gang of robbers
-
అంతర్ జిల్లాల దొంగలకు సంకెళ్లు
సాక్షి, చీరాల రూరల్: ఒంటరిగా రాత్రి సమయంలో ప్రయాణించే ప్రయాణికులను గుర్తించి వెంబడించి దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దోచుకుంటున్న ఐదుగురు దారి దోపిడీ దొంగల ముఠాను సోమవారం చీరాల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.9 వేల నగదు, నేరాలకు ఉపయోగించే ఆటో, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు అపహరించిన నాలుగున్నర సవర్ల బంగారు వస్తువులను ముత్తుట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ లక్ష రూపాయలు ఉంటుంది. సోమవారం స్థానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లో సీఐ ఎన్.నాగ మల్లేశ్వరరావుతో కలిసి డీఎస్పీ వై.జయరామ సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురానికి చెందిన దేవర నవీన్, తమ్మిశెట్టి శ్రావణ్, తమ్మిశెట్టి సుభాష్ (వీరు అన్నదమ్ములు), గుంటూరు జిల్లా తెనాలి మురిప్పేటకు చెందిన గరిక గోపి, తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన గరిక సంపత్‌లు ముఠాగా ఏర్పడ్డారు. వీరు అతి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించి జల్సాలు చేయాలని భావించారు. అందుకు దారి దోపిడీలకు పాల్పడాలని ప్రణాళికలు రచించారు. వారంతా అనుకున్నదే తడవుగా తమ ప్రణాళిను కార్యరూపంలోకి తీసుకొచ్చి అమలు పరిచారు. వీరందరిపై అనేక జిల్లాల్లోని పోలీసుస్టేషన్‌ల్లో కేసులు నమోదయ్యాయి. వీరిలో తమ్మిశెట్టి శ్రావణ్‌పై కావలిలో ఒక దారిదోపిడీ కేసు, వెదుళ్లపల్లి పోలీసుస్టేషన్లో సస్పెక్టు షీటు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ముఠాగా ఏర్పడిన వీరంతా ముందుగా బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద రాత్రి సమయంలో సంచరిస్తుంటారు. ఒంటరిగా ఊళ్లకు వెళ్లే ప్రయాణికులను లక్ష్యంగా ఎంచుకుంటారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఐదుగురు దొంగలు మూడు కేసుల్లో పట్టుబడ్డారు. ఇదీ..బాధితుల చిట్టా ఈ ఏడాది ఏప్రిల్‌లో చీరాల నవాబుపేటకు చెందిన పఠాన్ కాలేషా వలి రాత్రి సమయంలో రైల్వేస్టేషన్ రోడ్డులో సైకిల్‌పై వెళ్తుండగా ఈ ఐదురుగు దొంగల ముఠా సభ్యులు కాలేషా వలిని అడ్డగించిæ అతనిపై దాడి చేసి రూ.9 వేల నగదు దోచుకున్నారు. పొన్నూరుకు చెందిన బచ్చు వెంకట శివప్రసాద్ బాపట్లలో వ్యాపారం చేస్తుంటాడు. అతడు ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన తన వ్యాపారం ముగించుకుని రాత్రి సమయంలో బైకుపై తన స్వగ్రామం పొన్నూరుకు వెళ్తున్నాడు. అప్పికట్ల సమీపంలో వెంకట శివ ప్రసాద్‌ను అడ్డగించి అతడిపై దాడి చేసి రెండు బంగారు ఉంగరాలు అపహరించారు. పర్చూరుకు చెందిన కోట భార్గవ్ తేజ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఈ నెల 14న రాత్రి 11:45 గంటలకు చీరాలలో రైలు దిగి తన బైకుపై పర్చూరు వెళ్తున్నాడు పట్టణ శివారు ప్రాంతం కారంచేడు రోడ్డులోని మంచినీటి చెరువు సమీపంలో భార్గవ్‌ను అనుసరించి అతడిపై దాడి చేసి రెండున్నర సవర్ల బంగారు గొలుసు తీసుకెళ్లారు. ఈ కేసులను సంబంధించి బాధితులందరూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. ఎస్పీ ఈ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు చీరాల ఒన్‌టౌన్ సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తును వేగవంతం చేశారు. సీపీ టీవీ పుటేజీల ఆధారంగా కేసులను అతి తక్కువ సమయంలో ఛేదించి నిందితులను సోమవారం చీరాలలోని దండుబాట రోడ్డులో అరెస్టు చేశారు. బాధితుల వద్ద నిందితులు అపహరించిన నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులను అరెస్టు చేసిన సీఐ, ఎస్ఐలు పి.సురేష్, నాగ శ్రీను, హెడ్ కానిస్టేబుళ్లు పిల్లి రవికుమార్, తన్నీరు శ్రీనివాసరావు, బొల్లెద్దు అచ్చయ్య, కానిస్టేబుల్ రమేష్‌లను డీఎస్పీ అభినందించారు. వీరందరికి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు డీఎస్పీ చెప్పారు. ప్రయాణికులను అనుసరించేదిలా.. దొంగల ముఠాగా ఏర్పడిన వీరంతా రాత్రి సమయంలో రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల్లో సంచరిస్తుంటారు. ఒంటరిగా నిలబడి వాహనాల కోసం ఎదురు చూసే ప్రయాణిలను ముఠా సభ్యులు గుర్తిస్తారు. ఎంచుకున్న ప్రయాణిలను అనుసరించేందుకు దొంగల ముఠా సభ్యుల వద్ద ఒక ఆటో, రెండు స్కూటీలు రెడీగా ఉంటాయి. దొంగలు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారి వద్ద ఉండే ఆటోతో ముఠాలోని సభ్యుడు ఆటోవాలా మాదిరిగా పోజులిచ్చి వాహనం కోసం ఎదురు చూసే ప్రయాణికుని వద్ద ఆటో నిలుపుతాడు. ఈ లోగా ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు ఆటోలో తామూ వస్తామంటూ ప్రయాణికునికి వినబడే విధంగా ఆటోవాలాతో మాట్లాడుతారు. మరో ఇద్దరు ప్రయాణికులు తనకు తోడుగా ఉంటారనుకున్న అసలైన ప్రయాణికుడు దొంగల ముఠాకు చెందిన ఆటో ఎక్కుతాడు. దొంగల ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు ఆటోను అనుసరిస్తుంటారు. ఆటో నిర్జన ప్రదేశంలోకి వెళ్లిన తర్వాత ముఠాలోని ఐదుగురూ ప్రయాణికుడిపై దాడి చేసి అతడి వద్ద ఉ జండే నగదు, బంగారు వస్తువులను అవలీలగా అపహరిస్తారు. రాత్రి సమయంలో ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించవద్దని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి సూచించారు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద సంచరించే వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఇంటింటా తనిఖీలు
పొంచి ఉన్న ఉగ్రవాద దాడులు, అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పలాస మండలంలోని శాసనాం, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని ఏఎస్ పేట, టెక్కలి పంచాయతీలోని చేరీవీధిల్లో శుక్రవారం ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. అనుమానితులకు ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరించారు. పలాస/ఇచ్ఛాపురం/టెక్కలి: పలాస మండలం శాసనాం గ్రామాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసు బలగాలు ఒక్కసారి చుట్టుముట్టారుు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటిని(కార్డెన్స్ సెర్చింగ్) తనిఖీ చేశారు. తాళం వేసిన ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మొత్తం పోలీసు సిబ్బంది నాలుగు విభాగాలుగా విడిపోయి ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో నాటుసారా విక్రయించకూడదని, అపరిచితులు గ్రామంలోకి వచ్చినట్లయితే వెంటనే సమాచారం అందజేయాలని సూచించారు. పండుగ సమయాల్లో దొంగతనాలు జరగడానికి అవకాశం ఉందని, ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లినట్లయితే సమాచారమివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ ఎస్ఐలు ఆర్.వేణుగోపాలరావు, బి.శ్రీరామ్మూర్తి, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని ఏఎస్ పేట గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.అవతారం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీఐతో పాటు ఇచ్ఛాపురం, కవిటి ఎస్సైలు కె.వాసునారాయణ, బి.రామారావు, మధుసూదనరావులు సిబ్బం దితో కలిసి ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు, రేషన్ కార్డులను పరిశీలించారు. వాహన పత్రాలను పరిశీలించారు. పత్రాలు చూపని రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టెక్కలిలో గత కొంత కాలంగా సమస్యాత్మకంగా ఉన్న చేరీవీధిని పోలీసు బలగాలు చుట్టుముట్టారుు. ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు కోళ్ల అప్పన్న హత్యకు గురికావడం, సంఘ విద్రోహ శక్తులు తిష్టవేశాయన్న సమాచారంతో పోలీసులు ఇంటింట తనిఖీలు నిర్వహించారు. -
ఈజీమనీ కోసం దొంగలుగా మారారు
-
జల్సాల కోసం.. ఎంతకైనా తెగిస్తారు
కాకినాడ క్రైం :దేశాభ్యున్నతికి పాటుబడాల్సిన ఆ విద్యార్థులు నేరాల బాట పట్టారు. కష్టపడి చది వించిన తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేశారు. జల్సాలకు అలవాటు పడి పథకం ప్రకారం చోరీలు సాగించారు. ఓ రిటైర్డ్ ఉద్యోగిని కూడా హతమార్చారు. ఈ నేరాల్లో కొంద రు విద్యార్థులతో పాటు చదువు మానేసి వివిధ పనులు చేసుకుంటున్న మరికొందరు కూడా కలిశారు. మొత్తం ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసి, రూ.11 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాజమండ్రి త్రీ టౌన్ క్రైం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామిరెడ్డి విజయ భాస్కర రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ప్రతాప్‌నగర్‌కు చెందిన కొండపల్లి అరుణ్‌కుమార్ అలియాస్ అరుణ్ బీఎస్సీ ఫైనలియర్ చదువుతూ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. కాకినాడ ప్రతాప్‌నగర్ ట్రెజరీకాలనీకి చెందిన అరుణ్ స్నేహితుడు కాకరపర్తి సాయిరవికాంత్ అలియాస్ రవి రాజమండ్రి సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కరప మండలం పెద్దాపురప్పాడుకు చెందిన మేకా గోపి బీకాం చదివాడు. ప్రస్తుతం విశాఖ జిల్లా ఆదర్శనగర్ రైల్వే గేటు వద్ద నివసిస్తున్నారు. పెద్దాపురం మండలం జె.తిమ్మాపురానికి చెందిన పిన్నమరాజు ప్రశాంత్‌వర్మ అలియాస్ ప్రశాంత్ కాకినాడలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. స్థా నిక కొండయ్యపాలేనికి చెందిన మజ్జి విజయ్‌కుమార్ అలియాస్ ఈక ఏడో తరగతి చదివి, కూ లీ పని చేసేవాడు. 2008లో చోరీ కేసులో పోలీ సులకు పట్టుబడి, మూడు నెలల జైలు శిక్ష అనుభవించాడు. కాకినాడ త్రీటౌన్ క్రైం స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. మరో 4 కేసులు పెండింగ్ లో ఉండడంతో బెయిల్‌పై వచ్చి, మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు. కరప మండలం పెద్దాపురప్పాడు కు చెందిన బిరుదా మాచారావు అలియాస్ మ హేష్ ఇంటర్ చదువుకున్నాడు. జల్సాలకు అల వాటు పడ్డ మాచారావు తన అమ్మమ్మ, తాతయ్యలను బెదిరించి రూ.80 వేల విలువైన బం గారు ఆభరణాలను అపహరించాడు. స్థానిక కొండయ్యపాలేనికి చెందిన కొశిరెడ్డి సాయికుమార్ అలియాస్ సాయి నాలుగో తరగతి చది వాడు. సైకిల్, స్కూటర్ మెకానిక్, కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. స్థానిక జగన్నాథపురం రెవె న్యూ కాలనీకి చెందిన చార్లెస్ రిక్సన్ జోసెఫ్ బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి, విశాఖ పట్నం సీతమ్మధారలో ఉంటున్నాడు. ఇలాఉండగా అరుణ్‌కుమార్, రవి, గోపి, ప్రశాంత్, మాచారావు, చార్లెస్.. హైస్కూల్, కాలేజీల్లో స్నేహితులు. గోపి కారు డ్రైవర్ కావడంతో, అతడికి సాయితో పరిచయం ఏర్పడింది. గోపికి మాచారావు బాల్య స్నేహితుడు. చిన్న చిన్న నేరాలకు పాల్పడే వీరంతా ఏడాది క్రితం ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవారు. ఈ నెల ఒకటిన స్థానిక జీపీటీ సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న కాకరమూడి అనురాగం అలియాస్ అనురాధ (61)ను హతమార్చి, బంగారం దొంగిలించారు. ఆమె వద్ద కారు డ్రైవర్‌గా పని చేసిన సాయికుమార్ తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ ప్రాంతంలో సాయి, విజయ్‌కుమార్, మాచారావు, చార్లెస్ బయట కాపు కాయగా, అరుణ్‌కుమార్, రవికాంత్, గోపి, ప్రశాంత్ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ప్రతిఘటించడంతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం బంగారు ఆభరణాలతో వెనుక గేటు నుంచి పరారయ్యారు. మరిన్ని నేరాలు గతేడాది సెప్టెంబర్ 11న స్థానిక ప్రతాప్‌నగర్‌లో రూ.3.25 లక్షల విలువైన బంగారం, ఈ ఏడాది జూన్ 10న కరప మండలం పెద్దాపురప్పాడులో రూ.80 వేల విలువైన బంగారం, 23న విశాఖపట్నం కంచరపాలెంలో రూ.80 వేల విలువైన బంగారం, ఇతర వస్తువులు దొంగిలించారు. కాకినాడలో ఏడాది కాలంలో 13 బైక్‌లు అపహరించారు. ఒంటరి మహిళల మెడలో ఆభరణాలు తస్కరించారు. నిందితులు దొరికిందిలా.. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్థానిక శాంతినగర్‌లోని పాత ఆర్టీఓ ఆఫీసు జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రెండు వాహనాలపై నలుగురు యువకులు వారికి అనుమానాస్పదంగా తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య, దోపిడీలు, చోరీలు, చైన్‌స్నాచింగ్‌ల విషయం వెలుగు చూసింది. ఎనిమిదిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.11 లక్షల విలువైన 280 గ్రాముల బంగారం, రెండు సెల్ఫోన్లు, 13 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకుని, ఆయా కేసులను ఛేదించిన పోలీసులను ఎస్పీ జి.విజయ్ కుమార్, డీఎస్పీ విజయభాస్కర రెడ్డి ప్రశంసించారు. క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, త్రీటౌన్ క్రైం ఎస్సై సీహెచ్ మహేశ్వర రావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
లండన్‌లో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
లండన్: భారత సంతతి వ్యక్తిని బ్రిటన్‌లో దోపిడీ దొంగల ముఠా అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకుంది. శ్వేత జాతీయులుగా అనుమానిస్తున్న 10 మందితో కూడిన ముఠా 44 ఏళ్ల షమ్మీ అత్వాల్‌ను రోడ్డుపైకి నెట్టి ట్రక్కుతో తొక్కించి హతమార్చింది. పోలీసులు, హతుని బంధువుల కథనం మేరకు, లండన్ తూర్పు ప్రాంతంలో ‘గ్లెన్ అండ్ కో’ పేరుతో షమ్మీ ఓ శీతల పానీయ కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీని దోచుకోవాలని కుట్ర పన్నిన 10 మంది దొంగల ముఠా సమ్మెటలు, ఇనుప రాడ్లతో మంగళవారం రాత్రి దాడికి దిగింది. అయితే, ఈ దాడిని ప్రతిఘటించిన షమ్మీని దొంగలు రోడ్డుపైకి నెట్టి ట్రక్కుతో తొక్కించడంతో ఘటనా స్థలంలోనే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దొంగలను అడ్డుకునే క్రమంలో షమ్మీ భార్య దీప కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్కాట్లాండ్ యార్డు పోలీసులు విచారణ చేపట్టారు.