దీప రాజకీయ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ | jayalalitha brother daughter Deepa tamil nadu Political entry | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 17 2017 7:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ పార్టీలో కల్లోల వాతావరణాన్ని సృష్టించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను సహించలేక రగిలి పోతున్నవారంతా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. వీరిలో అధికశాతం మంది అన్నాడీఎంకేపై అభిమానాన్ని చంపుకోలేక, అలాగని శశికళ నాయకత్వంలో ఇమడలేక నలిగిపోతున్నారు. శశికళ బొమ్మలను చింపివేయడం ద్వారా తమ నిరసనను చాటుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న ద్వితీయ శ్రేణి మొదలుకుని కింది స్థాయి కార్యకర్త వరకు అధికశాతం లోలోన దీప వైపు మొగ్గు చూపుతున్నారు. రాజకీయాల్లో అమ్మ లేని లోటును తీర్చాలంటూ దీపపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటి పరిసరాలు అభిమానుల నినాదాలతో మార్మోగుతున్నాయి. ప్రతిరోజు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని దీప కలుసుకుంటున్నారు. సమయం వచ్చినపుడు రాజకీయ ప్రవేశం ఖాయమని నచ్చజెబుతూ వచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement