అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కావాలని భావిస్తున్న చిన్నమ్మ శశికళకు చట్టపరమైన చిక్కులు తప్పేలా లేవు. శశికళను చట్టపరంగా ఎదుర్కొ నేందుకు వ్యతిరేక వర్గం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 29న జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశానికి శశికళ మద్దతుదారులకు మాత్రమే ఆహ్వానాలు పంపు తున్నారు. పిలవకున్నా హాజరై ఎంపికను అడ్డుకుంటాం, విఫలమైతే చట్టపరంగా సాధిస్తామని వ్యతిరేక వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.