భారత సంతతి వ్యక్తిని బ్రిటన్‌లో దోపిడీ దొంగల ముఠా అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకుంది.
లండన్: భారత సంతతి వ్యక్తిని బ్రిటన్‌లో దోపిడీ దొంగల ముఠా అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకుంది. శ్వేత జాతీయులుగా అనుమానిస్తున్న 10 మందితో కూడిన ముఠా 44 ఏళ్ల షమ్మీ అత్వాల్‌ను రోడ్డుపైకి నెట్టి ట్రక్కుతో తొక్కించి హతమార్చింది. పోలీసులు, హతుని బంధువుల కథనం మేరకు, లండన్ తూర్పు ప్రాంతంలో ‘గ్లెన్ అండ్ కో’ పేరుతో షమ్మీ ఓ శీతల పానీయ కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీని దోచుకోవాలని కుట్ర పన్నిన 10 మంది దొంగల ముఠా సమ్మెటలు, ఇనుప రాడ్లతో మంగళవారం రాత్రి దాడికి దిగింది. అయితే, ఈ దాడిని ప్రతిఘటించిన షమ్మీని దొంగలు రోడ్డుపైకి నెట్టి ట్రక్కుతో తొక్కించడంతో ఘటనా స్థలంలోనే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దొంగలను అడ్డుకునే క్రమంలో షమ్మీ భార్య దీప కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్కాట్‌లాండ్ యార్డు పోలీసులు విచారణ చేపట్టారు.