కదిలించిన ‘సాక్షి’ కథనం
బాధితులకు రూ.40 వేల ఆర్థికసాయం చేసిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం
చెన్నూర్ : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన గడ్డం శంకర్-మాంతులు అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలు దీప, పూజల ధీనగాథపై ‘కన్నవారు దూరమై..బతుకు భారమై’ శీర్షికన ఈ నెల 18న సాక్షిలో ప్రచురితమైన మానవీయ కథనం సహృదయులను కదిలించింది. ఇప్పటికే జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డితోపాటు పలువురు 30 వేలకు పైగా ఆర్థికం సాయం అందించగా..తాజాగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మంచాల సంతోశ్ తన మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని చలించిపోయూరు.
తన వంతు సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. తల్లిదండ్రులు మృతి చెంది అనాథలుగా మారిన బాలికలు దీప, పూజకు రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని తన తల్లిదండ్రులు మంచాల సత్యనారాయణ, సావిత్రితో ఇప్పించారు. ఈ సందర్భంగా సంతోశ్ అమెరికా నుంచి సాక్షితో మాట్లాడారు. ‘నిరుపేద బాలికలు దీప, పూజలు ధీనగాథ నన్ను కదిలించింది. అమ్మాయిలిద్దరూ ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలి. అప్పుడే వారి తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తారు’ అని అన్నారు.