులపై సిఫార్సులతో తీర్పు: ఇదిలా ఉండగా, జయలలిత ఆస్తుల వివాదానికి సంబంధించి కొన్ని సిఫార్సులతో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ ఖుద్దూస్ బుధవారం తీర్పును ప్రకటించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఇంటినంతా స్మారకమండపంగా మార్చాల్సిన అవసరం లేదు, కొంతభాగాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్‌గా చేయవచ్చు. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించి స్మారక మండపంపై నిర్ణయం తీసుకోవాలి. ప్రయివేటు ఆస్తుల కొనుగోలుపై ప్రజల హృదయాల్లో అనేక సందేహాలుంటాయి. అందుకే జయ ఆస్తుల నిర్వహణకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్‌లో దీప, దీపక్‌లను సభ్యులుగా చేర్చాలి. వీరిద్దరికీ ప్రభుత్వం 24 గంటలపాటూ సాయుధ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి. జయ ఆస్తుల్లోని కొంత భాగాన్ని అమ్మివేసి ఆ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌పై వచ్చే ఆదాయం నుంచి దీప, దీపక్లకయ్యే పోలీసు బందోబస్తు ఖర్చుకు వినియోగించాలి. రెండో తరం వారసులుగా జయ అన్న కుమార్తె, కుమారునికి జయ ఆస్తిపై హక్కు ఉంటుంది. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని 8 వారాల్లోగా కోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేయాల’ని వారు తీర్పులో పేర్కొన్నారు. జయ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తూ నిర్వాహక అధికారిని నియమించుకునే అవకాశాన్ని కలి్పంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు కొట్టివేశారు. అన్నింటికి వారసులం: దీప దివంగత సీఎం, తన మేనత్త ఆస్తులకే కాదు ఆమె ఆశయాలు, లక్ష్యాలకు వారసులం తాను, తన సోదరుడు దీపక్ అని దీప వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మీడియా ముందుకు బుధవారం సాయంత్రం దీప వచ్చారు. కోర్టు ఇచ్చిన సూచనల్లో తమను వారసులుగా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు. తాను, తన సోదరుడు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని తెలిపారు. పారంపర్య ఆస్తులే కాదు, మేనత్త ఆస్తులకు తామిద్దరం వారసులమని, ఆమె ఆశయ సాధన, లక్ష్యాల్లోను వారసులంగా ఉంటామన్నారు. -
రక్త సంబంధీకులు వారసులు కారా?
సాక్షి, చెన్నై : వేద నిలయాన్ని స్మారక మందిరంగా మారుస్తూ తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఇంటిని కబ్జాచేయడమే కాదు, అందులో ఉన్న వస్తువుల్ని కొల్లగొట్టేందుకు అన్నాడీఎంకే పాలకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పనులకు గాను సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆమోదంతో ఈ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆగమేఘాలపై చట్టం ఏంటి? ఈ పరిస్థితుల్లో జయలలిత మేన కోడలు దీప ఆదివారం ఆడియో రూపంలో స్పందించారు. జయలలితతో తనది రక్త సంబంధం అన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆమెకు తాను మేన కోడలు అని, మేనత్త మరణంతో తాను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, రాజకీయ కుట్రలు, వెన్నంటి ఉన్న వారి రూపంలో అందులో నుంచి బయటకు రాక తప్పలేదన్నారు. ప్రస్తుతం కరోనా తాండవం రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ, ఈ సమయంలో ఆగమేఘాల మీద తన మేనత్త ఇంటిని కబ్జా చేయడానికి చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఈ పాలకులకు ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు. కేవలం వేద నిలయాన్ని కబ్జా చేయడం, అక్కడున్న అన్ని రకాల వస్తువుల్ని అపహరించడం, కొల్లగొట్టడం లక్ష్యంగా ఈ పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. జయలలిత ఆస్తులకు ఎవరైనా వారసులు అని నిరూపించుకుని రానివ్వండి తదుపరి చూసుకుందామని న్యాయ మంత్రి సీవీ షణ్ముగం ఓ వ్యాఖ్య చేశారని గుర్తు చేశారు. రక్త సంబంధీకులు వారసులు కాలేరా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మేనత్త మరణం గురించిన వివరాల్ని నిగ్గు తేల్చలేని పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన తన మేనత్తను మళ్లీ తీసుకు రాగలరా అని ప్రశ్నిస్తూ, వేదనిలయం తమ పూర్వీకుల సొత్తు అని దాని జోలికి వెళ్లడం మంచిది కాదని హెచ్చరించారు. -
అమ్మ ఆస్తులకు కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకోసం కుమ్ములాట మొదలైంది. భాగస్వామిగా వ్యవహరించిన శశికళ, అన్నకుమార్తె దీప మధ్య ఆస్తులపై ఆధిపత్య పోరుకు మద్రాసు హైకోర్టు వేదికగా మారనుంది. కొడనాడు ఎస్టేట్ సహా అనేక స్థిరాస్తులు, కంపెనీలు తనకే సొంతమని శశికళ ప్రకటించుకోవడాన్ని జయలలిత అన్న కుమార్తె దీప తీవ్రంగా ఖండించారు. శశికళపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు శుక్రవారం ఆమె ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. జయ అధికారంలో ఉన్నా లేకున్నా శశికళ అన్నీతానైనట్లుగా వ్యవహరించారు. అధికార పరపతిని అడ్డుపెట్టుకుని వేలాది కోట్లరూపాయల ఆస్తులను సంపాదించినట్లుఆరోపణలున్నాయి. వీటిల్లో అనేక ఆస్తులను జయలలిత, శశికళ సంయుక్త భాగస్వాములుగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటిల్లో కొడనాడు ఎస్టేట్ ఎంతో ప్రధానమైనది. భర్త నటరాజన్ అనారోగ్యం, మరణం సందర్భాల్లో శశికళ రెండుసార్లు పెరోల్‌పై చెన్నైకి వచ్చి కొన్నిరోజులు గడిపారు. పెరోల్ ముగిసిన తరువాత ఆమె జైలుకు చేరిన కొద్దిరోజుల్లోనే 2017 నవంబరులో ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం, శశికళ బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టి లెక్కల్లో చూపని భారీ ఆస్తులను గుర్తించారు. అంతేగాక రద్దయిన కరెన్సీకి సంబంధించిన సుమారు రూ.1,900 కోట్ల ఆస్తులను కొనుగోలు, రుణాలు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ అక్రమ వ్యవహారాలకు సంబంధించి వివరణ కోరుతూ శశికళకు సమన్లు జారీ చేశారు. శశికళ తరఫున ఆమె ఆడిటర్ ఈనెల 11వ తేదీన ఐటీ అధికారులకు బదులిచ్చాడు. జయలలితకు సొంతమైనదిగా ఇటీవల వరకు ప్రచారంలో ఉండిన కొడనాడు ఎస్టేట్, మరో నాలుగు ఆస్తుల్లో 2016 నుంచి ఏప్రిల్ 1 నుంచి జయలలిత మరణించిన అదే ఏడాది డిసెంబరు 5వ తేదీ వరకు శశికళ భాగస్వామిగా మెలిగారు. జయ కన్నుమూసిన తరువాత భాగస్వామ్య సంస్థలు రద్దుకాగా శశికళ వాటి యజమానిగా మారారు. ఈ కారణంగా కొడనాడు ఎస్టేట్ ఆస్తులు శశికళకు సొంతమని ప్రకటించుకున్నారు. దీంతో శశికళ నిర్ణయాలను సవాలు చేస్తూ దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ జయ వారసురాలిగా ఆమె ఆస్తులకు సంబంధించి తాను గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లు విచారణ దశలో ఉన్న పరిస్థితుల్లో కొడనాడు ఎస్టేట్ ఆస్తులను తనకు సొంతమైనవని శశికళ ప్రకటించడం చట్టరీత్యా చెల్లదని అన్నారు. జయ ఆస్తులను సొంతం చేసుకుంటూ శశికళ వద్దనున్న డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాలని, ముఖ్యంగా భాగస్వామ్య పత్రాలను కోరనున్నట్ల దీప తెలియజేశారు. -
జయలలిత బయోపిక్‌ను అడ్డుకోండి!
సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌పై అప్పుడే వివాదాలు చుట్టుముట్టాయి. సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ శుక్రవారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. బయోపిక్‌ల ద్వారా జయలలిత కొందరు ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా ‘తలైవి’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయక కంగనా రనౌత్ జయ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే నుంచే బోలెడంత హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా బాగానే కష్టపడుతున్నారు. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకుంటున్నారు. అయితే చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో దీపా కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు జయలలిత జీవిత చరిత్రపై మరికొంతమంది దర్శకులు వెబ్ సిరీస్‌ను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
‘దీప’కు బెదిరింపులు..!
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేన కోడలు దీపకు బెదిరింపులు, వేధింపులు పెరిగాయి. ఎంజీఆర్, అమ్మ, దీప పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ బెదిరింపులు, వేదింపులు పెరిగాయి. దీంతో తనకు, తన భర్తకు భద్రత కల్పించాలని కమిషనర్ విశ్వనాథన్‌కు దీప విజ్ఞప్తి చేశారు.జయలలిత మరణం అనంతరం ఆమె మేన కోడలు దీప ఓ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంజీఆర్ అమ్మ దీప పేరవైతో రెండేళ్ల పాటుగా సాగిన ఈ పార్టీ వ్యవహారాల మీద అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. పదవుల్ని అమ్ముకున్నట్టుగా కూడా ఆరోపణలే కాదు, వ్యవహారం ముదిరి పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీని నడప లేని పరిస్థితుల్లో ఉన్న దీప, ఇక రాజకీయాలకు దూరం అని గత వారం ప్రకటించారు. అలాగే, ఎంజీఆర్ అమ్మ దీప పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ పార్టీ కోసం జేబులు చిల్లు చేసుకున్న వాళ్లలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమతో మాట వరసకైనా చెప్పకుండా, ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు. జయలలిత మీదున్న అభిమానంతో దీప వెన్నంటి నిలబడి ఆస్తుల్ని సైతం అమ్ముకున్నామని చాలా మంది వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దీపకు ఆ శక్తుల నుంచి బెదిరింపులు, వేధింపులు క్రమంగా పెరిగినట్టుంది. ఆడియో ద్వారా ఫిర్యాదు సోమవారం కమిషనర్ విశ్వనాథన్‌కు దీప ఆడియో రూపంలో ఫిర్యాదు చేశారు. తాను జయలలిత మేన కోడలుగా పేర్కొంటూ, ఇది వరకు తాను రాజకీయాల్లో ఉన్నానని,ప్రస్తుతం తప్పుకున్నట్టు గుర్తు చేశారు. రాజకీయ జీవితం నుంచి దూరంగా ఉన్న తనకు ప్రస్తుతం బెదిరింపులు, వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన పార్టీ పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేసిన అనంతరం ఈ బెదిరింపులు పెరిగినట్టు వివరించారు. ఫోన్ల ద్వారా, వాయిస్ మెస్సేజ్‌ల ద్వారా వస్తున్న బెదిరింపులు ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఓ మహిళ అనే విషయాన్ని కూడా పరిగణించకుండా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అనారోగ్య సమస్య ఉందని, కొంత కాలం చికిత్స సైతం తీసుకోవాల్సి ఉందని, ఈ సమయంలో ఈ బెదిరింపులు భయాన్ని కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణ హాని సైతం ఉందని, దయ చేసి తనకు తన భర్త మాధవన్‌కు భద్రత కల్పించాలని కోరారు. అన్నాడీఎంకేలో పేరవైను విలీనం చేయడానికి అంగీకరించని శక్తులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాయని, తనకు భద్రత కల్పించాలని విన్నవించారు. -
‘ఆమె రక్తం కావాలి.. ఓపికను పరీక్షిస్తోంది’
తిరువనంతపురం, కేరళ : కేరళలోని త్రిచూర్‌కు చెందిన ఓ మహిళా లెక్చరర్ తనకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపా నిశాంత్ త్రిచూర్‌లోని శ్రీ కేరళ వర్మ కాలేజ్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కొందరు బీజేపీ కార్యకర్తలు ఆమెను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా బెదిరించారు. తనను బెదిరించిన వారిని త్వరగా అరెస్టు చేయాలని దీపా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను కోరారు. కేరళ బీజేపీ నాయకుడు, ఇంటెలెక్చువల్ వింగ్ అధ్యక్షుడు టీజీ మోహన్‌దాస్ తన నంబర్‌ను సోషల్‌మీడియాలో పోస్టు చేశారని, అప్పటినుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని దీపా ఫిర్యాదులో పేర్కొన్నారు. బహ్రయిన్లో ఉంటున్న రమేశ్ కుమార్ అనే వ్యక్తి ‘ఆమె రక్తం కావాలి.. ఓపికను పరీక్షిస్తోంది’ అంటూ సోషల్‌మీడియాలో దీపాను ఉద్దేశించి పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ‘మేం అందుకే ప్రయత్నిస్తున్నాం’ అంటూ ఇంటెలెక్చువల్ వింగ్‌లో పని చేసే బిజు నాయర్ అనే వ్యక్తి రమేశ్ పోస్టుకు కామెంట్ చేశాడు. కాగా, దీపా ఫిర్యాదుపై స్పందించేందుకు టీజీ మోహన్ దాస్ నిరాకరించారు. -
భోజ్యేషు ఇండస్ట్రీ
మహిళ ‘భోజ్యేషు మాత’ అయితే కావచ్చు. అయితే భోజనాన్ని వండి వడ్డించే పరిశ్రమలో ఆమె రాణించగలదా అనే సంశయం అనేకమందిలో ఇప్పటికీ ఉంది. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ‘రాణించగలం’ అని.. గత దశాబ్దకాలంగా లండన్‌లో తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఓ ఐదుగురు భారతీయ మహిళలు. దీప్నా ఆనంద్ లండన్‌లోని భారతీయ భోజన పరిశ్రమ రంగంలో దాదాపుగా మొదటి స్థానంలో ఉన్నారు దీప్నా ఆనంద్. ఈమె తాతగారు కెన్యాలో 1950లో ఒక రెస్టారెంట్ ప్రారంభించి దానికొక బ్రాండ్ ఇమేజిని సృష్టించుకున్నారు. అయితే పదిహేనేళ్ల తర్వాత దాని ప్రాభవం తగ్గిపోయింది. దాంతో ఆమె తండ్రి రంగంలోకి దిగి ‘డిప్ ఇన్ బ్రిలియంట్’ పేరుతో లండన్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సంప్రదాయ పంజాబీ తాలీని, తన కుటుంబంలో అంతా ఇష్టపడే రుచులను రెస్టారెంట్లో ప్రవేశపెట్టారు. దీంతో ఆ కెన్యా ఘుమఘుమలు లండన్‌కు వ్యాపించాయి. తర్వాత తండ్రి నుంచి తను స్వీకరించారు దీప్నా. ఇప్పుడు ‘ఇన్ కిచెన్ ఆన్ బి 4 యు’ అనే టీవీ షోతో లండన్‌లో చాలా పాపులర్ అయ్యారు. రవీందర్ భోగల్ రవీందర్ భోగల్ అనే ఈ ఫ్యాషన్ జర్నలిస్ట్ కూడా రెస్టారెంట్ వైపు తన దృష్టిని మరల్చారు. చెఫ్, కుకరీ రైటర్‌గా లండన్‌లో పేరొందారు. ‘జెంటిల్మెన్స్ క్లబ్ డెకార్’ పేరుతో రెస్టారెంట్స్‌ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. కెన్యా, నార్త్ ఇండియన్ వంటకాలను ఈమె తన రెస్టారెంట్ ద్వారా అందిస్తున్నారు. ఆస్మాఖాన్ ఇరవై నాలుగు గంటలూ ఈమె రెస్టారెంట్లో ఛాయ్ కోసం ఆర్డర్ ఇవ్వచ్చు. కోల్‌కతా వాసి అయిన ఆస్మా ఖాన్ తన ఇండియన్ రెస్టారెంట్ ద్వారా రాయల్ మొఘల్ ఘుమఘుమలను అందిస్తున్నారు. కొన్నేళ్లక్రితం కుటుంబంతో లండన్ చేరిన ఆస్మా లాయర్గానూ రాణించారు. హైదరాబాద్ రాయల్ డిషెస్, కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్, బెంగాల్ క్లాసికల్ రిఫ్లెక్ట్స్.. ఆస్మా అందించే రుచులలో జిహ్వను మైమరపిస్తాయి. చెఫ్ శిల్పా దండేకర్ పూర్తిగా ఇండియన్ వంటకాలను మూడేళ్లుగా అందిస్తున్నారు. శిల్ప ఇండియన్ తాజ్ హోటల్ గ్రూప్‌లో శిక్షణ తీసుకున్నారు. యు.కె. వెళ్లిన తర్వాత అక్కడి పబ్బులలో రుచికరమైన వంటలను అందించారు. ఆ తర్వాత తనే సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కాలానుగుణంగా లభించే పదార్థాలతో వంటలను రుచికరంగా అందించడం శిల్ప ప్రత్యేకత. ఏంజెలా మాలిక్ ఈమెది పంజాబీ నేపథ్యం. చెఫ్‌గా రాణించడమే కాకుండా సొంతంగా కుకరీ స్కూల్‌ను నడుపుతున్నారు. టీవీల్లోనూ, రేడియోలోనూ తన క్లాసుల ద్వారా నగరవాసులకు చేరువయ్యారు. ఏంజెలా మాలిక్ అనే మరో చెఫ్ ‘లండన్ ఫుడ్ బోర్డ్’ సభ్యురాలిగా భారతీయ రుచులపై స్థానికులకు ఆసక్తి కలిగించడంతో పాటు, భారతీయ భోజన పరిశ్రమకు విస్తృతినీ కల్పిస్తున్నారు. ‘ప్రతిభ ఉన్న ఏ రంగంలో అయినా అవకాశాల కోసం ఎదురుచూడటం కాదు, ఆ అవకాశాలను మనమే కల్పించుకోవాలి’ అనేది ఈ ఆధునిక మహిళలు వంట ద్వారా నిరూపిస్తూ చెబుతున్నారు. ఫైవ్ ఉమెన్ వీళ్ల కన్నా ముందులండన్‌లో మొదటిసారి‘చట్నీ మేరీ’ అనే పేరుతో మోడ్రన్ ఇండియన్ రెస్టారెంట్‌ని నమిత, కామెలియా అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు 1990లలో ప్రారంభించారు. పంజాబీయులు అయిన ఈ అక్కచెల్లెళ్లు తమ కుటుంబ సంప్రదాయ రుచులను వండి వడ్డించారు. వంటల పుస్తకాలు, టీవీ షోల ద్వారా భోజనప్రియుల మనసులను కొల్లగొట్టారు. కొన్నాళ్లలోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. -
జయ ఆస్తి కోసం ‘అమృత’ నాటకం!
సాక్షి, చెన్నై : తన మేనత్త దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు, వారసత్వం కోసమే బెంగళూరుకు చెందిన అమృత నాటకాలు ఆడుతున్నారని దీప ఆరోపించారు. గురువారం ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మరణం తర్వాత వారసత్వంపై జరుగుతున్న పరిణామాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. ఆమె ఆస్తులకు తామే వారసులం అంటూ జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప ,కుమారుడు దీపక్‌లు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇక, రాజకీయంగా అమ్మ వారసత్వాన్ని అంది పుచ్చుకునే యత్నంలో కేసులు వెంటాడటంతో చిన్నమ్మ శశికళ కటకటాలకు పరిమితం అయ్యారు. అయితే, అమ్మకు తానే బిడ్డనంటూ బెంగళూరుకు చెందిన అమృత (37) తెర మీదకు రావడంతో కొత్త చర్చ మొదలైంది. జయలలితే తన కన్న తల్లి అని, డీఎన్ఏ పరీక్షకు కూడా తాను సిద్ధం అని అమృత ప్రకటించారు. అమ్మ ఆస్తులు తనకు వద్దని, ఆమెకు కన్నబిడ్డగా సంప్రదాయబద్దంగా జరగాల్సిన అంత్యక్రియలను పూర్తి చేయడానికి తనకు అనుమతి ఇవ్వాలని అమృత న్యాయ పోరాటం చేస్తున్నారు. జయలలితకు వైష్టవ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరిపించాలని, తనకు కావాలంటే డీఎన్ఏ పరీక్షలు కూడా చేసుకోవచ్చంటూ అమృత హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ కేసు విచారణ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు రానుంది. గత విచారణ సమయంలో అమృత వాదనలను పరిగణించిన కోర్టు దీప, దీపక్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. అమృత పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పటికే దీప, దీపక్ లు కోర్టుకు వివరణ ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదు. శుక్రవారం న్యాయమూర్తి వైద్యనాథన్ బెంచ్ ముందు సాగే విచారణలో తమకు మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసి, వాయిదాల పర్వంతో కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అమృత వాదనలను గత విచారణలో పరిగణలోకి తీసుకున్న బెంచ్ తాజాగా ఏదేని కొత్త ఉత్తర్వులు ఇచ్చేనా అని ఉత్కంఠ రేపుతోంది. -
దీప ఇంటి వద్ద నకిలీ ఐటి అధికారి కలకలం
-
దీప ఇంట్లో ఐటీ సోదాలు.. ట్విస్ట్
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ఇంట్లో శనివారం ఉదయం ఆదాయపన్ను అధికారుల సోదాల కలకలం చెలరేగింది. పార్టీ పదవులను అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడలు జరిగినట్లు అందరూ భావించారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ సంచలనం కలిగించింది. దాడి చేసింది అసలు ఐటీ అధికారులు కాదు. గ్యాంగ్ సినిమా తరహాలో నకిలీ ఇన్‌కం టాక్స్ అధికారులు ఈ దాడులకు యత్నించారు. ఐటీ దాడులకు వచ్చిన అధికారుల తీరుపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీప నివాసానికి చేరుకొనేలోపే నకిలీ ఐటీ గ్యాంగ్ మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. సినిమాలో మాదిరి పెద్ద ఎత్తున డబ్బు, వస్తువులను దోపిడీ చేయవచ్చనే ఉద్దేశంతోనే నకిలీ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ సినిమాలో మాదిరి.. ఒక్క రోజులో సీఎం కాలేరు’
సాక్షి, టీ. నగర్: సినిమాల్లో జరిగినట్లు ఎవరూ ఒక్క రోజులో ముఖ్యమంత్రి కాలేరని పేరవై ప్రధాన కార్యదర్శి జె.దీప అన్నారు. తనపై రూ. 1.12 కోట్లు మోసగించినట్లు ఆరోపణలు రావడం శశికళ కుటుంబీకులు చేసిన కుట్రగా జె. దీప పేర్కొన్నారు. కడలూరులో ఎంజీఆర్ అమ్మ దీప పేరవై తూర్పు జిల్లా ఆధ్వర్యంలో ఎంజీఆర్, జయలలిత బహిరంగ సభ, సంక్షేమ సహాయకాల పంపిణీ కార్యక్రమం తేరడి మైదానంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దీప మాట్లాడుతూ.. జయలలిత జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమె పుట్టిన రోజు నుంచి రాయడం ప్రారంభించారని తెలిపారు. అన్నాడీఎంకేను, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. జయలలిత మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటైందని, ఈ కమిషన్ ద్వారా వాస్తవాలు బయటపడుతాయని తెలిపారు. అంతేకాక ఆమె తనపై వచ్చిన రూ. 1.12 కోట్ల వ్యవహారం ప్రస్తావించారు. దీనిపై మోసం చేసినట్లు ఫిర్యాదులందాయని వాపోయారు. తనపై ఇది వరకే అనేక ఫిర్యాదులు చేయడమే కాకుండా అసత్యాలను వెల్లడిస్తున్నారని ఆమె అన్నారు. ప్రస్తుతం రూ. 1.12 కోట్లు మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదు శశికళ కుటంబీకులు చేసిన కుట్రగా జె. దీప తెలిపారు. -
అమ్మ మరణ తేదీలోనూ మరోమలుపు
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం మిస్టరీ మలుపులు తిరుగుతోంది. జయ కన్నుమూసి ఏడాది దాటినా మరణం వెనుక అనేక మర్మాలు దాగి ఉన్నట్లు పార్టీ పెద్దలే ప్రచారం చేస్తూ సంచలనాలకు తెరదీస్తున్నారు. సాక్షి, చెన్నై: 2016 సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినపుడు జ్వరం, డీహైడ్రేషన్ వంటి స్వల్ప అనారోగ్యంతో బాధపుడుతున్నారని ఆస్పత్రి యాజమాన్యం బులిటెన్ విడుదల చేసింది. త్వరలోనే ఆమె కోలుకుని డిశ్చార్జ్ అవుతారని సైతం ఆస్పత్రి వర్గాలు, పార్టీ శ్రేణులు తెలిపాయి. అయితే 74 రోజుల చికిత్స తరువాత అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీ కన్నుమూసినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. కోలుకుంటున్న జయలలిత ప్రాణాలు ఎలా కోల్పోయారనే ప్రశ్న సహజంగానే అందరి మెదళ్లను తొలిచివేసింది. ఎక్కువశాతం మంది ప్రజలు, అమ్మ అభిమానులు శశికళనే నిందించారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం శశికళ వైపు అనుమానంగా చూసాయేగానీ ఎవ్వరూ నోరుమెదపలేదు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సీబీఐ, న్యాయవిచారణకు పట్టుపట్టాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేయగా, కమిషన్ చైర్మన్, రిటైర్డ్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, జయలలిత మరణ వివాదం ఇటీవలి కాలంలో మళ్లీ రాజుకుంటోంది. మరణించిన తరువాతనే వేలిముద్రలు సేకరణ 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఫారంపై జయ మరణించిన తరువాతనే వేలిముద్రలు సేకరించారని డీఎంకే లీగల్‌సెల్ కార్యదర్శి శరవణన్ విచారణ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. జయ వేలిముద్రలతో జీవించి ఉన్నవారి వేలిముద్రలను ఆయన పోల్చిచూపారు. కాగా, జయ 5వ తేదీ కాదు 4వ తేదీ సాయంత్రమే మరణించారని శశికళ తమ్ముడు దివాకరన్ ఇటీవల మరో బాంబు పేల్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కేంద్రప్రభుత్వానికి చెందిన పెద్దమనిషి నడిపిన రాజకీయం వల్లనే మరణ వార్త ప్రకటన మరురోజుకు వాయిదా పడిందని ఆరోపించారు. దివాకరన్ చేసిన ప్రకటన జైల్లో ఉన్న శశికళను సైతం కంగారు పెట్టింది. ఇదిలా ఉండగా దివాకరన్ వ్యాఖ్యలను సాక్షాత్తు మంత్రి రాజేంద్రబాలాజి సైతం బలపరిచారు. విరుదునగర్‌లో శనివారం జరిగిన దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకల బహిరంగ సభలో తమిళనాడు మంత్రి రాజేంద్రబాలాజి మాట్లాడుతూ, జయలలిత గుండెఆగిపోయి మరణించినట్లుగా 2016 డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు తనకు సమాచారం రాగా వెంటనే తాను అపోలో ఆస్పత్రికి వెళ్లానని చెప్పారు. జయది హత్యే: ఇక జయ మరణాన్ని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పొన్నయ్యన్ మరింత సంచల మలుపు తిప్పారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకలు కాంచీపురంలో శనివారం జరిగాయి. పొన్నయ్యన్ ప్రత్యేక ఉపన్యాసం చేశారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న జయలలిత అప్పుడప్పుడూ స్టెరాయిడ్ మందులు ఇవ్వాల్సి ఉండేది. అయితే జయ అనారోగ్యాన్ని శశికళ, ఆమె కుటుంబ సభ్యులు అవకాశంగా తీసుకుని ఎనిమిది నెలలపాటూ స్లోపాయిజన్‌గా పదే పదే స్టెరాయిడ్స్ ఇచ్చారు. తరచూ ఇచ్చిన స్టెరాయిడ్స్‌తో అమె ఇన్ఫెక్షన్కు గురైయ్యేలా చేసి హతమార్చారు. ఈ విషయాన్ని అన్నాడీఎం శ్రేణులు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వల్లనే ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిందని ఆయన తెలిపారు. జయ ఆస్తులపై పెత్తనం కోరిన దీప, దీపక్: జయలలిత మరణ వివాదం ఇలా సాగుతుండగా, ఆమె ఆస్తులకు తమను నిర్వాహకులుగా ప్రకటించాలని కోరుతూ ఆమె అన్నకుమారుడు దీపక్, కుమార్తె దీప మద్రాసు హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. అందులో జయకు తాము మినహా చట్టబద్ధమైన వారసులు ఎవ్వరూ లేరు. చనిపోయే ముందు ఆమె వీలునామా రాసిన దాఖలాలు కూడా లేవు. వారసులుగా తమను నిర్ధారిస్తూ సర్టిఫికెట్‌ను జారీచేయాల్సిందిగా అనేకసార్లు చెన్నై తహసీల్దారును కోరినా ఇవ్వలేదు. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసి సర్టిఫికెట్ పొందవచ్చని ఆయన సూచించారు. జయలలితకు రూ.52 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. వాటిని ఆరునెలల్లోగా పూర్తిగా లెక్కకట్టి కోర్టుకు తెలియజేస్తాం. ఆ తరువాత ఏడాది లోగా అసలైన లెక్కలు కోర్టుకు చూపుతాం. ఇందుకు వీలుగా తమను జయ ఆస్తుల నిర్వాహకులుగా ప్రకటించాల్సిందిగా వారు పిటిషన్లో పేర్కొన్నారు. -
ఇక.. చొరబాటే
► చట్టపరంగా కసరత్తులు ► మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప ► ఆస్తులన్నీ మావే : దీపక్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, మేనల్లుడు మేనత్త ఆస్తుల కోసం మళ్లీ తెర ముందుకు వచ్చారు. పోయెస్ గార్డెన్‌లోకి చొరబడేందుకు సిద్ధమైనట్టు, పార్టీని కైవసం చేసుకునేందుకు చట్టపరంగా కసరత్తులు మొదలెట్టినట్టుగా దీప ప్రకటించారు. మేనత్తకు చెందిన ఆస్తులన్నింటికీ తామే వారసులం అని, చిన్న అత్త శశికళ కుటుంబీకులు తప్పుకుంటే మంచిదని దీపక్ హెచ్చరించారు. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత ఆస్తులకు తామే వారసులం అని ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఐక్యత లేని దృష్ట్యా, తరచూ వివాదం బయలుదేరుతోంది. గత ఆదివారం పోయెస్ గార్డెన్ వేదికగా, అక్క, తమ్ముడు కయ్యానికి కాలు దువ్వుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం దీప మీడియా ముందుకు వచ్చారు. అలాగే, దీపక్ మరో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆస్తులన్నీ తమదేనని, తామిద్దరికీ అన్ని హక్కులు అంటూ వ్యాఖ్యానించారు. అయితే, దీపక్ వ్యాఖ్యలు ఓ రకంగా సాగితే, దీప వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. గార్డెన్‌ను కైవసం చేసుకుంటా: టీ.నగర్‌లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక, ఎవర్నీవదలి పెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని అందుకున్నారు. పోయేస్ గార్డెన్‌ను కైవశం చేసుకుంటానని, ఎవరు అడ్డు వచ్చినా, ఎదురించి చొరబడటమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఆస్తుల కైవశం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తంచేశారు. పోయేస్ గార్డెన్లో ఏదో జరుగుతోందన్న అనుమానం కల్గుతోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరనీ, వివాదం సాగగానే, లోపలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ఆరోపించారు. శశికళ ఫోటోను తాను బయటపడేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆ వ్యక్తులు చొచ్చుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నట్టు తెలిపారు. ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని పోయేస్ గార్డెన్ ఇంటినే కాదు, పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తంచేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్ ఎదురుచూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నం రక్షిస్తానని, పార్టీలోకి అడుగుపెట్టి, మేనత్త స్థానాన్ని భర్తీ చేస్తానని వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే, తన వైపునకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్ తనకు మరింత సమయాన్ని కేటాయిస్తూ మరో రెండు లక్షల అంశాలతో కూడిన ప్రమాణ పత్రం దాఖలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. జయ పేరవై తరహాలో అన్నాడీఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందని పేర్కొన్నారు. ఆస్తులన్నీ మావే ఓ మీడియాతో ప్రత్యేకంగా దీపక్ మాట్లాడుతూ తమ అవ్వ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసినట్టు, అవన్నీ మేనత్త పేరుతోనే ఉన్నాయని వివరించారు. గతంలో రాసిన వీలునామా మేరకు, మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తుల మేరకు ప్రస్తుతం తాను తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవనీ, చిన్నత్త శశికళ ఫోటోను బయటకుపడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకు ముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే, చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే, తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడూ.. ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేదని స్పష్టంచేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తులు గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్‌లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నాననీ.. అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురుకాలేదని స్పష్టంచేశారు. ఈ ఆస్తులన్నీ చిన్నత్త శశికళ కుటుంబీకుల చేతిలో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయని, దయచేసి వారుగా ముందుకు వచ్చి తమకు అప్పగించాలని కోరారు. -
జయలలిత ఆస్తులన్నీ మావే
► మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప ► ఆస్తులన్నీ మావే :దీపక్ చెన్నై : మేనత్త ఆస్తి కోసం మేనకోడలు, మేనల్లుడు పోటీ పడుతున్నారు. అత్తమ్మ ఆస్తులకు తామే అసలైన వారసులమంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం ఆమె సోదరుడి సంతాపం అయిన దీపక్, దీపలు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం టీ నగర్‌లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని సంధించారు. పొయస్ గార్డెన్‌ను కైవసం చేసుకుంటానని, ఎవరు అడ్డొచ్చినా ఎదిరించి చొరబడటమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆస్తుల కైవసం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. పొయస్ గార్డెన్లో ఏదో జరుగుతోందన్న అనుమానం వస్తోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరని, శశికళ ఫోటోను తాను బయట పడేయడానికి ప్రయత్నించిన సమయంలో లోపలి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానని, ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని, పొయస్ గార్డెన్‌నే కాదు పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్ ఎదురు చూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నాన్ని రక్షిస్తానని చెప్పారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే తన వైపుకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జయ పేరవై తరహాలో అన్నాడిఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందన్నారు. ఆస్తులన్నీ మావే మరోవైపు జయ మేనల్లుడు దీపక్ మీడియాతో మాట్లాడుతూ తమ నానమ్మ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసిందని, అవన్నీ అత్త జయలలిత పేరుతోనే ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో రాసిన వీలునామా మేరకు మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తులకు ప్రస్తుతం తాను,తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని, చిన్నత్త శశికళ ఫోటోను బయట పడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకుముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే తాను ఏమి చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడు, ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేరని స్పష్టం చేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తుల గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్‌లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నట్టు, అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురు కాలేదని స్పష్టం చేశారు. తొలుత చిన్నమ్మ శశికళకు అనుకూలంగా వ్యవహరించిన దీపక్ తదుపరి పరిణామాలతో తన సోదరికి దగ్గరయ్యే విధంగా వ్యవహరించడం మొదలెట్టారు. -
అమ్మపార్టీ నాదే!
♦ అన్నాడీఎంకే కోసం నాలుగో పోరు ♦ పోటీకి దిగిన దీప ♦ నేడు ఎన్నికల కమిషన్‌కు 50వేల ప్రమాణపత్రాలు అమ్మ మరణం తరువాత ముక్కలై చివరకు నిషేధానికి గురైన అన్నాడీఎంకే కోసం నాలుగోపోరు మొదలైంది. సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లతో పాటు జయలలిత మేనకోడలు దీప కూడా పోటీకి దిగారు. అమ్మ అన్నకూతురైన తానే అన్నాడీఎంకేకి అసలైన వారసురాలినని పేర్కొంటూ 50వేల ప్రమాణపత్రాలతో గురువారం ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్చించనున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత ఆమె అన్న కుమార్తె దీప ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ ని ప్రారంభించారు. అన్నాడీఎంకేలో ఇప్పటికే సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చెరో వర్గంగా కొనసాగుతుండగా జైలు నుంచి వచ్చిన దినకరన్ తనో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ఇక అన్నాడీఎంకే దీప వర్గంగా పనిచేస్తుందని కొన్నినెలల క్రితం దీప ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీ ముక్కలు కావడంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికల సమయంలో ఆ పార్టీ, రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఎంజీ రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నంను దక్కించుకునేందుకు మూడువర్గాలు పోటీపడుతున్నారు. ఎన్నికల కమిషన్‌కు రూ.60 కోట్ల ముడుపులు ముట్టజెప్పడం ద్వారా దొడ్డిదారిలో రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని టీటీవీ దినకరన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా కటకటాలపాలయ్యాడు. ఎన్నికల కమిషన్‌కు దశలవారీగా వేలకొలది డాక్యుమెంట్లు సమర్పిస్తూ అన్నాడీఎంకేను సొంతం చేసుకునేందుకు ఎడపాడి, పన్నీర్, దినకరన్ వర్గాలు పాకులాడుతున్నాయి. నేను సైతం : దీప పోయస్ గార్డెన్‌లోని జయలలిత ఇల్లు తనకే చెందాలంటూ ఇటీవల పోరుబాటపట్టిన దీప తాజాగా అన్నాడీఎంకేకి తానే అసలైన వారసురాలిననే నినాదాన్ని భుజానెత్తుకున్నారు. అత్త మరణం తరువాత ఆమె పార్టీపై ఆధిపత్యం తనదేనని చెప్పుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నంను సాధించుకునేందుకే దీప పేరవైని అన్నాడీఎంకే దీప వర్గంగా మార్పులు చేసినట్లు గతంలో చెప్పిన దీప తాజాగా కార్యాచరణలోకి దిగారు. అన్నాడీఎంకేకి చెందిన వివిధ అనుబంధ శాఖలు సంతకాలు చేసిన 50 వేల ప్రమాణపత్రాలను ఎన్నికల కమిషన్‌కు గురువారం సమర్పించనున్నారు. ఆ పత్రాలను ఎన్నికల కమిషన్‌కు స్వయంగా అందజేసే నిమిత్తం దీప వర్గ ప్రధాన అధికార ప్రతినిధి, న్యాయవాది పశుంపొన్ పాండియన్ తదితరులు ఢిల్లీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలని, శశికళ స్థానంలో సరైన విధానంలో మరలా ఎన్నిక నిర్వహించాలని, పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి నేతలు సైతం సంతకాలు చేసిన ప్రమాణ పత్రాలు పరిశీలించి అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నంను దీపకు అప్పగించి ఆపార్టీకి అసలైన వారసులుగా ప్రకటించాలని తదితర కోర్కెలతో ఎన్నికల కమిషన్‌కు గురువారం వినతిపత్రం సమర్పించనున్నారు. -
కల్లోల దీపం
♦ దీపక్ పిలుపుతో వేద నిలయంలోకి ♦ ఆ అరగంట ఏం జరిగింది ♦ కాసేపటికి ఉత్కంఠ – ముష్టియుద్ధం ♦ హతమార్చేందుకు ప్రయత్నంగా ఆరోపణలు ♦ మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారు ♦ దీప వ్యాఖ్యలతో ఉత్కంఠ వేద నిలయం వేదికగా దివంగత సీఎం జయలలిత మేనల్లుడు, మేన కోడలు మధ్య వివాదం చెలరేగింది. సోదరుడు దీపక్ పిలుపుతో మేనత్త ఇంట్లోకి సోదరి దీప ఆదివారం అడుగుపెట్టారు. అర్ధగంట సజావుగా సాగినా, తదుపరి ఏమైందో ఏమో క్షణాల్లో కల్లోలం బయలు దేరింది. తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్టుగా దీప ఆరోపణలు గుప్పించారు. మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వ్యాఖ్యలతో క్షణాల్లో పోయెస్‌గార్డెన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాక్షి, చెన్నై: జయలలిత మరణం తదుపరి ఆమె ఆస్తులకు తాను, తన సోదరి దీప మాత్రమే వారసులం అని దీపక్ వ్యాఖ్యానిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు అనుకూలంగా వ్యవహరించిన దీపక్ తదుపరి పరిణామాలతో తన సోదరికి దగ్గరయ్యే విధంగా వ్యవహరించడం మొదలెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం దీప, దీపక్‌ల మధ్య చోటుచేసుకున్న సమరం ఉత్కంఠకు దారి తీసింది. జయలలిత మరణం, చిన్నమ్మ శశికళ జైలు జీవితం తదుపరి కొన్ని నెలలుగా పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం నిర్మానుష్యంగా మారిన విషయం తెలిసిందే. భద్రత కూడా ఇక్కడ కరువైంది. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు ఏదో అరుపులు కేకలు వినిపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీప రూపంలో కల్లోలం బయలు దేరడంతో ఆ పరిసరాల్లో ఉత్కంఠ బయలు దేరడం గమనార్హం. వేద నిలయంలోకి దీప : తమ్ముడు దీపక్ పిలుపు మేరకు మిత్రుడు రాజాతో కలిసి దీప ఉదయం పోయెస్‌గార్డెన్‌కు వచ్చారు. అక్కడ భద్రత సిబ్బంది ఎవ్వరూ లేని దృష్ట్యా లోనికి వెళ్లారు. అర్ధగంట పాటు అక్కడే ఆమె ఉన్నారు. తదుపరి ఏమి జరిగిందో ఏమో వేదనిలయంలో అరుపులు కేకలు, వివాదం సాగుతున్నట్టుగా ఉత్కం ఠ. ఈ సమాచారంతో ఓ మీడియా వేదనిలయంలోకి ప్రవేశించింది. వెళ్లిన కాసేపటికి ఆ మీడియా ప్రతినిధులు బయటకు పరుగులు పెట్టడంతో పోయెస్‌గార్డెన్ పరిసరాల్లో క్షణాల్లో ఉద్రిక్తతను రేపింది. లోపల ఏమి జరుగుతోందో అన్న ఉత్కంఠ తప్పలేదు. ఇంతలో లోపల నుంచి చెదిరిన జుట్టు, నీరసంగా దీప, ఆమె వెంట భర్త మాధవన్, మిత్రుడు రాజా బయటకు పరుగెత్తుకు వచ్చారు. ఇంతలో అక్కడికి దీప మద్దతు దారులు తరలి రావడం, క్షణాల్లో పోలీసు భద్రత కట్టుదిట్టం కావడం వంటి పరిణామాలు సినీ ఫక్కీలో సాగాయి. దీప మీద దాడి జరిగిందంటూ ఆమె మద్దతుదారులు ఆగ్రహంతో ఊగి పోవడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. హతమార్చేందుకు కుట్ర : ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన నీళ్లు తాగి, కుదటపడ్డ అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. నాలుగైదు రోజులుగా వేద నిలయానికి రావాలని దీపక్ పదేపదే తనకు ఒత్తిడి తెచ్చినట్టు వివరించారు. తనకు ఇక్కడకు రావడం ఇష్టం లేదని, సోమవారం చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సమయంలో ఉదయాన్నే పదేపదే ఫోన్ చేసి ఇక్కడకు రావాలని, మేనత్త కోసం పూజలు చేయాల్సి ఉందని సూచించి రప్పించినట్టు తెలిపారు. తాను, తన మిత్రుడు రాజా ఇక్కడికి వచ్చామని, దీపక్ వెంట రౌడీల్లా ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు చెప్పారు. హఠాత్తుగా తన మీద ఆ వ్యక్తులు దాడికి ప్రయత్నించారని, రాజా అడ్డుకునే క్రమంలో వివాదం ముదిరిందని, ఇంతలో తన భర్త మాధవన్‌కు ఫోన్‌చేసి పిలిపించడంతో బయట పడ్డానని తెలిపారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ మీడియా ప్రతినిధి, కెమెరామెన్ మీద కూడా ఆ వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. పథకం ప్రకారం తనను ఇక్కడకు పిలిపించి హతమార్చేందుకు కుట్ర చేసినట్టుందని ఆరోపించారు. తనకు, తన భర్త మాధవన్‌కు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజా మీద తప్పుడు కేసులు వేసి కక్ష సాధింపు చర్యలకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మేనత్తను దీపక్, శశికళ కలిసి హతమార్చారని ఆరోపిస్తూ, దీపక్‌ను కూడా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం. దినకరన్ గురించి మాట్లాడ వద్దని బెదిరించారని, క్షణాల్లో పోలీసులు అక్కడకు రావడం బట్టి చూస్తే, ముందస్తు పథకం వేసినట్టు అనుమానాలు కల్గుతోందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ వ్యవహారాలపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయనున్నట్టు, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. దీపక్‌పై దీప ఫైర్ : మీడియాకు చిక్కిన వీడియో మేరకు దీపక్‌పై దీప తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దీప, దీపక్ జయలలిత ఫొటో వద్ద పుష్పాంజలి ఘటించారు. తదుపరి వేద నిలయంలోకి దీప వెళ్లారు. అర్ధగంట లోపల ఏమి జరిగిందో ఏమోగానీ, కాసేపటికి వెలుపల ఉత్కంఠ తప్పలేదు. ఓ పోలీసు అధికారి రంగంలోకి దిగి దీపను వారిస్తున్నారు. దీపక్‌ను ఉద్దేశించి దీప అనుచిత వ్యాఖ్యలు గుప్పించారు. పొకిరి, రాస్కెల్..మాధవన్ మీద చేయి చేసుకుంటావా, నాకు నీ ముఖం ఇక చూపించ వద్దు అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆ పోలీసు అధికారి మాధవన్‌కు ఏమి కాదు, తాను చూసుకుంటానని సమాధానం ఇస్తుండగా, అందరూ సమాధానం చెప్పే రోజు త్వరలో వస్తుందని దీప మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ దృశ్యాల్లో కనిపించారు. పూజ అని పిలిపించి, హతమార్చేందుకు కుట్ర చేస్తారా, ఇంతసేపు ఎంతకు తనను వెయిట్ చేయించారంటూనే, ఇతనే... ఇతనే అంటుండగా ఓ వ్యక్తి అక్కడి నుంచి జారుకుంటూ వేద నిలయంలోకి వెళ్లడం ఆ మీడియాకు చిక్కిన దృశ్యాల్లో ఉండడం గమనార్హం. ఇక వేద నిలయంలో తమ్ముడు, అక్కయ్య మధ్య ఏమి జరిగిందోనన్న ఉత్కంఠ తప్పలేదు. వారసులు ఆస్తుల కోసం తన్నుకున్నారేమో...అని వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్లు పెరిగారు. మీడియాపై దాడి జరగడంతో జర్నలిస్టులు ఆందోళన చేశారు. నేనే రప్పించాను – దీపక్ : దీపను తానే పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయానికి రప్పించానని దీపక్ పేర్కొన్నారు. వి వాదంపై ఓ మీడియాకు ఆయన స్పం దిస్తూ దినకరన్ మనుషులు ఎవ్వరూ ఇక్కడ లేరన్నారు. ఇక్కడ ఏమీ జరగలేదని, నాకు, దీపకు మధ్య ఎలాంటి గొడవ లేదని స్పందించడం గమనార్హం. ఇక, ఈ వివాదం పుణ్యమా, ఇన్నాళ్లు నిర్మానుష్యంగా ఉన్న వేద నిలయం పరిసరాల్ని, ప్రస్తుతం నిఘా నీడలోకి తీసుకు వచ్చారు. -
గుర్తు పట్టాలని!
► రెండాకుల చిహ్నం కోసం మూడు పార్టీల పట్టు ► దీప పేరవై పేరు మార్పు ► ఈసీకి పన్నీర్ వర్గం ప్రమాణపత్రాల సమర్పణ అన్నాడీఎంకేకు ఆయువు పట్టు రెండాకుల చిహ్నం. ఈ గుర్తుకోసం మూడు పార్టీలు పోరుబాట పట్టాయి. శశికళ వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద తన వాదన వినిపించింది. ఇప్పుడు పార్టీ పేరు మార్పుతో దీప, ఈసీకి ప్రమాణపత్రాల సమర్పణతో పన్నీర్‌సెల్వం రెండాకుల గుర్తు దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత గత ఏడాది కన్నుమూసిన కొద్దిరోజుల్లోనే రెండాకుల పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకేకు అసలైన వారసులం తామంటే తామని శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాల ప్రకటించుకోగా ఎవ్వరూ కాదు పొమ్మంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామంతో విస్తుపోయిన ఇరువర్గాలు రెండు పార్టీలు పెట్టుకున్నాయి. శశికళ వర్గం తమ పార్టీకి ‘అన్నాడీంకే అమ్మ’ (టోపీ గుర్తు), పన్నీర్ వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవీ అమ్మ’ (రెండు దీపాల విద్యుత్ స్తంభం గుర్తు) అని నామకరణం చేసుకుని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తలపడ్డాయి. అయితే అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం లేకుండా నెగ్గుకు రావడం కష్టమని కొద్దిరోజుల్లోనే ఇరు వర్గాలకూ తెలిసిపోయింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం లేని లోటును డబ్బుతో అధిగమించేందుకు ప్రయత్నించి అభాసుపాలు కావడంతోపాటు ఎన్నికల రద్దు కారకుడయ్యాడు. అంతేగాక రెండాకుల చిహ్నంను దొడ్డిదారిన దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్‌కే రూ.50 కోట్ల ఎరవేసి జైలు పాలయ్యాడు. రెండాకుల కోసం మూడు పార్టీల పోరు ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్న అన్నాడీఎంకేను, రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాలను మానివేసి పార్టీ క్యాడర్ బలం ద్వారా పొందాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. ప్రస్తుతం పార్టీ, మెజార్టీ ఎమ్మెల్యేల బలం ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనే ధీమాతో ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే అనేక పత్రాలను సమర్పించిన శశికళ వర్గం నింపాదిగా వ్యవహరిస్తోంది. పన్నీర్ వర్గం ప్రమాణ పత్రాల సమర్పణ: ఇక పన్నీర్‌సెల్వం వర్గం సైతం ఎన్నికల కమిషన్నే నమ్ముకుంది. అమ్మ పార్టీకి అసలైన వారసులం అంటూ గతంలో 20 వేల పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఇందుకు అదనంగా శుక్రవారం 12,600 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను అందజేసింది. పన్నీర్‌సెల్వం నాయకత్వాన్ని తాము సమర్థిస్తున్నామంటూ పార్టీ నేతలు, సభ్యుల సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలు అందులో ఉన్నాయి. ఇరువర్గాల పత్రాలను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. పేరు మార్చుకున్న దీప పేరవై: రెండాకుల చిహ్నం కోసం శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీ పడుతుండగా జయలలిత అన్నకుమార్తె దీప సైతం రంగంలోకి దిగారు. అమ్మకు రక్తసంబంధీకులమేకాదు, రాజకీయ వారసురాలిని కూడా నేనే అంటూ ఎంజీఆర్ ‘అమ్మ దీప పేరవై’ పేరుతో జనం ముందుకు వచ్చారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో సైతం పేరవై పేరుతో పోటీచేసిన దీప... రెండాకుల చిహ్నం రేసులో ఉరికేందుకు తాజాగా తన పార్టీ పేరును మార్చారు. పేరవై ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రుమాన పాండియన్ అధ్యక్షతన నిర్వాహకులతో శుక్రవారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవైని రద్దు చేసి ‘అన్నాడీఎంకే దీప’ వర్గంగా మార్చడం తీర్మానాల్లో ప్రధానమైనది. -
పులిని చూసి ఎలుక ఎగతాళి
రాందాస్ వ్యాఖ్యలపై దీప గరం టీనగర్: అన్నాడీఎంకేపై రాందాస్ వ్యాఖ్యలు చేయడం పులిని చూసి ఎలుక ఎగతాళి చేసినట్లుంద ని ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ప్రధాన కార్యదర్శి జె. దీప విమర్శించారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. అవినీతి రాబందులు ఊరిని మోసగించే విధంగా రెండు వర్గాల విలీనం పేరుతో నాటకాన్ని రక్తికట్టిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం దినకరన్ అరెస్టు వ్యవహారాన్ని దారి మళ్లించేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో శశికళ బ్యానర్ల తొలగింపుతో పురట్చి తలైవర్ ఎంజీఆర్, పురట్చి తలైవి జయలలిత వర్గాల అసలైన కార్యకర్తలు మోసపోరని అన్నారు. అన్నాడీఎంకే పార్టీని, రెండాకులను రక్షించే వరకు ఎంజీఆర్ అమ్మా దీప పేరవై నిద్రపోదన్నారు. ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ గందరగోళంలో పాట్టాలి మక్కల్ కట్చి నేత రాందాస్ రెండాకుల చిహ్నాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని ప్రకటన విడుదల చేయడం గర్హనీయమన్నారు. కోటిన్నర కార్యకర్తలు ఉన్న పార్టీపై ఈ వ్యాఖ్యలు చేయడం పులిని చూసి ఎలుక ఎగతాళి చేసినట్లుగా ఉందన్నారు. త్వరలో అసలైన అన్నాడీఎంకే కార్యకర్తలు తన నాయకత్వం కిందికి వస్తారన్నారు. అమ్మా– 2023 విజన్ పథకం స్వప్న సాకారం చేసేందుకు అహర్నిశలూ కృషిచేస్తామని పేర్కొన్నారు. -
కొడిగడుతున్న దీపం
► బలహీనమవుతున్న పేరవై ► భర్త మాధవన్ వేరుగా కొత్త పార్టీ ► రూ.20 కోట్ల మోసం కేసు సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఆమె మేనకోడలు దీప నానాటికి తెరమరుగవుతున్నారు. భర్తతో మనస్పర్థలు, దీప పేరవై నేతలు కార్యకర్తలతో విబేధాలతో సతమతం అవుతున్న దీప జీవితంపై శుక్రవారం మరో రెండు పిడుగులు పడ్డాయి. భర్త మాధవన్ కొత్త పార్టీ స్థాపన, పేరవై సభ్యత్వాల పేరుతో రూ.20 కోట్లు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు దీపను మరింత బాధల్లోకి నెట్టేశాయి. జయలలిత మర ణం వరకు పెద్దగా ఎవ్వరికీ తెలియని దీప ఆ తరువాత రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలందరికీ పరిచయమయ్యారు. శశికళ చేతుల్లోని అన్నాడీఎంకే వెళ్లడాన్ని సహించలేని వారిపై నమ్మకంతో ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు. పేరవైపై భర్త మాధవన్ పెత్తనం లేకుండా చేసి ఆమె కారుడ్రైవర్‌ను ప్రధాన కార్యదర్శిగా, ఆయన భార్యను అధ్యక్షురాలిగా చేయడంతో ముసలం పుట్టింది. దీపపై అలిగిన మాధవన్ వేరే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పన్నీర్‌సెల్వం రాజీనామా, శశికళపై తిరుగుబాటుతో అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలంగా మారిపోగా సీఎంగా ఎడపాడి పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం పక్షాన నిలిచారు. మెజారిటీ ఎమ్మెల్యేలపై పన్నీర్‌సెల్వం పట్టుజారిపోవడంతో దీప మనస్సు మార్చుకుని సొంతంగా రాజకీయాలు ప్రారంభించారు. ఆర్కేనగర్లో పోటీకి దిగడంతో భర్త మాధవన్ మనసు మార్చుకుని మళ్లీ చేరుమయ్యారు. ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త పేరు కాలమ్‌ను ఖాళీగా పెట్టి మరో వివాదానికి కా>రణమయ్యారు. ఆనాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఇటీవల అంబేడ్కర్ జయంతి సందర్భంగా దీప ఇంటి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మాధవన్‌ను లోనికి అనుమతించక పోవడం అగ్నిలో అజ్యం పోసింది. దీప, మాధవన్‌ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడి రాళ్లు, నీళ్ల బాటిళ్లతో కొట్టుకున్నారు. ఘర్షణ సమయంలో ఇంటి నుంచి బైటకు వచ్చిన దీప భర్త మాధవన్‌ను ఇంట్లోకి రావద్దని హెచ్చరించి తరిమివేసింది. ‘ఎమ్జేడీఎంకే’ ఆవిర్భావం: మాధవన్ దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్ శుక్రవారం అకస్మాత్తుగా రాజకీయ పార్టీ స్థాపించి పేరవైని మరింతగా బలహీనపరిచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎమ్జేడీఎంకే) పేరున తాను స్థాపించిన కొత్తపార్టీకి దీపకు ఎటువంటి సంబంధం లేదు, తను చేరదలుచుకుంటే చేరవచ్చని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నేరుగా జయలలిత సమాధి వెళ్లి నివాళులర్పించిన అనంతరం పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే తీవ్రమైన నాయకత్వలేమిని ఎదుర్కొంటోందని, ఇరుపక్షాల నేతలు పన్నీర్‌సెల్వం మాయలో పడిపోయారని మాధవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజాయితీగా నిలిచే సిసలైన నేతను తానేనని చెప్పుకున్నారు. రెండాకుల చిహ్నం తన పార్టీకి సాధిస్తానని చెప్పారు. భర్త మాధవన్ పార్టీ పెట్టడం దీపకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీపపై రూ.20 కోట్ల మోసం కేసు: ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్న దీప రూ.20 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాస్తుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో రెండు లక్షల దరఖాస్తులను రూ.10లకు అమ్మి, సభ్యత్వ రుసుమును స్వాహా చేశారని అతను ఆరోపించాడు. తాను సైతం రూ.50వేలు చెల్లించి 5వేల దరఖాస్తులను పొందానని చెప్పాడు. రిజిస్ట్రేషన్ దరఖాస్తులో కోశాధికారిగా, సభ్యత్వ దరఖాస్తులో ప్రధాన కార్యదర్శిగా పేర్కొనడం మోసపూరితమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. తనలాగా మరింత మంది కార్యకర్తలు మోసపోకుండా దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా రోజుకో సమస్యతో ‘దీప’ం కొడిగట్టుతోందా అనే భావన కలుగుతోంది. -
జయలలిత పేరుతో కొత్త పార్టీ
- దీప భర్త మాధవన్ వేరుకుంపటి - పార్టీ పేరు ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ - దీపపై రూ.20 కోట్ల మోసం కేసు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అమ్మ పేరిట మరో కొత్తపార్టీ జీవంపోసుకుంది. దివంగ సీఎం జయలలిత మేనకోడలు దీప భర్త మాధవన్ ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎంజేడీఎంకే) అనే కొత్త పార్టీని స్థాపించారు. శుక్రవారం ఉదయం జయలలిత సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించిన మాధవన్.. ఆ తరువాత పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. దీప పేరవైకి తన పార్టీకి సంబంధం లేదని, దీపకు ఇష్టమైతే తన పార్టీలో చేరవచ్చని తెలిపారు. అన్నాడీఎంకేలో వర్గపోరు కారణంగా ఎవరికీ దక్కకుండాపోయిన రెండాకుల చిహ్నాన్ని తాము సాధిస్తానని మాధవన్ మీడియాకు చెప్పారు. ఇటీవలి ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన దీప.. తన నామినేషన్ పత్రాల్లో భర్త పేరును రాయనికారణంగా దంపతుల మధ్య విబేధాలు చెలరేగాయి. నాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు అంతకంతకూ పెద్దవవుతూ వచ్చాయి. అంబేడ్కర్ జయంతి రోజున దీప, మాధవన్‌ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడ్డారు. కొన్నిరోజులుగా దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్ రాజకీయ పార్టీని పెట్టడం చర్చనీయాంశమైంది. దీపపై రూ.20 కోట్ల మోసం కేసు ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాసుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అమ్మి, సభ్యత్వ రుసుమును స్వీకరించిన దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
డిష్యూం..డిష్యూం
► రోడ్డెక్కిన దీప, మాధవన్‌ల పోరు ► దీప డౌన్ డౌన్ అంటూ నినాదాలు ► ఇరువర్గాల ఘర్షణలతో ఉద్రిక్తత సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంజీఆర్ అమ్మ దీప పేరవైలోని విభేదాలు శుక్రవారం మరోసారి భగ్గుమన్నాయి. దీప, ఆమె భర్త మాధవన్ వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. జయలలిత వారసురాలిగా రాజకీయ తెరపైకి వచ్చిన దీప ఆ పార్టీని స్వాధీనం చేసుకుంటారని అందరూ భావించారు. అయితే తాను సొంతగా పేరవైని స్థాపించి అధ్యక్షురాలిగా తన డ్రైవర్ భార్యను, ప్రధాన కార్యదర్శిగా డ్రైవర్ ఏవీ రాజాను నియమించారు. తాను సిఫారసు చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని కోపగించుకున్న దీప భర్త మాధవన్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పార్టీ పెద్దలు సమాధానపరచడంతో మళ్లీ కలిశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త కాలమ్‌ను ఖాళీగా పెట్టడం మాధవన్‌ను మళ్లీ ఆగ్రహానికి గురిచేయడంతో మళ్లీ వెళ్లిపోయారు. ఒక దశలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది. దంపతుల మధ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం దీప ఇంటి ముందు అంబేడ్కర్ జయంతికి ఏర్పాట్లు జరిగాయి. మాధవన్ అన్నాడీఎంకే పార్టీ రంగులతో ఉన్న పంచెను కట్టుకుని వేడుకల్లో పాల్గొనేందుకు అనుచరులతో హాజరయ్యారు. దీప రాకకోసం మాధవన్ ఇంటి బైటే వేచి చూసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో ఆయన అనుచరులు దీప అనుచరులతో వాగ్విదానికి దిగి గేటు తోసుకుని లోపలికి వెళ్లారు. వీరిని డ్రైవర్ ఏవీ రాజా, అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు మంచినీళ్ల బాటిళ్లు, రాళ్లు విసురుకున్నారు. ఘర్షణ పడవద్దని దీప కేకలు వేసినా ఎవ్వరూ వినిపించుకోలేదు. పేరవైలో గొడవలన్నింటికీ నీవే కారణమని కొందరు ఏవీ రాజాను దూషించగా, దీప డౌన్ డౌన్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించేశారు. -
ఆర్కేనగర్ రేసులో 62 మంది
►ఈవీఎంలతో ఓటింగ్ ►పది కంపెనీల పారా మిలటరీ ►ఆర్కేనగర్లో ప్రచార హోరు ►పన్నీరు, దీప శ్రీకారం ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో 62 మంది అభ్యర్థులు నిలిచారు. బహుముఖ సమరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. భద్రత నిమిత్తం పది కంపెనీల పారా మిలటరీ రంగంలోకి దిగనుంది. ఓట్ల వేటలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, జయలలిత మేన కోడలు దీప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై: జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది. అన్నాదీఎంకేలో ఏర్పడ్డ చీలికల పుణ్యమా ఈ సారి ఆ పార్టీ గుర్తు రెండాకుల్ని ఎన్నికల యంత్రాంగం సీజ్ చేయక తప్పలేదు. అన్నాడీఎంకే గుర్తు లేని ఎన్నికలుగా సాగుతున్న సమరంలో గెలుపు కోసం తీవ్ర కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఎన్నికల బరిలో నిలబడేందుకు 127 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో ఓటింగ్ బ్యాలెట్ ద్వారా జరపక తప్పదన్న ప్రశ్న బయల్దేరింది. అయితే, పరిశీలన, ఉప సంహరణ పర్వాలతో సోమవారం నాటికి చివరకు రేసులో 62 మంది నిలిచారు. రేసులో ఉన్న అభ్యర్థులు తుది జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రకటించడంతో ప్రచారం మరింతగా ఊపందుకుంది.రేసులో 62 మంది:డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. డీఎంకే అభ్యర్థి ఓట్లు చీల్చే దిశగా గణేష్ పేరు వచ్చే రీతిలో పలువురు నామినేషన్లు దాఖలు చేసినట్టు సమాచారం. తుది జాబితా ప్రకటనతో ఓటింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించేందుకు ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టింది. 63 మందికి పైగా అభ్యర్థులు రేసులో ఉంటే బ్యాలెట్ నిర్వహించాల్సి ఉంటుందని తొలుత నిర్ణయించారు. అయితే, సంఖ్య ప్రస్తుతం 62కు పరిమితం కావడం, నోటా చిహ్నం ఒకటిని కలుపుకుంటూ, ఒక్కో పోలింగ్ బూత్‌కు నాలుగు ఈవీఎంలను ఉపయోగించేందుకు తగ్గ చర్యల్లో అధికార వర్గాలు ఉన్నాయి. నియోజకవర్గంలో నగదు బట్వాడా అడ్డుకట్ట, మద్యం తదితర తాయిలాల పంపిణీని అడ్డుకునే విధంగా తనిఖీల ముమ్మరం అయ్యాయి. పది కంపెనీలకు చెందిన పారా మిలటరీ బలగాలు ఒకటి రెండు రోజుల్లో చెన్నైకు రానున్నాయి. తనకు వయసు లేదన్న కారణంతో నామినేషన్ తిరస్కరించినట్టు ఎన్నికల యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వయసు 23 సంవత్సరాలు అని, అయితే, తనకు 25 సంవత్సరాలు రాలేదన్న ఒక్క కారణంతో నామినేషన్ తిరస్కరించారని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమైన ఆర్కేనగర్కు చెందిన సౌమ్య పిటిషన్లో వివరించారు. ఓటు హక్కు వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించినప్పుడు, అదే ఎన్నికల్లో నిలబడేందుకు వయస్సు 25గా నిర్ణయించడం ఏమిటోనని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన తమకు అన్ని హక్కులు ఉన్నప్పుడు, ఎన్నికల్లో మాత్రం నిలబడే హక్కు ఎందు లేదని సౌమ్య ప్రశ్నించడం గమనార్హం. ప్రచారంలో నేతలు: మధుసూదనన్‌కు మద్దతుగా మాజీ సీఎం పన్నీరు సెల్వం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓపెన్ టాప్ వాహనంలో ఆయన సుడిగాలి పర్యటనతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. టీటీవీ దినకరన్ సైతం ప్రచారంలో ఉరకలు తీశారు. సీఎం ఎడపాడి పళనిస్వామి, మంత్రులతో కలిసి ఏకంగా ఆర్కేనగర్కు ఓ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తనకు మద్దతుగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ జయలలిత మేనకోడలు దీప ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ అభ్యర్థికి మద్దతుగా డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రచారం రద్దు కాగా, ఆయన స్థానంలో ప్రేమలత విజయకాంత్ ఓటర్ల వద్దకు బయల్దేరారు. బీజేపీ అభ్యర్థి గంగై అమరన్కు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ప్రచారం నిర్వహించారు. డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్ ప్రచారంలో దూసుకెళ్తుండగా, ఆయనకు మద్దతుగా మంగళవారం ఆ పార్టీ నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ప్రచారం చేపట్టనున్నారు. దీపకు పడవ: ఎంజీయార్, అమ్మ, దీప పేరవై అభ్యర్థి, జయలలిత మేన కోడలు దీపకు ఎన్నికల యంత్రాంగం పడవ చిహ్నంగా కేటాయించింది. ఆర్కేనగర్ రేసులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీప ప్రచార పయనానికి శ్రీకారం చుట్టారు. ఆమెకు పడవ చిహ్నం రావడంతో అందుకు తగ్గ ప్లకార్డులను చేత బట్టి మద్దతుదారులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
కొండెక్కనున్న దీపం
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మేనకోడలు దీప నేతృత్వంలోని ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ మూణ్ణాళ్ల్ల ముచ్చటగా మారిపోతోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని దీపపై కార్యకర్తలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. దీప పేరవైని ఎత్తివేసి పన్నీర్ పంచన చేరే ప్రయత్నాల్లో భాగంగా ఈనెల 19వ తేదీన పేరవై నేతలు తిరుచ్చిలో సమావేశం అవుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు తెచ్చింది. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలుగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోగా, జయలలిత రాజకీయ వారసురాలిగా దీప రాజకీయ అరంగేట్రం చేశారు. జయ మరణించిన నాటి నుంచి తండోపతండాలుగా వస్తున్న అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల అండదండలతో గత నెల 24వ తేదీన ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు. కార్యవర్గ నిర్మాణంలో దీప కారు డ్రైవర్‌కు ప్రముఖ స్థానం కల్పించడంతో పేరవై ముసలం మొదలైంది. ఇదే సమయంలో ఆర్కేనగర్ నుంచి స్వతంత్య అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు దీప ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. దీపతో పాటు ఆమె భర్త మాధవన్ సైతం ఈనెల 16వ తేదీన ఆర్కేనగర్లో వేదికెక్కి ప్రచారంలో పాల్గొన్నారు. జయలలితకు రెండుసార్లు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఆర్కేనగర్ ప్రజలు దీపకు సైతం పట్టకడుతారని పేరవై నేతలు విశ్వసించారు. దీపకు షాకిచ్చిన భర్త మాధవన్: ఇదిలా ఉండగా భర్త మాధవన్ అకస్మాత్తుగా భార్య దీపకు గట్టి షాకిచ్చారు. శుక్రవారం రాత్రి చెన్నై మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వెళ్లి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అంతేగాక తన భార్య దీప పెట్టింది కేవలం ఒక సంఘం మాత్రమే రాజకీయ పార్టీ కాదని వ్యాఖ్యానించారు. దీప పేరవైలో దుష్టశక్తులు ప్రవేశించాయని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామం అటు దీపను, ఇటు దీప పేరవై నేతలను ఆందోళనకు గురిచేసింది. దీప వ్యవహారశైలి అంటే భర్తకే గిట్టనపుడు పేరవై నేతలతో ఎలా మెలుగుతారని సందేహం మొదలైంది. జయలలిత స్థానంలో దీపను ప్రోత్సహించాలని భావించిన వారిలో ముఖ్యుడైన తిరుచ్చిరాపల్లి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సుందరరాజన్ తీవ్రంగా స్పందించారు. దీప పేరవైని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్న ఆయన తాజా పరిణామాలతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాష్ట్రంలోని పేరవై నేతలతో మాట్లాడి దీప పేరవైని ఎత్తివేయాలని సంకల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయంలో భాగంగానే ఆదివారం నాడు తిరుచ్చిలో పేరవై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీప వ్యవహారశైలి తీవ్ర అసంతృప్తికరమని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలతో పేరవై కార్యకర్తలకు ఉత్తరాలు రాశారు. దీపపై నమ్మకంతో ఆమె చుట్టూ తిరిగిన వారంతా తనపై ఒత్తిడి తెస్తున్నందున వారికి తగిన పరిహారం, ప్రత్యామ్నాయ మార్గం చూపాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఉత్తరంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 19వ తేదీన తిరుచ్చిలో జరిగే సమావేశానికి రాష్ట్రంలోని పేరవై నేతలు, కార్యకర్తలంతా కదలిరావాలని ఉత్తరం ద్వారా ఆహ్వానించారు. విశ్వసనీయ సమాచారాన్ని బట్టి దీప పేరవైని ఎత్తివేసి సుందరరాజన్ నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంలో చేరిపోతారని తెలుస్తోంది. ఆమోమయంలో దీప: ఒకవైపు భర్త, మరోవైపు పేరవై తనకు దూరమైపోతున్న పరిస్థితిలో దీప ఆయోమయంలో పడిపోయారు. ఆర్కేనగర్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తనకు అండగా నిలవాల్సిన పేరవై కార్యకర్తలు ప్రత్యర్థి వర్గంలో చేరిపోతే దిక్కెవరని ఆందోళన చెందుతున్నారు. ఈనెల 19వ తేదీన తిరుచ్చీలో జరిగే దీప పేరవై సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఆమె ఆందోళనకు గురవుతున్నారు. -
ఆర్కేనగర్ బరిలో డీఎండీకే
► అభ్యర్థిగా మదివానన్ ► పన్నీరు శిబిరంలో తిలకవతి ► దీప పూజలు ► ఏర్పాట్లలో ఈసీ సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ బరిలో డీఎండీకే అభ్యర్థిగా మదివానన్ పోటీ చేయనున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటామని ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటించారు. అవకాశం ఇస్తే, పన్నీరుసెల్వం శిబిరం నుంచి ఆర్కే నగర్ నుంచి పోటీకి సిద్ధమని మాజీ డీపీజీ తిలకవతి సంకేతాన్ని ఇచ్చారు. ఇక, వేంకటేశ్వరుని సన్నిధిలో పూజల అనంతరం ఆర్కేనగర్పై దీప దృష్టి పెట్టారు. అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఆ సీటును కైవసం చేసుకోవడం లక్ష్యంగా డీఎంకే పావులు కదిపే పనిలో పడింది. జయలలిత చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసిన సిమ్లా ముత్తు చోళన్‌ను మళ్లీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం అభ్యర్థి విషయంగా డీఎంకే కార్యాలయం ప్రకటన చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కమ్యూనిస్టులకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విన్నవించుకున్నారు. డీఎండీకే అభ్యర్థిగా : అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు, ఓటింగ్ శాతం గల్లంతు చేసుకున్న డీఎండీకే, తాజాగా ఆర్కేనగర్ ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్ పేరును విజయకాంత్ ఖరారు చేశారు. అయితే, పలువురు నాయకులు విజయకాంత్ సతీమణి ప్రేమలత పోటీ చేయాలని నినదిస్తున్నారు. పోటీకి సిద్ధం : మాజీ డీజీపీ తిలకవతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న సంకేతాన్ని పంపించారు. మాజీ సీఎం పన్నీరుశిబిరం నుంచి ఆర్కేనగర్ బరిలో దిగేందుకు తాను రెడీ అని, అయితే, అవకాశం దక్కేనా అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె ఈ ప్రకటన చేశారు. దీప పూజలు: ఆర్కే నగర్ నుంచి ఎన్నికల్లో పోటీకి జయలలిత మేన కోడలు దీప సిద్ధమయ్యారు. టీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజల అనంతరం ఆమె ఆర్కేనగర్ ఎన్నికల పనుల మీద దృష్టి పెట్టారు. అలాగే, ఎంజీఆర్, అమ్మ, దీపా పేరవై సభ్యత్వ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఏర్పాట్లలో ఈసీ: రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపిక , గెలుపు పావులు కదిపేందుకు తగ్గ వ్యూహ రచనల్లో ఉంటే, ఎన్నికల ఏర్పాట్ల మీద ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఖర్చుల పరిశీలనకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత చర్యల మీద దృష్టి పెట్టింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీసు కమిషనర్ జార్జ్ బదిలీకి రంగం సిద్ధం అయింది. సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
గుర్తు పట్టాలని!
► చేజారకుండా శశి వర్గం జాగ్రత్తలు ► తమకే దక్కుతుందని పన్నీర్ ధీమా ► దీప సైతం ఎదురుచూపులు ► ఎన్నికల కమిషన్ నిర్ణయం కీలకం రాష్ట్రంలోని అనేక ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకేపై రసవత్తర చర్చ మొదలైంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో రెండాకుల చిహ్నం ఏవర్గానికి దక్కేనో, మరెవరి వర్గం వైపు మొగ్గేనో అని ఆసక్తికరమైన విశ్లేషణలో పార్టీలు మునిగితేలుతున్నాయి. రెండాకుల గుర్తును నిలబెట్టుకునేందుకు శశికళ, సాధించుకునేందుకు పన్నీర్ పాటుపడుతుండగా, అనుకూల పవనాల కోసం జయ మేనకోడలు దీప కాచుకుని ఉన్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: 1972 అక్టోబరు 17వ తేదీన ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఈ పార్టీకి 1.50 కోట్ల సభ్యత్వంతో బలమైన క్యాడర్ ఉంది. ఎంజీఆర్ బొమ్మ, అమ్మ ఫొటోలు అన్ని ఎన్నికల్లో అతి ప్ర ధాన ఆకర్షణలు. వీటికి తోడు పార్టీ రెండాకుల చిహ్నం కనపడితేచాలు బ్యాలెట్ పేపర్‌పై ముద్రవేసే ఓటు బ్యాంక్ అన్నాడీఎంకేకు సొంతం. పార్టీకి ఆనేతలు ఎంత బలమో ప్రజల హృదయాల్లో నాటుకుపోయిన రెండాకుల చిహ్నం కూడా అంతేబలం. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, శశికళ బాధ్యతల స్వీకరణ, పన్నీర్‌సెల్వం తిరుగుబాటు, జయకు అసలైన రాజకీయ వారసురాలిని తానేనంటూ ఆమె మేనకోడలు దీప గళమెత్తారు. దీంతో అన్నాడీఎంకే అనుచరులు మూడుగా చీలిపోయారు. సభ్యులు సైతం ఎవరికి నచ్చిన చోట వారు చేరిపోయారు. 1.50 కోట్ల పార్టీ సభ్యత్వం సైతం మూడు వర్గాలుగా మారిపోయింది. అన్నాడీఎంకేలోని మూడు వర్గాలూ అమ్మ బొమ్మ చూ పించే ఎన్నికల బరిలో దిగ డం తప్పనిసరి. అయితే వీటన్నికం టే గెలుపు గుర్రం ఎక్కించే రెండాకుల చిహ్నం ఇంకా ఎంతో ముఖ్యం. అమ్మ మెచ్చిన నేత అనే సెంటిమెంట్ బలాన్ని పన్నీర్‌సెల్వం కలిగి ఉన్నా, జయ మేనకోడలిగా అసలైన రాజకీయ వారసురాలు అనే ముద్ర దీప సొంతమైనా ఇవన్నీ బ్యాలెట్ పేపరులో ప్రతిబంబించవు. బ్యాలెట్ పేపరులో ఓటరుకు కనపడేది రెండాకుల చిహ్నం మాత్రమే. రెండాకుల చిహ్నం కనపడితే చాలు ఆవేశంతో ఊగిపోయినట్లుగా బ్యాలెట్‌పై ఓటరు తన రాజ ముద్రను వేసేస్తారని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. ఓటర్లపై అంతటి ప్రభావం చూపగలిగిన సత్తా కలిగి ఉండటం వల్లే రెండాకుల చిహ్నం కోసం ముగ్గురూ పోటీపడుతున్నారు. ఐదేళ్ల సభ్యత్వం లేని కారణంగా ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని పన్నీర్‌సెల్వం ప్రధాన ఎన్నికల కమిషన్ వద్ద సవాల్ చేసి ఉన్నారు. పన్నీర్ వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవించినపక్షంలో శశికళ పదవీచ్యుతురాలు కాగలరు. తద్వారా పార్టీ పగ్గాలు, రెండాకుల గుర్తు తన చేతికి వస్తాయని పన్నీర్ ఆశిస్తున్నారు. అయితే సీఈసీ నిర్ణయం ప్రతికూలంగా మారినపక్షంలో పార్టీ చేజారిపోకుండా తన వర్గంలో ఉండే ఐదేళ్ల సభ్యత్వ సీనియారిటి కలిగి ఉన్న వ్యక్తిని శశికళ తన స్థానంలో నిలిపే అవకాశం ఉంది. తన రాజకీయ ప్రవేశ లక్ష్యం పార్టీని, రెండాకుల చిహ్నన్ని స్వాధీనం చేసుకోవడమేని దీప ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడంలో దీపకు ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే రెండాకుల చిహ్నం శశికళకా, పన్నీరుకా ఎవరికి సొంతం అనే అంశంపై సీఈసీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. శశికళ ఎంపిక చెల్లదని సీఈసీ ప్రకటించినట్లయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె చేసిన నియామకాలు, తీసుకున్న నిర్ణయాలన్నీ రద్దయిపోతాయి. ఎన్నికల పోలింగ్‌లోగా సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించని పక్షంలో పరిస్థితి మరోరకంగా మారుతుంది. అన్నాడీఎంకే తరపున ఆర్కేనగర్లో పోటీచేసే అభ్యర్దులకు తగిన వ్యక్తి బీఫాంపై సంతకం చేసినపుడే రెండాకుల చిహ్నం కేటాయించబడుతుంది. సర్వసభ్య సమావేశం ద్వారా ఎంపికైన శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమే కాబట్టి బీఫాంపై ఆమె సంతకం చెల్లదని పన్నీర్ వర్గం వాదిస్తోంది. అంతేగాక శాశ్వత కార్యదర్శి హోదాలో జయ చేత నియమితులైన ప్రిసీడియం చైర్మన్ మదుసూధనన్ సంతకంతో బీఫారాలు జారీచేస్తామని కూడా పన్నీర్ అనుచరులు చెబుతున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికపై మరో రెండు రోజుల్లో నామినేషన్లను స్వీకరించనున్న తరుణంలో రెండాకుల చిహ్నం వివాదం కీలకంగా మారింది. ఇంతటి గందరగోళ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే. -
మోగిన ఉప నగారా
► వచ్చే నెల 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక ► మార్చి 16 నుంచి నామినేషన్లు ► ఏప్రిల్ 15న ఓట్ల లెక్కింపు ► పోటీకి దీప సిద్ధం సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్లో ఉప ఎన్నిక నగారా మోగింది. వచ్చేనెల 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఈనెల 16న నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆర్కేనగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. ఆమె మరణంతో ఆమె ప్రాతిని«థ్యం వహించిన ఆర్కేనగర్లో ఉపఎన్నిక ఏర్పడింది. అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం బాధ్యతలు స్వీకరించారు. అయితే అనతికాలంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోగా తదనంతర పరిణా మాల వల్ల రెండాకుల పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వంతో ఆయన మద్దతుదారులపై శశికళ బహిష్కరణ వేటువేశారు. ఒక వర్గానికి పన్నీర్‌సెల్వం, మరో వర్గానికి శశికళ నాయకత్వం వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా శశికళ జైలు కెళ్లే ముందు ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బెంగళూరు జైలు నుంచి ఆమె పార్టీ చక్రం తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని ఒక వర్గం జయ మేనకోడలు దీపను అనుసరిస్తోంది. దీంతో రెండుగా ఉండిన పార్టీ మూడు వర్గాలుగా మారిపోయింది. శశికళపై ఎన్నికల కమిషన్ కు పన్నీర్‌సెల్వం వర్గం ఫిర్యాదు చేయగా ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. శశికళ ఇచ్చిన వివరణకు ఎన్నికల కమిషన్ సంతృప్తిచెందని పక్షంలో పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు పన్నీర్‌సెల్వం పావులు కదుపుతున్నారు. ఇటువంటి కీలకమైన తరుణంలో ఆర్కేనగర్ ఉప ఎన్నిక ముంచుకొచి్చంది. ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కార్యాలయం గురువారం మధ్యాహ్నం ఆర్కేనగర్ ఉపఎన్నిక నగారాను మోగించింది. ఆర్కేనగర్లో ఉప ఎన్నిక ప్రకటన వల్ల ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో అధికార అన్నాడీఎంకే నేతలు, ప్రభుత్వ అధికారులు హడావుడిగా నియోజక వర్గానికి చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకోవడం ప్రారంభించారు. అలాగే దీప, పన్నీర్‌సెల్వం అనుచరులు వేర్వేరుగా సమావేశమై ఎన్నికలపై సమాలోచనలు జరిపారు. ఆర్కేనగర్ నుంచి దీప పోటీ: అన్నాడీఎంకే ప్రతిష్ట, అమ్మ ప్రభావంపై ఆధారపడి మూడు వర్గాలు అభ్యర్థులను పోటీకి పెట్టడం దాదాపు ఖాయమని భావించవచ్చు. శశికళ జైలు కెళ్లకుంటే పోటీచేసి ఉండేవారు. దీంతో ఆమెకు బదులుగా దినకరన్ పోటీచేసేందుకు ఉత్సాహపడుతున్నారు. పన్నీర్‌సెల్వం ఎవరిని పోటీకి పెడతారో ఇంకా తేటతెల్లం కాలేదు. ఇక మూడో వర్గం నుంచి దీప పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్కేనగర్ నుంచి పోటీచేయనున్నట్లు దీప గురువారం సాయంత్రం ప్రకటించారు. ఇక డీఎంకే, కాంగ్రెస్ కలిసి ఒక అభ్యర్థిని, బీజేపీ, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, వీసీకే పార్టీలు కూడా రంగంలో నిలిచే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూలు: మార్చి 16వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 23 వ తేదీతో ముగుస్తుంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ ఆఖరు రోజు. ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో ఉప ఎన్నికకు తెరపడనుంది. -
దీపకు పేరవై చిచ్చు
► తప్పుకున్న మాధవన్ ► మద్దతుదారుల్లో అసంతృప్తి సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప కుటుంబంలో ‘పేరవై’ చిచ్చు రగిలింది. ఇందులో నుంచి తాను తప్పకుంటున్నట్టు దీప భర్త మాధవన్ ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలు మద్దతుదారుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. దివంగత సీఎం జయలలిత రాజకీయ వారసురాల్ని తానేనని ఆమె మేనకోడలు దీప ప్రకటించడం అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ పెద్ద సంఖ్యలో హర్షం వ్యక్తం చేశాయి. దీప ఇంటి ముందు పెద్ద ఎత్తున వాలడంతో ఇక, రాజకీయ పయనానికి జయలలిత మేనకోడలు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై పేరుతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు. అయితే, ఆమెకు రాజకీయ అనుభవం తక్కువే. సరిగ్గా సలహాలు ఇచ్చే వారు తక్కువేనని చెప్పవచ్చు. ఈ రెండు వెరసి దీప పేరవైలో సమస్యల సృష్టికి కారణం అయ్యాయన్న ప్రచారం సాగుతోంది. ఆ పేరవైకు నిర్వాహకుల ఎంపిక మొదటి నుంచి వివాదానికి దారి తీసూ్తవస్తోంది. వారికి వ్యతిరేకంగా అసంతృప్తి రగులుతున్న సమయంలో ఇన్ చార్జల నియామక ప్రకటన దీపను ఇరకాటంలో పడేసినట్టుం ది. అసలు ఆ జాబితాను ఆమె అధికారికంగా ప్రకటించినట్టు సమాచారం. మీడియాల్లో ఆ జాబితా హల్చల్ సృష్టించడంతో ఇక, ఆ పేరవైలో మరింతగా చిచ్చు రగిలింది. ఆ జాబితాకు వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసనలు బయలు దేరాయి. ఈ సమయంలో దీప కుటుంబంలోనూ ఆ పేరవై చిచ్చు రగల్చడం చర్చకు దారి తీసింది. తప్పుకున్న మాధవన్ : జయలలిత మరణం తదుపరి తెరమీదకు వచ్చిన దీపకు వెన్నంటి ఆమె భర్త మాధవన్ ఉంటూ వస్తున్నారు. దీప ఎక్కడికి వెళ్లినా, ఆయన అనుసరిస్తున్నారు. రాజకీయ అరంగేట్రం, పేరవై ఏర్పాటు ప్రకటన వరకు తోడునీడగా మాధవన్ ఉన్నారు. అయితే, ఆ పేరవై నిర్వాహకుల ఎంపిక, ఇన్ చార్జ్ ల జాబితా దీప కుటుంబంలోని చిచ్చు రగిల్చినట్టుంది. ఈ విషయాల్లో తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేని మాధవన్, ఆ పేరవై నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం చర్చకు దారి తీశాయి. మూడు నెలలుగా దీప వెన్నంటి ఉన్న ఆయన రెండు మూడు రోజులుగా దూరంగా ఉంటూ రావడంతో కొందరు మీడియా ప్రతినిధులు కదిలించి ఉన్నారు. తాను పేరవై వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకోదలచుకోలేని, దీప ఉన్నత స్థానంలో ఉంటే ఆనందించే మొదటి వ్యక్తి తానేనని మాధవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. తాను తప్పుకుంటున్నానని, ఆ పేరవైతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పందించడం మద్దతుదారుల్లో అసంతృప్తిని రగిల్చింది. ఇంటి వద్దకు వచ్చే మద్దతుదారులతో సంప్రదింపులు సాగించడం, సూచనలు సలహాలు ఇవ్వడంలో మాధవన్ ఇన్నాళ్లు ముందున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన తప్పుకోవడం ఆయనతో సన్నిహితంగా ఉండే మద్దతుదారులతో పాటు, దీప పేరవై మద్దతు దారుల్లో అసంతృప్తి బయలు దేరినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
దీప ఇన్ చార్జ్‌లు
► నాలుగు డివిజను్లగా ఏర్పాటు ► మొదట్లోనే వ్యతిరేకత ► కమిటీలో మరింత జాప్యం సాక్షి, చెన్నై: ఎంజీఆర్, అమ్మ దీపపేరవైకు ఇన్ చార్జ్ లను ప్రకటించారు. రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి ఇన్ చార్జ్ ల జాబితాను ఆ పేరవై కార్యదర్శి, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప శుక్రవారం విడుదల చేశారు. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా అనేక చోట్ల పదవుల వివాదం ఏర్పడింది. ఇక, పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటులో మరింత జాప్యం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. మేనత్త జయలలిత జయంతి రోజున దీప తన రాజకీయ పయనం గురించి ప్రకటన చేశారు. ఆ మేరకు ఎంజీఆర్, అమ్మ, దీపపేరవైతో తన రాజకీయ పయనం సాగుతుందని చేసిన ప్రకటన మద్దతు దారుల్లోఆనందాన్ని నింపింది. అదే సమయంలో ఆ పేరవై నిర్వాహకులుగా తన మిత్రులు పలువుర్ని నియమించి వివాదాన్ని దీప కొని తెచ్చుకున్నారు. ఈ మంటల్ని చల్లార్చేందుకు మద్దతుదారుల్ని బుజ్జగించేందుకు దీప తీవ్రంగానే శ్రమించాల్సిన పరిస్థితి. తదుపరి ఆమె ఇంటి ముందుగానీ, సమావేశాలకు గానీ మద్దతుదారుల సంఖ్య క్రమంగా తగు్గతూ రావడంతో ఆ శిబిరంలో కలవరం బయలు దేరినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి కమిటీ అన్నది పక్కన పెట్టి, రాష్ట్రాన్ని నాలుగు డివిజను్లగా విభజించి తన పేరవైకు ఇన్ చార్జ్ లను దీప ప్రకటించడం గమనార్హం. ఈ నియామకాలను సైతం ఆయా ప్రాంతాల్లో మద్దతుదారులు వ్యతిరేకిస్తుండడం చర్చకు దారి తీసింది. మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరం దీపకు మళ్లీ పిలుపునిస్తుండడంతో, ఆ శిబిరంలోకి దూకేనా, పేరవైతో ముందుకు సాగేనా, కొత్త పార్టీని పెట్టేనా అన్నది వేచిచూడాల్సిందే. డివిజన్లు : తొలి డివిజన్ లో కన్యాకుమారి, తిరునల్వేలి, తూతు్తకుడి, రామనాథపురం, శివగంగై, విరుదునగర్, మదురై, తేని జిల్లాలను చేర్చారు. రెండో డివిజన్ లో దిండుగల్, తిరుప్పూర్, కోయంబతూ్తరు, నీలగిరి, ఈరోడ్, నామక్కల్, కరూర్, సేలం, మూడో డివిజన్ లో తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు, కడలూరు, నాలుగో డివిజన్ లో ధర్మపురి, కృష్ణగిరి, తిరువణ్ణామలై, కాంచీపురం, వేలూరు, విల్లుపురం, తిరువళూ్లరు, చెన్నై జిల్లాలను చేర్చారు. ఇన్ చార్జ్ లు: దురైయప్ప(తిరునల్వేలి), పుసుం పొన్ పాండియన్ (మదురై), తొండన్ జీ సుబ్రమణి(తూతు్తకుడి), సెంథిల్ మురుగన్ (కన్యాకుమారి), వీరకుమార్ (తేని), భారతీ సుబ్బురాం (విరుదునగర్), సరస్వతి (నామక్కల్), అమినన్ (సేలం), కరుప్పుస్వామి(కరూర్), రాజామణి(నామక్కల్),రాజ పరమ శివం(పుదుకోట్టై), ఇలవలగన్ (పెరంబలూరు), మురుగన(తంజావూరు), సెల్వవినాయ్ గం(కడలూరు), రాజకన్నప్పన్(వేలూరు), హేమచంద్రన్ఇన్ చార్్జల జాబితాలో ఉన్నారు. -
ఢిల్లీకి దీప
రాష్ట్రప్రతి, ప్రధానిలను కలిసే యత్నం జయ మరణంపై ఫిర్యాదుకు సన్నాహం పేరవైలో నిరసనలు సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి, ప్రధానిలను కలిసేందుకు దీప సన్నాహాలు సాగిస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం రాష్ట్ర రాజకీయాలను కుదిపివేసింది. ముఖ్యంగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయి జయలలిత మేనకోడలు రాజకీయ అరంగేట్రంతో మూడుగా మారిపోయింది. రాష్ట్రంలోని 1.5 కోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలను శశికళ, పన్నీర్‌సెల్వం, దీప తలా కొంత పంచుకున్నారు. ముగ్గురి రాజకీయ జీవితాలకు ప్రధాన కారకురాలైన జయలలిత అనుమానాస్పద స్థితిలో మరణించారనే వివాదం నెలకొని ఉంది. జయ మరణం వెనుక శశికళ కుట్ర దాగి ఉందని కొందరు ఆరోపిస్తుండగా, మరణం వెనుక మర్మాన్ని బైటపెట్టాలని, సీబీఐ విచారణ జరపాలనే డిమాండ్లు లేచాయి. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు ఇటీవల డిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి జయ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తమను చుట్టుకున్న వివాదాల నుండి గట్టెక్కెందుకు శశికళ వర్గీయులు సైతం డిల్లీ వెళ్లి వచ్చారు. ఇక మిగిలిన మూడో వర్గం దీప సైతం డిల్లీ బాటపట్టనున్నారు. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన జయలలిత పోయస్‌గార్డెన్‌లోని తన ఇంటిలో స్పృహతప్పిపడిపోయిన స్థితిలోనే ఆసుపత్రిలో చేర్చారని ప్రచారం జరుగుతోంది. అయితే జయ స్పృహతప్పడానికి దారితీసిన కారణాలు ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఈ అనుమానాల నివృత్తి కోసమే సీబీఐ విచారణ చేయాలని కొందరు, న్యాయవిచారణ నిర్వహించాలని మరికొందరు పట్టుబడుతున్నారు. ఈ నేపధ్యంలో దీప సైతం ఇదే డిమాండ్‌పై డిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కలిసేందుకు అవకాశం దొరికన పక్షంలో జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించాలని భావిస్తున్నారు. పేరవైలో నిరసనలు ఇదిలా ఉండగా, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై పేరుతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన దీపకు అప్పుడు తలనొప్పులు మొదలైనాయి. దీప పేరవై కార్యవర్గ నియామకాలపై నిరసనలు తెలపడం ప్రారంభించారు. దీప పేరవైకి రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి.. ఈ మూడు పదవులకు నియమకాలు పూర్తిచేశారు. కార్యదర్శిగా నియమితులైన ఏవీ రాజా...దీప కారు డ్రైవర్ కావడంతో నిరసన మొదలైంది. రాజా నియామకాన్ని నిరసిస్తూ గత వారం దీప ఇంటిని ముట్టడించారు. కలైయరసి అనే యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి యత్నానికి పాల్పడింది. ఈ పరిణామంతో విస్తుపోయిన దీప తాత్కాలికంగా కార్యదర్శిగా తానే ఉంటానని కార్యకర్తలను శాంతిపజేశారు. కార్యవర్గం నియామకాలు వివాదాలు తలెత్తడంతో తాత్కాలింగా వాయిదావేశారు. కాగా, మంగళవారం మరికొందరు కార్యకర్తలు దీప ఇంటిని ముట్టడించి తమ అభిప్రాయాలను స్వీకరించాల్సిందిగా కోరారు. అయితే వారు దీపను కలుసుకునే అవకాశం కలగలేదు. దీప భర్త వారిని సముదాయించే ప్రయత్నం చేయగా, కౌన్సిలింగ్ విధానం ద్వారా కార్యవర్గాన్ని నియమించాలని కోరారు. పేరవై ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కార్యకర్తల మద్య ఘర్షణ వాతావరణం తలెత్తడం చర్చనీయాంశమైంది. -
ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన ప్రియుడి పెళ్లి
గొల్లపల్లి(జగిత్యాల): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడనే విషయం తెలిసి ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడి పెళ్లిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.... కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన దీప(24)కు ఓ ఫోటో స్టూడియోలో నాలుగేళ్ల క్రితం తూర్పాటి కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచింది. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న దీపను కాదని కుమార్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని ఇవాళ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని కుమార్ స్నేహితుల ద్వారా తెలుసుకున్న దీప ‘తనను అన్ని విధాలుగా వాడుకొని చివరకు పెళ్లి చేసుకోకుండా.. వేరే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని’ గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
ఆ పోస్టర్లతో నా భార్యకు గుండెపోటు
- నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ - పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చెన్నై: ఉద్దేశపూర్వకంగా తనను, కుటుంబాన్ని దారుణంగా కించపరుస్తోన్నవారిని శిక్షించాలని కోరుతూ సినీ నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ చెన్నై పోలీస్‌కమీషనర్‌కు ఫిర్యాదుచేశారు. అన్నా డీఎంకే తరఫున తిరువాడాళై నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరుణాస్.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో శశికళకు మద్దతుగా నలిచిన విషయం తెలిసిందే. అయితే కరుణాస్.. శశికళకు మద్తతు పలకడంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల 22న కరుణాస్ పుట్టినరోజు సందర్భంగా విమర్శలజడి శృతిమించింది. కరుణాస్ ఫొటోకు ఆయన భార్య గ్రేస్ కన్నీటి అంజలి ఘటిస్తున్నట్లు కొందరు పోస్టర్లు రూపొందించారు. అంతటితో ఆగకుండా, ఆ పోస్టర్లను ముద్రించి గోడలపై అంటించారు. ఈ పరిణామాలతో కలత చెందిన కరుణాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా కన్నీటి అంజిలి ఘటిస్తూ ముద్రించిన పోస్టర్లు చూసి తన భార్య తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. భావ స్వాతంత్ర్యం పేరుతో తనను కించపరచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను పోటీ చేసి గెలిచిన తిరువాడాళై నియోజక వర్గంలో 2,86,644 ఓటర్లు ఉన్నారని..అందులో నాకు వచ్చిన ఓట్లు 76 వేల 786 అని తెలిపారు. తన గెలుపును వ్యతిరేకించిన వారి సంఖ్య లక్షా 15 వేలు అని, ఓటు హక్కును వినియోగించుకోని వారి సంఖ్య 80 వేలు ఉందన్నారు. మొత్తం మీద తనకు, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రెండు లక్షల మంది ఉన్నారని అన్నారు. తనను కించపరచే విధంగా విమర్శలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. శుక్రవారం తన నియోజక వర్గం అయిన తిరువాడాళైకు కార్యకర్తలతో కలిసి వెళ్లిన కరుణాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీపా పేరవైకి చెందిన కొందరు కరుణాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతోపో లీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పి పంపారు. -
ఓపీఎస్ శిబిరానికి దీప ఎందుకొచ్చింది?
టీనగర్: జయలలిత మేనకోడలు దీప మంగళవారం హఠాత్తుగా ఓ. పన్నీర్ సెల్వం వర్గం లో చేరడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర సంచలనం కలిగించింది. దీనికి గల కారణాలు ఆసక్తికరంగా నిలిచాయి. దీప గత రెండు నెలలుగా అన్నాడీఎంకేలో కొత్త గుర్తింపు పొందారు. జయలలిత పుట్టిన రోజైన ఫిబ్రవరి 24వ తేదీన తన తదుపరి చర్యల గురించి ప్రకటించనున్నట్లు తెలిపారు. దీప కొత్త పార్టీ ప్రారంభించాలని, తమను నడిపించాలంటూ ఆమె మద్దతుదారులు ప్రకటించారు. అయితే ఆమె తగిన నిర్ణయాన్ని తీసుకొనడంలో కాలయాపన చేశారు. ఇలావుండగా ఆమె పర్యటనకు పోలీసులు అనుమతి నివ్వకపోవడంతో ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. పన్నీర్ సెల్వం నిర్ణయాన్ని అన్నాడీఎంకే వర్గాలు స్వాగతించాయి. ఈ క్రమంలో పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేయాలని కొందరు దీప మద్దతుదారులు ఆమెకు సూచించారు. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా దీపకు ఆహ్వానం పలికారు. అయితే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించేందుకు దీప సంశయించారు. పన్నీర్‌తో వెళితే తమకు మర్యాద అంతగా ఉండదని మద్దతుదారులు నిరాదరణకు గురవుతారని ఆమె భావించారు. అందువల్ల అనుకున్న ప్రకారం ఈనెల 24వ తేదీన కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈరోడ్‌లో భారీ స్థాయిలో మహానాడు జరిపి అందులో కొత్త పార్టీని ప్రకటించాలనుకున్నారు. మహానాడు ఏర్పాట్లు కూడా జరుగుతూ వచ్చాయి. దీంతో ఆమె మద్దతుదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలావుండగా ఎవరూ ఊహించని విధంగా మంగళవారం రాత్రి మెరీనా తీరంలో జయలలిత సమాధి వద్ద ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను దీప కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకే ఇరు హస్తాలుగా తాను, పన్నీర్ సెల్వం పనిచేస్తామని, ఇది తన రాజకీయ ఆరంగేట్రమని ప్రకటించారు. అంతకు మునుపు వరకు ప్రత్యేక పార్టీ ప్రారంభించనున్నట్లు చెబుతూ వచ్చిన దీప హఠాత్తుగా ఈ నిర్ణయానికి రావడం ఆమె మద్దతుదారులకు మింగుడుపడలేదు. దీనిగురించి దీప పేరవై నిర్వాహకుడు ఒకరు మాట్లాడుతూ పన్నీర్ సెల్వం ఆహ్వానం గురించి దీప తన అభిప్రాయాన్ని కోరారని, 70 శాతం మంది పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేయాలన్న అభీష్టాన్ని వ్యక్తం చేశారని, దీంతో పన్నీర్ సెల్వం వర్గంతో దీప చర్చలు జరిపారని, అయితే ఆరంభంలో దీప నిబంధనలు అంగీకరించేందుకు వారు సంశయించినట్లు తెలిపారు. దీంతో అనుకున్న ప్రకారం కొత్త పార్టీ ఏర్పాటుకు దీప నిర్ణయించారని, ఇలావుండగా సోమవారం రాత్రి పన్నీర్ సెల్వం స్వయంగా ఫోన్లో దీపతో మాట్లాడారని అందులో ఆయన దీపను తమ వైపునకు రావాలని కోరారు, కారణమేమంటే, బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలందరూ తమ వైపునకు వచ్చినట్లయితే తగిన బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చని చెప్పడంతో దీప ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. -
తమిళనాట మళ్లీ వారసత్వ రాజకీయాలు
న్యూఢిల్లీ: ‘మక్కాలాల్ నాన్, మక్కాలుకాగవే నాన్ (ప్రజల వల్లనే నేను, ప్రజల కోసమే నేను)’ ప్రతి బహిరంగ సభలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ముందుగా చెప్పిన మాటలివే. ఆ తర్వాత ‘మీది పక్కా వారసత్వ రాజకీయాలు’ అంటూ డీఎంకే పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఎక్కువ. ఇప్పుడు అలాంటి అన్నాడీఎంకే పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు పురివిప్పాయి. జయలలిత అన్నకూతురు దీపా జయకుమార్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీలోకి ఆహ్వానించడం, ఆమె శశికళకు వ్యతిరేకంగా ఆయనకు మద్దతివ్వడం తెల్సిందే. సుప్రీం కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో పార్టీపై పట్టుకోసం శశికళ కూడా వారసత్వ రాజకీయాలనే ఆశ్రయించారు. తన సోదరుడి కుమారుడైన టీటీవీ దినకరన్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకొని ఏకంగా పార్టీ డిప్యూటి జనరల్ సెక్రటరీ పదవి అప్పగించారు. మరో సమీప బంధువు ఎం. వెంకటేషన్‌ను కూడా తీసుకున్నారు. అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిద్దరికి 2011లో జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. దినకరన్, అక్రమాస్తుల కేసులో శశికళతోపాటు శిక్ష పడిన సుధాకరన్‌కు స్వయాన సోదరుడు. జయలలిత బతికున్నంతకాలం దూరంగా ఉంచిన వీరిద్దరిని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ దగ్గరికి తీసుకున్నారు. తాను జైలుకు వెళ్లాల్సి రావడంతో శశికళ తప్పనిసరి పరిస్థితిలో పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా పళనిసామికి మద్దతిచ్చారు. గౌండర్ కమ్యూనిటికి చెందిన పళనిసామి పార్టీలో బలమైన నాయకుడు. ఆ కులానికి చెందిన వారు పార్టీ శాసన సభ్యుల్లో 45 మంది ఉన్నారు. అంతటి వ్యక్తి ముఖ్యమంత్రయితే స్వతంత్రంగా వ్యవహరిస్తూ తనను పట్టించుకోకపోవచ్చనే దూరదష్టితో ఆయనకు చెక్ పెట్టేందుకు దినకరన్‌ను శశికళను తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి పదవీ స్వీకారానికి రేపు ఎవరిని ఆహ్వానించినా, ఎవరు ముఖ్యమంత్రయినా ఈ వారసత్వ రాజకీయాల వల్ల పార్టీ చీలిపోయే ప్రమాదం ఎప్పటికీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దీపా జయకుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించడం పట్ల పన్నీర్ సెల్వం వర్గీయులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. పార్టీలోకి తీసుకున్నా ఆమెకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని, ఇస్తే తమ సీటుకే ఎసరు పెడతారని పన్నీరు సెల్వంను హెచ్చరిస్తున్నవారు కూడా ఉన్నారు. -
పన్నీరు శిబిరంలోకి దీప
సాక్షి, చెన్నై: పన్నీరు శిబిరంలోకి మంగళవారం రాత్రి దీపా చేరారు. అభిమానుల అభిష్టంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడిఎంకే బలోపేతం లక్ష్యంగా శ్రమిస్తానని ప్రకటించారు. గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంటి వద్ద దీపాకు ఘన స్వాగతం పలికారు. ఈ ఇద్దరు ఒకే గూటికి చేరడంతో అన్నాడిఎంకేలో రాజకీయం వేడెక్కింది. అన్నాడీఎంకే చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా దీపా అడుగులు వేగవంతం అయ్యాయి. దీపాకు మద్దతుగా అన్నాడిఎంకేలోని ద్వితీయ , తృతీయ శ్రేణి కేడర్ కదిలింది. వారి అభిప్రాయాల మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం లక్ష్యంగా తీవ్రంగానే దీపా ప్రయత్నాల్లో పడ్డారు. గత నెల 17వ తేదిన రాజకీయ పయానానికి శ్రీకారంచుట్టారు. కొత్త పార్టీ ప్రారంభించడమా? లేదా అన్నాడీఎంకేలో చేరడమా? అనే విషయంగా ఈనెల 24న మేనత్త జయలలిత పుట్టిన రోజున ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దీపకు ఆహ్వానం పలుకుతూ పన్నీరు సెల్వం చేసిన ప్రకటన ఆమె శిబిరాన్ని ఆలోచనలో పడేసింది. శశికళకు వ్యతిరేకంగా పన్నీరు దూకుడు పెంచడంతో ఆయన శిబిరంలో చేరడం మంచిదన్న అభిప్రాయాన్ని అభిమానులు తెలియజేయడంతో ఆదిశగా దీపా అడుగులు పడ్డాయి. మంగళవారం ఉదయం నుంచి దీపా అభిమానులు, మద్దతు దారులతో సంప్రదింపుల్లో మునిగారు. మెజారిటీ శాతం మంది పన్నీరు సెల్వంతో కలిసి పనిచేయాలని సూచించడంతో వారి అభిప్రాయానికి దీపా శిరస్సు వంచారు. ఇందుకు తగ్గట్టు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మేనత్త జయలలిత సమాధి నివాళులర్పించారు. పన్నీరు శిబిరంలో చేరనున్నట్టు ప్రకటించారు. అన్నాడిఎంకేతో రాజకీయ పయనం అని ప్రకటించిన దీపా, గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు కర్పూర హారతులు పలుకుతూ పన్నీరు శిబిరం ఆహ్వానించింది. వెళ్లాల్సిన చోటికే వెళ్లారు: అక్రమ ఆస్తుల కేసులో శశికళ వెళ్లాల్సిన చోటకే వెళ్లారని దీపా ఎద్దేవా చేశారు. నాలుగేళ్లపాటు జైలు శిక్ష శశికళకు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో దీప ఇంటి ముందు గుమికూడిన కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాల్కనీ నుంచి తన కోసం వచ్చిన కార్యకర్తలకు ఆమె అభివాదం చేశారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని, శశికళకు విధించిన శిక్ష సరైనదేనని పేర్కొన్నారు. -
దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి
► పన్నీర్‌సెల్వం వైపు వలసలు ► శశికళ వ్యతిరేకులకు ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ ► దీప కొత్త పార్టీపై అనుమానాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడింది’ అన్నట్లుగా తయారైంది జయ మేనకోడలు దీప పరిస్థితి. పన్నీర్‌సెల్వం పుణ్యమాని పార్టీ పెట్టక ముందే, పర్యటనలతో ప్రజల్లో రాకముందే బలహీనపడుతోంది. అన్నాడీఎంకేలోని అందరికీ జయలలిత ఆరాధ్యదేవత. అడుగులకు మడుగులొత్తడమేకాదు, పాద నమస్కారాలు చేసేవారు. రాష్ట్ర ప్రజల చేత అమ్మగా కూడా జయ కీర్తింపబడ్డారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో తీరని అగాథం ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం ఆ పార్టీలో అసంతృప్తి రాజేసింది. జయ మరణానికి కారణమైన శశికళ ప్రధాన కార్యదర్శిగా సహించలేమని బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి. దీప వైపు కార్యకర్తల చూపు: అన్నాడీఎంకేలోని అసంతృప్తివాదులు ప్రత్యామ్నాయంగా జయ మేనకోడలు దీపను ఎంచుకున్నారు. చెన్నైలోని టీనగర్‌లోని ఇంటికి క్యూకట్టడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దీపను ఊహించుకున్నారు. ఇది కుదరని పక్షంలో దీప చేత కొత్త పార్టీ పెట్టించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించిన శశికళ వ్యతిరేకీయులు రాష్ట్రవ్యాప్తంగా దీప పేరవైలను ప్రారంభించారు. పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కూడా సాగిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆమెపై ఒత్తిడి పెంచారు. శశికళపై వ్యతిరేకత, తన పట్ల పెరుగుతున్న అభిమానానికి స్పందించిన దీప తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత నెల 17వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున కీలకమైన ప్రకటన చేస్తానని, ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలుసుకుంటానని తెలిపారు. అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ సంక్షోభం శశికళకు పోటీగా దీపను రాజకీయాల్లో తేవాలని భావించిన వారిని ఆలోచనలో పడేసింది. జయ మరణించిన మూడునెలల్లోనే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గంగా పార్టీ రెండుగా ముక్కలైంది. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో బలమైన పవర్‌సెంటర్‌గా మారిపోవడం వారిని ఆనందింపజేసింది. శశికళపై తమకున్న వ్యతిరేకత పన్నీర్‌సెల్వం రూపంలో తీరిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఇక దీప అవసరం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. అన్నాడీఎంకేలో రాజకీయపోరు ప్రారంభం కాగానే దీప ఇంటి వద్ద అభిమానులు పలచన కావడం ప్రారంభమైంది. జయ మేనకోడలు హోదాలో దీపను ఆహ్వానిస్తున్నానని, ఎప్పుడు వచ్చినా తగిన మర్యాదనిస్తానని పన్నీర్‌సెల్వం ఆహ్వానించడం పరోక్షంగా దీప పేరవైని దెబ్బతీసింది. శశికళపై కక్షతో దీపను బలమైన రాజకీయనేతగా తీర్చిదిద్దేకంటే పన్నీర్‌సెల్వం పంచన చేరడం మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే దీప నేతృత్వంలో కొత్త పార్టీ ఉదయించకుండానే అస్తమించినట్లు కాగలదు. -
నాక్కూడా అపాయింట్ మెంట్ ఇవ్వండి!
చెన్నై: అన్నాడీఎంకేలో అధికారం కోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య కుమ్ములాట జరుగుతుండగా నేనున్నానంటూ జయలలిత మేనకోడలు దీప ముందుకు వచ్చారు. ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోవడంతో ఆయనను కలిసేందుకు ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీపకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీప మద్దతుదారులు రాజ్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, జయలలితకు తాను వారసురాలిని తానేనని దీప ఇంతకుముందు ప్రకటించుకున్నారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు ఎంతమాత్రం కోరుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. దీప మద్దతు ఇస్తే తీసుకుంటానని పన్నీర్ సెల్వం ఇంతకుముందు పేర్కొన్నారు. -
దీపా అడుగు
పన్నీరు పిలుపునకు స్పందించేనా? మద్దతుదారులతో సమాలోచన నిశితంగా పరిశీలన సాక్షి, చెన్నై: మేనత్త జయలలితకు తానే వారసురాలి నంటూ రాజకీయల్లో రాణించేందుకు తీవ్రంగా కసరత్తుల్లో ఉన్న దీపా అడుగులు ఇక, ఎలా ఉండనున్నాయో అన్న చర్చ బయలు దేరింది. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం పిలుపురనకు ఆమె స్పందించేనా అన్న ఎదురు చూపులు బయలు దేరాయి.అమ్మ జయలలిత మరణం తదుపరి నెలకొన్న పరిణామాలతో అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతియ శ్రేణి కేడర్ చూపు దీపా మీద మరలిన విషయం తెలిసిందే. జయలలితమేన కోడలు దీపా నాయకత్వంలో పనిచేసే దిశగా ఆ కేడర్ అడుగులు సాగుతున్నాయి. దీపా పేరవై గొడుగు నీడన బలోపేతం లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. అచ్చం అమ్మ జయలలితను గుర్తుకు తెచ్చే రీతిలో దీపా అడుగులు ముందుకు సాగుతున్నాయి. దీపా పార్టీ పెట్టేనా అన్నంతగా ఇన్నాళ్లు చర్చ సాగుతున్న సమయంలో తాజాగా, అన్నాడిఎంకేలో నెలకొన్న పరిస్థితులు దీపా అడుగులు ఎలా ఉంటుందోనన్న చర్చ బయలు దేరింది. అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా కలిసి పనిచేద్దామంటూ దీపాకు అపధర్మ సీఎం పన్నీరు సెల్వం ఆహ్వానం పలకడంతో ఇక, ఆమె అడుగులు ఎటో అన్న ప్రశ్న బయలు దేరింది. పన్నీరు పిలుపుకు స్పందించేనా లేదా, తన దైన శైలిలోనే ముందుకు సాగేనా అన్న ఎదురు చూపులు బయలు దేరాయి. పన్నీరు ఆహ్వానం, అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలను దీపాతో పాటుగా ఆ పేరవై వర్గాలు నిశితంగా పరిశీంచే పనిలో పడ్డాయి. పేరవై వర్గాలతో దీపా సమాలోచన సైతం సాగిస్తున్నట్టు సమాచారం. పన్నీరు సెల్వం వేయబోయే తదుపరి అడుగుల మేరకు స్పందించాలన్నట్టుగా దీపా నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈవిషయగా పేరవై వర్గాలను కదిలించగా, పన్నీరు ఆహ్వానం మేరకు ఇప్పట్లో స్పందించే అవకాశాలు ఉండబోదని సమాధానం ఇస్తున్నారు. ఇక, ఏకంగా దీపాను కదిలించగా, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, వేచి చూద్దం అని మీడియా ప్రశ్నలకు దాట వేత ధోరణి ప్రదర్శించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే మలర్వన్ మరో అడుగు ముందుకు వేసి దీపా నాయకత్వంలో అన్నాడీఎంకే వర్గాలకు మంచి రోజులు రాబోతున్నాయని స్పందించడం విశేషం. అలాగే, అన్నాడిఎంకే రెండాకుల చిహ్నం దీపా చేతికి రావడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మేము ముందుగానే పరిస్ధితి గురించి చెప్పాం
-
చిన్నమ్మ సీఎం కాకుండా ఆపేందుకే..!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన నేపథ్యంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీ పర్యటన చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి.. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. శశికళ నిందితురాలిగా ఉన్న అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ను స్టాలిన్ కోరే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడులో పరిస్థితులు స్థిరంగా లేవని, ఈ నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా దిగజారుతాయని, ఈ నేపథ్యంలో చిన్నమ్మ సీఎం కాకుండా అడ్డుకోవాలని ఆయన కోరనున్నట్టు సమాచారం. మంగళవారం రాత్రికల్లా స్టాలిన్ ఢిల్లీ చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతుండగా.. ఆమె ప్రమాణాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీంతో చిన్నమ్మ ప్రమాణం అనిశ్చితిలో పడింది. -
అమ్మ వారసురాలిని ముమ్మాటికీ నేనే!
-
అమ్మ వారసురాలిని ముమ్మాటికీ నేనే!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిని తానేనని, అమ్మ తరఫున తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె మేనకోడలు దీప ప్రకటించారు. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని ప్రకటించారు. అమ్మ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తానని, త్వరలోనే కొత్త పార్టీ పెడతానని తెలిపారు. తన కొత్త పార్టీ వివరాలు ఈ నెల 24న ప్రకటిస్తానన్నారు. జయలలిత ఆశయసాధన కోసం తాను పోరాడుతానని చెప్పారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు ఎంతమాత్రం కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో జయలలిత మృతిపైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలితకు అందించిన చికిత్స రికార్డులన్నింటినీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అమ్మ మృతిపై అపోలో వైద్యులు ఇచ్చిన వివరణ సరిపోదని, ఇంకా చాలా అనుమానాలకు సమాధానం రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెను కలిసేందుకు తనను అనుమతించలేదని గుర్తుచేశారు. -
శశికళపై ధ్వజమెత్తిన దీప
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని వస్తున్న కథనాలపై జయలలిత మేనకోడలు దీపాకుమార్ స్పందించారు. 'ఇండియా టుడే'తో మాట్లాడిన ఆమె శశికళ తీరు సైనిక కుట్రను తలపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవారిని మార్చి తాను అకస్మాత్తుగా పగ్గాలు చేపడితే.. దానిని ప్రజలు ఒప్పుకోబోరని ఆమె పేర్కొన్నారు. సీఎం పన్నీర్ సెల్వాన్ని గద్దె దించి శశికళ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారని, ఇందుకోసమే ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కీలక భేటీ నిర్వహించబోతున్నారని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథనాలపై దీప స్పందించారు. ఈ విషయంలో పలు కథనాలు వస్తున్నాయని, అయినా అన్నాడీఎంకే తుది నిర్ణయం తీసుకునేవరకు వేచిచూడటం మంచిదని చెప్పారు. సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. 'ఇలా జరగాలని ప్రజలు కోరుకోవడం లేదు. తమిళనాడు ప్రజలకు అంతతి దుస్థితి వస్తుందని నేను కూడా అనుకోవడం లేదు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో కూల్చడం లాంటిదే. ఆమె ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన నేత కాదు' అంటూ పేర్కొన్నారు. జయలలిత సలహాదారు అయిన షీలాబాలకృష్ణన్ ను పక్కా ప్లాన్‌తోనే పదవి నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. -
అచ్చం అమ్మలానే!
► ఆర్కేనగర్ నుంచి దీప రాష్ట్ర పర్యటన ► జయ బాణీలో ప్రచారం ► నేడు కన్వీనర్లతో సమావేశం ► జయ మృతిపై ప్రధానికి గౌతమి లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో కాలుమోపిన జయలలిత మేనకోడలు దీప అత్త బాణీలోనే సాగుతున్నారు. ఎమ్మెల్యేగా అత్త ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ నుంచి తన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. వేష భాషలు, ఆప్యాయంగా మాటతీరు అమ్మను తలపిస్తోందంటూ ఆర్కేనగర్ ప్రజలు దీపను అక్కున చేర్చుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన రాజకీయ పయనం ఆగదని ఈ సందర్భంగా దీప స్పష్టం చేశారు. రాష్ట్రపర్యటన ఏర్పాట్ల దీప పేరవై కో ఆర్డినేటర్లతో ఆదివారం దీప సమావేశం అవుతున్నారు. జయలలిత స్థానంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను జీర్ణించుకోలేని పార్టీ శ్రేణులు దీప వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. గత నెల 17వ తేదీన ఎంజీ రామచంద్రన్ జయంతి రోజున రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు దీప ప్రకటించారు. ఆరంభంలో పార్టీలోని కార్యకర్తలు మాత్రమే దీపవైపు మొగ్గుచూపగా కాలక్రమేణా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మద్దతు పలకడం ప్రారంభించారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో దీప పేరవైని స్థాపించి సభ్యులను చేర్పిస్తున్నారు. ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి సందర్భాన రాజకీయంగా ఒక కీలకమైన ప్రకటన చేయనున్నట్లు రాజకీయ అరంగేట్రం రోజునే దీప ప్రకటించారు. అత్త జయలలితను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆర్కేనగర్ నుంచే తన పర్యటనను ప్రారంభించారు. అన్నాదురై జయంతి సందర్భంగా శుక్రవారం మెరీనాబీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించి ఆర్కేనగర్కు చేరుకోవాలని ఆమె తలంచారు. దీప రాక సందర్భంగా ఆమె అభిమానులు ఆర్కేనగర్లో ఏర్పాటు చేసిన వేదికను తొలగించాలని పోలీసులు అభ్యంతరం చెప్పగా అన్నాడీఎంకే కార్యకర్తలు, దీప అభిమానులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆర్కేనగర్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో దీప తన పర్యటనను కొద్దిసేపు వాయిదా వేసుకుని ఆ తరువాత వచ్చారు. జయలలిత వలే నిండుగా కప్పుకుని ఆర్కేనగర్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న తన అభిమానులను, వృద్ధులను, చిన్నారులను కలుసుకున్నారు. వృద్ధ మహిళల కాళ్లకు దీప నమస్కరించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయాల్సిందిగా దీపను కోరగా, త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బదులిచ్చారు. జయలలిత వదిలి వెళ్లిన ఆశయాలను తాను నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆర్కేనగర్లోని మూడు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయకాలను పంచిపెట్టారు. ఆర్కేనగర్ ప్రజలు అమ్మ మరణం అనుమానాస్పదమని భావిస్తున్నారు. అంతేగాక జయలలిత అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడానికి శశికళే కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా అమ్మ పదవిలో కూర్చునట్లే ఆర్కేనగర్ నుంచి పోటీకి దిగితే సహించబోమని, ఎన్నికల పర్యటనకు వస్తే తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు. అర్కేనగర్ ప్రజల హృదయాల్లో అమ్మ ఆ స్థాయిలో గూడుకట్టుకుని ఉండగా దీప పర్యటన వారిలో సంతోషాన్ని కలిగించింది. నిన్ను చూస్తుంటే అమ్మను చూసినట్లే ఉందని ఆనందపడిపోతూ దీపకు అఖండస్వాగతం పలికారు. జయ మరణ మిస్టరీపై పోరాటం తప్పదా: ప్రధానికి నటి గౌతమి లేఖ జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని బద్దలు కొట్టేందుకు న్యాయవిచారణ జరపాలన్న తన డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ నటి గౌతమి ప్రధాని మోదీకి శనివారం లేఖ రాసారు. జల్లికట్టు పోరాటంలా ప్రజలు ఉద్యమించక తప్పదాని నిలదీశారు. జయలలిత మరణం పట్ల తమిళనాడు ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ గత ఏడాది డిసెంబరు 8వ తేదీన గౌతమి ప్రధానికి లేఖ రాశారు. అయితే ఇంత వరకు కేంద్రం నోరుమెదపక పోవడంతో శనివారం మరోసారి ఉత్తరం రాశారు. జయలలిత మరణం విచారణకు ఆమోదించాలంటే తాము ఇంకా ఏమి చేయాల్లో చెప్పాల్సిందిగా ఆమె కోరారు. కేంద్రం దృష్టిని ఆకర్షించేలా జల్లికట్టును పోలిన ఉద్యమాన్ని లేవనెత్తాలా అని వ్యాఖ్యానించారు. -
ఎన్నికల బరిలో దీప
►స్థానికానికి సై ► అర్కేనగర్ నుంచి పోటీకి సమాలోచన ► త్వరలో ఆర్కేనగర్ ఎన్నికల తేదీ ప్రకటన : ఈసీ రాజకీయ రంగంలోకి ఒంటరిగా అడుగుపెట్టిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఎన్నికల రణరంగంలోకి సైతం దిగేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపి అర్కేనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు సమాయత్తం అవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికైన నేపథ్యంలో ఆ పార్టీలో చేరే అవకాశం లేకపోవడంతో దీప స్వతంత్రంగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ, మంది మార్బలం ఏదీ లేకుండా తన రాజకీయ అరంగేట్రాన్ని ఇంటి వద్ద ప్రకటించారు. అయితే ఏదైనా పార్టీలో చేరుతారా, సొంత పార్టీ పెడతారా అనే సందేహాలకు ఈ నెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున దీప సమాధానం ఇవ్వనున్నారు. అయితే అప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకోవడం, భవిష్య ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో దీప నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై వర్ధంతి సందర్భంగా శుక్రవారం మెరీనాబీచ్‌లోని అన్నా సమాధి వద్దకు వచ్చి దీప నివాళులర్పించారు. అన్నాదురై వర్ధంతి సందర్భంగా శుక్రవారం చెన్నై తండయార్‌పేటలో వేదికను ఏర్పాటు చేసి దీప చేతుల మీదుగా ప్రజలకు సహాయకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి వేదికను తొలగించాలని ఆదేశించడంతో గందరగోళం నెలకొంది. దీప అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కార్యక్రమం నిలిచిపోయింది. గురువారం రాత్రి దీప తన అభిమానులతో కలిసి మైలాపూర్‌లోని కపాలీశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వెలసిన దీప పేరవైలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఎన్నికల బరిలోకి... : ఆర్కేనగర్ నుంచి పోటీ చేసేందుకు అనుకూల, ప్రతికూల అంశాలను సన్నిహితుల వద్ద ఆమె సమీక్షించుకుంటున్నారు. అన్నాడీఎంకేకు పెట్టని కోట, జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కేనగర్ నుంచి పోటీచేయాలని ఆ పార్టీలోని అసంతృప్తి వాదులు దీపపై ఒత్తిడి పెంచుతుండగా, ఆమె కూడా సమ్మతించినట్లు సమాచారం. ఆర్కేనగర్లో ఎన్నికల తేదీని త్వరలో ఖరారు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్‌లఖాని శుక్రవారం తెలిపారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజయకవర్గంలో జూన్ 5వ తేదీలోగా ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. మేలో ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా త్వరలో తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అలాగే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తిరునెల్వేలి జిల్లా దీప పేరవై ప్రకటించింది. -
మద్దతు
జయ మేనకోడలు దీప రాజకీయ అరంగేట్రం జరిగిపోగా ఆమెకు బాసటగా నిలిచేవారి సంఖ్య పెరుగుతోంది. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే మలరవన్ దీపకు మద్దతుగా పార్టీ నుంచి వైదొలిగారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలను శశికళ చేపట్టినా పార్టీలో ప్రశాంత వాతావరణం నెలకొనలేదు. శశికళ నాయకత్వాన్ని సహించలేని వారంతా దీప వైపు చూస్తున్నారు. వారిలో కొందరు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. తాజాగా కోయంబత్తూరు మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే మలరవన్ బుధవారం మీడియా సమావేశం పెట్టి మరీ శశికళపై విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకేను ఎంజీఆర్ స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్నానని, ఆయన మరణం తరువాత జయలలిత నాయకత్వంలో కొనసాగానని చెప్పారు. అన్నాడీఎంకేలో పార్టీపరంగా, ప్రజాప్రతినిధిగా అనేక పదవుల్లో ఉంటూ ప్రజాసేవ చేశానని తెలిపారు. అయితే జయలలిత మరణం తరువాత పార్టీ పరిస్థితులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శశికళ భర్త నటరాజన్ తాను, తన కుటుంబ సభ్యులు పార్టీ ప్రగతికి పాటుపడ్డానని చెప్పుకోవడం బాధాకరమని అన్నారు. అన్నాడీఎంకే అంటే ప్రాణంఇచ్చే ఎవ్వరూ ఆయన మాటలను సహించలేరని తెలిపారు. జయలలిత తన స్వయంకృషితో పార్టీని అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. ఇలాంటి అనేక కారణాలతో అన్నాడీఎంకే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకేకు సరైన నాయకురాలు దీప మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. దీప మాత్రమే జయలలితకు నిజమైన రాజకీయ వారసురాలని ఆయన అన్నారు. దీప పేరవైలో తాను చేరుతున్నానని, మరింత మందిని చేరుస్తానని తెలిపారు. రూట్‌మ్యాప్ రూపకల్పన:రాజకీయనేతగా తనను తాను ప్రకటించుకున్న దీప రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. జయలలిత జయంతి ఫిబ్రవరి 24వ తేదీన రాజకీయంగా ఒక కీలకమైన ప్రకటన చేయబోతుండగా, అప్పటి వరకు రాష్ట్రమంతా పర్యటిస్తానని ఈనెల 17వ తేదీన మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్రం నలుమూల నుంచి తనకు మద్దతు పెరుగుతుండడంతో పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి బుధవారం ఉదయం 8 గంటల నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. వారందరి అభిప్రాయాలతో కూడిన ఉత్తరాలను స్వీకరించేందుకు మూడు పెద్దసైజు పెట్టెలను అక్కడ ఏర్పాటు చేశారు. వచ్చేనెల 23వ తేదీలోగా పర్యటన ముగించుకోవాలని నిర్ణయించుకున్న దీప త్వరలో తన రూట్‌మ్యాప్‌ను ప్రకటిస్తానని బుధవారం తెలిపారు. దీప అభిమానులపై దాడి: ఇదిలా ఉండగా, దీప అభిమానులపై బుధవారం అన్నాడీఎంకే కార్యకర్తలు దాడిచేశారు. తాంబరం ముడిచ్చూరు రోడ్డులోని ఒక కల్యాణమండపంలో దీప అభిమానులు ఎంజీఆర్ శతజయంతి సభను నిర్వహిస్తుండగా దాడులు జరిపి సమావేశాన్ని నిలిపివేశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను పంపివేశారు. -
దీప అరంగేట్రం
► ఇక దీప రాష్ట్రవ్యాప్త పర్యటన ► అమ్మ జయంతిలోగా అభిప్రాయ సేకరణ ► వచ్చే నెల 24న కీలక ప్రకటన ► అమ్మ మరణంపై అనుమానం లేదు ► ఎన్నికల్లో పోటీ ఖాయం ► ఎక్కడనేది తర్వాత ప్రకటిస్తా ఎంజీఆర్ శతజయంతి సాక్షిగా మంగళవారం నుంచి తన రాజకీయ అరంగేట్రం జరిగిపోయిందని జయలలిత అన్నకుమార్తె దీప ప్రకటించారు. అసలైన రాజకీయ జీవితం అమ్మ జయంతి రోజైన ఫిబ్రవరి 24వ తేదీన పూర్తిస్థాయిలో ప్రారంభం అవుతుందని ఆమె తెలిపారు. అన్నాడీఎంకే కార్యకర్తల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నైః చెన్నై టీ.నగర్‌లోని ఇంట్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీప మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావడం ద్వారా తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని తన రాజకీయ పయనాన్ని ప్రారంభిస్తున్నానని అన్నారు. కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు తాను ముహూర్తం పెట్టుకున్న అమ్మ జయంతికి 35 రోజులు గడువు ఉంది. ఈ కాలంలో రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలను కలుసుకుంటానని తెలిపారు. అదేరోజున తన రాజకీయ ప్రణాళికను ఆవిష్కరిస్తానని తెలిపారు. నేడు రాజకీయ ప్రవేశంతో తొలి దశ పూర్తికాగా, ఫిబ్రవరి 24న మలిదశ ప్రారంభమై వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. తన రాజకీయ అరంగేట్రం గురించి వస్తున్న అనుమానాలు ప్రస్తుత ప్రకటనతో పటాపంచలు అయినట్టేనని అన్నారు. 1972లో ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించి అధికారంలోకి తీసుకురాగా, ఆ తరువాత అదేస్థాయిలో జయలలిత పార్టీని ముందుకు నడిపిం చారని చెప్పారు. జయ మరణం తరువాత పార్టీ కార్యకర్తలు తనను రాజకీయాల్లో ఆహ్వానించారని, అయితే తనకు వ్యక్తిగత జీవితం, బాధ్యతలు ఉన్నందున వెంటనే జవాబు చెప్పలేక పోయానని అన్నారు. తనకు జన్మభూమి తమిళనాడు, మాతృభాష తమిళం రెండు కళ్లుగా భావించి రాజకీయాల్లో కొనసాగుతానని తెలిపారు. జయలలిత చూపిన మార్గంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతానని చెప్పారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీల నుంచి తనను ఎవ్వరూ సంప్రదించలేదని, తన ఇంటికి వచ్చే కార్యకర్తలను మాత్రమే కలుస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో తనకు గాడ్‌ఫాదర్ లేరు, ఏ పార్టీ నేతలు తనను రెచ్చగొట్టడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానంలో మరెవ్వరిని ఊహించలేమన్నారు. జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన సోదరుడు దీపక్ అక్కడే ఉన్నందున అత్త మరణంలో తనకు సందేహాలు లేవని అన్నారు. జయ ఆస్తుల కోసం తాను ఆశపడడం లేదని, ఆమె వినియోగించిన పెన్ ఇస్తే చాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమ్మ మరణించిన నాటి నుంచి తన ఇంటికి వచ్చి ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంజీర్, జయలలితకు నివాళి: తన రాజకీయ అరంగేట్ర ప్రకటనకు ముందుగా ఎంజీఆర్, జయలలితలకు దీప నివాళులర్పించారు. తన ఇంటికి సమీపంలోని ఎంజీఆర్ స్మారక భవనం, అన్నాశాలైలోని ఎంజీఆర్ విగ్రహం, మెరీనాబీచ్‌లోని ఎంజీఆర్, జయలలిత సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం ఉదయం 7 గంటలకు చెన్నైలోని ఎంజీఆర్ స్మారక భవనానికి తాళం వేసి ఉండడంతో ఆమె అభిమానులు ఆ తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లారు. వారి వెంట దీప కూడా లోపలికి వెళ్లి అక్కడి ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. దీప వస్తున్నట్టుగా ముందస్తు సమాచారం ఉన్నా తగిన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఆమె అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ మెరీనా బీచ్ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. దీప ఇంట జనసందోహం: దీప తొలిసారిగా రాజకీయ ప్రకటన చేస్తున్నారని ప్రచారం జరగడంతో మంగళవారం ఆమె ఇంటి పరిసరాలు జనంతో కిటకిటలాడాయి. దీపకు అనుకూలంగా నినాదాలు, డ్రమ్స్, బాణాసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మెరీనాబీచ్ వద్దనున్న సమాధుల వద్ద అన్నాడీఎంకే మహిళా కార్యకర్తలు నృత్యాలు చేస్తూ దీపకు స్వాగతం పలికారు. దీపను చూడాలని పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహం చూపారు. దీపకు స్వాగతం చెప్పిన వారి చేతుల్లో అన్నాడీఎంకే పతాకాన్ని పోలినట్లుగా మూడు రకాల పతాకాలు ఉండడం విశేషం. జనాన్ని అదుపుచేసేందుకు అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. దీంతో దీప తన ఇంటి ముందు ప్రయివేటు సెక్యూరిటీని పెట్టాల్సి వచ్చింది. నిరుత్సాహపరిచిన దీప ప్రకటన: జయలలిత మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన బిందువుగా మారిన దీప ఈ నెల 17న చేయబోయే రాజకీయ ప్రకటన ఏ విధంగా ఉంటుందో అని ఉత్కంఠతో ఎదురుచూసిన వారిని నిరుత్సాహపరిచింది. తన ఇంటికి వచ్చేవారితో నెలరోజులుగా చెబుతున్న మాటలనే మీడియా ముందు ఉద్ఘాటించారు. కొత్త పార్టీని పెట్టడమా, మరేదైనా పార్టీలో చేరడమా అనేది స్పష్టం చేయకుండా ప్రజాభిప్రాయ సేకరణకై రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఎందుకీ జాప్యమని మీడియా ప్రశ్నించడంతో ఇందులో జాప్యమేమీ లేదని బదులిచ్చారు. తన రాజకీయ ప్రవేశాన్ని ఖరారు చేయడం కోసమే మీడియా ముందుకు వచ్చానని సమర్ధించుకున్నారు. శశికళ గురించి మీడియా ప్రతినిధులు అనేక ప్రశ్నలు సంధించినా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. సీఎం పన్నీర్‌సెల్వం పాలన బావుందని కితాబివ్వడం మరింత విశేషం. ఎన్నికల్లో పోటీ చేసేది ఖాయమని ప్రకటించడం మాత్రమే ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశం. -
దీప రాజకీయ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ
-
దీప రాజకీయ అరంగేట్రం
రాష్ట్ర రాజకీయాలు మంగళవారం మరోసారి జాతీయతెరపై మెరవనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్న కుమార్తె దీప రాజకీయ అరంగేట్రమే ఇందుకు కారణం. తన రాజకీయ ప్రవేశం సందర్భంగా దీప చేయబోయే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ పార్టీలో కల్లోల వాతావరణాన్ని సృష్టించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను సహించలేక రగిలి పోతున్నవారంతా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. వీరిలో అధికశాతం మంది అన్నాడీఎంకేపై అభిమానాన్ని చంపుకోలేక, అలాగని శశికళ నాయకత్వంలో ఇమడలేక నలిగిపోతున్నారు. శశికళ బొమ్మలను చింపివేయడం ద్వారా తమ నిరసనను చాటుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న ద్వితీయ శ్రేణి మొదలుకుని కింది స్థాయి కార్యకర్త వరకు అధికశాతం లోలోన దీప వైపు మొగ్గు చూపుతున్నారు. రాజకీయాల్లో అమ్మ లేని లోటును తీర్చాలంటూ దీపపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటి పరిసరాలు అభిమానుల నినాదాలతో మార్మోగుతున్నాయి. ప్రతిరోజు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని దీప కలుసుకుంటున్నారు. సమయం వచ్చినపుడు రాజకీయ ప్రవేశం ఖాయమని నచ్చజెబుతూ వచ్చారు. కొందరు ఉత్సాహవంతులు సేలం జిల్లాలో దీప పేరవైని స్థాపించడమేగాక రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు సాగిస్తున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో మరో అభిమాన వర్గం ‘జయలలిత, ఎంజీఆర్ అన్నాడీఎంకే’ అనే పార్టీ పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ‘అఖిల భారత అమ్మ ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఏఐఏడీఎంకే) అనే పార్టీ ఇటీవల నామక్కల్‌లో నెలకొల్పడమేగాక పతాకాన్ని సైతం ఆవిష్కరించారు. దీపకు మద్దతుగానే తమ పార్టీని స్థాపించినట్లు వ్యవస్థాపకులు తెలిపారు. జయలలిత రాజకీయ సలహాదారు దురై బెంజిమిన్ ‘అమ్మ మక్కల్ మున్రేట్ర సంఘం’ను సోమవారం స్థాపించి రిజిష్ట్రషన్ కూడా చేయించారు. శశికళ మద్దతుదారుల బెదిరింపులు ఈ నెల 17వ తేదీన దీప రాజకీయ ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు చెన్నై విరుగంబాక్కంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి శశికళ మద్దతుదారులు అడ్డంకులు సృష్టించారు. దీప పేరవై తరఫున విరుగంబాక్కంలో ఒక కల్యాణ మండపాన్ని ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే సమావేశ నిర్వాహకులు వచ్చే వేళకు కల్యాణ మండపానికి తాళం వేసి ఉంది. అంతేగాక దీప పేరవై సమావేశం నిర్వహించేందుకు వీలులేదని పోలీసులు తరిమివేయడంతో స్వల్పంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సమావేశం కోసం ఈ నెల 13వ తేదీన కల్యాణ మండపాన్ని బుక్ చేసి అడ్వాన్సు కూడా చెల్లించామని దక్షిణ చెన్నై జిల్లా అమ్మా పేరవై సహాయ కార్యదర్శి కె.పుగళేంది తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్లో అనుమతికి దరఖాస్తు చేసుకోగా చర్చా సమావేశాలకు అనుమతి అవసరం లేదని చెప్పారని ఆయన అన్నారు. అయితే అకస్మాత్తుగా శశికళ మద్దతుదారులు రంగప్రవేశం చేసి కల్యాణ మండపం యాజమాన్యాన్ని బెదిరించి తాళాలు వేయించారని ఆయన ఆరోపించారు. నేడు దీప ప్రకటన అధికార అన్నాడీఎంకే నుంచి ఎదురవుతున్న ఇటువంటి ప్రతిఘటన వాతావరణంలో దీప తన రాజకీయ భవిష్యత్తుకు మంగళవారం పునాదులు వేయడం ప్రారంభిస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన దీప తన పేరుతో వెలసిన పేరవైలో చేరుతారా, కొత్త పార్టీ పెడతారా, అలాగాక మరేదైనా ప్రముఖ పార్టీలో చేరుతారా అనే ఆలోచనలతో ఉత్కంఠ నెలకొని ఉంది. తన కోసం ఇంటికి వచ్చే అభిమానులకు రెండాకుల చిహ్నం వలె రెండు వేళ్లను చూపుతుండగా ప్రజలు కేరింతలు కొడుతున్నారు. తన అభిమానులు ఆశిస్తున్న బాటనే ఎంచుకుంటానని సోమవారం సైతం తన ఇంటి వద్ద దీప స్పష్టం చేశారు. అలాగని అన్నాడీఎంకేలో చేరే అవకాశం లేదు. ఇంతకూ దీప రాజకీయ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని అన్ని పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది. -
దీప కొత్త పార్టీ?
► శ్రేయోభిలాషులతో సమాలోచనలు ►బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆరా ►బలపడుతున్న దీప పేరవై సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే లక్ష్యంగా రాష్ట్రంలో మరోకొత్త పార్టీ ఆవిర్భవించనుందా? దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్నకుమార్తె దీప కొత్త పార్టీకి సారథ్యం వహించనున్నారా? అవును, ప్రస్తుతానికి ఇవి ఊహాగానాలే అయినా పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు రాష్ట్రం లోని రాజకీయ విశ్లేషకులు. జయలలిత మరణంతో రాష్ట్రం లో ఒకరకమైన రాజకీయ శూన్యత ఏర్పడింది. బలమైన అన్నాడీఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టినా ఆ పార్టీలో అనిశ్చితి కొనసాగుతోంది. పార్టీలోని అగ్రనేతలు శశికళ ఎంపికను ఏకపక్షంగా కానిచ్చేయడంతో ద్వితీయ శ్రేణి మొదలుకుని క్షేత్రస్థాయి వరకు అసంతృప్తితో రగిలిపోతున్నారు. శశికళ బొమ్మతో కూడిన పోస్టర్లు, ఫ్లెక్సీలు కనబడితే చించివేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా శశికళకు పోటీగా దీపను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సేలం జిల్లా కేంద్రంగా వెలిసిన జయలలిత దీప పేరవైని అన్నాడీఎంకేలోని అసంతృప్తి వాదు లు వెనకుండి నడిపిస్తున్నారు. దీప పేరవై రాష్ట్రం నలుమూలలా విస్తరి స్తూ సభ్యత్వ నమోదుతో ముందుకు వెళుతోంది. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని సభ్యత్వాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు చెన్నైలోని దీప ఇంటి వద్ద అభిమానుల తాకిడి అంతకంతకూ పెరిగిపోతోంది. రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడికి తలొగ్గిన దీప ఈనెల 17వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారు. తేదీ మినహా మరే వివరాలను అమె ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే మద్దతు: అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే తిరుచ్చి సౌందరరాజన్ తన మద్దతు ప్రకటించారు. తిరుచ్చిరాపల్లి జిల్లా కైత్తరి కల్యాణమండపంలోబుధవారం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను దీపతో మాత్రమే భర్తీ చేయగలమని ఆయన అన్నారు. కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా జయలలిత స్థాయిలో దీప మహత్తర శక్తిగా ఎదుగుతారని చెప్పారు. చెన్నైలో దీప సమాలోచనలు: ఇదిలా ఉండగా, తన రాజకీయ అరంగేట్రం రోజు సమీపిస్తుండగా చెన్నై నంగనల్లూరులోని కేసీటీ కల్యాణ మండపంలో దీప తన శ్రేయోభిలాషులతో బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో అక్కడక్కడా దీప పేరవై పేరున సమావేశాలు జరుగుతున్నా దీప హాజరుకాలేదు. ఈ దశలో బుధవారం దీప తొలిసారిగా తన అభిమానులతో అందునా చెన్నైలో సమావేశం కావడం ఎంతో కీలకంగా భావించవచ్చు. శశికళ ప్రధాన కార్యదర్శిగా ఉన్నంత వరకు అన్నాడీఎంకేలోకి దీప ప్రవేశించే అవకాశం లేకపోవడంతో కొత్త పార్టీని పెట్టడమా, దీప పేరవైని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడమా అని ఆమె తర్జనభర్జన పడుతున్నారు. పార్టీనే పెట్టదలుచుకుంటే ఎంజీ రామచంద్రన్, జయలలిత పేర్లు కలిసి వచ్చేలా నామకరణం చేస్తారని సమాచారం. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన అభిమానులతో దీప బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అందరి ఆలోచనల మేరకు దీప ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఆ వివరాలను సమావేశం ముగియగానే మీడియాకు చెబుతారా లేక 17వ తేదీన దీప స్వయంగా ప్రకటిస్తారా అనేది తెలియరావడం లేదు. అమిత్‌షా ఆరా: ఇదిలా ఉండగా, దీప రాజకీయరంగ ప్రవేశంపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరా తీస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశానికి తమిళనాడు నుంచి కేబినెట్లో ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్రశాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతోపాటు ముఖ్యంగా దీపకు పెరుగుతున్న ఆదరణ, రాజకీయాల్లోకి రావడం, దీప వెనుకుండి నడిపించే రాజకీయ శక్తులు ఎవరు తదితర అంశాలపై లోతుగా అడిగి తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు చెప్పాయి. -
17న దీప అరంగేట్రం
-
17న దీప అరంగేట్రం
► రాజకీయ ప్రవేశంపై ముమ్మరంగా అభిప్రాయసేకరణ ►పురట్చిమలర్ (విప్లవ పుష్పం) దీపగా ప్రచారం ►ఫిబ్రవరి 24న సేలంలో దీప పేరవై మహానాడు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనా డు రాజకీయ వినీలాకాశంలో మరో నేత త్వరలో మెరవనుంది. పురట్చిమలర్ దీప (విప్లవ పుష్పం) అనే నామకరణం కూడా జరిగిపోయింది. ఈనెల 17వ తేదీన ఎంజీఆర్ శత జయంతిరోజున అధికారికంగా ప్రకటించనున్నట్లు దీప సోమవారం తెలియజేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గా శశికళ ఎంపికను ససేమిరా అంటున్న పార్టీ శ్రేణులన్నీ దీప ఇంటి బాటపడుతున్నాయి. చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి 15 రోజులుగా తండోపతండాలుగా కార్యకర్తలు వస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు దీప పలువురు రాజకీయపెద్దలను, శ్రేయోభిలాషులను కలుసుకుంటున్నారు. దీప ఇంట్లో లేని సమయాల్లో ఆమె భర్త మాధవన్, సాయంత్రం వేళల్లో దీప ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇంటి వద్ద ఒక రిజిస్టర్‌ను అందుబాటులో పెట్టి తన కోసం వచ్చేవారి పేరు, చిరునామా, సెల్‌ఫోన్ నంబరుతోపాటు అభిప్రాయాలను నమోదు చేసేందుకు ఏర్పాటు చేశారు. చెన్నై టీనగర్‌లోని ఆటో స్టాండ్ వారు దీప చిత్రంతో కూడిన స్టిక్కర్లను అంటించుకుని మద్దతు తెలిపారు. మరో విప్లవం: అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ ను పురట్చితలైవర్ (విప్లవనాయకుడు), దివంగత జయలలితను పురట్చితలైవి(విప్లవనాయకి) అని తమిళనాడు ప్రజలు పిలుచుకుంటారు. ఇదే కోవలో దీపకు ‘విప్లవమలర్’(విప్లవ పుష్పం) అని పిలుచుకోవడం ప్రారంభించారు. విప్లవమలర్ దీప, కాబోయే ముఖ్యమంత్రి పేరుతో క్యాలెండర్లు, స్టిక్కర్లు చలామణిలోకి వచ్చేశాయి. 17న ముహూర్తం: దీప ఇంటికి వస్తున్న ప్రజానీకం ప్రతిరోజూ అడిగేది ఒకటే ప్రశ్న. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? ఈ ప్రశ్నకు సోమవారం దీప బదులిచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల శుభసమయాన ఈనెల 17న తన రాజకీప్రవేశంపై ప్రకటన చేస్తానని తెలిపారు. అమ్మ పేరు, ప్రతిష్టలు నిలబెట్టేలా అందరూ ఆశిస్తున్నట్లే తన నిర్ణయం ఉంటుంది, తనపై అభిమానంతో తరలివచ్చేవారి కోసం పనిచేస్తానని ఆమె అన్నారు. 17వ తేదీ నుంచి తన రాజకీయ పయనం కొనసాగుతుందని తెలిపారు. వచ్చే నెల 24న దీపా పేరవై మహానాడు: జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24వ తేదీన సేలంలో జయలలిత దీపాపేరవై మహానాడు నిర్వహించి సభ్యత్వ నమోదు వివరాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పేరవై రాష్ట్ర కన్వీనర్ జీఆర్.రామచంద్రన్ మాట్లాడుతూ, ఇంతవరకు 28 జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోందని అన్నారు. -
చీలిక అసాధ్యం!
► ఎవరి తరం కాదన్న చిన్నమ్మ ► దీపా కసరత్తులు ► ఈరోడ్‌లో కొత్త పార్టీ సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో చీలిక అసాధ్యమని, ఎవరెన్ని కుట్రలు చేసినా, వాటిని భగ్నం చేసి తీరుతానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారాల్ని నమ్మొద్దని, పార్టీ బలోపేతం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల గురించి తెలిసిందే. పార్టీ బలోపేతం, పట్టు సాధన లక్ష్యంగా ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ తీవ్రంగానే కసరత్తులు చేస్తూ వస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ కేడర్‌తో సమావేశం అవుతున్న ఆమె ఆదివారం కూడా పార్టీ వర్గాలతో సమాలోచన సాగించారు. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల నేతలతో శశికళ సమావేశం అయ్యారు. ఉదయం పదిన్నర గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు ఎడపాడి పళనిస్వామి, దిండుగల్ శ్రీనివాసన్, పార్టీ అధికార ప్రతినిధి పొన్నయ్యన్ తదితరులు ఆమెకు ఆహ్వానం పలికారు. కేడర్‌కు అభివాదం తెలుపుతూ రెండో అంతస్తులోని సమావేశ మందిరంలో గంటన్నర పాటు ఆయా జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. చీలిక అసాధ్యం: జిల్లాల నేతల్ని ఉద్దేశించి శశికళ ప్రసంగిస్తూ, అన్నాడీఎంకే అతి పెద్ద పార్టీ అని పేర్కొన్నారు. దీనిని చీల్చడం ఎవరి తరం కాదన్నారు. అనేక కుట్రలు సాగుతున్నాయని, వాటిని భగ్నం చేసి తీరుతామన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా జిల్లాల్లో నేతలందరూ కేడర్‌కు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికార వర్గాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని సూచించారు. మూడు నెలలకు ఓ మారు మండల, డివిజన్ వారిగా, ఆరు నెలలకు ఓ మారు జిల్లా స్థాయిలో పార్టీ సమావేశాలు జరిగే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచిం చారు. పార్టీకి వ్యతిరేకంగా సాగే ప్రచారాలు, పుకార్లు నమ్మవద్దని, అందరి లక్ష్యం అమ్మ ఆశయ సాధనే అని ఆ దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సమావేశం ముగించుకుని పోయెస్ గార్డెన్ కు వెళ్తున్న శశికళను శ్రీపెరంబదూరుకు చెందిన రాజేష్, నందిని దంపతులు కలిశారు. తమ పాపకు పేరు పెట్టాలని కోరడంతో ఆ బిడ్డను చేతికి తీసుకుని జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత అని ఇది వరకే ఓ పాపకు శశికళ నామకరణం చేసిన విషయం తెలిసిందే. మరో కొత్త పార్టీ : అన్నాడీఎంకేలో ద్వితీయ, తృతీయశ్రేణి కార్యకర్తల తాకిడి దీపా ఇంటి వద్ద రోజు రోజుకు పెరుగుతోంది. ఆదివారం కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో రాజకీయ పయనానికి తగ్గ కసరత్తుల్ని దీపా వేగవంతం చేశారు. సంక్రాంతి తర్వాత ఏదైనా నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అభిమానులు పేర్కొంటున్నారు. దీపాకు మద్దతుగా ఈరోడ్‌లో కొత్త పార్టీ ఆవిర్భవించింది. జంట రోజాల చిహ్నంతో కూడిన ఆ పార్టీకి ఎంజీఆర్, జయలలిత అన్నాడీఎంకే అని పేరు పెట్టారు. ఇక, ఇప్పటికే రాష్ట్రంలో అభిమానుల్ని ఏకం చేసే పనిలో పడ్డ దీపా పేరవై వర్గాలు తాజాగా వాట్సాప్ ద్వారా సభ్యత్వ ప్రక్రియకు చర్యలు తీసుకోవడం గమనార్హం. అలాగే, దీపాకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే నేత నాంజిల్ సంపత్ స్పందించడాన్ని ఖండిస్తూ దీపా పేరవై వర్గాలు ఆందోళనకు దిగారు. -
మనసులో మాట బయటపెట్టిన జయ మేనకోడలు
రాజకీయాల్లోకి వస్తానని స్పష్టీకరణ త్వరలో సొంతంగా పార్టీ పెడుతున్నట్టు వెల్లడి చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు జే. దీపాకుమార్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తాను సొంతంగా పార్టీ పెడుతున్నానని, అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు తనకు అండగా ఉంటారనే విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. దివంగత నేత ఎంజీఆర్ వారసత్వం తనదేనని ఆమె ఉద్ఘాటించారు. శనివారం తన నివాసం ఎదుట పెద్ద ఎత్తున గుమిగూడిన మద్దతుదారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. జయలలలిత వారసురాలు దీపాకుమారేనంటూ తమిళనాడు అంతటా ఆమె మద్దతుదారులు కటౌట్లు, బ్యానర్లతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన క్యాడర్ శాంతియుతంగా వేచి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 17న అన్నాడీఎంకే స్థాపకుడు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా తామంతా కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిద్దామని మద్దతుదారులకు సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 'మేం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తాం' అని ఆమె అన్నారు. ప్రతిరోజూ వేలాదిమంది దీప ఇంటిముందు గుడిగూడి ఆమె నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నారు. తనను చూసేందుకు వచ్చిన వారిని జయలలిత తరహాలో రెండు ఆకుల ముద్రతో దీప పలుకరిస్తున్నారు. జయ వారసత్వం దీపకే దక్కాలంటూ ఆమె మద్దతుదారులు రాష్ట్రమంతాట కటౌట్లు, బ్యానర్లు కడుతున్నారు. దీప జయలలితకు పుష్ఫగుచ్ఛం ఇస్తున్నట్టు గ్రాఫిక్ ఫొటోలు సృష్టించి మరీ కటౌట్లు దర్శనమిస్తుండటం గమనార్హం. -
మనసులో మాట బయటపెట్టిన దీప
-
సీఎం దీపానే !
► అన్నాడీఎంకే కార్యకర్తల బ్యానర్లు ► దీప, భర్త మాధవన్ లపై ఒత్తిడి ► దీప ఇంటికి తండోపతండాలుగా అభిమానులు ► నా రాజకీయ పయనాన్ని ఏశక్తి అడ్డుకోలేదు : దీప సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి రావాలని జయలలిత అన్న కుమార్తె దీపపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వస్తూ రాజకీయాల్లోకి రావాలని బతిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు. అమ్మ ఆసుపత్రి పాలయ్యే వరకు దీప ఎవరో తెలియదు. అత్తను చూడాలని అపోలో ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసినపుడు తొలిసారిగా దీప పేరు బాహ్య ప్రపంచానికి కొద్దిగా పరిచయమైంది. అమ్మ భౌతికకాయాన్ని సందర్శించేందుకు వచ్చిన దీపను అడ్డుకోవడం, ఎంతో కష్టం మీద తన అత్తకు నివాళులర్పించాల్సి వచ్చిందని మీడియా వద్ద దీప మొరపెట్టుకున్నపుడు దీప పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది. జయలలిత ఆస్తికి, రాజకీయానికివారసులు ఎవరు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎవరికి అనే ప్రశ్నలు తలెత్తినపుడు శశికళతోపాటు దీప పేరు మార్మోగిపోయింది. అన్నాడీఎంకేలోని అగ్రనేతల ప్రాభవంతో శశికళ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టినా పార్టీ నేతలు, కార్యకర్తల్లో దీప ప్రభావాన్ని మాత్రం చెరిపివేయలేక పోయారు. జయ వారసురాలు దీప మాత్రమే అనే నినాదంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి వేలాది మంది రావడం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. దీప వారందరితో ఓపిగ్గా మాట్లాడుతూ నచ్చజెప్పి పంపుతున్నారు. దీప ఇంట్లో లేని సమయాల్లో ఆమె భర్త మాధవన్ కార్యకర్తలను కలుస్తున్నారు. తనను కలుసుకునేందుకు వచ్చే కార్యకర్తల వివరాలను నమోదు చేసేందుకు దీప తన ఇంటి ముందు ఒక రిజిస్టర్‌ను ఏర్పాటు చేశారు. గురు, శుక్రవారాల్లో తిరునెల్వేలి, తూత్తుకూడి, దిండుగల్లు, మదురై, కోయంబత్తూరు, విళుపురం, ఈరోడ్, తిరువణ్ణామలై, తిరుప్పూరు 14 జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. జనం సాధారణ సంఖ్యలో ఉన్నపుడు ఇంటి ముంగిట, ఎక్కువగా ఉన్నపుడు మిద్దెపై బాల్కనీ నుంచి రెండాకుల గుర్తులా రెండువేళ్లను చూపడం ద్వారా మరింత ఉత్సాహపరుస్తున్నారు. రాజకీయ పయనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు తన రాజకీయ పయనాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని దీప శుక్రవారం ప్రకటించారు. జయలలిత పేరు, ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పునరుద్ఘాటించారు. రాజకీయ ప్రవేశం గ్యారంటీ అనే ధోరణిలో దీప మాట్లాడగానే కార్యకర్తలు చప్పట్లు చరుస్తూ ఆనందంతో రెచ్చిపోయారు. జయలలిత ప్రాతినిథ్యంవహించిన ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు కార్యకర్తలను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీప రాజకీయాలకు తన పూర్తి అండదండలు ఉంటాయని భర్త మాధవ¯ŒS తన ఇంటికి వచ్చిన మీడియాతో చెప్పడం గమనార్హం. అండగా మేమున్నామని కార్యకర్తల భరోసా రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లూ స్పష్టం చేయని దీప శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన వారితో తన రాజకీయ పయనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పడం వారిలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఎంజీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్నాం, ఎవరి గురించి మీరు భయం పెట్టుకోవద్దు, దీపను చూస్తుంటే అమ్మను చూసినట్లే ఉంది, జయలలిత వారసురాలిగా దీప మాత్రమే ఉండాలని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. కొందరు మహిళా కార్యకర్తలు దీప భర్త చేతులు పట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. దీప ఇంటి ముందు కాబోయే ముఖ్యమంత్రి అనే నినాదంతో బ్యానర్లు కట్టారు. ఎంజీఆర్, జయలలిత, దీప ఫొటోలను అమ్మే అంగడి సైతం దీప ఇంటి ముందు వెలిసింది. కార్యకర్తల సందడితో ఫొటోల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. -
అన్నాడీఎంకే ఆశా దీపం
► దీపపై పెరుగుతున్న ఒత్తిడి ► సేలంలో జయలలిత దీప పేరవై ►మూడు వారాల్లోనిర్ణయం ► జయ మేనకోడలు దీప వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మలేని అన్నాడీఎంకేకు జయలలిత మేనకోడలు దీప ఆశాదీపమనే ప్రచారం ఊపందుకుంది. జిల్లా నలుమూలల నుంచి దీప ఇంటికి చేరుకుని రాజకీయ అరంగేట్రంపై ఒత్తిడి పెరుగుతోంది. అన్నాడీఎంకేకు అన్నీతానై వ్యవహరించిన జయలలిత ఎవ్వరినీ తన వారసురాలిగా ప్రకటించకుండానే కన్నుమూశారు. జయకు అత్యంత సన్నిహితురాలిగా ఉండడమే ఏకైక అర్హతగా శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం వెనుక నెలకొన్న అనుమానాలు, జయ రక్తసంబంధీకురాలైన దీపను దరిచేరనీయక పోవడం శశికళ కుట్రగా అనుమానిస్తున్నారు. అన్నాడీఎంకేలోని అగ్రనేతలంతా కలిసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ద్వితీయశ్రేణీ మొదలుకుని కింది స్థాయి వరకు మండిపడుతున్నారు. అంతటితో ఆగక సీఎం పదవిని కూడా కట్టబెట్టే ప్రయత్నాలను సహిం చలేక పోతున్నారు. శశికళ పోస్టర్లు, ఫ్లెక్సీలు చింపివేయడం ద్వారా తమ అగ్రహాన్ని బహిరంగంగా చాటుకుంటున్నారు. అన్నాడీఎంకేకు అసలైన వారసురాలు దీప మాత్రమేనని పట్టుబట్టే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. శశికళ స్థానంలో దీపను కూర్చోబెట్టాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీప పేరున గత కొంతకాలంగా పోస్టర్లు వెలిశాయి. జయలలిత మరణించే వరకు దీప అంటే ఎవరో తెలియదు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దీప గురించే చర్చ. తన బొమ్మతో పోస్టర్లు వేయరాదని దీప అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ఆగని అభిమానగణం చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి తండోపతండాలుగా చేరుకోవడం ప్రారంభించారు. వచ్చేపోయే అభిమానులతో దీప ఇంటి పరిసరాలు నిత్యం రద్దీగా మారిపోయాయి. జయ రాజకీయ వార సురాలిగా అన్నాడీఎంకేలో చేరాలని దీపపై వత్తిడి చేస్తూ రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి ఆమె ఇంటికి వస్తున్నారు. కడలూరు, సేలం, వేలూరు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు మంగళ, బుధవారాల్లో దీపను కలుసుకున్నారు. ఇంటి బాల్కనీ నుండి అందరికీ అభివాదం చేస్తూ అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నమైన రెండాకుల గుర్తుగా రెండువేళ్లను చూపడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయింది.ఈ సందర్బంగా దీప మాట్లాడుతూ, అత్త మరణం తనను కలిచి వేసిందని, ఆమె మరణంపై ఉన్న నెలకొన్ని ఉన్న అనుమానాలపై కోర్టులోని పిటిషన్ల మూలంగా త్వరలో ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ప్రధానంగా ఈ కారణం చేతనే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తనపై చలామణి ఉన్న వార్తలన్నీ ఊహాగానాలని అన్నారు. మరో మూడు వారాల్లో మీరు ఆశించిన నిర్ణయాన్నే ప్రకటిస్తానని దీప హామీ ఇచ్చారు. మంగళవారం చెన్నైలోని దీపను కలుసుకున్న సేలంకు చెందిన వారే బుధవారం నాడు ‘జయలలిత దీప పేరవై’ అనే అభిమాన సంఘాన్ని స్థాపించడం గమనార్హం -
సీఎం సీటుపై శశికళ దృష్టి
-
చిన్నమ్మకు చిక్కులు!
-
చిన్నమ్మకు చిక్కులు!
అన్నాడీఎంకేలో అసంతృప్తి ప్రధాని వద్దకు జయ అన్న కుమార్తె దీప సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కావాలని భావిస్తున్న చిన్నమ్మ శశికళకు చట్టపరమైన చిక్కులు తప్పేలా లేవు. శశికళను చట్టపరంగా ఎదుర్కొ నేందుకు వ్యతిరేక వర్గం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 29న జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశానికి శశికళ మద్దతుదారులకు మాత్రమే ఆహ్వానాలు పంపు తున్నారు. పిలవకున్నా హాజరై ఎంపికను అడ్డుకుంటాం, విఫలమైతే చట్టపరంగా సాధిస్తామని వ్యతిరేక వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ‘పార్టీ నియమావళి ప్రకారం ఒక సభ్యునిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఐదేళ్లపాటు అతను ఎన్నికల్లో పోటీచేసేందుకు వీల్లేదు. 2011 డిసెంబర్లో శశికళను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. 2012 మార్చిలో తిరిగి జయ వద్దకు చేరారు. అయితే శశికళకు ప్రాథమిక సభ్యత్వ కార్డును జారీ చేయలేదు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ నిబంధనలను సవరించి శశికళను ఎన్నుకుంటే అది చట్టవ్యతిరేకం అవుతుంది. ఎన్నికల కమిషన్ సంప్రదాయాన్ని విస్మరించి, శశికళ మాత్రమే నామినేషన్ వేసేలా పార్టీ పెద్దలు వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌లో పిటిషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వ్యతిరేక వర్గం పేర్కొంటోంది. ప్రధానిని కలవనున్న దీప జయలలిత అన్న కుమార్తె దీప త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని తెలుస్తోంది. శశికళ వ్యతిరేకవర్గం పన్నీర్‌సెల్వం లేదా దీపను ప్రధాన కార్యదర్శి చేయాలని పట్టుపడుతున్నారు. దీప పేరవై అనే సంస్థను స్థాపించి జోరుగా సభ్యత్వాన్ని చేరుస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని దీపపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. అన్నాడీఎంకే రాజకీయాలను బీజేపీ తెరవెనుక ఉండి శాసిస్తున్నట్లు ఉవ్వెత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీప ప్రధానిని కలుసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
ఇక చిన్నమ్మ వర్సెస్ కోడలమ్మ
-
జయలలితతో గొడవ పడ్డాను
జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందానని, రక్తసంబంధీకురాలిగా ఆమెతో కలసి ఉండేందుకు చాలాసార్లు ప్రయత్నించానని ఆమె మేనకోడలు దీప చెప్పారు. జయలలితకు స్వయాన సోదరుడైన జయకుమార్ కుమార్తె దీప. జయలలితతో తన అనుబంధం గురించి దీప ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్పారంటే ఆమె మాటల్లోనే.. 1974లో దీపావళికి ముందు రోజు జన్మించాను. ఆ సయమంలో మా మేనత్త జయలలిత అమ్మనాన్నల దగ్గరే ఉన్నారట. ఆమే నాకు దీప అని పేరు పెట్టారు. దీప అంటే వెలుతురు అని అర్థం. మేం మేనత్తతో కలసి ఉండేవాళ్లం. నా స్కూల్ డేస్ నుంచి ఆమె సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మేనత్త నాకు రోల్ మాడల్. ఆమె అంకితభావం, కష్టపడే స్వభావం, నిస్వార్థంగా పనిచేయడం వంటి లక్షణాలు నాకు ఎంతో నచ్చాయి. మేం పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లిపోయాక అక్కడ కొత్తవాళ్లు వచ్చి చేరారు. 1991లో తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి జయలలిత ప్రమాణం చేసినపుడు ఆమెతో కలసి మా కుటుంబం లంచ్ చేసింది. అప్పుడు నాకు 16 ఏళ్లు. మేనత్త మానాన్నను తన సోదరుడు అంటూ అందరికీ పరిచయం చేశారు. నన్ను చూడగానే ఆమె చాలా సంతోషించారు. చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లి మేనత్తను కలిశాను. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటికీ మా కుటుంబానికి ఆహ్వానం పంపేవారు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మా నాన్న చనిపోయారు. అప్పుడు మేనత్త వచ్చి ఓదార్చారు. నాన్నతో కలసి తను స్కూలుకు వెళ్లినప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తర్వాత మేనత్తకు, మా కుటుంబానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 1997లో ఆమె జైలుకు వెళ్లినపుడు నేను వెళ్లి పరామర్శించాను. నువ్వు చిన్నపిల్లవి ఇక్కడకు రావద్దు.. నేను బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం అని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమెను కలిసేందుకు చాలాసార్లు పోయెస్ గార్డెన్‌కు వెళ్లాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. గార్డులు, సిబ్బంది నన్ను బలవంతంగా బయటకు పంపారు. అయినా మేనత్త అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు 2002లో ఆమె రెండోసారి ముఖ్యమంత్రి అయినపుడు కలిశాను. మా కుటుంబాన్ని ఎందుకు దూరంగా ఉంచావంటూ వాదులాడాను. ఆమె ఐదారు గంటలు నాతో ఉన్నారు. తనకు చాలా మీటింగ్‌లు ఉన్నాయని, తర్వాత కలుద్దాం ఇంటికి వెళ్లు అని చెప్పారు. తర్వాత ఆమె మా కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. -
అన్న కూతురు వారసత్వ పోరు
• జయలలిత వారసత్వాన్ని ఆశిస్తున్న దీప • అపోలో ఆసుపత్రిలో కలుసుకునే యత్నం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసురాలిని తానేనంటూ తెరపైకి వచ్చారు ఆమె అన్న కుమార్తె దీప. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో దీప ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జయలలిత స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మిని వివాహం చేసుకుని జయలలితతోపాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది. ఆ తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఆయన పోయెస్ గార్డెన్ వదిలి చెన్నై టీనగర్లో కాపురం పెట్టారు. 1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. 2013లో వదిన చనిపోయినపుడు జయలలిత వెళ్లలేదు. ఇటీవలే జరిగిన మేనకోడలు దీప వివాహానికీ హాజరు కాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొంది వచ్చారు. ఈ సందర్భంగా వధూవరులకు అత్త హోదాలో జయలలిత ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. దీప వైవాహిక జీవితం కొన్నాళ్లు సజావుగా సాగినా ఆ తరువాత భర్తతో విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భర్తకు దూరమై, తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన దీప అత్త జయలలితకు చేరువకావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జయ ఇంటి వద్ద గంటసేపు నిరీక్షించినా అనుమతి రాలేదు. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఈ ఇల్లు మా నానమ్మ (జయలిత తల్లి సంధ్య) నాకు రాసిచ్చింది. దస్తావేజులు కూడా ఉన్నాయి. మా ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మీరు ఎవరు?’ అంటూ ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడ్డారు. మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం గార్డెన్‌లోని కొందరికి ఇష్టం లేదని దీప పరుషవ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలిసింది. జయను కలిసేందుకుఆగస్టులో మరోసారి ప్రయత్నించి విఫలమయ్యారు. ‘అత్తా... కలుస్తా’ అంటూ రాసిన ఉత్తరాలకు కూడా బదులు రాలేదు. జయలలితే స్వయంగా తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని ఆశిస్తూ దీప తన ప్రయత్నాలు కొనసాగించారు. ఇది గమనించి వారి కుటుంబ మిత్రుడైన ఒక బీజేపీ సీనియర్ నేత దీపను సున్నితంగా వారించారు. వారసత్వంకోసం ఓపిక పట్టాల్సిందిగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లండన్‌లో ఉన్నత విద్యనభ్యసించిన దీపకు ఆయన అమెరికాలో ఒక ఉద్యోగం చూసి పెట్టారు. ఇంతలో జయ అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరడంతో దీప తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆసుపత్రిలో తన అత్తను చూసేందుకు అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తులను అన్నాడీఎంకే నేతలు పట్టించుకోలేదు. దీంతో తనకు తానుగానే అపోలో వద్దకు చేరుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సీఎం జయలలిత సుదీర్ఘకాలం అపోలో ఆసుపత్రిలోనే ఉండాలని అపోలో వైద్యులు ప్రకటించడంతో దీప తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని అంచనా వేస్తున్నారు. -
కదిలించిన ‘సాక్షి’ కథనం
బాధితులకు రూ.40 వేల ఆర్థికసాయం చేసిన ఎన్ఆర్ఐ కుటుంబం చెన్నూర్ : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన గడ్డం శంకర్-మాంతులు అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలు దీప, పూజల ధీనగాథపై ‘కన్నవారు దూరమై..బతుకు భారమై’ శీర్షికన ఈ నెల 18న సాక్షిలో ప్రచురితమైన మానవీయ కథనం సహృదయులను కదిలించింది. ఇప్పటికే జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డితోపాటు పలువురు 30 వేలకు పైగా ఆర్థికం సాయం అందించగా..తాజాగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మంచాల సంతోశ్ తన మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని చలించిపోయూరు. తన వంతు సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. తల్లిదండ్రులు మృతి చెంది అనాథలుగా మారిన బాలికలు దీప, పూజకు రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని తన తల్లిదండ్రులు మంచాల సత్యనారాయణ, సావిత్రితో ఇప్పించారు. ఈ సందర్భంగా సంతోశ్ అమెరికా నుంచి సాక్షితో మాట్లాడారు. ‘నిరుపేద బాలికలు దీప, పూజలు ధీనగాథ నన్ను కదిలించింది. అమ్మాయిలిద్దరూ ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలి. అప్పుడే వారి తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తారు’ అని అన్నారు. -
సగర్వంగా... సంతోషంగా...
* రాష్ట్రపతి భవన్లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం * ఖేల్‌రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్‌లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్యం గెలిచారు. ఇక దీప జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్‌లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్‌కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు. తెలుగు వెలుగులు ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్‌కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. అవార్డు గ్రహీతలు రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు): పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్). ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు): నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్‌శర్మ (క్రికెట్లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్నంది (జిమ్నాస్టిక్స్‌లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు): రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్‌ప్రీత్‌సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు): సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్స కార్పొరేట్ లిమిటెడ్; క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స ఎడ్యుకేషన్ సొసైటీ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ వీల్‌చెయిర్‌లో... రియో ఒలింపిక్స్‌లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్లో వచ్చి పురస్కారం అందుకుంది.