దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు జే. దీపాకుమార్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తాను సొంతంగా పార్టీ పెడుతున్నానని, అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు తనకు అండగా ఉంటారనే విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. దివంగత నేత ఎంజీఆర్ వారసత్వం తనదేనని ఆమె ఉద్ఘాటించారు.