నాక్కూడా అపాయింట్ మెంట్ ఇవ్వండి! | Jayalalithaa Niece Deepa seek governor appointment | Sakshi
Sakshi News home page

నాక్కూడా అపాయింట్ మెంట్ ఇవ్వండి!

Published Thu, Feb 9 2017 3:47 PM | Last Updated on Thu, May 24 2018 12:05 PM

నాక్కూడా అపాయింట్ మెంట్ ఇవ్వండి! - Sakshi

నాక్కూడా అపాయింట్ మెంట్ ఇవ్వండి!

చెన్నై: అన్నాడీఎంకేలో అధికారం కోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య కుమ్ములాట జరుగుతుండగా నేనున్నానంటూ జయలలిత మేనకోడలు దీప ముందుకు వచ్చారు. ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోవడంతో ఆయనను కలిసేందుకు ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీపకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీప మద్దతుదారులు రాజ్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, జయలలితకు తాను వారసురాలిని తానేనని దీప ఇంతకుముందు ప్రకటించుకున్నారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు ఎంతమాత్రం కోరుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. దీప మద్దతు ఇస్తే తీసుకుంటానని పన్నీర్ సెల్వం ఇంతకుముందు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement