సాక్షి, చెన్నై: దివంగత అమ్మ జయలలితకు కుటుంబ వారసులు లేరని స్వయంగా సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె మేన కోడలు దీప పేర్కొన్నారు. ఆదివారం వీడియో రూపంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జయలలితకు ఆమె అన్న కుమార్తె గా తాను, కుమారుడిగా తన సోదరుడు దీపక్ వారసులుగా ఉన్నామని గుర్తు చేశారు. మేనత్త జీవించి ఉన్న కాలంలో తమకు చేయాల్సిన వన్నీ చేస్తూ వచ్చారని, అయితే, దురదృవష్టవశాత్తు అందర్నీ వీడి ఆమె అనంత లోకాలకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె మరణం తర్వాత సీఎం కుర్చీలో పళనిస్వామిని కొందరు కూర్చోబెట్టి వేడుక చూశా రని ఎద్దేవా చేశారు. అయితే, ప్రస్తుతం సీఎం పళనిస్వామి అమ్మకు కుటుంబ వారసులు లేరని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. వారసులం తాము ఉన్నామని, ఇకపై వారసుల గురించి మాట్లాడే అధికారం సీఎంకు లేదన్నారు. దివంగత నేత ఎంజీఆర్ వారసుల విషయంగా మరికొన్ని పార్టీ లు నినాదాన్ని అందుకున్నాయని గుర్తు చేస్తూ, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment